NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

Nuvvu Nenu Prema May 11 Episode 621

Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ అవుతూ ఉంటారు. శాంతాదేవి కుచ్చులకి పంతులు గారికి ఏం కావాలో చూడమని చెప్తుంది. కుచలా పంతులు గారి దగ్గర కూర్చొని అన్ని వచ్చాయా లేదా అని చెక్ చేస్తూ మధ్యలో ఆకలిగా ఉంది అని అరటిపండు తింటుంది. అప్పుడే అక్కడికి నారాయణ వచ్చి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అడుగుతాడు. అన్ని అయిపోయాయి అని అంటుంది నువ్వే చేసావా లేదా నటిస్తున్నావా అని అంటాడు. నటిస్తూ పనిచేస్తున్నాను అని అంటుంది. అప్పుడే అక్కడికి దివ్య వచ్చి పంచ పాత్రలు అడిగారు కదా తీసుకొచ్చాను అని అంటుంది. పంచ పాత్రలంటే 5 గిన్నెలు తీసుకు రమ్మని కాదు అని అంటుంది కుచల. మీరు నాకు సరిగ్గా చెప్పలేదు మీరు చెప్పినట్లు నేను తీసుకొచ్చాను అని అంటుంది. ఇక కుచల ఏంటి ఎదురు చెప్తున్నావు నేను చెప్పిన పని చేయడం చేతకాదు కానీ అని అంటుంది. మీరు చెప్పింది కానీ నేను తీసుకొచ్చింది అని అంటుంది ఇక దాంతో నారాయణ నువ్వు చెప్పడం చేతకాక అమ్మాయిని అంటావ్ ఎందుకు అని కోప్పడతాడు. పనిచేసిన తిట్లే చేయకపోయినా తిట్లే అని అంటుంది కుచల.

Nuvvu Nenu Prema May 11 Episode 621
Nuvvu Nenu Prema May 11 Episode 621

ఇక పంతులుగారు అందరినీ రమ్మన చెప్పండి పూజ మొదలు పెడదాం అని అంటే అప్పుడే విక్కీ పద్మావతి కిందకి వస్తూ వుంటారు. ఇక మరోవైపు అరవింద బాధపడుతూ ఉంటుంది. నువ్వు బావ మీద చెయ్యి చేసుకోవడం నాకు అసలు నచ్చలేదు. నీకు నేను తప్ప ఎవరూ లేరు నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు అని ఇన్ని రోజులు అనుకున్నాము కానీ నువ్వు ఆస్తి కోసం మీ బావని ఇల్లరికం ఉంటున్నందుకు చెయ్యి చేసుకుంటావని నేను ఊహించలేదునీతో పద్మావతి తో కళ్యాణం చేయిద్దామని అనుకున్నాను నువ్వేమో ఈరోజు ఇలా చేసావు నువ్వు కల్యాణం చేస్తే చూడాలని నాకు ఉంది అందుకే ఏది ఏమైనా సరే నేను నీకోసం అక్కడికి వస్తాను కళ్యాణం జరిపించేసి మళ్లీ తిరిగి వచ్చేస్తాను అని అనుకుంటుంది. విక్కీ దగ్గరికి వెళ్లాలని అరవింద నిర్ణయించుకుంటుంది.

Nuvvu Nenu Prema May 11 Episode 621
Nuvvu Nenu Prema May 11 Episode 621

ఇక మరోవైపు విక్కీ పద్మావతి కిందకి రావడం చూసి అందరూ సీతారాముల్లాగా ఉన్నారు మీ జంట అని అంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వికీ పద్మావతిని పొగుడుతూ ఉంటారు విక్కీ నిజంగా శ్రీరాముడే ఆ వనవాసానికి వెళ్లిన తర్వాత కూడా శ్రీరాముడు తన భార్య కోసం ఎలా నిలబడ్డాడో విక్కీ కూడా అలానే తన భార్య కోసం ఏదైనా చేస్తాడు అని అంటారు. పద్మావతి కూడా విక్కీ అంటే చాలా ప్రేమ,ఆ ప్రేమే వాళ్ళని ఇక్కడిదాకా తీసుకువచ్చింది ఎన్ని కష్టాలు వచ్చినా పద్మావతి కూడా విక్కీ కోసం నిలబడింది అని అందరూ పొగుడుతూ ఉంటారు వాళ్ళ పొగడ్తలు చూడలేక దివ్య పక్కకి వెళ్లిపోతుంది. వీళ్ళ ఓవరాక్షన్ నుంచి చూడలేకపోతున్నాను అని అనుకుంటుంది. ఇక పంతులుగారు కళ్యాణం మొదలుపెడతారు విక్కీ పద్మావతి ఇద్దరు కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఇన్ని రోజులు నేను చాలా బాధ పెట్టాను పద్మావతి ఇకమీదట నేను అలా బాధ పెట్టను. నిన్ను ప్రేమగా చూసుకుంటాను అని అనుకుంటాడు. తొందరగా పూజను పూర్తి చేస్తే మనం భోజనం తినొచ్చు అని అంటుంది కుచల. దాంతో నారాయణ కోపంగా కుచలని తిడతాడు.

Nuvvu Nenu Prema May 11 Episode 621
Nuvvu Nenu Prema May 11 Episode 621

ఇక మరోవైపు దివ్య కృష్ణ కి ఫోన్ చేస్తుంది. ఏంటి బాబా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత సేపు పట్టింది అని అడుగుతుంది మనిద్దరం ఏమైనా కబుర్లు చెప్పుకోవడానికి ఫోన్ చేస్తున్నామా అని అంటాడు. ఏదో చేసేస్తానన్నావు ఇంతవరకు ఏమీ జరగలేదు ఇక్కడ వెళ్లి పూజ చేసుకుంటున్నారు అని చెప్తుంది. ఏం పూజ చేస్తున్నారు అని కృష్ణ అడుగుతాడు వాళ్ళ అరవింద కోరిక ప్రకారం సీతారాముల కళ్యాణం జరిపించుకుంటున్నారు ఇంట్లో ఇల్లంతా సందడిగా ఉంది అని చెప్తుంది. నువ్వు కూడా కూర్చోలేక పోయావా పుణ్యం కూడా వచ్చేది నీకు అని అంటాడు కృష్ణ. వాళ్ల పొగడ్తలు చూడలేక విక్కీ పద్మావతిని సీతారాముల తో పొగుడుతూ అక్కడ అందరూ పూజ చేస్తుంటే చూడలేక పక్కకి వచ్చేసాను అని చెప్తుంది. ఇంతకీ నువ్వు ఏదో చేసేస్తాను అన్నావు ఇంతవరకు ఏమీ చేయలేదు. మాటల్లో చెప్పడమేనా చేసేదేమన్నా ఉందా అని అంటే నేను ఇప్పుడు అక్కడ బాంబు పెట్టాను ఇంకాసేపట్లో పేలుతుంది అని అంటాడు. వెంటనే దివ్య కంగారుగా ఏంటి బావ బాంబు పెట్టావా అని అంటుంది అవును నువ్వు వెళ్లి, అందరితోపాటు కూర్చొని సీతారాముల కళ్యాణం చూస్తూ ఉండు నేను పెట్టిన బాబు ఇంకొంత సేపట్లో పేలుతుంది అప్పుడు నేను ఏం చేశాను అన్నది నీకే అర్థమవుతుంది అని అంటాడు. అది కాదు బావ అసలు అదేంటో చెప్పు అనేసరికి కృష్ణ ఫోన్ పెట్టేస్తాడు.

Nuvvu Nenu Prema May 11 Episode 621
Nuvvu Nenu Prema May 11 Episode 621

ఇక పద్మావతి, విక్కీ ఇద్దరు పూజ చేస్తూ ఉంటారు పద్మావతి వికీ ని చూసి సీతారాముల కళ్యాణం లాగా మన కళ్యాణం కూడా జరిగితే బాగుండు అని అనుకుంటుంది. అప్పుడే పద్మావతి ఊహల్లో వికీతో పెళ్లి జరుగుతున్నట్లుగా కలగంటుంది. విక్కీ బాసికం కట్టుకొని పద్మావతి బాసికం కట్టుకొని ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటున్నట్లుగా చూపిస్తారు. ఇద్దరూ కలిసి పూజ చేసి విక్కీ పద్మావతి మెడలో తాళి కట్టడం పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. నిజంగా పెళ్లి జరిగినట్లు, పద్మావతి ఊహిస్తుంది. విక్కీ పద్మావతి కలిసి పూజ పూర్తి చేస్తారు. మీరిద్దరూ దండలు మార్చుకోండి సీతారాముల దండలు మీరు వేసుకుంటే మీకు అంతా మంచే జరుగుతుంది అని పంతులుగారు అంటారు ఇక దాంతో పద్మావతి ఇద్దరు దండలు మార్చుకుంటారు. విక్కీ పద్మావతి మెడలో దండ వేస్తూ ఇప్పటివరకు నీతో నేను ఎలా ఉన్నది గతం ఇక మీదట నేను నిన్ను బాగా చూసుకుంటాను అని అంటాడు నీతో పెళ్లి ఇష్టం లేకుండా చేసుకున్నాను మెడలో ఇష్టం లేకుండా తాళి కట్టాను కానీ ఈరోజు సీతారాముల సాక్షిగా నీ మెడలో దండ వేసి జీవితాంతం నిన్ను బాగా చూసుకుంటానని నీకు మాటిస్తున్నాను అని అనుకుంటాడు పద్మావతి కూడా ఎన్ని కష్టాలు వచ్చినా మీతోనే ఉంటాను అని అనుకుంటుంది. ఇకమీదట మన ప్రయాణం కొత్తగా సాగిపోతుంది అని అనుకుంటుంది. ఇక అప్పుడే దివ్య బావ ఏదో బాంబు పేలుస్తా అన్నాడు ఇక్కడేమో పూజ కూడా అయిపోయింది పూజ అయ్యేలోపు ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతుంటే ఏమీ జరగలేదు అని అనుకుంటుంది. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema May 11 Episode 621
Nuvvu Nenu Prema May 11 Episode 621

రేపటి ఎపిసోడ్ లో, విక్కీ పద్మావతి దండ మార్చుకునే టయానికి మీకు లీగల్ నోటీసు వచ్చింది అని అంటారు. పోలీసులు లాయర్ తో సహా వచ్చి లీగల్ నోటీసు ఇస్తారు. ఎవరు ఇచ్చారు లీగల్ నోటీసు అని విక్కీ చూస్తాడు. అది చూసి షాక్ అవుతారు. ఇంతకీ ఎవరు పంపించారు అని నారాయణ అడిగితే మురళీకృష్ణపేరు మీదకి విక్కీ తన ఆస్తి మొత్తం ట్రాన్స్ఫర్ చేసినట్లుగా ఉంది. అని పోలీసులు చెప్పడంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఇక పద్మావతి ఆ నీచుడు ఇంత పని చేస్తాడని అనుకోలేదు. ఇక దాచి పెట్టింది చాలు మన నిజం చెప్పాలీ అని ఆ నీచుడు వికీ నేను కిడ్నాప్ చేశాడు ఇదంతా జరగడానికి కారణం వాడే అని ఇంట్లో అందరి ముందు బయటపడుతుంది పద్మావతి. మంచి వాడిని చేరదీస్తే ఇంత పని చేస్తాడా అని అంటాడు నారాయణ.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri