Nuvvu Nenu Prema మే 20 ఎపిసోడ్: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ‘నువ్వు నేను ప్రేమ’ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 315 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. నిన్నటి ఎపిసోడ్ లో అనుకి సప్రైజ్ చేయడానికి ఆర్యా అను వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక ఆండాళ్ నుండి తప్పించుకోవడానికి తెగ ట్రై చేస్తూ ఉంటాడు.

నువ్వు నేను ప్రేమ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో అను వాళ్ళ అత్తని లోపలికి పంపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆర్య డైనింగ్ టేబుల్ కింద దాక్కొని ఉంటాడు. ఎక్కడ వాళ్ళ అత్త ఆర్య ని చూస్తుందో అని అను చాలా టెన్షన్ గా పంపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అత్తా నువ్వు వెళ్లి పడుకోవద్దా చాలా పొద్దు పోయింది అని అంటుంది. ఆండాలు నాకేదో డౌట్ గా ఉంది ,అని అటు ఇటు తిరుగుతూ ఆర్య చేతిని తొక్కుతుంది. ఆర్య అరవ లేక సైలెంట్ గా నొప్పిని భరిస్తూ ఉంటాడు. ఆండాలు ఏంటే అలా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదు అత్త గొంతు నొప్పిగా ఉంది దగ్గు వస్తుంది ,అందుకే ఇలా ఉన్నాను అని చెప్తుంది అను. దగ్గు వస్తుందా ,అయితే ఆగు అల్లం టీ పెట్టకు వస్తాను లోపలికి వెళ్తుంది, ఆండాళ్.

అను ,ఆర్య కి చేతికి, వెన్నపూస రాస్తూ ఉంటుంది. ఈలోపు ఆండాళ్ టీ పెట్టుకొని తీసుకొస్తుంది. నాకు గొంతు నొప్పిగా ఉంది అందుకే ఇద్దరికీ టీ పెట్టుకొని వచ్చాను తాగు అని టీ గ్లాస్ ఇస్తుంది. టీలో పంచదార ,వేయడం మర్చిపోతుంది. మళ్లీ వెళ్లి పంచదార తీసుకొస్తాను లోపలికి వెళ్తుంది. ఈలోపు అను టీ తాగమని ఆర్యాకిస్తుంది. టేబుల్ కింద ఉన్న ఆర్య టీ తాగేస్తాడు. ఈలోగా ఆండాళ్ వచ్చి టీ గ్లాస్ ఏది అనీ అడుగుతుంది. వెనకనుండి ఆర్య అనుకి టీ గ్లాస్ అందిస్తాడు. ఇక్కడే ఉంది అత్త ఇదిగో అని అను చెప్తుంది. ఈ లోపు అను అత్త టీ తాగితే నిద్ర రాదు వెళ్లి పడుకో అని పంపించేస్తుంది. ఆండాలు కూడా సరే మీరు కూడా తొందరగా పడుకోండి అని చెప్పి వెళ్తుంది. ఆర్య ను బయటికి రమ్మని అను మళ్లీ అత్తయ్య వస్తుందేమో మీరు వెళ్లిపోండి అని అంటుంది. లేదు స్వీట్ హార్ట్ నిన్ను బయటికి తీసుకెళ్లాలని అనుకున్నాను మీ అత్త ఇప్పుడే కదా పడుకుంది కదా ,ఇద్దరం వెళ్ళి వద్దాం మనకి పద్దు హెల్ప్ చేస్తుంది అని అంటాడు ఆర్య. ఆర్య కుర్చీలో ఉన్న ఫెవికాల్ మీద చూసుకోకుండా కూర్చొని అతుక్కుపోతాడు.

Nuvvu Nenu Prema మే 20 ఎపిసోడ్: మిర్చి బజ్జీలతో వేడి వేడి నేటి ఎపిసోడ్
పద్మావతి కి ఆర్య మిర్చి బజ్జి తీసుకొచ్చి ఇస్తాడు, పద్మావతి ఆహా మిర్చి బజ్జి ఇప్పుడు తింటే చాలా బాగుంటుంది అనుకుంటూ తినబోతూ ఉంటుంది. విక్కీ ఒక నిమిషం, ఇందాక నా గురించి ఏదేదో అన్నావు కదా, ముందు దానికి సారీ చెప్పి అప్పుడు తిను అని అంటాడు విక్కీ. ఎట్టా …సారీ చెప్పి నేను తినాలా అయినా మీరేంది సారు అడిగి మరి సారీ చెప్పిచ్చుకుంటారు నేను చెప్పను అంటుంది పద్మావతి. అయినా నేను అన్న దాంట్లో ఏం తప్పు ఉంది సారూ అంటుంది పద్మావతి. ఎదుటివాళ్లు హర్ట్ అయ్యేలా మాట్లాడటం నీకు అలవాటే కదా అంటాడు విక్కి. మిర్చి బజ్జి తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన పడేదేలా పద్మావతి ,పద్మావతి ఇక్కడ, రేపటి నుండి పెళ్లి పనులు మొదలవుతూ ఉంటాయి, ఆడపిల్ల పెళ్లి వాళ్ళము అని, ఏమీ చేసిన వురుకుంట, అనుకోకు రేపటి నుంచి చూపిస్తాను సార్ మీకు, మేము మగ పెళ్లి వాళ్ళు రేపటి నుంచి అన్నిట్లో గెలిచేది మేమే ,దేనిలోనూ తగ్గేదేలే అని విక్కీ అంటాడు. అవునా సరే ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడే ఒక పోటీ పెట్టుకుందాము అనీ పద్మావతి అంటుంది. విక్కి సరే చెప్పు ఏ పందెం కైనా రెడీ అంటాడు.

ఎవరైతే ఈ మిర్చి బజ్జిని ఐదు నిమిషాల్లో తింటారు వాళ్ళు గెలిచినట్టు అని అంటుంది పద్మావతి. ఏంటి సారు మిర్చి బజ్జి తినకుండానే ఘాట్ ఎక్కినట్టు ఉన్నది తినడానికి భయమేస్తుందా మీకు అని అంటుంది. విక్కీ నెవర్ నేను దేనినైనా ఒప్పుకుంటాను గాని ఓటమిని అస్సలు ఒప్పుకోను నేను రెడీ, సారు ఇది కేక్ కాదు తీయగా ఉండడానికి మిర్చి బజ్జి తింటే కారము నాసాలానికి అంటుతుంది ఆలోచించుకోండి. సమస్య లేదు, ఇందాక నేను బెలూన్ పట్టుకున్న నా ప్రేమని ఒప్పుకోవడానికి నువ్వు ఇష్టపడలేదు. ఇప్పుడైనా నేనంటే ఏందో నిరూపించుకోవడానికి అయినా నేను గెలిచి తీరుతాను అని వీక్కి అంటాడు. ఇద్దరు మిర్చి బజ్జిని తింటూ ఉంటారు పద్మావతికి ఒక బజ్జీ తిన్న తర్వాత కారం అనిపిస్తుంది వెంటనే నీళ్ల కోసం చూసి నీళ్లు తాగుతుంది విక్కి మాత్రం బజ్జీలు అన్నిటిని కష్టపడి తింటూ ఉంటాడు. పద్మావతి వెంటనే సారు మిర్చి చాలా కారంగా ఉంది వద్దు సారు తినకండి నా మాట వినండి అని ఆపాలని చూస్తుంది. నేను ఏదో మాట వరుసకు అన్నాను సారు మీరు ఇంత కారం తినలేరు ఆపండి ఆపండి అని బతిమిలాడుతుంది. కానీ విక్కీ అన్ని బజ్జీలు తినేస్తాడు. ఇష్టమైన వాళ్ళ కోసం ఈ కారాన్ని కాదు విషాన్ని కూడా అమృతంలో తాగేస్తాను. అని విక్కి అంటాడు. పద్మావతి ముందు ఈ నీళ్లు తాగండి అని ఇస్తుంది, విక్కీ పొరమలుతుంది తల మీద నిమురుతూ ఉంటుంది, విక్కీ అప్పుడే పద్మావతి చేతిని ప్రేమగా, పట్టుకుంటాడు.

నేను నీకు సర్ప్రైజ్ చేద్దామనుకుంటే నువ్వే నాకు సప్రైజ్ ఇచ్చావు
ఇద్దరూ ఒకరి కలలో ఒకరు చూస్తూ ఉండగా సిద్దు వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. సిద్ధూ అరే నేను నీకు సర్ప్రైజ్ చేద్దామనుకుంటే నువ్వే నాకు సప్రైజ్ ఇచ్చావు అని పద్మావతిని అంటాడు. బోర్ కొడుతుంది అన్నావ్ కదా మరి అప్పుడే వచ్చావ్ ఏంటి అని సిద్దు అని అడుగుతాడు విక్కి. పద్దు ని చూడాలని దోశతో వచ్చాను అని చెప్తాడు సిద్దు. అది దోశ కాదురా ఆశ అని విక్కి చెప్తాడు. పద్దు సిద్దు తో మిర్చి బజ్జి తింటారా అని అడుగుతుంది. సిద్దు నువ్వు పెనాయిల్ తాగమన్నా జ్యూస్ లా తాగేస్తాను మిర్చి బజ్జి అయినా పర్లేదు ఇవ్వండి తింటాను అంటాడు. సిద్దు కి మిర్చి బజ్జి ఇస్తుంది పద్మావతి, జాగ్రత్త మిర్చి కాస్త కారంగా ఉన్నది అని అంటుంది. సిద్దు యు డోంట్ వర్రీ అని చెప్పి, మిర్చి బజ్జి ని నోట్లో పెట్టుకుంటాడు, ఇంక అంతే సంగతులు స్టాచు లాగా నిలబడిపోతాడు. సిద్దు గారు ఏమైంది ఏమైంది పద్మావతి అడిగిన మాట్లాడు, ఒక్కసారిగా పెద్దగా అరుస్తాడు.. మై మౌత్ ఈజ్ బర్నింగ్ అని నీళ్లు తాగుతాడు. విక్కి కీ ఆర్య కాల్ చేసి అనుకోకుండా నేను చైర్ కు అతుక్కుపోయాను రా. నువ్వు త్వరగా వచ్చి నాకు హెల్ప్ చెయ్యి అని అడుగుతాడు.
Nuvvu Nenu Prema: అను పుట్టినరోజుకి సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ఆర్య..

అరవింద్ ను చంపటానికి రెడీ అయిన కృష్
కృష్ణ, అరవింద కు స్పాట్ పెడతాడు. కృష్ణ పాలల్లో విషం కలిపి అరవింద్ కు ఇస్తాడు. ఎలాగైనా అరవింద చేత పాలు తాగించాలని, పద్మావతిని పెళ్లి చేసుకోవాలని మనసులో అనుకుంటూ పాలలో విషం కలిపి అరవింద కు ఇస్తాడు. అరవింద అయ్యో నాకెందుకండీ ఇప్పుడు పాలు మీరు భోజనం కూడా సరిగా చేయలేదు అందుకని, మీరే తాగండి పాలు అని ఇస్తుంది. దెబ్బ కి కృష్ణ భయపడి అయ్యో నేను ఈ పాలు తాగితే పోతానని మనసులో అనుకోని నువ్వే తాగాలి రానమ్మ నీ బిడ్డ నీ అంత అందంగా పుట్టాలని,ఈ పాలల్లో కుంకుమపువ్వు వేసాను అని అంటాడు. సరేనండి నేను తాగుతాను మీరు ఈ లోపు పండు తినండి అని ఒక పండు ఇస్తుంది. నేను కలిపిన విషయం నీ శరీరంలో కలవగానే మరుక్షణం నువ్వు చస్తావు నాకు ఇక అడ్డంకి ఉండదు అరవింద ,అని కృష్ణ మనసులో అనుకుంటాడు. ఈలోపు ఉరుములు, మెరుపులు రావడంతో అరవింద ఒక్కసారిగా గ్లాస్ కింద పడేసి కృష్ణ ను కౌగిలించుకుంటుంది. కృష్ణ చా ప్లాన్ అంత ఫెయిల్ అయిపోయింది ,అని బాధపడుతూ ఉంటాడు.
Nuvvu Nenu Prema మే 20 ఎపిసోడ్: కావాలనే చేశారు కదా ఈ పని
ఆర్య కుర్చీకి అతుక్కుపోవడం పద్మావతి ,సిద్దు, విక్కీ అందరూ వచ్చి అర్య ను కుర్చీ నుంచి బయటికి తీయాలని చూస్తూ ఉంటారు.. ఇలా ఎలా కూర్చున్నావురా అని విక్కీ , ఆర్య ని అడుగుతాడు.. చైర్ మీద గమ్ము వుడాది,అందుకే అలా అతుక్కుపోయారు అని చెప్తుంది అను. ఇందాకట్నుంచి చాలా ట్రై చేస్తున్నాను రా అసలు రావట్లేదు అని అంటాడు ఆర్య. రేపటి ఎపిసోడ్ లో, పద్మావతి విక్కీ, ఆర్యాలను ఆటపట్టిస్తూ ఉంటుంది. కాళ్ళు కడుక్కోడానికి వేడి వేడి నీళ్లు ఇస్తుంది. అవి కాళ్ళ మీద పోసుకొని విక్కి, అర్యా అరుస్తారు. కావాలనే చేశారు కదా ఈ పని అని విక్కీ అడుగుతాడు,మరదలు కదా ఈ మాత్రం ఆట పట్టించకపోతే ఎలా ఉంటుంది అని అంటుంది పద్మావతి. ఇక పెళ్లి సందడి అంతా రేపు ఎపిసోడ్ లో చూద్దాం.