Nuvvu Nenu Prema : నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి, అణువులను తీసుకువెళ్లడానికి భక్త వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పద్మావతి కి విక్కీ వార్నింగ్ ఇస్తాడు. అను ఆర్య విడిపోకుండా ఉండాలి అంటే నువ్వు ఇప్పటికి నేను చెప్పినట్టే వినాలి అని వార్నింగ్ ఇస్తాడు విక్కి. అందరూ కలిసి పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్తారు.

ఈరోజు 387 ఎపిసోడ్ లో, పద్మావతి ఆండాలతో మాట్లాడుతూ ఉంటుంది. నన్ను ఎప్పటికీ క్షమించరా ఇంకా నేను ఏ తప్పు చేయలేదు.ఈ పద్మావతి ఏది చేసినా అందులో ఒక కారణం ఉంటుంది. మా అమ్మ తర్వాత నువ్వు నాకు అమ్మ లాంటి దానివి నువ్వే మాట్లాడకపోతే నేను ఎవరితో మాట్లాడాలి అసలు నేను ఎందుకు ఉండాలి చనిపోయిన పర్లేదు అని అంటుంది. వెంటనే ఆడాలి ఆమె నువ్వు అలా మాట్లాడకు నువ్వంటే మాకు కోపం లేదు. చెప్పకుండా పెళ్లి చేసుకున్నావ్ అన్న ఒక కారణం తప్ప నీ మీద మాకు ఏ కోపం లేదు. ఎప్పుడు నువ్వు అలా అనుకోకు అని పద్మావతి తో ఆండాలు అంటుంది. అసలు నాకన్నా మీ నాయన ఎక్కువ బాధ పడుతున్నాడు ముందు మీ నాయనని ఆ బాధలో నుంచి కొంచెం బయటికి వచ్చేలా చేయి అని అంటుంది పద్మావతి తో అండల్.

భక్త ని మార్చాలనుకున్న పద్మావతి..
ఆండాలు చెప్పిన తర్వాత పద్మావతి వాళ్ళ నాన్న కోసం వెతుకుతూ ఉంటుంది.చిలకమ్మ అక్కడికి వచ్చి ఎవరికోసం వెతుకుతున్నారమ్మా అని అడుగుతుంది. ఎవరికోసం లేదులే అని అంటుంది పద్మావతి నాకు తెలుసు అమ్మ నేను మొహం చూసి ఇట్లే చెప్పేస్తాను మీరు మీ నాన్న కోసం వెతుకుతున్నారు కదా ఆయన అక్కడ ఉన్నా వాడి వెళ్ళండి అని అంటుంది చిలకమ్మా. సరే అని పద్మావతి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది అప్పుడే అక్కడికి అనుకూడా వస్తుంది. పద్మావతి నాయన నా మీద ఇంకా కోపం పోలేదా అని అడుగుతుంది. నేను ఏ తప్పు చేయలేదు నాయనా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను అంతే అది కూడా ఒక కారణంతోనే ఆ కారణం ఎప్పటికైనా మీకు చెప్తాను కానీ ఇప్పుడు మాత్రం చెప్పలేదు అని అంటుంది పద్మావతి. నేను ఏ పని చేసినా కానీ అది ఇంటి కోసం ఇంట్లో వాళ్ళ కోసం చేస్తాను మీకు తెలుసు కదా నాయన, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు నాతో మాట్లాడు నాయనా అని అడుగుతుంది.

అయినా భర్త ఏం మాట్లాడకుండా ఉంటాడు 16 రోజుల పండగ కాబట్టి మీ వాళ్ళ ముందు అలా మాట్లాడి నిన్ను ఇక్కడికి తీసుకు వచ్చాము. అంతేకానీ నువ్వు చేసిన బాధ నువ్వు చేసిన గాయం నా మనసుకి అలానే ఉంది నేను నీతో మాట్లాడలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.పద్మావతి చూడక్కన అని నాతో మాట్లాడటం లేదు నువ్వైనా చెప్పు అక్క అని బతిమిలాడుతుంది.ఏం కాదులే మీ అసలు మాట్లాడను ఆయన 16 రోజులు పండక్కి నేను ఇక్కడ తీసుకొచ్చాడు అంటే నీ మీద ప్రేమ ఉన్నట్టే కదా, మెల్లిగా ఆయనే మారి నీతో మాట్లాడతాడు నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకు సంతోషంగా ఉండు అని అంటుంది అను.

Bhrahmamudi: వ్రతాన్ని పూర్తి చేసిన రాజ్, కావ్య.. రుద్రాని ప్లాన్ తో ఒక్కటవ్వబోతున్న జంట..
భోజనానికి ఏర్పాట్లు చేయడం..
భక్త ఆండాలు చిలకమ్మా అందరూ కలిసి భోజనానికి ఏర్పాట్లు చేస్తారు. భోజనానికి రమ్మని అను,ఆర్యాలను పిలుస్తారు. చిలకమ్మా అబ్బో వంటలు బాగానే చేశారండి ఈ వంటలు చూస్తుంటేనే తెలుస్తుంది మీ పిల్లల మీద మీకు ఎంత ప్రేమ ఉందో అని అంటుంది అండల్ తో,మీకు మీ పద్మావతి అంటే చాలా ఇష్టం కదా అందుకని పద్మావతికి ఇష్టమైనవి కూడా చేశారు అని అనగానే అక్కడికి పద్మావతి వస్తుంది. వాసం చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకోసమే చేశారా ఇవన్నీ అని అడుగుతుంది. కానీ అండల్ భక్త ఏమి మాట్లాడకుండా ఉంటారు. పద్మావతి చాలా ఆకలిగా ఉంది ఒక పట్టు పట్టేద్దాం అత్తా కొంచెం అన్నం పెట్టేసి అని అంటుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఎందుకంటే పద్మావతి ఒక్కతే వచ్చి కూర్చొని అన్నం పెట్టమంటుంది విక్కిం తీసుకురాదు. వెంటనే చిలకమ్మా ఇదేంటమ్మా మీరు ఒక్కరోజు కూర్చున్నారు మీ ఆయన గారు ఏరి అని అడుగుతుంది. పద్మావతి అయ్యో మర్చిపోయా ఈ టెంపరరీ కూడా ఇంట్లోనే ఉన్నాడు కదా, ఇప్పుడు వీళ్ళకి ఏదో ఒకటి చెప్తాము అని అనుకోని ఆయన చాలా బిజీ కదా నన్ను ముందు తినేసి ఏమన్నాడు తర్వాత ఆయన తింటా అన్నాడు అని అంటుంది. అట్లా ఎట్లా అమ్మ అందరూ ఒక చోట ఉన్నప్పుడు, కలిసి భోజనం చేయాలి కానీ ఇలా విడివిడిగా తినేదానికా 16 రోజులు పండక్కి నేను మిమ్మల్ని తీసుకువచ్చింది, అల్లుడు గారిని తీసుకొని రా అని చెప్తారు పద్మావతి తో, పద్మావతి చేసేది ఏం లేక నేను ఇప్పుడు తీసుకురాకపోతే డౌట్ పడేలా ఉన్నారు అని అనుకోని విక్కి ని పిలవడానికి వెళ్తుంది.

Krishna Mukunda Murari: దూరమవుతున్న కృష్ణ మురారి లను ఒక్కటి చేయడానికి నందు, గౌతమ్ ప్లాన్..
పద్మావతి విక్కి ల సరదా..
పద్మావతి విక్కీనిపిలవడానికి రూమ్ బయట నించు అని పిలుస్తూ ఉంటుంది.విక్కీ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. భోజనానికి మా వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు రండి అని అంటుంది పద్మావతి కావాలని విక్కీ పట్టించుకోకుండా ఉంటాడు. ఓ సామి నిన్నే పిలుస్తుంది ఏమి వినపడట్లేదా అని అంటుంది పద్మావతి.నేను పని చేసుకుంటున్నాను కనిపించట్లేదా డిస్టర్బ్ చేయకుండా అవతలికి వెళ్ళు అని అంటాడు విక్కి.వెనకనుంచి పద్మావతిని అల్లుడు గారిని పిలువమ్మా అని అంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు.ఓ సామి నీకు కనపడట్లేదా ఏంది మా వాళ్ళంతా అన్నానికి పిలుస్తున్నారు వస్తున్నావా రావట్లేదా,మీ ఇంట్లో నువ్వు చెప్పిన మాట నేను వినట్టు మా ఇంట్లో కూడా నేను చెప్పిన మాట నువ్వు వినాలి.భోజనానికి రండి అని అంటుంది వెంటనే విక్కీ నాకే ఆర్డర్లు వేస్తావా అని లేస్తాడు వెంటనే పద్మావతి రూమ్ బయటకి వచ్చి నిలబడుతుంది.ఏంటమ్మా నువ్వు ఒక్కదానివే బయటికి వచ్చావు అల్లుడుగారు ఏరి అని అడుగుతాడు. ఆయన న ఇక్కడ మర్యాదలు అవి సరిగ్గా సరిపోవట్లేదు అట అందుకని మీ నాయన వచ్చి అన్నట్టు పిలిస్తేనే వస్తాను పిలిస్తే రాను అని మన మీద అలిగాడు అని చెప్తుంది. వెంటనే ఆ మాట విని విక్కీ ఏంటి పద్మావతి ఇలా చెప్తుంది నేను ఎప్పుడు అలిగాను అని అనుకుంటారు.పద్మావతి మీరు రండి నాయనా వచ్చి పిలవండి అని అంటుంది భక్త తో సరే అమ్మ నేను వచ్చి పిలుస్తాను అని భర్త వచ్చేలోపు రూమ్ దగ్గరికి విక్కీని బయటకు వచ్చి నిలబడతాడు. పద్మావతి నేను అన్నానికి వస్తానని చెప్పాను కదా ఏంటి ఇక్కడ నిలబడ్డావు కదా,పదా వెళ్దాం అని అంటాడు.ఆండాలు పెళ్లయినా కానీ నీకు అల్లరితనం పోలేదా పద్మావతి అబ్బాయి మీద అబద్ధాలు చెప్తున్నావు అని అంటుంది. వచ్చి అన్న నీకు చూడండి అని అంటుంది సరే అని వికీ పద్మావతి అన్నం తినటానికి కు కూర్చుంటారు.
రేపటి ఎపిసోడ్ లో, పద్మావతి విక్కీ అను ఆర్య అందరూ భోజనం చేయడానికి సిద్ధంగా ఉండగా చిలకమ్మా, ఆగండి బాబు అందరూ తినేస్తున్నారు ఏంటి కొత్తగా పెళ్లైన వాళ్ళు ఒకరినట్లు ఒకళ్ళు తినిపించుకోవాలి మొదటి ముద్ద అని అంటుంది.వెంటనే పద్మావతి షాక్ అవుతుంది. ఆర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.