NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

Nuvvu Nenu Prema Today Episode may 18 2024 Episode 626 highlights

Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ కృష్ణ అవమానిస్తాడు. ఏ పని చేసుకోలేవని ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఏ పని చేయడానికి కుదరదని అంత గొప్పగా బతికి నిన్ను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదని నువ్వు ఇది ముష్టి ఎత్తుకొని బతకాల్సిందే అని అవమానించి ఒక రూపాయిని విక్కీకి ఇస్తాడు. విక్కీ అ రూపాయి తీసుకొని ఇదే రూపాయితో నేను ఎలా ఎదుగుతానో చూస్తావు కదా అని అంటాడు. నేను ఇలా కూల్ గా మాట్లాడుతున్నాను అంటే అక్కడ మా అక్క నీ దగ్గర ఉంది అన్న ఒక్క కారణమే మా అక్కకి నిజం తెలిసిన రోజు, మా అక్క అక్కడ క్షేమంగా లేదని తెలిసిన రోజు నీకు నా చేతిలో అదే ఆఖరి రోజు అవుతుంది అని వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఈ రూపాయి కూడా నేను సంపాదించింది ఇప్పుడు ఈ రూపాయితోనే నేను ఎలా ఎదుగుతాను నువ్వు చూస్తావు అంచెలంచెలుగా ఎదిగి ఈసారి నేను కొట్టే దెబ్బకి నీకు మతి పోతుంది చూడు అని సవాల్ చేసి వెళ్తాడు విక్కీ..

Nuvvu Nenu Prema Today Episode may 18 2024 Episode 626 highlights
Nuvvu Nenu Prema Today Episode may 18 2024 Episode 626 highlights

ఇక మరోవైపు కుచలా చాలా బాధపడుతూ ఉంటుంది ఎలా బతికిన మనం ఎలా అయిపోయామో, ఈ ఇల్లంత రూమ్ ఉండేది నాకు ఎప్పుడూ ఏసీలో ఉండేదాన్ని ఇక్కడ ఈ విసిని కర్రతో ఎంతైనా సార్లు విసురుకున్నా గాలి రావట్లేదు, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అంటే నారాయణ అందుకే ఎప్పుడూ సుఖం కాకుండా అప్పుడప్పుడు కష్టపడుతూ ఉంటే కష్టం విలువ కూడా తెలుస్తుంది అని అంటాడు. ఎందుకు నారు ఇంకా అసలే బాధపడుతుంటే బాధ పెడతావు నన్ను అని అంటుంది అప్పుడే అక్కడికి పార్వతి వస్తుంది పార్వతిని చూసిన కుచల, పార్వతిని అవమానించేలా మాట్లాడుతుంది వచ్చావా ఇప్పుడు మేము ఎలా ఉన్నామో చూడ్డానికి వచ్చావు కదా ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా అని అంటుంది. మీరు ఇలా ఉంటే నాకు ఎలా సంతోషంగా ఉంటుంది అని అంటుంది పార్వతి ఎందుకు అబద్దం చెప్తావు మేము ఎలా ఉన్నావో చూసి ఆనందించడానికి వచ్చావు అని అంటుంది. పద్దు అనుకూడా అక్కడికి వస్తారు వాళ్ళని చూసి ఏంటమ్మా ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చింది అని అడుగుతుంది పార్వతి వాళ్ళు అయిపోయిన దాని గురించి ఎందుకమ్మా అని అంటారు. అసలు మీ అమ్మ ఉందనుకున్నారా చచ్చిపోయింది అనుకున్నారా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కనీసం నాకు చెప్పాలి కదా అని పార్వతి ఆవేశంగా లోపలికి వెళ్తుంది.

Nuvvu Nenu Prema Today Episode may 18 2024 Episode 626 highlights
Nuvvu Nenu Prema Today Episode may 18 2024 Episode 626 highlights

ఇక పార్వతీ పద్దు అను బట్టలన్నీ సద్దుతూ నేను ఒకదాని ఉన్నాను మన ఇంటికి రావచ్చు కదా మీరందరూ కూడా మా ఇంటికి రండి అన్నయ్యగారు అని నారాయణతో అంటుంది. అక్కడే ఉన్న కుచల అదేమన్నా ఇంద్రభవనమా ఏంటి రావడానికి అని అంటుంది. మీరైనా నా మాట వినండి అమ్మ మన ఇంటికి వెళ్లి పోదాము మీ అందరిని నేను మన ఇంటికి తీసుకు వెళ్ళడానికే వచ్చాను అని అన్ని బట్టలు సర్దుతూ ఉంటే పద్దు గట్టిగా మేము రాము అని అరుస్తుంది వెంటనే పార్వతి ఏంటమ్మా అలా అంటున్నావు అని అంటుంది అవునమ్మా ఇప్పటికే మేము ఆస్తి పోగొట్టుకొని చాలా బాధల్లో ఉన్నాము ఇలాంటి అప్పుడు మీ ఇంటికి వచ్చి ఇంకా బాధనిపెంచలేము అని అంటుంది. అనుకూడా అవునమ్మా ఇప్పుడు మా అత్తగారు వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని అక్కడికి తీసుకువచ్చి ఇంకా బాధ పెట్టలేము మా బాధ ఏంటో మేము ఇక్కడే పడతాము అని అంటుంది. వెంటనే పార్వతి ఇలాంటి కూతుళ్లు కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాధల్లో అత్తింటి వాళ్ళని వదలకుండా వాళ్లతోనే ఉండాలన్న మీ ఆలోచన నాకు బాగా నచ్చింది. కానీ వెళ్లే ముందు మీకు ఒక మాట చెప్తున్నాను మీకు భరించలేని కష్టం వచ్చినప్పుడు ఈ అమ్మ బతికే ఉందన్న విషయం మర్చిపోవద్దు అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన విక్కీ ఏంటి ఏమైంది అని అడిగితే, చూడండి బాబు వీళ్ళు నేను ఇంటికి రమ్మంటే రావట్లేదు అని అంటుంది. అత్తయ్య గారు నేను ఇలా అంటున్నానని మీరు ఏమీ అనుకోవద్దు. మేము ఇక్కడే ఉంటాము మీరు ఎప్పుడు అక్కడికి రమ్మని అడగద్దు అని అంటాడు. మీ అందరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నా కూతుర్లు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నందుకు నాకు ఇంకా గర్వంగా ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పార్వతి.

Nuvvu Nenu Prema Today Episode may 18 2024 Episode 626 highlights
Nuvvu Nenu Prema Today Episode may 18 2024 Episode 626 highlights

ఇక మరోవైపు మీకు ఏ ఉద్యోగం దొరకట్లేదని క్యాబ్ డ్రైవర్ గా జాయిన్ అయ్యే కార్ తో ఇంటికి వస్తాడు. కార్ చూసి పద్మావతి ఎక్కడిది ఈ కారు అని అడుగుతుంది. వికీ నేను క్యాబ్ డ్రైవర్ గా జాయిన్ అయ్యాను అని చెప్తాడు. ఆ మాటలు విని పద్మావతి ఎలా ఉండే వాళ్ళు ఎలా అయిపోయారు సార్ మీకిందే చాలా మంది డ్రైవర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు మీరు ఇలా క్యాబ్ డ్రైవర్ గా జాయిన్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. చూడు పద్మావతి ఇప్పుడు మనకి ఉద్యోగం అవసరం నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం ఎవరు ఇవ్వట్లేదు అలాంటప్పుడు మనం ఏదో ఒకటి చూసుకోవాలి కదా అందుకే ఈ క్యాబ్ డ్రైవర్ గా జాయిన్ అయ్యాను కొన్నాళ్ల తర్వాత ఉద్యోగం వస్తే దీన్ని మానేస్తాను అని అంటాడు కానీ పద్మావతి మాత్రం దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది విక్కీ వాళ్ళ అక్క గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక దివ్య వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వింటుంది. పద్మావతి విక్కీతో మీరు కార్ డ్రైవర్ గా చేయడం నాకు ఇష్టం లేదు సారు అని అంటుంది. కానీ పద్మావతి మాట్లాడిన మాటలు విక్కీకి వినిపించవు తను అప్పటికే అరవింద గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నన్ను వదిలేసి ఎలా వెళ్లావు అక్క నీకోసం నేను ఎంత బాధ పడుతున్నానో చూడు. నువ్వు లేని రోజు నాకసలు కడగట్లేదు నువ్వు నన్ను కాదని వెళ్ళిపోయి నాకంటే కనిపించనంత దూరంలో ఉంటున్నావు అని అంటాడు. పద్మావతి మీరు మీ అక్క గురించి బాధపడుతున్నారని నాకు అర్థం అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడే ఉండి బాధపడం కన్నా ఒకసారి కలిస్తే తెలుస్తుంది కదా అని అంటుంది. వద్దు పద్మావతి అక్క ఎలా మాట్లాడుతుందో అని భయంగా ఉంది అని అంటే మీరు మీ అక్క కోసం బాధపడుతున్నారు మీ అక్క మీకోసం బాధపడుతుంది మనం ఎప్పుడు వెళ్తున్నాము అంతే అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode may 18 2024 Episode 626 highlights
Nuvvu Nenu Prema Today Episode may 18 2024 Episode 626 highlights

ఇక అక్కడే ఉన్న దివ్య ఇదంతా విని ఎలాగైనా బావకి ఈ విషయం చెప్పాలి అక్కని కలవడానికి వీళ్లిద్దరూ బయలుదేరుతున్నారు అక్క వీళ్ళని కలిస్తే మొత్తం తారుమారు అయిపోతుంది అని అనుకుంటుంది. అరవింద కూడా వాళ్ళింట్లో చాలా బాధపడుతూ ఉంటుంది విక్కీ నువ్వు తప్పితే నాకు ఎవరూ లేరు అనుకున్నాను అలాంటిది నువ్వు బావ మీద చేయి చేసుకుంటేఏ భార్య అయినా ఎలా ఊరుకుంటుంది భర్త మీద చేయి చేసుకుంటే అందుకే నేను నీ మీద కోప్పడ్డాను అలాగని నువ్వంటే ఇష్టం లేక కాదు ఇప్పటికీ నాకునువ్వే గుర్తొస్తున్నావు నిన్నుచిన్నప్పటినుంచి ఎత్తుకొని పెంచాను అమ్మమ్మకారమే ఇప్పుడు నువ్వు ఏం చేసినానీ మీద ఇష్టం పోకుండా చేస్తుంది అనుకుంటాను అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది నేను మా ఇంటికి వెళ్లి పోతే ఎంత బాగుంటుందో విక్కీ వచ్చి నన్ను తీసుకెళ్తే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ ఉంటుంది అక్కడ పనిచేస్తున్న శాంత అనే ఆవిడ అరవింద్ కి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది అరవింద జూసు తాగరు నేనిలా అంటున్నానని మీరేమనుకోవద్దు అమ్మ పుట్టింట్లోనే మొదటి కాన్పు జరగడం అందరికీ మంచిది. మీరు కూడా మీ పుట్టింట్లో ఉంటే బాగుండేది అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బాధపడుతున్నారు నా మాట విని అక్కడికి వెళ్ళండి అమ్మ అని అంటుంది. అరవింద నాకు వెళ్లాలని ఉంది కానీ ఏ దేవుడు వచ్చి నన్ను తీసుకెళ్తాడు అని అనుకుంటుంది .

Nuvvu Nenu Prema Today Episode may 18 2024 Episode 626 highlights
Nuvvu Nenu Prema Today Episode may 18 2024 Episode 626 highlights

ఇక అప్పుడే విక్కీ అక్క అని పిలుస్తాడు. అరవింద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకోసం వచ్చేసావా అని అడుగుతుంది. నీకోసమే వచ్చాను అక్క అని అంటాడు. ఇప్పటి గుర్తొచ్చిందా ఈ అక్క అని అంటుంది. పక్కనే ఉన్న పద్మావతి మిమ్మల్ని మర్చిపోతే వదిన మీకోసం రోజు బాధపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా మీరేమంటారు అని ఆలోచనతో రాకుండా ఉంటే నేనే బలవంతంగా తీసుకొచ్చాను అని అంటుంది నీకు నేను నాకు నువ్వు అక్క మనిద్దరం ఎప్పటికీ విడిపోకూడదు నువ్వు నన్ను చిన్నప్పటినుంచి చూస్తున్నావు అలాంటిది నేను బావ మీద చేయి చేసుకున్నాను అంటే దాని వెనక ఏదో కారణం ఉండి ఉంటుందని నీకు ఎప్పుడూ ఆలోచన రాలేదా అని అడుగుతాడు. అప్పుడే అక్కడికి కృష్ణ వస్తాడు ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella