NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema May 22 Episode 630: అరవింద కోసం పద్మావతి చేసిన పని..? పద్మావతిని అపార్థం చేసుకొని కొట్టిన విక్కి..

Nuvvu Nenu Prema Today Episode May 22 2024 Episode 630 highlights

Nuvvu Nenu Prema May 22 Episode 630: కృష్ణా పద్మావతి కి ఫోన్ చేసి అరవింద నిజం తెలుసుకుందని నన్ను కొట్టింది గుడిలో ఎవరో తనకి ఏదో చెప్పారు గుడి నుంచి వచ్చిన తర్వాత తన ప్రవర్తన మారిపోయింది నా నుంచి నిజం తెలిసిపోయింది ఇప్పుడు అరవింద్ రూమ్లో బంధించాను. కావాలంటే చూడు అని కృష్ణ వీడియో కాల్ చేసి పద్మావతికి చూపిస్తాడు. నువ్వు కనక కేసు వాపసు తీసుకోకపోతే, అరవింద్ అని చంపేస్తాను ఈ విషయం ఎవరితో చెప్పినా అరవింద ప్రాణాలతో నీకు దక్కదు నువ్వు మాత్రమే పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు తీసుకో అని అంటాడు. అరవింద కోసం పద్మావతి కేసు వాపస్ తీసుకోవాలి అని అనుకుంటుంది. విక్కీ,పద్మావతి ఎందుకు అంత డల్ గా ఉన్నావు అని అడిగితే ఏమీ లేదు నాకు నిద్ర వస్తుంది అని చెప్పి పడుకుంటుంది. కానీ పద్మావతి మనసులో విక్కికి నిజం చెప్పలేకపోతున్నానని అరవింద కోసం ఇదంతా చేయాల్సి వస్తుందని కానీ మీకు తెలిసిన తర్వాత నా మీద ఎంత కోపడతారో ఏంటో అని అనుకుంటూ పడుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode May 22 2024 Episode 630 highlights
Nuvvu Nenu Prema Today Episode May 22 2024 Episode 630 highlights

ఇక ఉదయాన్నే పద్మావతి రెడీ అవుతూ ఉంటుంది పోలీస్ స్టేషన్ కి వెళ్లడానికి విక్కీ తను కూడా బయటికి వెళ్తూ పద్మావతి ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు అందుకు పద్మావతి నేను బయటకు వెళ్తున్నాను సార్ అని అంటుంది. పదం ఏం డ్రాప్ చేస్తాను అని అంటాడు వద్దు సార్ నేను వెళ్తాను అని అంటుంది ఎక్కడికి అని అడుగుతాడు.చిన్న పని మీద వెళ్తున్నాను అని అంటుంది పద్మావతి వికీపీకి అనుమానం వస్తుంది ఏంటి పద్మావతి కంగారుపడుతుంది నా దగ్గర నిజం చెప్పట్లేదు నేను డ్రాప్ చేస్తానన్నా వద్దంటుంది ఏదో జరిగింది అని రాత్రికి బాగానే ఉన్న పద్మావతి రాత్రి ఉన్నటువంటి తన ఫేస్ కూడా మారిపోయింది. చాలా డల్ గా కనిపించింది ఎందుకు అని అడిగితే రాత్రి నిజం చెప్పలేదు ఇప్పుడు నిజం చెప్పట్లేదు పద్మావతి ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవాలి అని అనుకుంటాడు. ఇక పద్మావతి ఇప్పుడే వస్తాను సారు అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది బయట ఆటో ఎక్కి పద్మావతి పోలీస్ స్టేషన్ కి వెళుతుంది.

Nuvvu Nenu Prema Today Episode May 22 2024 Episode 630 highlights
Nuvvu Nenu Prema Today Episode May 22 2024 Episode 630 highlights

ఇక మరోవైపు కుచల పసుపు కుంకాలతో ఇల్లంతా పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే నారాయణ వచ్చి తన భార్య వేసిన ముగ్గుని చూసి భయపడతాడు. కుచల బయట బోర్డు పెడుతుంది ఎవరికైనా పెళ్లికూతురులకి మేకప్ వేయబడును అని బోర్డు పెట్టి ఆ బోర్డుకి పూజలు చేస్తూ ఉంటుంది. అదంతా చూసి నారాయణ ఆశ్చర్యపోతూ కుచల దగ్గరికి వెళ్తాడు. ఏంటే పూజలు చేస్తున్నావా క్షుద్ర పూజలు చేస్తున్నావా అని అడుగుతాడు. బోర్డు పెట్టి ఇన్ని రోజులు అయింది కదా ఒకళ్ళు కూడా రాలేదు అందుకే పూజలు చేస్తున్నాను అని అంటుంది. వాళ్లకి నీచైతే మేకప్ చేయించుకునే అదృష్టం లేదులే అని అంటాడు. నాకెందుకో ఈరోజు మన జీవితం మారబోతుంది అనిపిస్తుంది అని అంటుంది అప్పుడే ఒక ఆవిడ వచ్చి హాయ్ మేడం నా పేరు ఐశ్వర్యారాయ్ నాకు బ్రైడల్ మేకప్ వేయాలి అని అంటుంది. కుచల నేనే వేసేది రండి అని లోపలికి తీసుకు వెళ్తుంది.

Nuvvu Nenu Prema Today Episode May 22 2024 Episode 630 highlights
Nuvvu Nenu Prema Today Episode May 22 2024 Episode 630 highlights

ఇక మరోవైపు పద్మావతి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తుంది. నేనెప్పుడూ వికీ చెప్పకుండా నేను తీసుకోకూడదు అనుకుంటాను కానీ ఇప్పుడు ఆయనకి చెప్పకుండా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేను ఇప్పుడు అరవింద్ వదిన కోసం తన కడుపులో పెరిగిన బిడ్డ కోసం, నిర్ణయం తీసుకుంటున్నాను దీనివల్ల మా ఆస్తి మొత్తం పోతుంది కానీ వాళ్ళిద్దరూ సేఫ్ గా ఉంటారు. మీకు కూడా ఆస్తి కన్నా వాళ్ళ సేఫ్గా ఉండడమే మీకు ఇష్టం కాబట్టినేనుమీరు చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని పద్మావతి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండి విక్కీకి నిజం చెప్పలేదని బాధపడుతూ ఉంటుంది. మరోవైపు కుజుల వేసిన మేకప్ కి వచ్చిన అమ్మాయి దయ్యంలా మారిపోతుంది. పెళ్లికి వెళ్లాలని అందంగా రెడీ చేస్తారని ఇక్కడికి వస్తే నా మొఖం అంతా ఇలా చేస్తారేంటి నా స్కిన్ అంతా మీరేదో చేశారు. మిమ్మల్ని వదిలిపెట్టను నేను అని అంటుంది ఆవిడ. మేకప్ అన్న తర్వాత ఒకసారి ఇలా కూడా అవుతూ ఉంటుంది. చక్కగా ఉండే నన్నుఇలా చేశావు అని కుచల మీద కోప్పడుతుంది. వెళ్లి మా ఆయనకు చెప్తాను మా ఆయన ఎవరో తెలుసా రౌడీషీటర్ ని అంత తెలుస్తాడు అని అక్కడి నుంచి అమ్మాయి వెళ్ళిపోతుంది. నారాయణ బాగా అయిందా ఇప్పుడు నీకు అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode May 22 2024 Episode 630 highlights
Nuvvu Nenu Prema Today Episode May 22 2024 Episode 630 highlights

మరోవైపు పద్మావతి పోలీస్ స్టేషన్లో లోపలికి వెళ్లి, పోలీస్ దగ్గర మాట్లాడుతుంది. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు మీ పని మీదే మేమున్నాము అని ఎస్ఐ చెప్తాడు. నేను వచ్చింది మీరు కేసు ఎంత బడికి తీసుకొచ్చారు అని అడగడానికి కాదు, కేసు వాపస్ తీసుకోవడానికి అని అంటుంది పద్మావతి. మరోవైపు విక్కీ కారులో వెళ్తూ, కృష్ణుని చూసి ఆగుతాడు. కృష్ణ విక్కి దగ్గరికి వెళ్తాడు. ఏంటి బామ్మర్ది నా మీద కేసు పెడితే నేను భయపడతానా అని అంటాడు. నీ అంతు తేల్చడానికే నీ మీద కేసు పెట్టాను అని అంటాడు విక్కి. మరోవైపు పద్మావతిని పోలీసు ఏంటండీ మీరు అనేది కేసు ఆఫర్స్ తీసుకోవాలి అనుకోవడం ఏంటి ఆయన మిమ్మల్ని బెదిరించాడా అని అడుగుతారు.అదేం లేదండి నేను నా మనస్ఫూర్తిగా కేసు వాపసు తీసుకుంటున్నాను అని అంటుంది పద్మావతి. ఇక కృష్ణ నీకు నా గురించి పూర్తిగా తెలియదు. నువ్వు మంచి వాడివి కాబట్టి నేను అందరూ మోసం చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా నిన్ను మోసం చేయడానికి మీ ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్లారు. నా మీద అభిమానంతో నామీద ప్రేమతోనే ఇదంతా చేస్తున్నారు అని అంటే ఏంమాట్లాడుతున్నావురా అని అంటాడు.పద్మావతి కేసు వాపస్ వాపస్ తీసుకోవడానికి వచ్చాను అని అంటే ఎస్ఐ ఆమెకి ఒక పేపర్ ఇచ్చే సంతకం పెట్టండి అని అంటాడు. పద్మావతి భయపడుతూ మనసులో బాధపడుతూ కేసు వాపస్ తీసుకుంటుంది. ఇక అదే విషయాన్ని కృష్ణ విక్కీ తో చెప్తాడు. పద్మావతి ఇప్పుడు నా వైపు ఉంది నీకు ఆ విషయం అర్థం కావట్లేదు, అని అంటాడు కృష్ణ పద్మావతి గురించి పిచ్చిగా మాట్లాడకు అని అంటాడు విక్కి. అప్పుడే కృష్ణకి ఫోన్ వస్తుంది. ఇప్పుడే పద్మావతి గారు వచ్చి నీ మీద పెట్టిన వాపస్ తీసుకున్నారు. అని చెప్తే స్పీకర్ ఆన్ చేసి ఇప్పుడు మళ్ళీ చెప్పండి అని అంటాడు. ఆ మాటలు విక్కీ కూడా వింటాడు. వెంటనే వికీ షాక్ అవుతాడు. పద్మావతి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోతుంది ఇక కృష్ణ విన్నావు కదా నేను నీ మంచి నీ కోరుకుంటున్నాను కానీ నీతో ఉన్న వాళ్ళే, నిన్ను మోసం చేస్తున్నారు నీ మీద నిజంగా పద్మావతికి ప్రేమ ఉంటే నిజం చెప్తుంది. నీ మీద ప్రేమ ఉండదు కాబట్టి తను అప్పటికి నిజం చెప్పదు. ఇప్పటికీ పద్మావతికి నేనంటే నీ ఇష్టం అనే వ్యక్తి మనసులో లేనిపోని అపోహలు సృష్టించి వెళ్ళిపోతాడు కృష్ణ. విక్కీ బాధపడుతూ ఎందుకు ఇంత పని చేశావు. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అని అనుకొని ఇంటికి బయలుదేరుతాడు

Nuvvu Nenu Prema Today Episode May 22 2024 Episode 630 highlights
Nuvvu Nenu Prema Today Episode May 22 2024 Episode 630 highlights

ఇక మరోవైపు పద్మావతి ఇంటికి వస్తుంది ఇద్దరు కలిసి వెళ్లారు కదా, నువ్వు ఒక్కదానివే వచ్చావ్ ఏంటి అని అడిగితే, పద్మావతి సైలెంట్ గా ఉంటుంది అప్పుడే విక్కీ లోపలికి వస్తే చెప్పు అడుగుతున్నారు కదా అని అంటాడు. పద్మావతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే విక్కీ కోపంగా నిన్నే పద్మావతి అడుగుతుంది ఎక్కడికి వెళ్లావు అని అంటాడు. ఆయన ఎందుకంత కోపంగా అడుగుతున్నావు మామూలుగా అడగొచ్చు కదా అని అంటాడు. పద్మావతి భయపడుతూ ఉంటుంది విక్కీ దగ్గరికి వచ్చి ఎందుకు ఆ మురళి మీద పెట్టిన కేసు వాపస్ తీసుకున్నావు అని అడుగుతాడు. ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. పద్మావతి ఎందుకు వాపస్ తీసుకున్నావు వాడి మీద పెట్టిన కేసు వల్ల వాడి గురించి అక్కకి నిజం తెలిసిపోతుంది అక్క నా దగ్గరికి వస్తుంది అని ఎంత సంతోష పడ్డానో ఒక్క రోజులో నా సంతోషాన్ని పాడు చేశావు. ఎందుకిలా చేశావు అని అడిగితే నేనేం చెప్పలేను సారు అని అంటుంది ఎంత పెద్ద తప్పు చేశావో తెలుసా మా అక్క మా అమ్మ ఇద్దరు ఇంటికి వచ్చేస్తారని మా అక్క కడుపులో పెరుగుతున్న మా అమ్మతో నేను ఆడుకోవచ్చు అని ఎన్నోఆశలు పెట్టుకున్నాను అలాంటిది నా ఆశలు అన్నిటి మీద నీళ్లు చల్లేశావు.ఎందుకిలా చేశావు అని గట్టిగా నిలదీస్తాడు.నువ్వు ఇలా చేసావంటే నమ్మలేకపోతున్నాము అని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు దివ్య మాత్రం మా బావ బాగా భయపెట్టినట్టు ఉన్నాడు అందుకే పద్మావతి ఇలా చేసింది అని అనుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్లో పద్మావతి తనని మోసం చేసిందని తనకి చెప్పకుండా ఇంత పెద్ద పని చేసిందనివిక్కీ బాధపడుతూ మందు తాగుతూ ఉంటాడు.మరోవైపు పద్మావతి విక్కీ అన్న మాటలకు బాధపడి రోడ్డుమీద రాత్రిపూట చీకట్లో ఆలోచిస్తూ ఉంటుంది.ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించాను అన్నట్లుగానే జరిగింది.నేనేం చెప్పినా మీరు ఇప్పుడు నమ్మలేరు నేను అరవింద కోసమే ఇదంతా చేశాను. ఆ విషయం మీకు ఎప్పటికీ తెలుస్తుందో అని బాధపడుతూ ఉంటుంది పద్మావతి మరోవైపు నీకు అనవసరంగా నామనసులో చోటు ఇచ్చాను పద్మావతి నేను తప్పు చేశాను అని విక్కీ బాధపడుతూ ఉంటాడు.

Related posts

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella

Krishna Mukunda Murari June 06 Episode 489: శ్రీనివాస్ ని కలిసిన కృష్ణ.. మురారిని దాచింది ముకుంద అన్న నిజం కృష్ణకి తెలియనుందా? రేపటి ట్విస్ట్ ..

bharani jella

Nuvvu Nenu Prema June 06 Episode 643:అను పద్దు ల మధ్య గొడవ పెట్టాలనుకున్న దివ్య.. అను రిక్వెస్ట్.. విక్కీ పద్మావతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మూర్తి..

bharani jella