Nuvvu Nenu Prema: స్టార్ మా చానల్లో రోజూ మధ్యాహ్నం ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న సీరియల్ నువ్వు నేను ప్రేమ. ఈ సీరియల్ లో హీరోయిన్ పద్మావతి క్యారెక్టర్ కి అక్క పాత్రలో నటిస్తున్న అను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అను తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరొకవైపు చెల్లిని.. నిందల భారీ నుంచీ కాపాడుకునే క్రమంలో ఆమె పడే తిప్పలు ప్రేక్షకులను మరింతగా అలరిస్తున్నాయని అని చెప్పవచ్చు.

ఇక అను క్యారెక్టర్ లో నటిస్తున్న డోకల నవ్య ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఫోటోషూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు.

ఇక ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న వారు కూడా ఎక్కువగా ఈమె పెట్టే ఫోటోలకు , ఇన్స్టా రీల్స్ కి తెగ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా ఈమె మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలోని కాజల్ అగర్వాల్ డైలాగును రీమేక్ చేస్తూ ఒక వీడియో షేర్ చేసింది

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్ లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంతకూ ఆ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే.. నువ్వు నాతోనే ఉన్నట్టు అనే పాటతో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందిస్తూ అందులో కాజల్ చెప్పే డైలాగ్.. “ఒకప్పుడు అదే నా ప్రపంచం ఇప్పుడు నువ్వే నా ప్రపంచం అయ్యావు..

” అంటూ ప్రభాస్తో కాజల్ చెప్పే డైలాగ్ ను చెబుతూ అను మురిసిపోయింది. ఇక అను చెబుతున్నది చూస్తుంటే ఆమె నిజంగా లవ్ లో పడిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి పూర్తి విషయాలు తెలియాలి అంటే దీనిపై అనూ స్పందించక తప్పదు. మొత్తానికి అయితే అను షేర్ చేసిన వీడియో చాలా వైరల్ గా మారుతోంది.