Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘నువ్వు నేను ప్రేమ’. విజయవంతంగా 341ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 342 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.

నిన్నటి ఎపిసోడ్ లో,ఆర్య వాళ్ళ ఇంట్లో హోమం ఏర్పాట్లు చేసి ఉంటారు. పద్మావతి,సిద్దు ఇద్దరు కలిసి నెయ్యి తీసుకురావడానికి బయటకి వెళ్తారు.కృష్ణ ఎలాగైనా పద్మావతిని దక్కించుకోవాలని, ప్లాన్ వేస్తాడు.

Krishna Mukunda Murari: మురారి డైరీ చూసిన ముకుంద.. బాధతో మురారిని ఏం చేయనుంది..
ఈరోజు ఎపిసోడ్ లో,పద్మావతి కోసం సిద్దు గాజులు తీసుకొని వస్తాడు. గాజు చూసి పద్మావతి చాలా బాగున్నాయి అంటుంది. అయితే చేతికి వేసుకోవచ్చు కదా అని అడుగుతాడు. నీకు ఇష్టమైన మిర్చీ వచ్చిన తీసుకొచ్చానా అని అంటాడు. పద్మావతి మిర్చి బజ్జి అంటే కాదంటానా తీసుకురండి అని అంటుంది. సరే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్లిన బజ్జి తీసుకొస్తాను అని సిద్ధు వెళ్తాడు. ఎంతసేపటికి పద్మావతి వాళ్ళు రాలేదని విక్కీ ఫోన్ చేస్తూ ఉంటాడు. వాళ్ల ఫోన్ కలవదు. అసలే సిద్దుకి రోడ్లన్నీ కొత్త ఎటు తీసుకెళ్లాడు ఏమో అని విక్కీ కంగారు పడతాడు. పద్మావతి కూడా సిద్దు ఇంకా రాలేదు ఏంటి నెయ్యి ఇవ్వాలి కదా ఇంట్లో, నేను ఆటోలో అయినా వెళ్తే పోతుంది అని ఆటో కోసం ముందుకు వెళుతుంది. సిద్దు బజ్జి తీసుకొని దారి తప్పిపోతాడు. ఎంతసేపు వెతికినా తను కారు ఎక్కడ పార్క్ చేశాడు ఆ అక్కడికి, రాలేక వెతుక్కుంటూ, చివరికి కారు దగ్గరికి వస్తాడు. అప్పటికే అక్కడ పద్మావతి ఉండదు. పద్మావతి ఏక్కడికివెళ్ళింది అనుకుంటూ కారు స్టార్ట్ చేస్తారు.

Nuvvu Nenu Prema: పద్మావతిని మెప్పించడానికి సిద్ధూ ప్రయత్నం… కృష్ణ పన్నాగం ఫలించనుందా…
అను, ఆర్యా మాటలను వినేసిన కుచల..
ఒకటే కూర్చుని అంతకు ముందు జరిగిన, పెళ్లిచూపులను గుర్తు చేసుకుంటూ ఉంటుంది.కట్నం కోసం, క్యాన్సిల్ చేసుకున్న విషయాని గుర్తు చేసుకుంటుంది. అదే టైంకి కుచ్చులు ఫోన్ మాట్లాడుతూ దూరం నుంచిఅనుని గమనిస్తూ ఉంటుంది.అక్కడికి ఆర్య వచ్చి అనుకి జ్యూస్ తీసుకుని ఇస్తాడు.అను ఆర్యతో,మీ ఇంట్లో వాళ్లకి చెప్పారా మా గురించి అని అంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేను అను అంటాడు. ఇప్పుడు కాకపోతే రేపొద్దున తెలిస్తే బాగోదండి. ఇప్పుడే చెప్పాలి అని అంటుంది. దూరం నుంచి కుచల విని ఏంటి ఏదో, చెప్పాలి అంటుంది. ఏదో ఉంది అని వింటూ ఉంటుంది. ఆర్య ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి ఎందుకు, నాకు అన్నీ తెలిసే నేను నిన్ను ప్రేమించాను కదా ఇప్పుడు మా అమ్మకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు దాని గురించి మర్చిపో అని అంటాడు. లేదండి నేనంటే అసలే మీ అమ్మకి ఇష్టం ఉండదు. నీకు పెళ్లయిన తర్వాత చెప్తే అప్పుడు ఇంకా ఎంత గోల అవుతుందో, ఇప్పుడే నాకు ఇంతకుముందు ఒక సంబంధం వచ్చిందని పీటల మీద ఆ సంబంధం క్యాన్సిల్ అయిందని, చెప్పేస్తే,నాకు కి బాగుంటుంది మీకుబాగుంటుంది. లేదంటే రేపు మీక్కూడా మాట వస్తుంది అని అంటుంది. అది విని ఒక్కసారిగా కుచల షాక్ అవుతుంది. ఏంటి అంతకుముందే పెళ్లికి రెడీ అయ్యావా, పీటల మీదే అది క్యాన్సిల్ అయిపోయిందా, అని కుచల మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆర్యజరిగింది మొత్తం నాకు తెలుసు నేను నిన్ను ఇష్టపడే చేసుకుంటున్నాను. ఇవన్నీ మా అమ్మకు తెలియాల్సిన అవసరం లేదు అని అంటాడు. వాళ్ళిద్దరూ అలా ఉండడాన్ని, కుచల తట్టుకోలేక పోతుంది.నువ్వు ఇంకా కూల్ గా ఉండను ఏ టెన్షన్ లేదు అని అంటాడు. నన్ను టెన్షన్ పెట్టి మీరు కూల్ గా ఉంటారా చెప్తాను. మీ పని అని అనుకుంటుంది కుచల.

పద్మావతిని రౌడీలు, తీసుకెళ్లడం..
పద్మావతి ఆటో ఎక్కడానికి, ఆటో కోసం వెతుకుతూ ఉంటుంది. అదే టైం కి అక్కడ ఒక కారు వస్తుంది. ఆ కారులో నుంచి నాలుగు రౌడీలు పద్మావతి దగ్గరికి వస్తూ ఉంటారు. పద్మావతి రౌడీలు ఏంటి నా వైపే వస్తున్నారు అని అనుకుంటుంది. నలుగురు రౌడీలు వచ్చి పద్మావతిని పట్టుకుంటారు. చూడబోతే ఈ రౌడీలు పంపించింది కృష్ణ అయి ఉంటాడు. పద్మావతి ఆ రౌడీలనుండి తప్పించుకోవడానికి, ప్రయత్నిస్తూ వదలండి ఎవరు మీరు అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మరో కారు వస్తుంది. ఆ కార్లో విక్కీ బయటకు వస్తాడు. విక్కి ని చూసి పద్మావతి సార్ సార్ అని అరుస్తుంది. విక్కీ వెంటనే వెళ్లి రౌడీలు అందరినీ కొట్టి, పద్మావతిని కాపాడతాడు. అందులో ఒక రౌడీ, పద్మావతిని చంపడానికి కత్తి తీస్తాడు. పద్మావతికి కత్తి తగిలే టయానికి విక్కీ ఆ రౌడీ చేతిని పట్టుకుంటాడు. నాకేమైనా పర్లేదు కానీ పద్మావతి నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అని అరౌడీని పద్మావతి మీదకే కత్తి తీస్తావా అని కొడతాడు. రౌడీలందరు పారిపోయిన తర్వాత,విక్కీ పద్మావతి బయలుదేరుతారు.

కుచల హోమాన్ని,ఆపేస్తుంది..
హోమానికి అన్ని ఏర్పాట్లు చేసి వధూవరులను పిలవండి అని అంటారు పంతులుగారు. అప్పుడే అక్కడికి ఆర్య అను ఇద్దరూ వస్తారు. ఎక్కడికి వెళ్లారు రా అని అడుగుతుంది అరవింద. ఏమి చెప్పకుండా ఉంటారు. సరే సరే ముందు టైం అవుతుంది హోమానికి కూర్చోండి అని అంటుంది. వాళ్ళు కరెక్ట్ గా హోమానికి పీఠం మీద కూర్చునే టైంలో కుచల వచ్చి ఆగండి అని అంటుంది. మీరు కామెంట్ చేయడానికి వీలు లేదు, ఈ హోమం జరగడానికి నేను ఒప్పుకోను, అసలు ఈ హోమమే కాదు పెళ్లి జరగడానికి కూడా నేను ఒప్పుకోను ఈ పెళ్లి క్యాన్సిల్ అని అంటుంది. ఏమైంది అనిఅంటుంది, అరవింద. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేయకండి అమ్మ తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. మా నుంచి ఏమైనా తప్పు ఉంటే చెప్పండి సరిదిద్దుకుంటాం అంటుంది పార్వతి. అసలు పెళ్లి వద్దనుకుంటే వరుసలు పెట్టి పిలుస్తావేంటి, మీలా అబద్ధాలు చెప్పి, నిజాన్ని దాచిపెట్టే వాళ్లతో రేపు ఇంకా కష్టం. అందుకే ఇప్పుడే వద్దనుకుంటున్నాం అని అంటుంది. ఆర్య నువ్వు ఇంకా ఆ అమ్మాయితో మాట్లాడొద్దు ఇటు వచ్చేసేయ్ అని అంటుంది కుచల. ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. కృష్ణ మాత్రం మనసులో అమ్మయ్య నేను ఎలా పెళ్లాపాల అని అనుకుంటున్నా, కతల కార్యం గదర్వులు తీరుస్తారని, నా పని ఈవిడే చేస్తుంది. ఈ పెళ్లి ఆపేస్తే మనం ఎంజాయ్ గా చూస్తూ ఉన్నాం. మనసులో అనుకుంటాడు కృష్ణ.

అందరి ముందు పద్మావతి ఫ్యామిలీ ని, అవమానించిన కుచల..
ఆర్య కుచలను, వురుకుంటుంటే ఏంటమ్మా ఏదేదో మాట్లాడుతున్నావ్ అని అంటాడు. వాళ్ళు చేసింది ఏంటి అని అంటాడు. అవును నీకు తెలియదా వాళ్ళు చేసింది అని నీకు తెలుసు కదా నిన్ను వాళ్ళు మాయలో పడేశారు. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్ అంటుంది కుచల.
అసలు వాళ్ళు చేసినా తప్పేమిటికుచల అని అంటుంది,ఆర్య వాళ్ళ నాయనమ్మ.అది నా నోటితో నేను చెప్పడం ఎందుకు వాళ్ళని అడగండి అని అంటుంది కుచ ల.మాకుచల మీరు ఏదో తప్పు చేశారంటుంది ఏదో నిజం దాచి పెట్టారు అంటుంది అది ఏంటో చెప్పండి అని అంటుంది, ఆర్యా వాళ్ళ నాయనమ్మ. పార్వతి మాకు తెలిసి ఏ తప్పు చేయలేదమ్మా, అని అనగానే కుచల కాదు చేశారు నిజం ని దాచి పెట్టారు.ఇంతకుముందే మీ అమ్మాయికి ఒక సంబంధం వచ్చి పీటల మీద ఆగిపోయింది. ఆ నిజాన్ని మీరు దాచిపెట్టి డబ్బు కోసం ఆస్తి కోసం ఈ సంబంధం, కుదుర్చుకున్నారు అని అంటుంది కుచల. కుచల అత్తగారు అవునా మాకుచల చెప్పింది నిజమా అని అంటుంది.అవునండి అని అంటుంది పార్వతి.కాకపోతే అని ఏదో చెప్పబోతుండగా పార్వతి, వద్దు ఇంకేం చెప్పకు అని కుచల ఆపేస్తుంది. అమ్మ ఇప్పుడు అది నీకు తప్పుగా కనిపిస్తుందా అందులో ఏం తప్పు ఉంది అని అంటాడు ఆర్య.మీకు తప్పుగా కనిపించకపోవచ్చు, కానీ నా దగ్గర నిజాన్ని దాచి పెట్టారు కదా అని అంటుంది కుచల. డబ్బు కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నారు లేదంటే నిశ్చితార్థానికి ముందే నాతో ఒక మాట అనొచ్చు కదా, నా కొడుకుతో చెప్తే సరిపోతుందా వాడి అమ్మ ని నాతో చెప్పాలి కదా, అది కాదు వదిన అని పార్వతి అంటూ ఉంటుంది. నువ్వేం చెప్పకు అని అంటుంది కుచల. అరవింద ఎప్పుడో జరిగిపోయింది దానికి ఇప్పుడేంటి పిన్ని అని అంటుంది. అయినా సరే కుచేలా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని మొండి పట్టు పడుతుంది.

రేపటి ఎపిసోడ్ లో,విక్కీ పద్మావతి ఇద్దరు ఇంటికి వస్తారు.ఇంట్లో పరిస్థితిని చూసి ఏమైంది అక్క అని అడుగుతాడు విక్కీ. ఇంతకుముందే అనుకి ఒక సంబంధం వచ్చి ఆగిపోయింది అని పిన్నికి తెలిసి పెళ్లి ఆపేయమంటుంది, అని అరవింద విక్కీ తో చెప్తుంది. నిజాన్ని దాచి పెట్టి పెళ్లి చేస్తున్నారని ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమంటుంది కుచల అని అంటుంది. నిజాన్ని దాచి పెట్టింది వాళ్ళు కాదు పిన్ని నేను అని అంటాడు విక్కీ.. చూడాలి రేపు విక్కీ పెళ్లి ఎలా జరిపిస్తాడో…
Nuvvu Nenu Prema: పద్మావతిని మెప్పించడానికి సిద్ధూ ప్రయత్నం… కృష్ణ పన్నాగం ఫలించనుందా…