Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో,పద్మావతి అరవింద్ ను కాపాడుతుంది. ఆ విషయం తెలియక పద్మావతి మీద అరుస్తాడు. తర్వాత పద్మావతికి సారీ చెబుదామనుకుంటాడు కానీ పద్మావతి నేను మీ మాటలు ఇంక పడాలనుకోవట్లేదు ఇల్లు వదిలి వెళ్ళిపోతాను మా పుట్టింటికి అని చెప్తుంది. విక్కీ పద్మావతిని నువ్వు ఎక్కడికి వెళ్లలేవు ఎలా వెళ్తావో చూస్తా అని సవాల్ చేస్తాడు. పద్మావతి ఎలాగైనా వెళ్లి చూపిస్తాను. అని విక్కీకి చెప్తుంది.

ఈరోజు415వ ఎపిసోడ్ లో,పద్మావతి వికీ నిద్ర లేవకముందే రెడీ అయ్యి బ్యాక్ తీసుకొని కిందకు వస్తూ ఉంటుంది. విక్కి లేచేలోపు ఇంటికి వెళ్లి పోవాలి అని అనుకుంటుంది. ఈలోపు అరవింద పద్మావతిని చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. పద్మావతికి ఏం చెప్పాలో తెలియక, అలానే నిలబడి చూస్తూ ఉంటే నారాయణ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పమ్మా అడుగుతుంది కదా అరవింద అని అంటాడు. పద్మావతి మా ఇంటికి వెళ్తున్నాను అని అంటుంది.ఎందుకు అని అడుగుతుంది అరవింద.మా అమ్మని చూడాలనిపిస్తుంది వెళ్ళొస్తాను అంటుంది పద్మావతి. నువ్వు వెళ్లే సంగతి వికీ తెలుసా అని అంటుంది అరవింద. ఆయన వెళ్ళమంటే వెళ్తున్నానండి అని అంటుంది పద్మావతి. ఎలా వెళ్తారు అని అంటుంది అరవింద నేను ఆటోలో వెళ్తానండి అని అంటుంది. లేదు మిమ్మల్ని డ్రైవర్ డ్రాప్ చేస్తాడు ఉండండి అని అంటుంది అరవింద వద్దు అని లోపే పద్మావతి కృష్ణ కిందకి వస్తాడు, రానమ్మ నేనంటే వెళ్తున్నాను డ్రాప్ చేయమంటావా అని అంటాడు సరే అంటుంది. అరవింద్ మాత్రం పద్మావతి ఎందుకు ఇంటికి వెళ్లిందో విక్కిని అడిగి తెలుసుకోవాలి వీళ్ళ మధ్య మళ్ళి ఏమైనా గొడవ జరిగిందేమో అని మనసులో అనుకుంటుంది.

నువ్వు ఎప్పటికీ నా దానివే అన్న కృష్ణ..
పద్మావతి ఇంటికి వెళ్లడానికి కారు దగ్గరికి వచ్చేటప్పటికి పైన విక్కీ నిలబడి చూస్తూ ఉంటాడు. పద్మావతి విక్కీ చూస్తుండగానే కృష్ణ కారు ఎక్కి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది.కృష్ణ పద్మావతిని కారులో ఇంటిదగ్గర డ్రాప్ చేస్తానని తీసుకు వెళ్తూ ఉంటాడు.ఎందుకు పద్మావతి అలా మౌనంగా ఉన్నారు కావాల్సిన వాళ్ళు మాట్లాడకపోతే నాకు ఏదోలా ఉంటుంది అని అంటాడు కృష్ణ. ముందు రోడ్డు చూసి కారు నడపండి అని అంటుంది పద్మావతి. నాకు తెలిసి పద్మావతి నువ్వు పైకి ఒకలా నటిస్తున్నావు లోపల ఇంకోలా ఉంటున్నావు నువ్వు విక్కీ గురించి ఇప్పటికైనా అర్థం చేసుకొని బయటకు వచ్చేసావు నాకు అంతే చాలు, విక్కీ నా మీద కోపంతోనే నీ మెడలో తాళి కట్టాడు మనిద్దరిని వేరు చేయడానికి నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఆ విషయం నాకు తెలుసు నువ్వు చెప్పు కావాలంటే నిజమే కదా నేను చెప్పింది. విక్కీ నిన్ను సరిగా చూసుకోవట్లేదు కదా మీరిద్దరూ గొడవ పడే నువ్వు పుట్టింటికి వెళ్తున్నావు కదా అని అంటాడు కృష్ణ.నువ్వు ముందు కారాపు అని అంటుంది పద్మావతి. అదికాదు పద్మావతి నేను చెప్పింది దాని గురించి ఆలోచించు అంటాడు కృష్ణ నువ్వు ముందు అర్జెంట్గా కారాపు లేదంటే కారు నన్నే ఆపేమంటావా అని అంటుంది. కృష్ణకారాపుతాడు వెంటనే పద్మావతి కారు దిగుతుంది.

కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన పద్మావతి..
పద్మావతి నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు.నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటాను అనుకుంటున్నావా అని అంటుంది పద్మావతి.పద్మావతి నిజం చెప్పు ఇప్పటికే నీ మనసులో విక్కీ అంటే ద్వేషం ఉంది కదా నీకేం పరవాలేదు పద్మావతి నేనున్నాను నీకు అని అంటాడు. నువ్వు నాకెందుకు భరోసా ఇస్తున్నావు నువ్వు చూసుకోవాల్సింది ఇప్పుడు తల్లి కాబోతున్న అరవింద్ గారిని,నువ్వు ఎంత అంటున్నావ్ గాని నేను సైలెంట్ గా ఎందుకు ఉంటున్నాను తెలుసా అది అరవింద గారి ముఖం చూసే, ఆ తల్లి నీ పై చూపించే ప్రేమకే, నే నిన్నేమీ అనలేకపోతున్నాను అయినా నా పర్సనల్ విషయంలో కలుగ చేసుకోవడానికి నువ్వు ఎవరు మొగుడు పెళ్ళాల వల్ల తర్వాత చాలా అనుకుంటాము. మళ్లీ నేను విక్కీ ఒకటి అవుతాను అది నీకెందుకు, మా గొడవ నేను వాసురాక తీసుకొని మా మధ్య చిచ్చు పెట్టాలని చూడకు చచ్చిపోతా నా చేతిలో అని వార్నిగ్ ఇస్తుంది.నేను కాబట్టి సింపుల్గా వారిని ఇచ్చి వెళ్లిపోతున్నాను అదే మా ఆయన చెప్పినట్టు అయితే నిన్ను చంపేసేవాడు. ఇకనైనా బుద్ధిగా ఉండు అని చెప్పి ఆటో ఎక్కి ఇంటికి వెళుతుంది పద్మావతి.నిన్ను ఎలా వదిలిపెడతాను పద్మావతి అని మనసులో కృష్ణ అనుకుంటాడు.

అనుతో కుచల గొడవ..
కుశల అనుతో నేను చెప్పిన పనులన్నీ చేసావా అని అంటుంది. మీ చెల్లెలు ఇకనుంచి పుట్టింటికి వెళ్ళింది ఎందుకు అని అడుగుతుంది. మా చెల్లెలు ఎక్కడికెళ్ళింది ఇక్కడే ఉన్నది కదా అంటుంది అను. అబ్బాయి నటిస్తున్నారు అక్క చెల్లెలు నీకు తెలియకుండా మీ చెల్లెలు పుట్టింటికి వెళ్లిందా అది నేను నమ్మాలా అని అంటుంది కుచల.నిజంగా అత్తయ్య గారు నాకు తెలియదు తను ఎందుకు పుట్టింటికి వెళ్ళిందో అని అంటుంది అను. అయితే వెళ్లి ఫోన్ చేసి తెలుసుకొని చెప్పు అని అంటుంది కరెక్ట్ సమాధానం రావాలి ఏదో జరుగుతుంది అదేంటో నాకు తెలియాలి అని అంటుంది కుశల అనుతో, సరే అని ఫోన్ చేయడానికి వెళుతుంది అను.

పుట్టింట్లో పద్మావతి హడావిడి..
పద్మావతి పుట్టింటికి వచ్చి హడావిడి చేస్తూ ఉంటుంది. ఆండాలు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది పద్మావతిని. పద్మావతి మా ఇంటికి నేను రాకూడదా ఏంటి అని అంటుంది వెంటనే భక్తా దగ్గరికి వెళ్లి నాయన నాకు నువ్వే గుర్తొస్తున్నావు నీతో మాట్లాడాలనిపిస్తుంది నువ్వేమో నామీద కోపంతో మాట్లాడట్లేదు కరెక్టే నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాము అయినంత మాత్రాన నువ్వు నాతో మాట్లాడవా ఈరోజే వీటన్నిటికీ ఒక పరిష్కారం దొరకపోతుంది అని అంటుంది వెంటనే ఆడాలి ఏంటే అడిగిన దానికి కాకుండా ఏదైనా సమాధానం చెబుతున్నావు అని అంటుంది నేనేం సమాధానం చెప్తున్నాను అది మనందరికీ సంబంధించిందే అత్తా అని అంటుంది ఈ లోపు పార్వతీ పక్కకు తీసుకువెళ్లి పద్మావతిని ఏమైందండీ నువ్వు మీ ఆయన గొడవ పడ్డారా ఏంటి ఎందుకు ఒక్కదానివే వచ్చావు మీ ఆయన ఎందుకు రాలేదు అని అడుగుతుంది.పద్మావతి అమ్మ ఆమాత్రం అడగడానికి ఇక్కడికి తీసుకొచ్చావా అని చెప్పి మళ్ళీ అందరి ముందు తీసుకువెళ్లి మీరు ఎవరు కంగారు పడకండి నాకు ఏమీ గొడవ జరిగి ఇంట్లో నుంచి బయటికి రాలేదు నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మా ఆయనే వచ్చి చెప్తాడు మీ అందరికీ కూడా అప్పుడు అర్థమవుతుంది. అని చెప్పి ఆకలేస్తుంది లోపలికి వెళ్లి తింటాను అని వెళ్ళిపోతుంది లోపలికి పద్మావతి ఆండాలు ఇదేదో మళ్లీ గొడవ జరిగేటట్టు ఉన్నది ఈ తింగరిదేదో చేసింది అని అనుకుంటూ ఉంటుంది.

ఇంట్లో వాళ్ళందరూ విక్కిని నిలదీయడం..
విక్కీ రెడీ అయ్యే ఆఫీస్ కి కిందకి వస్తాడు ఇంట్లో అందరూ విక్కీని రౌండ్ అప్ చేస్తారు ఏంటి అందరూ ఏదో తేడాగా చూస్తున్నారు అని అనుకుంటాడు విక్కీ. అరవింద పద్మావతి ఎందుకు పుట్టింటికి వెళ్ళింది అని విక్కీని అడుగుతుంది. విక్కీ ఏంటి తన పుట్టింటికి వెళ్లిందా అని అంటాడు వెంటనే శాంతాదేవి అదేంటి నీకు తెలియకుండా వెళ్లిందా ఏంటి? నువ్వు చెప్పావని కదా తన పుట్టింటికి వెళ్ళింది అదే మాట చెప్పే వెళ్ళింది అని అంటుంది. వెంటనే విక్కీకి రాత్రి జరిగిన గొడవ గుర్తుకు వస్తుంది పద్మావతి ఎలాగైనా నేను రేపు ఉదయం ఇంటికి వెళ్లి పోతానని విక్కీ తో సవాల్ చేస్తుంది. ఏం చెప్పాలనుకుంటూ ఉంటాడు విక్కీ వెంటనే కుచల అసలు నీకు చెప్పి వెళ్ళిందా చెప్పకుండా వెళ్ళిందా అని అంటుంది. వెంటనే విక్కీ నాకు చెప్పే వెళ్ళింది అని అంటాడు ఎందుకు వెళ్ళింది అని అడుగుతుంది శాంతాదేవి. విక్కీ కాసేపు ఆలోచించి వీళ్ళకి డౌట్ రాకుండా కవర్ చేయాలి అని వాళ్ళ అమ్మానాన్నలని మిస్ అవుతుందిట అందుకే వెళ్ళమని చెప్పాను అని అంటాడు. వెంటనే విక్కీ ఎందుకు మీ అందరికీ ఇంత డౌట్ వచ్చింది అని అడుగుతాడు నువ్వు వ్రతంలో పద్మావతిని తిట్టావు కదా అలిగి వెళ్లిపోయింది అని అనుకుంటుంది అరవింద అని కుచల అంటుంది. వెంటనే విక్కీ అరవింద్ దగ్గరికి వెళ్లి అక్క నీకు డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమని చెప్పారు మా గురించి ఆలోచించకు మేం బాగున్నాము అని అంటాడు. మీరంతా మా గురించి ఆలోచించొద్దు మేం బాగున్నాము అని ఇంట్లో వాళ్లకు కూడా చెప్తాడు విక్కి వెంటనే శాంతాదేవి నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పద్మావతిని కూడా తీసుకురా అని అంటుంది.విక్కీ నా కుదరదు నాయనమ్మ నేను చాలా పనిలో ఉంటాను అని అంటాడు వెంటనే అరవిందా ఇవన్నీ చెప్పమాకురికి నువ్వు ఎట్లాగైనా సరే పద్మావతిని ఇంటికి తీసుకురావాలి వాళ్ళ అమ్మగారి ముందు వ్రతంలో తనని అవమానించావు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారి ముందు నువ్వు తనని తీసుకొస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటుంది అరవింద

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతిని ఆండాలు నిజంగానే నువ్వు మీ ఆయనకు చెప్పే వచ్చావా అని అంటుంది వెంటనే పద్మావతి మాయనే ఇప్పుడు వస్తారు చూడత్తా అని అంటుంది అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు అదిగో వచ్చాడు కదా ఇప్పుడే మీ అందరికీ సమాధానం చెప్పి నన్ను తీసుకెళ్తాడు అని అంటుంది వెంటనే పద్మావతిని రూమ్ లో తీసుకెళ్లి విక్కీ తెలివిగా నన్ను అందరి ముందు ఇరికించాను అనుకుంటున్నావు కదా, నేను నీ గురించి ఆలోచించడం మొదలుపెడితే నువ్వు తట్టుకోలేవు పద్మావతి ఇప్పుడే చెప్తున్నాను నేను ఆఫీస్ కి వెళ్లే లోపు నువ్వు మా ఇంటికి వెళ్లినట్టు నాకు ఫోన్ రావాలి లేదంటే మారియా డైవర్స్ ఇచ్చినట్టుగా పేపర్లను నీ చేతిలో పెడతాను అని అంటాడు.