NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema June 03 Episode 640: కోడలు మీద కోప్పడి కుచల.. చేయి చేసుకున్న నారాయణ.. సుగుణ కి గుడ్ న్యూస్ చెప్పిన పంతులు..

Nuvvu Nenu Prema Today Episode June 3 2024 Episode 640 highlights

Nuvvu Nenu Prema:విక్కీ పద్మావతి ఇద్దరూ ఆఫీస్ నుంచి బయటికి వస్తారు. పద్మావతి బండి స్టార్ట్ కాకపోవడంతో తనుఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి గాయత్రి వచ్చి బండికి ప్రాబ్లం వచ్చిందా అని అడుగుతుంది. అవును అని అంటుంది పద్మావతి. ఇక ఆటోలో వెళ్లి రేపొద్దున బండి తీసుకొని వెళ్ళు అని గాయత్రి సలహాయిస్తుంది దాంతో పద్మావతి సరే అనుకుంటుంది ఇంకా అప్పుడే విక్కీ లోపల నుంచి బయటకు రావడం గాయత్రి చూస్తుంది వెంటనే గాయత్రి విక్కీ గారు అని పిలుస్తుంది పద్మావతి తను నా మొగుడు నువ్వు అలా పిలవకు అని మనసులో అనుకుంటుంది. విక్కీ ఏంటో చెప్పండి అని అంటాడు మీరునా బైక్ మీద రావచ్చు నేను మీకు లిఫ్ట్ ఇస్తాను అని అంటుంది వెంటనే పద్దు మనసులో ఆడపిల్లని నా బండి పాడై పోతే నాకు లిఫ్ట్ ఇవ్వకుండా విక్కీ కి లిఫ్ట్ ఇస్తా అంటుంది అని అనుకుంటుంది. గాయత్రితో విక్కీ పర్వాలేదండి నేను వెళ్తాను అని అంటాడు. లేదు నేను మీకు లిఫ్ట్ ఇస్తాను నాకు నేను కూడా అటే వెళ్తున్నాను. మీ ఇంటివైపు అని అంటుంది. మా ఇల్లు ఎక్కడో నీకు తెలుసా అంటాడు విక్కీ మీ ఏరియా తెలుసులెండి అని అంటుంది గాయత్రి ఇక విక్కి నేను ఆటోలో వెళ్తాను పాపం అక్కడ పద్మావతి ఇబ్బంది పడుతున్నారు కదా మీరు తనకి లిఫ్ట్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు. గాయత్రి నాకు చిన్న పని ఉంది లేండి నేను వెళ్తాను అని పద్దుకి లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. ఇక ఇద్దరు కలిసి ఆఫీస్ నుంచి బయటికి వచ్చి ఆటో ఎక్కాలి అనుకుంటారు అప్పుడే ఆటో వాడు తో విక్కీ పద్మావతి ఇద్దరు గొడవ పడతారు. ముందు ఆటో నేను పిలిచాను అంటే నేనే ఆటో ఎక్కాలి అనుకుంటున్నాను అని విక్కి ఇద్దరు గొడవపడతారు ఇక ఆటో వాడు ఇద్దరూ ఒకే వైపు కదా వెళ్ళేది ఇద్దరు కలిసి కూర్చోండి నేను మీ ఇద్దరిని డ్రాప్ చేస్తాను అని అంటాడు. ఆటో వాడి కోసం పద్మావతి గొడవ పడకుండా సరే అని అంటుంది ఇక ఆటో వాడు పద్మావతి వాళ్ళని ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాడు పద్మావతి డబ్బులు ఇస్తుంటే ఆమె డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని విక్కీ ఆటో అంటాడు ఇక ఆటో వాడు మీ ఇద్దరు లవర్స్ అని అడుగుతాడు కాదు భార్య భర్తలు అని చెప్పి వెళ్ళిపోతాడు విక్కి.

Nuvvu Nenu Prema Today Episode June 3 2024 Episode 640 highlights
Nuvvu Nenu Prema Today Episode June 3 2024 Episode 640 highlights

ఇక మరోవైపు అను అద్దం ముందు రెడీ అవుతూ ఉంటే ఆర్య వచ్చి అనుని అలానే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అను ఏంటి ఈ రోజు సార్ మూడు మారిపోయినట్టుంది అని అంటుంది. నీలాంటి భార్య ఉంటే ప్రతిరోజు మూడు మారిపోతుంది అని అంటాడు ఆర్య. అను దగ్గరికి వెళ్లి నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావా అని అడుగుతాడు మీలాంటి భర్త దొరికితే ఏ భార్య అయినా సంతోషంగానే ఉంటుంది నేను గుర్రాలని తెలిసికూడా నా సంతోషం కోసం బిడ్డని దత్తత తీసుకోవడానికి ఒప్పుకున్నారు. నాకోసం ఇంత చేస్తున్నా మీలాంటి భర్త ఉంటే నేను ఎందుకు సంతోషంగా ఉండను అని అంటుంది. ఇక వెంటనే ఇలాగా సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పి నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోవద్దు అని అంటాడు. నేను గిఫ్ట్ ఇవ్వాలి అని అంటుంది భర్త కౌగిలిలో ఉన్నప్పుడు భార్య ఏ గిఫ్ట్ ఇవ్వాలో తెలియదా అని అంటాడు. నువ్వు గిఫ్ట్ ఇవ్వకుండా ఇకనుంచి వెళ్తానంటే నేను ఊరుకోను అని అంటాడు నేను ఇక నుంచి వెళ్ళను కానీ మీరే నాకు గిఫ్ట్ ఇస్తే వెళ్తాను అని అంటుంది. అప్పుడే ఆర్య అను నీ దగ్గరికి తీసుకుంటూ ఉంటే పాప ఏడుస్తుంది వెంటనే అను పాప ఏడుస్తుంది అని వెళ్ళిపోతుంది. పాప ఊయల్లో ఏడుస్తూ ఉంటుంది ఎదురుగా కుచలకూర్చొని ఉంటుంది అను ఆర్య ఇద్దరు వచ్చి పాపని సముదాయిస్తూ ఉంటారు. కుశల నువ్వు లోపల ఏం చేస్తున్నావు పాప ఏడవగానే నా గుండె జల్లుమంటుంది లోపల చేయడానికి పని కూడా ఏమీ లేదు కదా అంతా మీ అక్క పొద్దున్నే చేసి వెళ్తుంది ఇక అలాంటప్పుడు నీకు పనే ఉంటుంది అని అంటుంది. వెంటనే ఆ మాటలకు ఆర్య కోపంగా నువ్వు ఎదురుగానే ఉన్నావు కదా పాప ఏడిస్తే ఉయ్యాల ఊపొచ్చు కదా అని అంటాడు ఇక అమ్మో ఎంత మాట అన్నావు నువ్వేనా హర్యానా అనేది నేను పాపని ఉయ్యాలో ఊపలేదని ఇంత మాట అంటావా మీ పాప కాకపోతేనే ఇలా అంటున్నావు ఎంత మాయ చేసావే నా కొడుకుని అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode June 3 2024 Episode 640 highlights
Nuvvu Nenu Prema Today Episode June 3 2024 Episode 640 highlights

ఇక ఇంట్లో అందరూ అక్కడికి వస్తారు ఏంటి ఆర్య గొడవ అని అడుగుతాడు విక్కీ. అదంతా చూసి దివ్య నేను అనుకున్న విధంగానే వీళ్లింట్లో ప్రతిరోజు ఇలా గొడవ జరుగుతూనే ఉండాలి నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో అని అనుకుంటుంది. ఇక కుచల కావాలని అనుని అవమానిస్తుంది నీకు పిల్లలు పుట్టరని తెలిసి నువ్వు గొడ్రాలు అని తెలిస్తే నీ భర్త వేరే బా పిల్లని దత్తకు తీసుకుంటేనే ఆ పిల్ల మీద నేను ప్రేమ చూపించట్లేదు అని ఇన్ని మాటలు అంటున్నాడు నిజంగా నీకే పిల్లలు పుడితే వామ్మో అని అంటుంది. వెంటనే పద్దు ఎందుకు అత్తయ్య అక్కకి పిల్లలు పుట్టారని తెలిసి కూడా ప్రతిసారి అలా మాట్లాడతారు అని అంటుంది. అనుకున్నాను ఇంకా నువ్వు మధ్యలోకి రాలేదు ఏంటి అని అనుకున్నాను వచ్చావా మీ ఇద్దరినీ చేసుకున్న తర్వాతే మా పరిస్థితి ఇలా తయారయింది. మీఇద్దరు అక్కా చెల్లెలు నష్ట జాతకులు అది తెలియకనే మేం చేసుకుని ఇవాళ ఎన్ని అవమానాలు పడుతున్నాము అని అంటే వెంటనే నారాయణ కోపంగా కుచల అని చెంప మీద కొడతాడు. ఎప్పుడు ఏం మాట్లాడలో కూడ నీకు తెలియదా, ఎప్పుడు ఇలానే మాట్లాడుతుంటావు అని కోప్పడతాడు. ఇక కుచల ఏడుస్తూ మీ వల్లే నా భర్త ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు చేయి చేసుకోకుండా ఇప్పుడు చేయి చేసుకున్నాడు ఇదంతా మీ వల్లే మీరే సంతోషంగా ఉండండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దివి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంట్లో అందరూ వెళ్లిపోతారు.

Nuvvu Nenu Prema Today Episode June 3 2024 Episode 640 highlights
Nuvvu Nenu Prema Today Episode June 3 2024 Episode 640 highlights

ఇక మరోవైపు సుగుణ ఇంటికి, పంతులుగారు వస్తారు పంతులు గారిని చూసి సుగుణ ఈ రోజైనా మీరు నాకు ఒక మంచి వార్త చెప్పాలి అని అంటుంది. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట కదా అని అంటాడు. మా అబ్బాయి ఏలినాటి శని వెళ్ళిపోయింది అని చెప్పారు కదా ఇప్పుడు ఒకసారి చూసి చెప్పండి అని అడుగుతుంది. పంతులుగారు పంచాంగం చూసి మీ అబ్బాయి ఏలినాటి శని మూడు రోజుల క్రితమే అయిపోయింది. మీ అబ్బాయి జీవితంలోకి మూడు రోజుల క్రితం ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి మీ ఇంటి కోడలుగా వస్తుంది అని అంటాడు. ఆ మాటలకి సుగుణ సంతోషపడుతుంది అయితే మా అబ్బాయికి పెళ్లి ఘడియలు వచ్చాయా అని అంటుంది. వచ్చాయమ్మా అని అంటాడు పంతులు అప్పుడే యశోదర్ ఆఫీస్ కి రెడీ అయ్యి కిందకి వస్తాడు ఇక పంతులు గారిని చూసి ఏంటమ్మా పంతులుగారు వచ్చారు అని అడిగితే, నీకు పెళ్లి గడియలు వచ్చాయని చెప్తున్నారు అని అంటుంది. అవునా పంతులుగారు అని అడుగుతాడు అవును అని అంటాడు పంతులు ఇక సరే అమ్మ నేను వెళ్తున్నాను, ఆఫీస్ కి వెళ్తూ మిమ్మల్ని కూడా డ్రాప్ చేస్తాను రండి అని పంతులు గారిని అంటాడు యశోదర్, సుగుణ చాలా సంతోషిస్తుంది పంతులుగారు త్వరలోనే మీ ఇంట్లో పెళ్లి బజాలు మోగుతాయని చెప్పి వెళ్ళిపోతాడు. పంతులుగారు యశోదరతో మీ అమ్మ కోరిక ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటే పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు ఈ ఇంటికి కాబోయే కోడలు మా అమ్మని చిన్న పిల్ల లాగా చూసుకోవాలి అని అంటాడు. అలాంటి అమ్మాయి దొరికినప్పుడు తప్పకుండా చేసుకుంటాను అని అంటాడు. పంతులుగారు త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది లే బాబు అని చెప్పి వెళ్ళిపోతాడు.

Nuvvu Nenu Prema Today Episode June 3 2024 Episode 640 highlights
Nuvvu Nenu Prema Today Episode June 3 2024 Episode 640 highlights

ఇక మరోవైపు ఆఫీస్ కి రెడీ అవుతూ ఉంటుంది పద్మావతి అప్పుడే విక్కీ కూడా రెడీ అవుతూ ఉంటాడు. పద్మావతి చాలాసేపు అద్దం ముందు రెడీ అవుతుంటే విక్కీ చూసి ఎంతసేపు రెడీ అవుతావు మేము కూడా ఆఫీస్ కి వెళ్ళాలి అని అంటాడు. పద్మావతితో అవును నాకు ఒక డౌట్ నీకు పెళ్లి కాలేదు అంటే ఆ బాస్ ఎలా నమ్మాడు నీ కాలికి మెట్టెలు మెల్లగా తాళి అని ఆశ్చర్యపోతాడు అవి రెండు విక్కీ కి కనిపించవు. ఏం చేసావు అని అడిగితే పద్మావతి గోడకి వేలాడదీసి ఉంటుంది. అమ్మో ఇంత మోసం చేసావా మేడలో తాళి తీసి గోడకు తగిలించి ఆఫీసులో పెళ్లి కాలేదు అని చెప్పావా అని అంటాడు. అయినా నిన్ను చూస్తే ఎవరైనా ఆంటీ అనుకుంటారు లే అని అంటాడు మిమ్మల్ని చూస్తే తాతయ్య అనుకుంటారు అని అంటుంది విక్కి వెంటనే అవును నిన్ను చూస్తేనే అమ్మమ్మ అనుకునేది అని అంటాడు. నన్ను చూస్తే ఎవరైనా కాలేజీకి వెళ్లే పిల్ల అని అనుకుంటారు అని అంటుంది పద్మావతి దానికి విక్కీ నవ్వుతాడు ఏదో ఒక రోజు నాకు నవ్వే టైం వస్తుంది అని అంటుంది.నాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి అవి తెలుసు అని అంటుంది పద్మావతి అవును అందుకే కదా ఇలా చేశావు అని అంటాడు.నేను తాగి తీస్తేనే మీరు ఇంత బాధ పడుతున్నారు మరి ఎప్పుడు మీరు నీకు నాకు సంబంధం లేదు నువ్వు వేరు నేను వేరు వెళ్లిపో అని అంటారు

Nuvvu Nenu Prema Today Episode June 3 2024 Episode 640 highlights
Nuvvu Nenu Prema Today Episode June 3 2024 Episode 640 highlights

అప్పుడు నేను ఎంత బాధ పడ్డానో తెలుసా అని అంటుంది. అయినా నీ బాధతో నాకేం సంబంధం లేదు నాకేం బాధ లేదు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు విక్కి. పద్మావతి గోడకి ఉన్న తాలింపు తీసి మెడలో వేసుకొని నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను ఈ జన్మకి మీరే నా భర్త మీ ప్రేమంతా నాకే సొంతం అని అనుకొని ఆఫీస్ కి వెళ్తుంది. ఇక ఇద్దరూ ఒకే బస్టాండ్ కి చేరుకుంటారు అక్కడి నుంచి ఆఫీస్ కి ఆటోలో వెళ్లాలి. ఆ బస్టాండ్లో పద్మావతి వికీ ని చూసి నవ్వుతుంది కానీ విక్కీ మాత్రం అవ్వడు తెలిసిన వాళ్ళైనా కనీసం అవుతారు తాళి కట్టిన భర్త అయ్యుండి కూడా కనీసం నన్ను చూసి నవ్వను కూడా నవ్వడు అని పద్మావతి మనసులో అనుకుంటుంది. అప్పుడే ఇద్దరు పిల్లలు వచ్చి అంకుల్ అని పిలుస్తారు దానికి పద్మావతి నవ్వుతుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella