NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

Nuvvu Nenu Prema May 14 Episode 623

Nuvvu Nenu prema:మురళీకృష్ణ పథకం ప్రకారం విక్కి వాళ్ళ ఆస్తి మొత్తం కాజేసీ విక్కీ వాళ్ళ నడిరోడ్డు మీదకు తీసుకువస్తాడు. కోటలో నుంచి బయటికి రమ్మని పోలీసులు చెప్తారు ఈ ఆస్తి మొత్తం మురళీకృష్ణ దే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అని అంటాడు. బయటికి వచ్చిన విక్కీ వాళ్ళకి ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఫ్రెండ్స్ ని అడిగినా ఎవరు ఆశ్రయం ఇవ్వరు. పద్మావతి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అంటుంది శాంతాదేవి కూడా మంచి సలహాని అంటుంది. కానీ విక్కీ మాత్రం ఈ కష్టాల్లో మీ ఇంటికి వెళ్లి మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. దానికి ఆర్య మరి ఎక్కడికి వెళ్లకుండా ఎలా రా అని అంటాడు. అప్పుడే విక్కీ కి ఎదురుగా వాచ్మెన్ కనిపిస్తాడు వాచ్మెన్ దగ్గరికి వెళ్లి మీ ఏరియాలో ఏదైనా ఇల్లు అద్దెకి దొరుకుతుందా అని అడుగుతాడు. వాచ్మెన్ తప్పకుండా దొరుకుతుందండి ఒక ఇల్లు ఖాళీగా ఉంది చూపిస్తాను అని అంటాడు. కానీ మీలాంటి వాళ్లు అని ఆగిపోయేసరికి, ఇప్పుడు మాకు ఒక ఇల్లు దొరకడం చాలా ఇంపార్టెంట్ అది ఎలా ఉన్నా పర్వాలేదు అని అంటాడు విక్కి దాంతో వాచ్మెన్ తన ఏరియాకి తీసుకువెళ్తాడు. విక్కీ కుటుంబం మొత్తం కోటలో నుంచి బయటికి వచ్చి వాచ్మెన్ వెనుక ఒక చిన్న ఇంటి ముందు వెళ్లి నిలబడుతుంది.

Nuvvu Nenu Prema May 14 Episode 623
Nuvvu Nenu Prema May 14 Episode 623

ఇక వాచ్మెన్ చూపించిన ఇల్లు చూసి కుచలా ఇలాంటి ఇంట్లో మనం ఉండాలి అని అడుగుతుంది. కోటలో ఉన్న మహారాజుల బతికిన విక్కీనే ఇలాంటి పరిస్థితుల్లోకి వస్తే మనం తనకి సపోర్టుగా ఉండకపోతే ఎలాగో అని అంటాడు నారాయణ. దివ్య వీళ్ళతో కలిసి అన్నలు ఉండాలో ఏమో అని అనుకుంటుంది.విక్కీ ఎలా ఉంటే అలానే ఉంటాము అని అంటాడు. ఇక ఇంట్లో అందరూ కూడా మనం ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి అని అనుకుంటారు ఇక అందరూ లోపలికి వెళ్తారు వాచ్మెన్ నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అందరూ సహాయం చేయకపోయినా నువ్వు మాత్రం నాకు సహాయం చేశావు అని అంటాడు. పర్వాలేదు సారు మీరు నా చేసిన హెల్ప్ తో పోల్చుకుంటే ఇదేం పెద్ద సహాయం కాదు అని అంటాడు. ఇక అందరి లోపలికి వెళ్తారు కుచలకి ఇష్టం లేకపోయినా, అందరితో పాటు తను కూడా లోపలికి వెళ్తుంది. నావల్లే మీకు ఇన్ని కష్టాలు అని విక్కీ అంటాడు పద్మావతి కష్టాలు వస్తేనే కదా ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు తెలిసేది అని అంటుంది. ఎవరికి వాళ్లు ఏమి కాకుండా పోవడం కన్నా అందరం కలిసి కష్టాల్లో తోడు ఉండడమే బాగుంటుంది అని అంటుంది పద్మావతి. కరెక్ట్ గా చెప్పావు పద్మావతి అని అంటాడు ఆర్య. మేమంతా నీ వాళ్ళమని చెప్పి ఇప్పుడు కష్టాలు రాగానే వేరు చేస్తున్నావా అని అంటాడు. మా సంతోషంలో నువ్వు ఉన్నప్పుడు నీ కష్టాలు మేము ఉంటే తప్పేంటి అని అంటాడు. మళ్లీ నిన్ను తిరిగి మహారాజులా చూసే వరకు మేము ఎన్ని కష్టాలైనా భరిస్తాము అని అంటాడు ఆర్యా. మా ప్రాణం పోయినా మేమంతా మీతోనే ఉంటాము అని అంటుంది అను. వీధిన పడ్డ వీళ్ళ పొగరు మాత్రం తగ్గలేదు అని అనుకుంటుంది దివ్య. శ్రీరాముడు తన ఇచ్చిన మాట కోసం ఎలా అయితే కట్టుపడ్డాడో మీరు కూడా అలానే నిలబడాలి అని పద్మావతి అంటుంది అందుకు ఇంట్లో అందరూ అవును అని అంటారు ఇక త్వరలో మనకి మంచే జరుగుతుంది అని పద్మావతి అంటుంది.

Nuvvu Nenu Prema May 14 Episode 623
Nuvvu Nenu Prema May 14 Episode 623

ఇక మరోవైపు కృష్ణ విక్కీ వాళ్ళ ఇంటికి వస్తాడు. తాళం వేసిన ఇంటికి తాళం తీసుకొని లోపలికి వచ్చి మహారాజుల కుర్చీలో కూర్చుని ఇక ఈ సామ్రాజ్యానికి తిరుగులేని చక్రవర్తిని నేనే అని అంటాడు. ఈ కుర్చీ కోసం ఎన్నో పోరాటాలు చేశాను ఇప్పటికీ కుర్చీ నా చేతికి వచ్చింది అని అంటాడు. అప్పుడే అక్కడికి దివ్య చప్పట్లు కొట్టుకుంటే ఎంట్రీ చేసే శభాష్ బావ ఈ కుర్చీ కోసం నువ్వు ఎన్ని కుతంత్రాలు చేసావో, మొత్తానికి అనుకున్నది సాధించావు బావ ఇంకా వీధిన పడ్డ విక్కీ వాళ్ళని నేను సాధించేది ఏం లేదు ఇక నేను కూడా నీతోనే బావ అని అంటుంది. వెంటనే కృష్ణ ఆవేశంలో తీసుకుని నిర్ణయం మన జీవితాన్ని మార్చేస్తుంది ఇప్పుడు నువ్వు తొందర పడకూడదు అని అంటాడు అంటే ఏంటి బావ అని అంటుంది. విక్కీ దెబ్బతిన్న పులి ఇప్పుడు తన వేసే ప్రతి అడుగు మనకు చాలా ఇంపార్టెంట్ నువ్వు అక్కడ ఉండి ప్రతి నిమిషం ఏం జరుగుతుందో నాకు అప్డేట్ ఇవ్వాలి నువ్వు ఇక్కడ ఉంటే ఎలాగో అని అంటాడు. మా నాన్నను చంపిన వాళ్లతో నేనుండలేను బావ అని అంటుంది దివ్య. చూడు దివ్య కాస్త ఓపిక పట్టాలి మనకంటూ ఇంకొక రోజు వస్తుంది ఈ లోగా నేను అరవింద్ అని అడ్డు తొలగించేస్తాను. ఇక నువ్వు నేను జీవితాంతం కలిసి ఉండేటట్లు ప్లాన్ చేస్తాను. అరవింద్ అని అడ్డు తొలగించుకుంటే విక్కీ ఊరుకుంటాడా బావ అని అంటుంది. అసలు అరవింద్ అని చంపిన విషయం కూడా విక్కీకి తెలియకుండా చేస్తాను కదా అని అంటాడు కృష్ణ. అరవింద్ అడ్డుతులకు కానీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను దివ్య ఇక మనిద్దరం కలిసి కొత్త జీవితాన్ని మొదలుపెడదాం అని అంటాడు. దివ్య కూడా అందుకు సరే అన్నట్లుగా సైలెంట్ గా ఉంటుంది. నీకు తొందరలోనే ఒక మంచి శుభవార్త చెప్తాను దివ్య అరవింద అని చంపి మనిద్దరం ఒకటవుదాం అని అంటాడు. అప్పటివరకు నువ్వు జాగ్రత్తగా విక్కీ వాళ్ళు ఏం చేస్తున్నది గమనిస్తూ ఉండు అని అంటాడు ఇక సరే అంటుంది దివ్య.

Nuvvu Nenu Prema May 14 Episode 623
Nuvvu Nenu Prema May 14 Episode 623

ఇక మరోవైపు కృష్ణ అరవిందను తీసుకొని కారులో విక్కి ఇంటికి బయలుదేరుతాడు. అరవింద అప్పటికే విక్కీ వాళ్ళని చూడాలని చాలా ఆత్రుతగా ఉంటుంది తొందరగా మా వాళ్ళని చూడాలని నాకు చాలా ఆశగా ఉంది అని అంటుంది వెళ్తున్నాం రాణమ్మ అని అంటాడు లేదంటే వాళ్లకి ఫోన్ చేస్తావా అని అడుగుతాడు వద్దు వెళ్లి సప్రైజ్ ఇద్దాము అని అంటుంది. ఇది కృష్ణ నవ్వుకుంటూ వెళ్తున్నాం కదా అని అంటాడు. అప్పుడే ఒకచోట కారు అభి కారు ఏదో ట్రబుల్ ఇచ్చిందని చెప్తాడు అరవింద నిజం అనుకుంటుంది. కారులోనుండి కృష్ణ దిగి కారు రిపేరు ఉన్నట్లుగా చూస్తూ ఉంటాడు ఇక కొంచెం సేపటికి అక్కడికి రౌడీలు వస్తారు. అరవింద్ అను కార్లో నుండి బయటకు రమ్మని బెదిరిస్తారు అప్పుడే కృష్ణ వాళ్ళకి ఎదురు వెళ్లి వాళ్ళతో పోట్లాడి వాళ్లతో దెబ్బలు తిని కృష్ణ కూడా కొన్ని దెబ్బలు వారిని కొట్టి అక్కడ హోరాహోరీగా పోరు జరిగినట్టుగా బిల్డప్ ఇస్తాడు. నువ్వు మాతో పాటు రావాల్సిందే మాకు కావాల్సింది నువ్వే అని అంటాడు రౌడీ దాంతో అరవింద్ కి అడ్డుగా కృష్ణ నిలబడి నా భార్యను తీసుకెళ్లాలంటే ముందు నన్ను దాటాది అని అంటాడు నువ్వు మాకు అవసరం లేదు నువ్వు పక్కకు వెళ్లి అరవింద్ అని తీసుకెళ్లడానికి వచ్చాము అని అంటారు దానికి కృష్ణ నేనుండగా నా భార్యకు ఏమీ కానివ్వను అని అంటాడు ఇక రౌడీలకీ తుపాకీ తీసి బెదిరిస్తాడు దాంతో రౌడీలు పారిపోతారు. ఇక అరవింద మీకేం కాలేదు కదండి అని అంటుంది. నీకేం కాలేదు కదా రానమ్మ అని అంటాడు. మీరు ఉండగా నాకేమవుతుందండి అని అంటుంది సరే వెళ్దాం పదవికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని అంటాడు. వద్దులెండి మనం ఇంటికి వెళ్లి పోదాము మీరు డేంజర్ అని చెప్పినా కూడా నేనే వినకుండా బయటికి వచ్చాను. ఇక నేను ఎక్కడికి రాను విక్కీనే వచ్చి నన్ను తీసుకువెళ్తాడు. మనం వెళ్దాం పదండి ఇంటికి అని వెనక్కి వెళ్ళిపోతారు ఇక కృష్ణ మనసులో ఇదే కదా నేను కోరుకుంది ఇక జన్మలో అరవింద మల్లి విక్కీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అడగదు. అని అనుకొని అక్కడ నుంచి బయలుదేరి అరవిందను ఇంటికి తీసుకు వెళ్తాడు.

Nuvvu Nenu Prema May 14 Episode 623
Nuvvu Nenu Prema May 14 Episode 623

ఇక మరోవైపు కుచల నాకు ఆకలి వేస్తుంది ఏదైనా చేసుకొని తీసుకురండి అని అనుని పద్మావతిని అడుగుతుంది. పోయింది మన ఆస్తి ఆస్తి కాదు మాట్లాడండి అని అడుగుతుంది. వెంటనే పద్మావతి మన ఇంట్లో సరుకులు ఏం లేవు అత్తయ్య సరుకులు తెద్దాం అంటే డబ్బులు లేవు కదా అని అంటుంది అను. అవన్నీ నాకు తెలుసు కానీ నా పొట్టకు తెలియదు కదా ఎలకలు పరిగెడుతున్నాయి వాడికి ఏదైనా ఆహారం వేయాలి అని అంటే, నారాయణ కాస్త ఎన్నికలు ముందు తీసుకొచ్చి ఇస్తాను నోట్లో వేసుకుంటావా అని అంటాడు. ఏంటి నా ఆకలి మీకు అరుపులు లాగ వినపడుతుందా అని అంటుంది. ఆకలి వేస్తే నీళ్లు తాగండి అంతేగాని ఇదేంటి పెద్దదాని వే ఉండి నువ్వే ఇలా చేస్తే పిల్లలు ఎలా ఉంటారు అని శాంతాదేవి అంటుంది. అసలు మనకి పరిస్థితి రావడానికి కారణమే వీళ్ళు కదా అత్తయ్య అని అంటుంది కుచల శాంతాదేవితో, వెంటనే నారాయణ కు చల అని అరుస్తాడు. దాంట్లో తప్పేముంది అసలు వీలు వచ్చినప్పటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి మనం పరిస్థితి ఇవాళ ఈ స్థాయికి దిగజారిపోయింది అని అంటుంది వెంటనే ఆయన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మాత్రం ఉన్నామేమో పాజిటివ్ గా ఆలోచించాలి కదా అని అంటాడు. మన ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక అనర్ధం జరుగుతూనే ఉంది వీళ్ళిద్దరిని వద్దు అని నేను అప్పుడే చెప్పాను కానీ నా మాట ఎవరు విన్నారు. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు చూడండి అనుభవిస్తున్నాం అని అంటుంది. నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అని ఇంట్లో వాళ్ళందరూ కుచల మీద అరుస్తారు. ఇక పద్మావతి అక్క మనిద్దరం బయటికి వెళ్దాం పద అని తీసుకువెళ్తుంది. అక్కడ ఒక గుడిలో దండం పెట్టుకోవడానికి వెళ్తారు అప్పుడే భోజనాలు ప్రసాదం చేయడానికి వంట వాళ్ళు రాలేదని అక్కడ వాళ్ళు సీరియస్ గా మాట్లాడుతూ ఉంటారు అది గమనించి పద్దు ఆ వంట మేం చేస్తాము ఆ డబ్బు లేదు మాకు ఇవ్వండి అని అడుగుతుంది. పోయినసారి వాళ్లు కూడా ఇలానే చెప్పి మోసం చేశారమ్మా ఇప్పుడు నేను ఇవ్వడం కుదరదు అని అంటే లేదు మేము ఖచ్చితంగా చేస్తాము ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను కచ్చితంగా మేము వంట చేస్తాము ఎంతమందికైనా చేస్తాము నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతారు దాంతో అక్కడున్న ఆయన సరే అమ్మ అయితే అని అంటాడు. అన్నదాన కార్యక్రమానికి వంట చేయడానికి ఇద్దరు ఒప్పుకుంటారు. అక్కా చెల్లెలు ఇద్దరు మనకు దేవుడు ఒక అవకాశం ఇచ్చారు అని అనుకుంటారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema May 14 Episode 623
Nuvvu Nenu Prema May 14 Episode 623

రేపటి ఎపిసోడ్ లో విక్కీ, రెడీ అవుతూ పద్మావతి నా ఫైల్ ఇక్కడే పెట్టాను చూసావా అని అడుగుతాడు. పద్మావతి వచ్చి ఫైల్ ఇస్తుంది ఇప్పుడు ఈ ఫైల్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. దండయాత్ర మొదలు పెట్టాలి కదా ఉద్యోగం పురుషుల క్షణం ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తున్నాను మళ్లీ మొదటి నుంచి నా జీవితాన్ని ప్రారంభిస్తున్నాను పద్మావతి నువ్వు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పవా అని అడుగుతాడు మంచి చేయాలనుకునే వాళ్ళకి మంచే జరుగుతుంది అని అంటుంది పద్మావతి. విక్కీ ఉద్యోగం వేటలో పడతాడు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri