NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

Nuvvu nenu Prema Episode

Nuvvu Nenu Prema :Nuvvu nenu : పద్మావతి విక్కీ ల పెళ్లిరోజు వేడుకలో పద్మావతి విక్కీ గురించి చాలా గొప్పగా చెప్తుంది. ఇక కావ్య విక్కీని పద్మావతి గురించి చెప్పమని అడుగుతుంది. విక్కీ తన భార్య గురించి చెప్పడం మొదలుపెడతాడు. ప్రతి విషయంలో, నా వెనకే ఉండి నన్ను నడిపించి ప్రతిదానికి నాకు సపోర్ట్ చేస్తుంది. చిరునవ్వుతో అన్ని పనులు చేస్తూ పొందికగా ఉంటుంది పద్మావతి. అందుకే తను కార్యేషు దాసి, నా లైఫ్ లో నేను చాలా సందర్భాలలో డౌన్ అయినప్పుడు, నేను ఆలోచించలేని సిచువేషన్ లో తను నా పక్కనే ఉంటూ, మంచి సలహాలు సూచనలు ఇచ్చింది. అందుకే తను కరణేషు మంత్రి. మనసులో ఎలాంటి బాధ ఉన్నా పైకి నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉంటుంది. అంతకంటే ఐశ్వర్యం ఇంకేముంటుంది. అందుకే తన రూపేచ లక్ష్మి. మన బాధల్ని భరించడంలో తప్పుల్ని, క్షమించడంలో తనకి భూదేవంత ఓర్పు ఉంది. అందుకే తను క్షమయా ధాత్రి. మా బిడ్డ కడుపు చూస్తుంది భార్య భర్త జేబు చూస్తుంది అంటారు, కానీ నా భార్య అలా కాదు నేను తింటేనే తన కడుపు నిండిపోతుంది. పద్మావతి గురించి చెప్పాలంటే ఇలా తనలో ఉన్న ఎన్నో గుణాలు గురించి చెప్పుకుంటూ పోవాలి. ఇప్పటివరకు మా మధ్య అగ్రిమెంట్ పెళ్లి బంధం మాత్రమే ఉండేది. ఇకనుంచి మా మధ్య ప్రేమ బంధం మాత్రమే ఉంటుంది. మమ్మల్ని మా మనసులు కలిపాయి. మా మధ్య దూరం రాదు ఉండదు. పద్మావతి నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం. అని విక్కీ పద్మావతి గురించి గొప్పగా చెప్తాడు దానికి పద్మావతి విక్కీని హగ్ చేసుకుంటుంది.

Nuvvu nenu prema today episode
Nuvvu nenu prema today episode

ఇక కావ్య మాట్లాడుతూ మీ మాటలకు మీరేమో కానీ మేమంతా చాలా ఎమోషనల్ అయ్యాము అని ఈ ఎమోషనల్ కి బ్రేక్ వేయాలి అని అంటుంది. ఇక మరోవైపు కృష్ణ అరవింద ని తీసుకొని కారులో వెళుతూ ఉంటాడు. మళ్లీ ఇంకొకసారి దివ్య కృష్ణ కి కాల్ చేస్తుంది. అప్పుడు కూడా కృష్ణ దివ్య కాల్ ని కట్ చేస్తాడు. పక్కనే ఉన్న అరవింద నాకంటే ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఎవరో మీకు కాల్ చేస్తున్నారు ముందు వాళ్ళ గురించి చూడండి అని అంటుంది. నేను కట్ చేస్తుంటే ఈ దివ్య ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది అని మనసులో అనుకుంటాడు కృష్ణ. అయితే తను నాకు ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పడానికే కాల్ చేస్తున్నట్లు ఉంది అని అనుకుంటాడు. దివ్య రాజ్ పోలీసులతో కృష్ణ గురించి చెప్పిన విషయాన్ని కృష్ణ కి చెప్పడానికి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక దివ్య మాత్రం ఆగకుండా కృష్ణ కి కాల్స్ చేస్తూనే ఉంటుంది ఇక దాంతో కృష్ణ ఒకచోట కారు ఆపుతాడు. దివ్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు. నువ్వు చెప్తున్నావని ఈ ఫోన్ ని లిఫ్ట్ చేస్తున్నాను రానమ్మ అని చెప్పి హలో అని అంటాడు. ఇక్కడ వినిపించట్లేదు నేను కొంచెం పక్కకు వెళ్లి మాట్లాడి వస్తాను అని పక్కకు వెళ్తాడు. చెప్పు దివ్య అని అంటాడు బావ ఎక్కడ ఉన్నావు నువ్వు కంగారుగా అడుగుతుంది దివ్య. నేను అనుకున్న పనికి ఇంకొంచెం దగ్గరలో ఉన్నాను అని అంటే, నువ్వు ఈ ఇంటికి వస్తే నీ చావు కూడా నీకు దగ్గరగా వస్తుంది అని అంటుంది. నా మాట విని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అటు నుంచి అటే ఎక్కడికైనా వెళ్ళిపో బావ అని అంటుంది దివ్య. ఫంక్షన్ లో ఏమైనా తాగావా ఏంటి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్ అని అంటాడు కృష్ణ. నీ గురించి ఇప్పటికే పోలీసులకి తెలిసిపోయి ఉంటుంది నా మాట విని పారిపో బావ అని అంటుంది. అర్థమయ్యేటట్టు చెప్తావా దివ్య అని అంటాడు కృష్ణ. ఇందాక రాజ్ తనకు తెలిసిన పోలీసులతో మాట్లాడాడు నీ నెంబర్ వాళ్లకి ఇచ్చి ట్రేస్ చేయమని చెప్పాడు. ఆ మాట విని ఒక్కసారిగా కృష్ణ షాక్ అవుతాడు. ఇప్పుడు నేను ఎందుకు కంగారు పడుతున్నాను అర్థమైంది కదా ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో బావ నేను ఇక నీకు ఫోన్ చేయను స్విచాఫ్ చేసేయి. సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపో అని ఫోన్ పెట్టేస్తుంది దివ్య జాగ్రత్త బావ అని అంటుంది అప్పుడే ఇదంతా కావ్య చూస్తుంది. దివ్య మాట్లాడిందంతా కావ్య వింటుంది. దివ్య కావ్యని చూసి కంగారు పడుతూ ఉంటుంది.

Nuvvu nenu prema today episode
Nuvvu nenu prema today episode

ఇక కావ్యా దివ్య దగ్గరికి వచ్చి ఏంటి దివ్య లోపల ఏమో చల్లటి వేసి బయట చల్లటి గాలి అయినా నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి అని అడుగుతుంది. నా బాడీ నేచర్ అంతే వదిన అని అంటుంది దివ్య. ఇది బాడీ నేచర్ వల్ల వచ్చిన చెమటల అనిపించట్లేదే అని అంటుంది కావ్య. నువ్వు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావ్ అని అడుగుతుంది కావ్య. ఏంటో టెన్షన్ ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావ్ అని అంటుంది. ఎవరైనా ఏదైనా ప్రమాదంలో ఉన్నారా ఏంటి అని అంటుంది కావ్య. వామ్మో ఈవిడెంటి పద్మావతి లాగా ఆవలించుకుని పేగులు లెక్కపెట్టేలా ఉందే అని అనుకుంటుంది దివ్య మనసులో, ఇకనుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకుంటుంది. అదిగో చూడు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా నీ చెమటలు ఎక్కువవుతున్నాయి దివ్య అని అంటుంది కావ్య. నేను నీకు వదిన కదా ఏంటో చెప్పు నాతో అని అంటుంది కావ్య. చెప్పడానికి ఏం లేదు వదిన నాకు తెలిసిన ఫ్రెండ్, ఒకటి ఒంటరిగా ఫారిన్ వెళుతుంటే ఎలా ఉంటుందో ఏంటో అని కంగారు పడుతున్న అంతే అని అంటుంది. మరి చివరిలో భావా అని అన్నావు అని అంటుంది దాంతో దివ్య షాక్ అవుతుంది. బావ కాదు వదిన అది బాయ్ అని చెప్పాను నీకు అలా వినిపించిందిలే అని అంటుంది దివ్య. సరే నానమ్మ పిలుస్తుంది నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దివ్య . ఏదో ఉంది దివ్య ఏదో దాస్తుంది అని కావ్య కి అర్థమవుతుంది. పద్మావతి కావ్య ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ వెళ్తుంటే కావ్య ఆలోచించుకుంటూ నడుస్తూ ఉంటుంది అప్పుడే పద్మావతి కావ్యా అని పిలుస్తుంది ఏంటి నేను ఎంత పిలుస్తున్నా నువ్వు పలకట్లేదు అని కావ్య దగ్గరికి వెళ్లి అడుగుతుంది పద్మావతి. ఏం లేదు నీది రాజ్ బావది డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంది కదా, నువ్వు డాన్స్ చేస్తే వచ్చిన వాళ్ళతో పాటు నేను ఆనందిస్తాను కదా అని కావ్యని తీసుకువెళ్దాం అనుకుంటుంది. పద్దు వెళ్దాంలే కానీ ముందు నాకు ఒక విషయం చెప్పు అని అంటుంది కావ్య. డాన్స్ అయిపోయాక మాట్లాడుకుందాం కావ్య అని అంటుంది పద్దు అని గట్టిగా అంటుంది కావ్య. మా పర్ఫామెన్స్ తర్వాత ఇంట్లో దివ్య పర్ఫామెన్స్ గురించి చెప్పు అని అంటుంది కావ్య. దీనిలో అని అడుగుతుంది ఇంట్లో దివ్య ఎలా ఉంటుంది మీతో అని అంటుంది. సడన్ గా ఎందుకు అలా అడుగుతున్నావ్ అని అంటుంది పద్మావతి. తను చెప్పే దాంట్లో చేసే దాంట్లో చాలా తేడా ఉంది అని అంటుంది కావ్య. అట్లాంటిది ఏం లేదు కావ్య ముందు తను మా ఇంట్లో వాళ్లతో కోపంగా ఉన్నాయి ఇప్పుడు అందరితో కలిసిపోయింది అని అంటుంది పద్మావతి. తను మా మామయ్య లాగా చూసుకుంటున్నాం అని అంటుంది. కానీ తను మాత్రం మీకు ఏదో చెప్పకుండా దాచిపెట్టి వెనక ఏదో నడిపిస్తుంది అని అంటుంది కావ్య. ఎందుకైనా మంచిది తన మీద ఒకన్నే చూయించవద్దు అని అంటుంది తన కొత్త వాళ్ళతో అలానే ఉంటుందిలే అని అంటుంది పద్మావతి. అందుకే నీకు తను తప్పుగా కనిపించి ఉంటుంది అని అంటే తప్పుగా కనిపించడం కాదు నిజంగానే తప్పు చేస్తుంది అని అంటుంది కావ్య. అందుకే చెప్తున్నాను నువ్వు ఒక్కన్నేసి ఉంచు తన మీద అని అంటుంది. డాన్స్ కి టైం అవుతుంది వెళ్దాం పద అని కావ్య ని తీసుకుని వెళ్ళిపోతుంది పద్దు.

Nuvvu nenu prema today episode
Nuvvu nenu prema today episode

ఇక డాన్స్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దామా అని అంటుంది పద్మావతి. డాన్స్ చేయడానికి ముందు ఎవరైనా పాట పాడతారా అని అడుగుతుంది. వెంటనే కుచల నేను పడతాను అని అంటుంది. తను పాడమంది వేలం పాట కాదే నీ బొంగురు గొంతు వేసుకుని పాడటానికి అని అంటాడు నారాయణ. చిన్నప్పుడు నన్ను అందరూ చిత్ర లాగా పడతావు అని అనేవాళ్ళు తెలుసా అని అంటుంది . చిత్ర లాగా కాదే చిత్రవిచిత్రంగా పడతావు అనే వాళ్ళు నువ్వు అందులో నీకు కావాల్సిన చిత్రా అన్న మాటను మాత్రమే తీసుకొని ఉంటావు అని అంటాడు నారాయణ. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేవు అని అంటుంది. నన్ను పాడకుండా ఎవరూ ఆపలేరు అని అంటుంది. నా మాట వినవే వద్దని ప్రశాంతంగా ఉండనివ్వవే అని అంటాడు నారాయణ. కావ్య అంకుల్ పర్వాలేదు పాడనివ్వండి అని అంటుంది. కుచల పాట పాడుతుంది. నా గొంతు శృతి లోన అని పాడుతూ ఉంటే అందరూ చెవులు మూసుకుంటారు. ఇక అందరూ ఎప్పుడు ఆ పాట ఆపుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. నేను చెప్తే విన్నారా ఇప్పుడు అనుభవించండి అని అంటాడు నారాయణ మరి ఈ రేంజ్ లో ఉంటుందని అనుకోలేదు అని అంటుంది కావ్య. వెంటనే ఒక్కసారిగా కుచలని పాట ఆపమని నారాయణ అరుస్తాడు. ఇప్పటికే అందరి కర్ణ బెరీలు పగిలిపోయాయి. ఇంకొక లైన్ పాడావంటే నీ పని చెప్తాను అని అంటాడు.ఏంటి నారు నేను సరిగా పాడలేదా అని అంటే దాని పాట అని ఎవరైనా అంటారా రా అని అంటాడు దాంతో కుచల కోపంగా వెళ్ళిపోతుంది. వెంటనే రాజ్ మాట్లాడుతూ పెద్ద ఉపద్రవం తర్వాత, ఐ మీన్ ఇంత మంచి సాంగ్ విన్నారు కదా నెక్స్ట్, డైరెక్ట్ గా డాన్స్ లోకి వెళ్లి పోదాం. ఫస్ట్ ఎవరు డాన్స్ చేస్తున్నారు అంటే కావ్య ఆర్య అను అని చెప్తుంది.

Nuvvu nenu prema today episode
Nuvvu nenu prema today episode

ఇక ఫస్ట్ అను ఆర్య ఇద్దరు డాన్స్ చేస్తూ ఉంటారు.పట్టించుకోవే చిన్ని అనే పాటకి డాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ డాన్స్ పెర్ఫార్మెన్స్ తర్వాత కుచల మనం కూడా డాన్స్ చేద్దామా అని అడుగుతుంది. మన డాన్స్ చేస్తే హాస్పిటల్ కి వెళ్లాల్సి ఉంటుంది అని అంటాడు నారాయణ నా గొంతు నొక్కేసినట్టు ఇప్పుడు డాన్స్ కూడా చేయకుండా ఆపుతారా అని అంటుంది. అందరూ కలిసి నన్ను తొక్కేస్తున్నారు అని అంటుంది ఎవరు తోకట్లా నిన్ను నువ్వే తొక్కేసుకుంటున్నావ్ అని అంటాడు నారాయణ. ఇప్పుడు డాన్స్ నేను ఆరాచకం మొదలు పెట్టకు నావల్ల కాదు అని అంటాడు నారాయణ. అంతలో కావ్య ఏంటి ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు. అని అడిగితే మీ ఆంటీ డాన్స్ చేస్తుంది అంట పైకి పంపించమంటావా అని అంటాడు నారాయణ వద్దు అని అంటాడు రాజ్. అందుకే ప్రతి దాంట్లో వేరే పెట్టొద్దు అనేది అని అంటాడు రాజ్ కావ్య తో నేను వేరే పెడతాను మీరు కాలు కూడా పెడతారు కదా అని అంటుంది కావ్య. ఇద్దరు స్టేజి మీదే ఎవరికి వినపడకుండా కొట్టుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు కృష్ణ ఏది ఏమైనా సరే నేను విక్కీకి దొరకకూడదు అని అనుకుంటాడు. ఇక నెక్స్ట్ డాన్స్ పర్ఫామెన్స్ విక్కీ పద్దు ని చేయమంటారు. ఇక మీరు వేసే డాన్స్ తో ఇది ఫస్ట్ యానివర్స్ డే కాదు పెళ్లి సందడి లాగా ఉండాలి అని అంటుంది కావ్య. ఇక ఇద్దరు డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టేజి మీదకి వస్తారు ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode
Nuvvu Nenu Prema Today Episode

రేపటి ఎపిసోడ్ లో, విక్కీతో రాజ్ అక్క ఎక్కడ ఉందో తెలిసిపోయింది అని చెప్తాడు దాంతో థాంక్స్ రాజ్ అని విక్కీ అంటాడు అదంతా దివ్య వింటుంది. మరోవైపు పాటలతో డాన్స్ చేస్తూ ఉంటారు విక్కీ పద్మావతి, రాజ్ కావ్య అను ఆర్య అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దివ్య కృష్ణ కి కాల్ చేసి నీ గురించి ఆల్రెడీ పోలీసులకు తెలిసిపోయింది ఏ క్షణమైనా నిన్ను అరెస్ట్ చేయొచ్చు. నా మాట విని పారిపో అని అంటుంది అంతలోనే అక్కడికి విక్కీ రాజ్ ఇద్దరూ కృష్ణ దగ్గరికి వెళ్తారు. కృష్ణని బాగా కొడుతూ ఉంటారు. సడన్ గా ఇద్దరూ కొట్టడం ఆపేస్తారు.మరి పక్కనే ఉన్న అరవింద కి గొడవ గురించి తెలుస్తుందో లేదో తెలియాలంటే, రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella