Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో,పద్మావతి, అరవింద, కృష్ణ ముగ్గురు గుడికి వెళ్తారు. వెళ్లే దారిలో కృష్ణ అరవింద కు అపాయాన్ని తలపెడతాడు. దాని నుండి పద్మావతి అరవింద్ ను కాపాడుతుంది. అలాగే కృష్ణ కూడా ఇంకొకసారి ఇలాంటి పనులు చేయొద్దని వర్నింగ్ ఇస్తుంది.

ఈరోజు 414 ఎపిసోడ్ లో,పద్మావతిఅరవింద విషయంలో అశ్రద్ధగా ఉన్నందుకే అరవింద కు చేయి దెబ్బ తగిలిందని విక్కీ పద్మావతి మీద కోప్పడుతూ ఉంటాడు. చివరికి అరవిందా విక్కీని అరుస్తుంది. అసలు పద్మావతి లేకపోతే నేనుండే దాన్ని కాదు అని నిజం చెప్తుంది అరవింద. ఇక పద్మావతి ని అందరూ పొగుడుతూ ఉంటారు. నువ్వు లేకపోతే అరవింద్ ఉండేది కాదు నీ ప్రాణాలను అడ్డం పెట్టి కాపాడావు అని నారాయణ అంటాడు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని అను అంటుంది. పద్మావతి చాలా మంచిది అందుకే కదా విక్కీ ఎన్ని మాటలు అన్నా కానీ పద్మావతి ఏమీ మాట్లాడకుండా ఉంది తను నీ ఆవేశాన్ని అర్థం చేసుకుంది కాబట్టి నువ్వు ఎన్ని మాటలు అన్నా తిరిగి నిన్ను ఎదిరించలేదు ఇప్పుడు నిజం తెలిసింది కదా అవి ఆవేశం పనికిరాదు అని అరవిందా విక్కీ తో అంటుంది.

తమ్ముళ్ళకి రాఖీ కట్టిన అరవింద..
నారాయణ అయిందేదో అయిపోయింది అంతా మర్చిపోండి ఇంక రాఖీ కట్టమ్మా అరవిందా అని అంటాడు. కుశల ఎలా రాఖీ కడుతుంది చేతికి గాయం అయింది కదా ఇంకా ఇప్పటికి వద్దులే అని అంటుంది. అరవిందా లేదు పిన్ని నేను కచ్చితంగా రాఖీ కడతాను నేను రాఖీ కడితేనే నా తమ్ముళ్ళకి మంచి జరుగుతుంది అని అరవింద చాలా బలవంతంగా చెయ్యి నొప్పిగా ఉన్న కానీ కట్టలేక కట్టలేక వాళ్ళకి బొట్టు పెట్టి రాఖీ కడుతుంది. రాఖీ కట్టేటప్పుడు ఎడమ చేతితో కట్టాల్సి వస్తుంది కుడి చేతికి దెబ్బ తగులుతుంది కాబట్టి వెంటనే కుచాల ఎడం చేత్తో కట్టకూడదమ్మా అని అంటుంది విక్కీ ఏ చేతితో కట్టిన పర్వాలేదు పిన్ని మా అక్క మనసు మంచిది ఏమీ కాదు అని అంటాడు. అరవింద ఇద్దరి తమ్ముళ్ళకి రాఖీ కట్టింది.

కృష్ణ నువ్విలా కష్టపడటం నేను చూడలేకపోతున్నాను రానమ్మ కట్టకుండా ఉన్నా పర్వాలేదు కదా అని అంటాడు లేదండి కచ్చితంగా కట్టాల్సిందే సంవత్సరానికి ఒకసారి వస్తుంది రాఖీ పండుగ కట్టి తీరాలి అని కట్టేస్తుంది. ఇద్దరు తమ్ముళ్ళు అరవింద్ కి ఒక బంగారు నగ బంగారు గాజులు గిఫ్టుగా ఇస్తారు. పద్మావతి తో అరవింద నాకు వచ్చిన గిట్లలో సగం నీకు కావాలన్నావు కదా తీసుకో అని అంటుంది. పర్వాలేదండి మీ తమ్ముళ్లు మీకు ప్రేమగా ఇచ్చారు. నాకెందుకు నేను ఏదో ఊరికే జోక్ గా అన్నాను అని అంటుంది పద్మావతి. అందరూ కలిసి ఒక సెల్ఫీ దిగుదామని సెల్ఫీ దిగుతారు.

Nuvvu Nenu Prema Today September 13: పార్వతి బాధ..
పార్వతి ఒకటే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది పద్మావతి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు, మళ్లీ ఏం గొడవ జరిగిందో ఏమో అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు అక్కడికి వచ్చిన భక్త ఏమైందని అడుగుతాడు. పద్మావతి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మళ్లీ ఏం గొడవ జరిగిందో ఏమో అని అంటుంది. ఎందుకు పార్వతి ఎప్పుడు పద్మావతి గురించి ఆలోచిస్తావు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగానే ఉంటారులే అంటాడు భక్త. మీ అంత కఠినంగా నేను ఉండలేనండి పెంచిన తల్లిని కదా ఎంతైనా తను ఎంత బాధ పడుతుందో అని నాకు ఉంటుంది కదా మీలాగా మనసుని రాయి చేసుకుని నేను బతకలేక పోతున్నాను అండి, అయినా తను చేసిన తప్పేంటండి చెప్పకుండా పెళ్లి చేసుకుంది దానికే దానితో మాట్లాడకుండా దూరం పెడతారా, అసలు ఏ పరిస్థితుల్లో తను తాళి కట్టించుకుందో ఏమో, ఏరోజైనా అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఎప్పుడైనా మీరు కనుక్కున్నారా కనుక్కోలేదు, పైగా తన ఏదో పెద్ద తప్పు చేసినట్టు తనతో మాట్లాడకుండా భీష్మించు కూర్చున్నారు.

తనకు శత్రువులా చూస్తున్నారు ఇంకా కూడా, చిన్నప్పటినుండి తను ఏం చేసినా తనకోసం కాకుండా మన కోసం మన సంతోషం కోసం చేసేది,అలాంటిది ఇప్పుడు ఇలా చేసింది అంటే అందులో కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది అది ఆలోచించకుండా, ఇలా మీరు మాట్లాడకుండా ఉండడం ఏంటండీ అని బాధపడుతూ ఉంటుంది పార్వతి. మీతో తన బాధ చెప్పుకోలేక అత్తింట్లో కష్టాన్ని భరిస్తూ, తను ఎంత బాధ పడుతుందో అని అంటుంది. తండ్రిగా మీరున్నారన్న నమ్మకాన్ని ధైర్యాన్ని తనకి మీరిస్తేనే కదా బాగుండేది. లేదంటే జీవితాంతం తను ఇట్లా అనే బాధపడుతూ ఉంటుంది అది మీకు ఇష్టమా చెప్పండి అని భక్త ని నిలదీస్తుంది పార్వతి. తను వాళ్ళ అత్తగారింట్లో సంతోషంగా ఉండేలాగా వాళ్ళ ఆయనతో సఖ్యతగా ఉండేలాగా మనమే ఏదో ఒకటి చేయాలండి ఆలోచించండి అని అంటుంది.

పద్మావతి నిర్ణయం..
పద్మావతి ఒక్కతే కూర్చొని రూమ్లో బాధపడుతూ విక్కీ అన్నమాటలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నీకు బాధ్యత లేదు అందుకే మా అక్క చేతికి దెబ్బ తగిలింది అని పద్మావతిని విక్కీ కోప్పడతాడు అవే గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది పద్మావతి అప్పుడు అక్కడికి విక్కీ వస్తాడు. ఏదో అక్క చేతికి దెబ్బ తగలడం వల్ల నేను అలా మాట్లాడాల్సి వచ్చింది అని అంటాడు. నాకు విషయం ఏంటో పూర్తిగా తెలియదు అక్క చేతికిగాయం చూసేసరికి అని అనేటప్పటికి పద్మావతి మీ అక్క గాయం చూసి నా మనసు గాయపడేలాగా మాట్లాడారు.ఇప్పుడే కాదు మొదటి నుంచి నేను చెప్పేది ఏది మీరు నమ్మరు అని వినరని నాకు తెలుసు ఇప్పుడు కూడా నన్ను శత్రువులా చూస్తూ జరిగిన విషయాన్ని తెలుసుకోకుండా నా మీద నోరు పారేసుకున్నారు ఇప్పటికీ నన్ను బాధ పెడుతూనే ఉన్నారు నన్ను అర్థం చేసుకోవడం మీ వల్ల కాదు, పద్మావతి నేను తగ్గి మాట్లాడాను నన్ను తక్కువ చేసి చూడకు, నా తప్పు ఉంది కాబట్టి నేను సారీ చెప్పాలనుకున్నాను కానీ నువ్వు యువతల వాళ్ళని అర్థం చేసుకోవడం చేతకాదు అని అంటాడు విక్కి.

అర్థం చేసుకుని నేను కాదు మీరు అందుకే కదా నా చేత బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. నేను మా ఇంట్లో మా వాళ్ళతో ఆనందంగా ఉండేదాన్ని ఇక్కడ నేను నరకం అనుభవిస్తున్నాను మీ వల్లే కదా అని అంటుంది. మీకు వివతల వారిని అర్థం చేసుకోవడం చేతకాక నా మీద కోపడతారు అని అంటుంది. మీ ఇంట్లో అందరి ముందు నేను అవమానపడటం నాకు అసలు ఇష్టం ఉండట్లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది పద్మావతి.నేను ఇంకా ఇక్కడ సచ్చినా ఉండలేను. రేపు మా పుట్టింటికి పోతాను అని అంటుంది. నేనిక్కడ మీకు ఆరు నెలలు బాగా నటిస్తే బాధపడుతూ ఉండడం కంటే అక్కడ జీవితాంతం మా అమ్మ నాన్నతో కూతురుగా ఉంటాను. వాళ్లతో సంతోషంగా ఉంటాను దానికి నేను రేపు వెళ్తున్నాను ఇంటికి అని చెప్తుంది.

మీ ఇంటి తాగడంపులు చేసుకొని మా ఇంటికి వెళ్లి పోతాను అని అంటుంది. నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు ఇంకా రేపటితో అని అంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా,అని అంటాడు వికీ నేను తీసుకున్న నిర్ణయాన్ని మీతో చెప్పాను అంతే అని అంటుంది పద్మావతి. అది నీకే మంచిది కాదు అని అంటాడు విక్కీ. నన్ను కాదని నువ్వు వెళ్ళలేవు అంత ధైర్యం నీకు లేదు అని అంటుంది. ఆరు నూరైనా నేను అనుకున్నది చేస్తాను. రేపు ఉదయం ఇకనుంచి వెళ్ళిపోతాను. మీ అక్క గురించి ఆలోచించావా అని అంటాడు. ఆర్య గారు మాకు అని బానే అర్థం చేసుకున్నారు మీ తరం కాదు వాళ్ళిద్దర్నీ విడదీయడం. అలాగే నన్ను ఆపడం కూడా మీ తరం కాదు నేను కచ్చితంగా వెళ్లి తీరుతాను.మన స్థాయి ఏంటో తెలుసుకొని ఎదుటి వాళ్ళతో తలపడాలి కానీ నీ స్థాయి ఏంటో తెలుసుకొని, నాతో తలపడి ముందు అంతేగాని , ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడకు చాలెంజులు చేయకు అని అంటాడు విక్కీ. అవునా సరే అది చూద్దాం తెల్లవారిని ఇవ్వు అని అంటుంది. నువ్వు చూస్తూ ఉండడం తప్పఏమి చేయలేవు అని అంటాడు.

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి విక్కీ చూడకుండా ఇంటికి వెళ్దాం అనుకుంటుంది. అప్పుడే అరవింద పద్మావతి అని పిలుస్తుంది. శాంతాదేవి అందరూ హాల్లో ఉంటారు. విక్కీ ఏమైంది అని అడుగుతాడు. అరవింద పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఎందుకు అని అడుగుతుంది. ఏంటి పద్మావతి ఇంటికి వెళ్ళిపోయిందని ఆశ్చర్యపోతాడు. అవును నువ్వు వెళ్ళిపోమంటేనే కదా వెళ్ళిపోయింది పద్మావతి. అదే మాట చెప్పి వెళ్ళింది అంటుంది శాంతాదేవి. ఇంటికి వెళ్ళిన పద్మావతి వాళ్ళ నాన్నతో కన్వస్ చేయాలని చూస్తుంది. అన్నిటికీ మా ఆయన సమాధానం చెబుతాడు అని అంటుంది.