NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

Nuvvu Nenu Prema May 13 Episode 622

Nuvvu Nenu prema:విక్కీ పద్మావతి పూజ చేస్తూ ఉంటారు. పూజ పూర్తయిందమ్మ, ఇక మీ కుటుంబం సంతోషంతో ఉంటుంది. మీరు ఎప్పుడూ కలకాలం ఇలానే ఉండాలి అని పంతులుగారు అంటారు తర్వాత పద్మావతి వికీ వైపు చూస్తుంది. పద్మావతి కళ్ళల్లో నీళ్లు చూసి నీ కళ్ళల్లో రావాల్సింది కన్నీళ్లు కాదు పద్మావతి ఆనంద భాష్పాలు ఇక నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని అంటాడు. ఇక పక్కనే ఉన్న నారాయణ బాగా చెప్పావు విక్కీ అని అంటాడు. సుఖ సంతోషాలు నే కాదు కష్టనష్టాల్లో కూడా మీరు ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి అని అంటాడు నారాయణ. మీ మధ్య అయిన అడ్డంకులు ఉన్న అవన్నీ తొలగిపోయి మీరు సంతోషంగా ఉంటారు అని అంటాడు. సీతారాముల లాగా మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అని అంటాడు. నిజంగానే మన మధ్య ఏ ఆడంకులు రావు, మన జీవితం ఇక ముందట హ్యాపీగా ఉండబోతుంది అని పద్మావతి సంతోషంగా ఉంటుంది.

Nuvvu Nenu Prema May 13 Episode 622
Nuvvu Nenu Prema May 13 Episode 622

ఇక విక్కీ వాళ్ళంతా చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే లాయర్ పోలీసులు లోపలికి వచ్చి విక్కీని పిలుస్తారు. ఈ టైం లో వీళ్ళు వచ్చారు ఏంటి అని అందరూ అనుకుంటారు ఇక కుచల పూజ పూర్తయిందని వడపప్పు పానకం తీసుకోవడానికి వచ్చారా అని అంటుంది. నారాయణ కాసేపు ఆపుతావా అని అంటాడు. ఇక అప్పుడే విక్కీ మీరు దేనికి వచ్చారు అని అడుగుతాడు మీతో పని ఉండి వచ్చాము అని అంటాడు పోలీస్. నాతో మీకు పని ఏంటి అని అడుగుతాడు. మీకు లీవెల్ నోటీసు ఇవ్వడానికి వచ్చాము అని అంటాడు. నాకు లీగల్ నోటీస్ ఇవ్వడం ఏంటి?ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటాడు. అవును మేము చెప్తుంది నిజమే. మీరు ఈ ఆస్తి అంతా వేరే వాళ్ళ పేరు మీద రాశారు అలాంటప్పుడు వాళ్ళు మీకు లీగల్ నోటీస్ కదా ఇచ్చేది అని అంటాడు లాయర్. ఆ మాటలకు ఇంట్లో వాళ్లకు ఏమీ అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారు మీరు? లీగల్ నోటీసు ఏంటి విక్కి ఆస్తి మొత్తం వేరే వాళ్ళ పేరు మీద రాయడం ఏంటి అని అంటాడు. అవునండి నేను చెప్తున్నది నిజమే కావాలంటే పేపర్ చూడండి అని విక్కికి ఇస్తాడు. విక్కీ ఆ పేపర్స్ చూసి షాక్ అవుతాడు. అప్పుడే పద్మావతి కూడా ఆ పేపర్ మీద కృష్ణ సంతకం చేయించడం గుర్తుకు వస్తుంది. దుర్మార్గుడు అన్నంతపని చేశాడు అని అనుకుంటుంది. ఇక పక్కనే ఉన్న నారాయణ అసలు మా విక్కి ఎవరి పేరు మీద ఆస్తి రాశారు అని అడుగుతాడు.

Nuvvu Nenu Prema May 13 Episode 622
Nuvvu Nenu Prema May 13 Episode 622

ఇక అక్కడ ఉన్న లాయర్ మీ విక్కీ ఆస్తి మొత్తం మురళీకృష్ణ పేరు మీద రాశారు. ఇక ఆస్తంతా మురళీకృష్ణదే మీరు ఇక్కడి నుంచి కట్టు బట్టలతో బయటకు వెళ్లాలి అని అంటాడు. ఆ మాటలకు ఇంట్లో అందరూ షాక్ అవుతారు. అరవింద భర్త మురళీకృష్ణ ఇదంతా చేశాడన్న విషయం ఇంట్లో అందరికీ అర్థమవుతుంది. వెంటనే అసలు ఆస్తి రాయించుకున్న ఆయన మీద కంప్లైంట్ ఇవ్వాలి కానీ మా ఆయన ఏం చేశాడు ఇంత కష్టపడి సంపాదించిన ఆయన ఆస్తి ఆ దుర్మార్గుడు కావాలని కాజేశాడు మీరు వెళ్లే ఆ దుర్మార్గున్ని అరెస్ట్ చేయండి అని అంటుంది. చూడండి మేడం నోటీస్ లో ఏముందో మేము అదే చేస్తాము మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్లి తీరాల్సిందే, లేదంటే మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని అంటాడు. చూడు పద్మావతి వాళ్ళు చెప్పినట్లు చేయాలి అని అంటాడు నారాయణ. అలా ఎలా కుదురుతుంది మా ఆయన ఇంత కష్టపడి సంపాదిస్తే, కానీ చూడు పేరు మీద రాస్తే ఎలా కుదురుతుంది అని అంటుంది. ఏం మాట్లాడుతున్నారో నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అంటుంది శాంతాదేవి. ఈ ఆర్య అసలు విషయం చెప్పడం మొదలుపెడతాడు. అవును నానమ్మ మీరు అనుకుంటున్నదే నిజం, నా మురళీకృష్ణ మంచివాడు కాదు అక్కని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు ఆస్తి కోసమే చేసుకున్నాడు ఈరోజు ఆస్తి మొత్తం సొంతం చేసుకున్నాడు అని అంటాడు. నువ్వు చెప్పిన నువ్వు చెప్తున్నది నిజమా అని అడుగుతారు. వెంటనే అను కూడా అవును మా ఆయన చెప్పింది అంతా నిజం ఆ కృష్ణ మంచివాడు కాదు అని అంటుంది ఇక వెనకాలే ఉన్న దివ్య అందరికీ నిజం తెలిసిపోయింది ఇక ఇప్పుడు మా బావ ఎలా తప్పించుకుంటాడో ఏంటో అని అనుకుంటుంది. కానీ తను అనుకున్నంత పని చేశాడు ఇప్పుడు మీరు బయటకు వెళ్లడం తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు అని అనుకుంటుంది.

Nuvvu Nenu Prema May 13 Episode 622
Nuvvu Nenu Prema May 13 Episode 622

ఇక విక్కీ బాధపడుతూ ఉంటాడు. వెంటనే పద్మావతి చూడండి సారు మనం వెళ్లి ఆ నీచుడు మంచివాడు కాదన్న విషయం చెప్పి, మన ఆస్తి మనం తీసుకొచ్చుకుందాం అని అంటుంది. అని చూడు ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు అని అంటే శాంతాదేవి ఇంకా ఏమైందమ్మా అని అడుగుతుంది. ఆర్యా మీకు మంచివాడు కాదని చెప్పాడు మీకు ఇంకో పెద్ద నిజం చెప్పాలి అని అంటుంది విక్కి వద్దు అని అంటాడు ఇంత జరిగిన తర్వాత ఇంకా వద్దని అట్లా అంటున్నారు సార్ అని అంటుంది పద్మావతి. విక్రమాదిత్య గారిని నన్ను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు అమరళీకృష్ణ అని అంటుంది. విక్కీని చంపాలని కూడా చూశాడు మేము తప్పించుకుని వచ్చేసాము మేము కనుక ఏమైనా యాక్షన్ తీసుకుంటే అరవింద అని చంపేస్తామని విక్కీకి ఫోన్ చేసి బెదిరించారు. అక్కకి ఏమన్నా అవుతుందేమోనని కంగారులో ఆయన ఏమి చేయలేకపోయాడు ఇప్పుడు కూడా మనం ఏం చేసినా కూడా అరవిందకు ప్రమాదం అని అంటుంది. ఇక అందరూ బాధపడతారు మీరు తొందరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి అని అంటాడు పోలీస్. వాళ్ళు వేసుకునే నగల్ని కూడా తీసి అక్కడ పెట్టమని చెప్తాడు ఈ నగలు అన్ని నావి అని అంటుంది కుచల అవేమీ కుదరదు పిన్ని ఇచ్చేసేద్దాం అని అంటాడు విక్కీ. సరే నీ కోసం ఏదైనా చేస్తాను అని అన్నీ నగలు తీసి అందరూ పల్లెలో పెట్టేసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు.

Nuvvu Nenu Prema May 13 Episode 622
Nuvvu Nenu Prema May 13 Episode 622

ఇక మరోవైపు కృష్ణ ఇంట్లో జరిగిందంతా దివ్య వీడియో తీసి పంపిస్తుంది అది చూసి నవ్వుకుంటూ ఆనందపడుతూ ఉంటాడు. ఇది కదా నేను అనుకుంది ఇక మీరు కట్టు బట్టలతో రోడ్డున పడాల్సిందే, చూశారుగా నేను అనుకుంటే ఏదైనా చేస్తాను విక్కీ నీ కంటే ఒక రూపాయి కూడా ఈరోజు లేదు. చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అరవిందా వస్తుంది ఏంటండీ ఫోన్లో ఏదో చూసి సంతోష పడుతున్నారుఅని అడుగుతుంది హమ్మయ్య ఇది పూర్తిగా తెలుసుకోలేదు అని అనుకుంటాడు.ఏమీ లేదు రానమ్మ ఒక కేసు గురించి క్లూ దొరికింది ఆ కేసు మనమే విన్ అయ్యాము ఇక నాకు తిరుగులేదు అని అంటాడు. మరి అంత ఎక్కువ సంబరపడకండి ఎప్పుడు అంత ఆనందం మంచిది కాదు ఈరోజు మనకు విజయం దొరికితే, రేపు వాళ్లకు విజయం దక్కుతుంది ఆమాత్రం దానికి మనం ఇలా పొంగిపోకూడదు అని సలహా ఇస్తుంది. కృష్ణకి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా ఉంటాడు ఇక అరవింద మన అర్జెంటుగా బయటకు వెళ్దాం అని అంటుంది ఎక్కడికి అని అంటాడు మా ఇంటికి వెళ్లి మా ఇంట్లో వాళ్ళని పలకరిద్దామని అంటుంది ఇప్పుడు అని అంటాడు అవును ఇప్పుడే నాకు ఒకసారి మా ఇంటికి వెళ్లాలని ఉంది అక్కడ వాళ్ళు నా కోసం ఇంత కంగారు పడుతున్నారు అని అంటుంది. లేదంటే ఒకసారి విక్కీకి ఫోన్ చేసి ఒప్పిస్తాను అని అంటుంది అవసరం లేదు నువ్వు వెళ్లి రెడీ అయ్యారా పో నేను నిన్ను తీసుకెళ్తాను కదా అని అంటాడు. అరవింద కృష్ణ మాటలు నమ్మి రెడీ అవ్వడానికి వెళుతుంది కృష్ణ రెడీ అయి రా నిన్నెక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలుసు కదా అని అంటాడు.

Nuvvu Nenu Prema May 13 Episode 622
Nuvvu Nenu Prema May 13 Episode 622

ఇక మరోవైపు విక్కీ వాళ్ళు చాలా బాధగా బయటికి వస్తారు. ఇది ఎక్కడికి వెళ్లాలో తెలియక అక్కడే నిలబడి ఉంటారు పోలీసులు కారు ఎక్కుతుంటే నీకు కారు కూడా అర్హత లేదు అది కూడా ఇక్కడే వదిలి వెళ్లాలి అని అంటారు. ఎంత పని చేశాడు మంచివాడు అనుకోని చెర తీస్తే, ఇంత పని చేస్తాడని అనుకోలేదు అని అంటుంది శాంతాదేవి. ఇక మన పరిస్థితి ఇలా ఉంటే ఈ విషయం అరవింద్ కి తెలిస్తే అరవింద ఏమైపోతుందో అని అంటుంది. ఈ విషయం ఎట్టి పరిస్థితిలో అక్కకు తెలియకూడదు అని అంటాడు. మనం వెళ్లి లీగల్ గా ప్రొసీడ్ అవుదాం అని అంటే అక్క వాడి దగ్గర బందీగా ఉంది ఇప్పుడు మనం వెళ్లిన అక్కని వాడు ఏదైనా చేస్తాడేమో అని భయపడతాడు. పోలీసులు మీరు ఇక్కడి నుంచి వెళ్తే మేము తాళం వేసుకుంటాము అని అంటారు. ఇక ఇంట్లో అందరూ ఎక్కడికి వెళ్లాలి అని ఆలోచిస్తే విక్కీ నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం అని వాళ్ళకి ఫోన్ చేస్తాడు ఎవరూ కూడా వాళ్ళని ఇంటికి రానివ్వడానికి ఓకే చెయ్యరు. అందరూ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటారు ఇక విక్కీకి ఏం చేయాలో తెలియదు పద్మావతి ఏమైంది అని అడిగితే ఎవరూ మనల్ని ఇంటికి రానిచ్చుకునేలా లేరు పద్మావతి అని అంటాడు దానితో పద్మావతి అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది మనమందరం కలిసి మా ఇంటికి వెళ్దాము అని అంటుంది. ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema May 13 Episode 622
Nuvvu Nenu Prema May 13 Episode 622

రేపటి ఎపిసోడ్ లో విక్కీ ఫ్యామిలీ మొత్తం ఒక చిన్నగదిలో ఉంటారు. పద్మావతి వెళ్లి తినడానికి పులిహార తీసుకొని వస్తుంది ఇది ఎక్కడిది పద్మావతి అని అడుగుతాడు. ఒక గుడిలో అన్నదానం జరుగుతుంటే వంట చేసే వాళ్ళు రాలేదంటే నేను అక్క కలిసి ప్రసాదం చేశాము వాళ్ళు తిరిగి మిగిలింది ఇచ్చారు అది తీసుకొని వచ్చాను అని చెప్తుంది దాంతో ఆ మాటలకు విక్కీ బాధపడి ఏడుస్తూ ఉంటాడు. ఇంట్లో అందరూ కూడా పద్మావతి వైపు జాలిగా చూస్తారు. ఇక అరవింద విక్కీ వాళ్ళ గురించి తెలుసుకుంటుందో లేదో కృష్ణ అరవింద ని ఏం చేస్తాడో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri