Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి విక్కీ ఆఫీస్ లో కేడీ బ్రదర్స్ మంచివాళ్లు కాదని పోలీసులు పట్టిస్తుంది. పద్మావతి ఆఫీస్ కి రావడం వల్ల చాలా మంచి జరిగిందని అక్కడున్న వాళ్ళందరూ పొగుడుతూ ఉంటారు. విక్కి మాత్రం పద్మావతిని ఏమీ అనకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక పద్మావతి వ్యక్తితో కారులో ఇంటికి వస్తూ ఉండగా కానిస్టేబుల్ తో గొడవలు జరుగుతాయి ఆ తర్వాత విక్కీ వచ్చి పద్మావతిని సేవ్ చేసి ఇంటికి తీసుకొస్తాడు. ఇక కృష్ణ ఎలాగైనా అనుని అందరి చేత తిట్టించాలి అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema: విక్కీ కి హెల్ప్ చేసిన పద్మావతి.. అరవింద ను నమ్మించేందుకు కృష్ణ ప్రయత్నం..
ఈరోజు ఎపిసోడ్ లో, అనుకి కుచల కొన్ని చీరలు ఇచ్చి ఇశ్రీ చేయమని చెప్తుంది. సరే అని చీరలు అను తీసుకుంటుంది. ఇవి గనక నువ్వు సరిగ్గా చేయలేదంటే మాత్రం నీకు నేనంటే ఏంటో చూపిస్తాను అవన్నీ పట్టుచీరలు చాలా కాస్ట్లీ చీరలు అని కుచల అనుని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదంతా కృష్ణ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. నన్ను హ్యాపీగా లేకుండా చేసిన మీ అక్క చెల్లెలు ఇద్దరికీ నేను కూడా హ్యాపీగా ఉంచను అని అనుకుంటాడు. ఇంతలో అనుని ఆర్య మంచినీళ్లు తీసుకొని రమ్మని పిలుస్తాడు అప్పుడే అను పక్కకు వెళుతుంది ఇదే మంచి అవకాశం అనుకుంటాడు కృష్ణ.

అత్తగారి చేతిలో బలైన అను..
కృష్ణ కావాలని కుచల చీరల దగ్గరికి వెళ్లి వాటిని ఇస్రి పెట్టితో కాలుస్తాడు ఏమీ తెలియనట్టు అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఇక అను ఆర్య కి మంచినీళ్లు ఇచ్చి తర్వాత మళ్ళీ ఇస్రి పెట్టి దగ్గరికి వస్తుంది అప్పటికే కుచల చీరలు కాలిపోయి ఉంటాయి. అక్కడికి కుచల వచ్చి నీ మొఖానికి ఒక్క పని కూడా చేతకాదు మళ్లీ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు ఏడుపుగొట్టు మొఖం దాన అని తిడుతూ ఉంటుంది అప్పుడు అక్కడికి పద్మావతి వచ్చి పట్టుకుంటుంది. ఇంట్లో అందరూ వస్తారు ఏమైంది అని అడుగుతారు మా అక్కని ఎందుకు తిడుతున్నారు అని పద్మావతి అడుగుతుంది. బంగారు లాంటి పట్టుచీర కాలిస్తే తిట్టకుండా ముద్దు పెట్టుకోమంటావా అంటుంది. నిజంగా నాకేం తెలియదు అత్తయ్య అని అంటుంది అను. నేను ఐరన్ బాక్స్ నిలబెట్టి వెళ్లాను ఈ చీర ఎలా కాలిపోయిందో నాకు తెలియదు అంటుంది అను. నిన్ను నమ్మి నేను ఈ చీర నీకు ఇచ్చాను అత్తగారిగా నేనంటే నీకు ఇష్టం లేదు కాబట్టి కోపంతో నా చీరని కాల్చా చేసావు కదా అని అంటుంది. మా అక్కకు ఎవరి మీద కోపం ఉండదు అలాంటిది మీ చీరలు ఎందుకు కాలుస్తుంది. ఇన్ని రోజులు అనునే కదా మీ చీరలు ఇస్త్రీ చేసింది ఇప్పుడెందుకు కాలుస్తుంది అని అంటారు అందరూ ఇక మీ అందరి ఇలా సపోర్ట్ చేయండి అక్క చెల్లెలు అని వీలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇంట్లో అని, చీర కాలింది అంటే నీ తప్పుకాక ఇంకా అది ఎవరి తప్పు కచ్చితంగా నీదే తప్పు, అసలు ఎందుకు కాల్చావు ఎందుకు కాలింది దీని ఖరీదు ఎంతో తెలుసా, ఒక సంవత్సరం పాటు మీ ఇంట్లో వాళ్ళందరూ ఊడిగం చేసిన దీని ఖరీదుకు సరిపోరు అని అంటుంది వెంటనే పద్మావతి అత్తయ్య అని ఒకసారి అరుస్తుంది. మాట పడుతున్నాం కదా నీ నోటికి ఎంత వస్తే అంత అనకండి మాకు డబ్బులు లేకపోతే ఆత్మ అభిమానం ఉన్నది. పోయింది నీ సొమ్ము కాదు కదా ఎన్ని డైలాగ్ లు ఎలా చెప్తావు అని అంటుంది. త్వరలోనే మీ ఇద్దరి వల్ల చాలా నష్టం జరుగుతుంది అని అంటుంది కుచల ఇక వెంటనే ఆర్య ఎందుకమ్మా ఎప్పుడూ అనునే అంటావు అని అంటాడు ఇంట్లో అందరూ కూడా కుచ్చులని చీరే కదా కాలిపోయింది దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావ్ అని తిడతారు. నారాయణ ఒక చీర బదులు ఇంకో చీర కొనుక్కోవచ్చు వాల్ల పనులు వాళ్ళు చూసుకుని చక్కగా ఉంటున్నారు కదా నువ్వెందుకు వాళ్ళని అలా మాట్లాడతావు అని అంటాడు కుచల తో, కుచల కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
Krishna Mukunda Murari: క్రిష్ణ ఇంటిని ముకుంద చేత క్లీన్ చేయించిన మురారి.. రేపటికి సూపర్ ట్విస్ట్..

అనుని ఓదార్చిన ఆర్య..
అవును బాధపడుతూ ఉంటే ఆర్య మా అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా పట్టించుకోబాకు అని అంటాడు. కాదండి నేను అసలే తప్పు చేయలేదు నేను ఐరన్ బాక్స్ నుంచో పెట్టే వెళ్లాను అది ఎలా కాలిందో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. నేను ఎంత ఆలోచించినా నాకు మాత్రం గుర్తుకు రావట్లేదు అని అంటుంది అను. అప్పుడే అక్కడికి వచ్చిన పద్మావతి ఇదంతా కృష్ణ చేశాడు అని అర్థమవుతుంది. ఆర్య అనుతో మా అమ్మ వదులు నేను క్షమాపణ చెప్తున్నాను అని అంటాడు ఎందుకండి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అత్తయ్య చీర చాలా కాస్ట్లీ అది కాలిస్తే ఎవరికైనా అలానే కోపం వస్తుంది కదా పాపం ఆవిడ ఎంత ఫీల్ అయిందో ఏంటో అని అంటుంది. పోనీలే మా అమ్మ మీద నువ్వెక్కడ కోపం పెంచుకుంటావో అనుకున్నాను అంటుంది నాకు ఎందుకండీ కోపం అత్తయ్య ఎలాంటిదో నాకు తెలుసు కోపంలో అలా మాట్లాడుతుంది కానీ ఆవిడకి మనసులో ఏమీ ఉండదు అని అంటుంది. సరే ఇవన్నీ మర్చిపోవాలి అంటాడు ఆర్య సరే అంటుంది అను.

కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన పద్మావతి..
కృష్ణ దగ్గరికి వెళ్లి పద్మావతి నువ్వు చేసిన పనులు నాకు తెలియదు అనుకుంటున్నావా అంటుంది నేనేం చేశాను అంటాడు ఏమి జరగనట్టు మాట్లాడకు అని అంటుంది. దేని గురించి మాట్లాడుతున్నావ్ పద్మావతి అని అంటాడు నువ్వు చేసిన పని గురించి అని అంటుంది.నీకు ఏదైనా ఉంటే నాతో డైరెక్ట్ గా పెట్టుకో. అంతేగాని నా వాళ్ళని బాధ పెట్టకు అని అంటుంది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అంటాడు కృష్ణవల్లి ఏమి తెలియనట్టు ఇస్త్రీ పెట్టె చీర కాల్చింది నువ్వే మా అక్కని ఇబ్బంది పెట్టింది నువ్వే కదా అని అంటుంది. వెంటనే కృష్ణ షాక్ అవుతాడు. నాకెలా తెలిసింది అనుకుంటున్నావా నాకు తెలిస్తే నువ్వు చేసే పనిలోని నీకెన్నోసారి చెప్పాను మళ్లీ చెప్తున్నాను.నీ విషయం విక్కీ సారి గనక తెలిస్తే నిన్ను ఏం చేస్తాడో నీ ఊహకే వదిలేస్తున్నాను అరవింద ఈ బిడ్డ పుట్టే వరకే నీ ఆటలన్నీ సాగేది తర్వాత నీ ఆటలేవీ సాగవు ఇంకొకసారి నా జోలి గాని మా అక్క జోలి గాని వచ్చావంటే నీకు పద్ధతిగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. పిచ్చి పద్మావతి ఇలాంటి వార్నింగ్ నువ్వు ఎన్ని ఇవ్వలేదు, నేను మాత్రం మారతానా అని అనుకుంటాడు.

కేడి బ్రదర్స్ గురించి ఇంట్లో చెప్పిన ఆర్య..
ఏంటి ఆర్య సంతోషంగా కనిపిస్తున్నావు అని అంటారు ఇంట్లో వాళ్ళు, ఈ సంతోషానికి కారణం పద్మావతి అని అంటాడు అర్థమయ్యేలా చెప్పు అని అంటారు ఇంట్లో వాళ్ళు, ఆఫీసులో కేడి బ్రదర్స్ దొంగ నాటకం వేసుకొని వచ్చి, ఆఫీసులో మోసం చేద్దామనుకున్నారు వాళ్ళు మంచి వాళ్ళు కాదని పద్మావతి అందరికన్నా ముందు కనిపెట్టి వాళ్ళని పోలీసులకు పట్టించింది. హనీ పద్మావతి గురించి చెప్తాడు ఇక అందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. అప్పుడే పద్మావతి అందరికీ జ్యూస్ తీసుకుని వస్తుంది ఎవరికి ఏం కావాలో తనే ముందే కనిపెట్టిజ్యూస్ తీసుకొని వస్తుంది.ప్రతిక్షణం నాకోసం ఒక క్షణం కోసం ఆలోచిస్తున్నారు మీ అక్క చెల్లెలు ఇద్దరు ఏ జన్మలో మేము చేసుకున్న పుణ్యమో మీ అక్క చెల్లెలు ఇద్దరు మా ఇంటికి కోడళ్ళు గా వచ్చారు అని అంటుంది. ఎందుకు అందరూ ఇలా పొగుడుతున్నారు అని అంటే ఈరోజు నువ్వు ఆఫీసులో చేసిన మంచి పని గురించి ఇప్పుడే ఆర్య చెప్తున్నాడు అని అంటాడు నారాయణ.నువ్వు చేసిన పనికి నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది ఆఫీస్ పరుగు కాదు మన ఇంటి పనులు కూడా నిలబెట్టారు అంటాడు నారాయణ. విక్కీ గొంతు బాగా పట్టేలా చేసింది కదా దానికి పశ్చాతాపంగా ఈ పని చేసిందంటే ఇందులో ఈవిడ గారి గొప్పతనం ఏముంది అంటుంది.విక్కీ మనసులో స్నానం సంపాదించుకోవడానికి పద్మావతి బాగా ట్రై చేస్తుంది నేను ఏదో ఒకటి చేసి చెడగొట్టాలి అనుకుంటాడు కృష్ణ. పద్మావతి విక్కి కషాయం తీసుకెళ్లి వెళ్ళు అని అంటుంది శాంతాదేవి. విక్కీకి కషాయం తీసుకెళ్లి ఇస్తే విక్కి వద్దంటాడు. పద్మావతి అంత నచ్చ చెప్పిన విక్కీ కషాయం తీసుకోవడానికి ఇష్టపడడు. కషాయం అక్కడ పెట్టి కిందకి వచ్చి డల్లుగా కూర్చుంటుంది. అప్పుడే పద్మావతిక ఆలోచన వస్తుంది అక్కడే ఉన్న కత్తి తీసుకొని ఒకే రూమ్ కి వెళ్లి నిలబడుతుంది పద్మావతి చేతిలో కత్తి చూసి ఒకే షాక్ అవుతాడు.

రేపటి ఎపిసోడ్ లో మిక్కీమనసు గెలుచుకోవడానికి పద్మావతి విక్కీకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది. అదే విక్కీ పుట్టినరోజు,తన చేత కేక్ కట్ చేయించడానికి విక్కీ నిద్రలేచేలోపు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. విక్కి ని నిద్రలేపి మీకోసమే కష్టపడి ఇదంతా చేశాను మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నా కోసం వచ్చి ఈ కేక్ కట్ చేయండి అని అంటుంది.