Nuvvu Nenu Prema Serial ఏప్రిల్ 6 ఎపిసోడ్: మత్తులో మంచం మీద ఉన్న విక్రమాదిత్యతో ఈ రోజు నువ్వు నేను ప్రేమ సీరియల్ ఎపిసోడ్ మొదలవుతుంది. పూర్తి మత్తులో ఉన్న విక్రమాదిత్య సోయి లేకుండ తనలో తాను మాట్లాడటం మొదలు పెడుతాడు. నా ప్రాణం కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాతో ఉంటె నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అంటూ విక్రమాదిత్య మత్తులో మాట్లాడుతూ ఉండగా ఇంతలో అటుగా వొచ్చిన మాయ ఆ మాటలు వింటుంది. విక్కీ ఇలా మాట్లాతుంది తన గురించేనా అని మనసులో అంకుంటుంది. కానీ కాసెపటలోనే విక్కీ ఆలోచిసితుంది తన గురించి కాదు అని మాయ కు అర్ధం అవుతుంది. నీవు లేకుండా ఈ ఎడబాటులో నేను బ్రతకలేను నన్ను ఎందుకు ఇలా దూరంగా ఉంచుతున్నావు ప్లీజ్ నా బాధను అర్ధం చేసుకో అంటూ విక్కీ తన మాటలు కంటిన్యూ చేస్తాడు.

విక్కీ నా గురించి ఆలోచిస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఇలా తాగి ఇంతలా బాధపడుతున్నాడు అంటే తాను ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు అంటూ సందేహంలో ఉండిపోతుంది అక్కడకు వొచ్చిన మాయ. అంటే విక్కీ మనసులో నేను లేనా? విక్కీ నన్ను కాకుండా వేరే ఎవరినైనా ఇష్టపడుతున్నాడా అని కంట తడి తెచుకుంటుంది.

క్రిమినల్ లాయర్ పాత్ర పోషిస్తున్న మురళి కారులో వొచ్చి పద్మావతిని చూసి ఆగుతాడు. పద్మావతి గారు ఏంటి ప్రేమించినవాడు దేవదాసు అయిపోతున్నాడు అని బాధ పడుతున్నారా? అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం పద్మావతి అది మన పెళ్లి అంటూ వార్నింగ్ .ఇస్తాడు. చంపెయ్యాలి అన్నంత కోపంగా ఉందా? లేదా నా గురించి నిజం చెప్పెయ్యాలి అని ఉందా? ఇలాంటివి ఏమైనా చేస్తే రెండు ఫామిలీస్ పని అయిపోయినట్లే అని వార్నింగ్ ఇస్తాడు. దీనికి బదులుగా పద్మావతి కోపంగా సమాధానం ఇస్తుంది, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసిన నీ కోరిక తీరదు, ఆ పరిస్థిథే వొస్తే నేను చావనైనా చస్తాను కానీ నీకు దక్కను అని నిక్కచ్చిగా చెప్పేస్తుంది. ఇంతలో పద్మావతిని వెతుక్కుంటూ అక్క అను అటుగా రావటం చూసి ఇద్దరు కంగారు పడతారు.

నువ్వు ఎక్కడ ఉన్నవో అని కంగారు పడుతున్న ఇక్కడ ఉన్నావా అంటూ అక్కడికి వొస్తుంది అను. ఇంతలో మురళి కూడా మాట మారుస్తూ నేను కూడా అదే కంగారు పడ్డాను అండి, ఇంత రాత్రిలో విక్రమాదిత్య గారిని వెతుకు ఒక్కతే ఇలా బయటకు రావటం మంచిదేనా మీరే చెప్పండి అంటూ అను తో మాట కలిపే ప్రయత్నం చేస్తాడు.
అను గారు మీ పెళ్లి గురించి పద్మావతి గారు అనవసరంగా కంగారు పడుతున్నారు, మీ పెళ్లి అయినా తరువాత మా పెళ్లి జరుగుతుంది అని మీరైనా చెప్పండి, పెద్మావతి గారు ఆరు నూరు అయినా మన పెళ్లి కచ్చితంగా జరుగుతుంది అంటూ వ్యంగ్యంగా నవ్వి అక్కడనుంచి వెళ్ళిపోతాడు మురళి

సీన్ కట్ చేస్తే, విసీక్రమాదిత్య రూమ్ లో తాగి పడుకోవటం చూసి ఏడవడం మొదలు పెడుతుంది అరవింద. అయ్యో విక్కీ నిన్ను ఇలా చూడాల్సి వొస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు,నా విక్కీ ని ఇలా చూడటానికేనా నేను ఇంకా బ్రతికి ఉన్నాను, వీరికీ లేరా ఒక్కసారి ఈ అక్కని చూడరా అంటూ ఏడుస్తుంది. అటుగా వొచ్చిన తన నానమ్మను చూసి వీడు ఇలా ఎందుకు అయిపోతున్నాడు? చిన్నప్పటినుంచి ఎలాంటి బాధైనా నాతో పంచుకునేవాడు కానీ ఇప్పుడు అంత లోపలే ఉంచుకొని ఇలా అయిపోతున్నాడు అంటుంది. ఉరుకు అరవింద, వాడికి అక్కలా కాకుండా అమ్మలా ను పడే బాధ ఏంటో నాకు తెలుసు అంటూ ఓదారుస్తుంది.

ఉదయాన్నే పద్మావతి ఫోన్ చూసుకుంటే టెంపరోడు నుంచి మిస్డ్ కాల్స్ ఇంకా ఒక మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే ఉదయాన్నే తనను కలవమని ఒక విషయం మాట్లాడాలి అని విక్రమాదిత్య అంటాడు. అది చదివిన పద్మావతి, అదేంటి ఈ రోజు మాయ గారితో ఎంగేజ్మెంట్ పెట్టుకొని నాతో ఎం మాట్లాడుతాడు అని కంగారు పడుతుంది. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే విక్కీ మల్లి డిస్టర్బ్ అవుతాడు ఆయన సంతోషంగా ఉండాలి అంటే నేను అక్కడికి వెళ్ళకూడదు అని పద్మావతి నిర్ణయించుకుంటుంది.
ఇంతలో పద్మావతి అత్త ఆండాళ్ళు అక్కడికి వొస్తుంది. ను ఇంకా రెడీ కాకుండా అలానే ఉన్నవేంది పో వెళ్లి రెడీ అవ్వు అంటూ పద్మావతికి చెప్తుంది. దీనికి బదులుగా నేను అక్కడికి పోను అని పద్మావతి చెప్తుంది. వీరు మాట్లాడుతూ ఉండగే అను మురళి ఇంకా మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ అక్కడికి వొస్తారు. పద్మావతి వెళ్లట్లేదు అని తెలుసుకున్న మురళి చాలా ఆనందిస్తూ ఇంకా విక్కీ మాయ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది అని అనుకుంటాడు.

పద్మావతిని రెడీ కమ్మని అను అంటుంది, మిగతావారు కూడా ఒత్తిడి చేస్తుంటే చేస్తారు. నాకు ఆరోగ్యం బాలేదు అంటే ఎవరు వినరే అని కోపంగా చెప్తుంది పద్మావతి.
అక్కడ విక్రమాదిత్య నిద్ర లేచి పద్మావతిని గుర్తుతెచ్చుకొని ఏడుస్తుంటాడు. ఎందుకు పద్మావతి ఇలా చేస్తున్నావు, నీ మనసులో ఎం అనుకుంటున్నావా నాకు చెప్పావు అని గట్టిగా బయటకు అంటాడు, సరిగ్గా అదే సమయానికి అక్కడకి వొచ్చిన తన అక్క అరవింద ఆ మాటలు విని ఆశ్చర్య పోతుంది. ఆ తరువాత ఎం జరుగుతుందో నువ్వు నేను ప్రేమ సీరియల్ రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
Brahmamudi: కళావతిని తన పుట్టింటికి తీసుకు వెళ్ళనున్న రాజ్.. కళావతి మనసులో స్థానం కోసమైనా ఇదంతా..??