Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి విక్కి ఇద్దరూ రిసార్ట్లో ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు. పద్మావతి మీద ఇష్టం లేకపోయినా విక్కీ అందరి ముందునాటకం ఆడుతాడు.ఆ విషయాన్ని పద్మావతి తోనే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పద్మావతి చాలా బాధగా అక్కడే కూర్చుని ఉండగా కృష్ణ తను అనుకున్నట్టు పద్మావతిని పోలీస్ స్టేషన్ కి పంపిస్తాడు.

ఈరోజు 430 వ ఎపిసోడ్ లో పోలీస్ స్టేషన్లో పద్మావతి బాధపడుతూ ఒక్కసారి మా వారికి ఫోన్ చేస్తాను అని అడుగుతుంది. కానీ ఎస్సై అందుకు ఒప్పుకోదు. ఒకతూరి నా మాట వినండి నేను మీరు అనుకున్నట్టు ఏ తప్పు చేయలేదు హనీ పద్మావతి ఎస్సైతో అంటే అందరూ దొరికినప్పుడు ఇలానే చెప్తారు సైలెంట్ గా కూర్చో అని అరుస్తుంది దానికి పద్మావతి ఏడుస్తూ నేనిక్కడున్న విషయం మా ఆయనకి తెలిసేది ఎలా అని అనుకుంటూ ఉంటుంది.

విక్కీ కంగారు..
ఇక ఇవన్నీ తెలియక విక్కీ అప్పుడే రిసార్ట్ కి వస్తాడు. లోపలికి వెళ్తున్న విక్కీని అక్కడ ఉన్న మేనేజర్ జరిగిన విషయాన్ని చెప్తాడు. మీకు ఒకసారి గా షాక్ అవుతాడు. పద్మావతి ఏంటి పోలీసులు తీసుకెళ్లడం ఏంటి అని అంటాడు. నిజం సార్ మేము ఎంత చెప్పినా కానీ పోలీసులు వినలేదు పద్మావతిని తీసుకువెళ్లారు. నేను ఎంత ఆపినా కానీ వాళ్లు వినలేదు. అనీ మేనేజర్ విక్కీ తో చెప్తాడు. విక్కీ కోపంగా మేనేజర్ మీద అరిచేసి అక్కడి నుంచి పద్మావతి వెతకడానికి వెళ్తాడు. పద్మావతి పోలీస్ స్టేషన్లో విక్కీకి నేను ఇక్కడున్న విషయం ఎలా తెలుస్తుంది అనుకుంటుంది. విక్కీ మేనేజర్ తో అసలు ఏ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారో తెలుసా అని అడుగుతాడు మేనేజర్ నాకు తెలియదు అని చెప్తాడు. పద్మావతి ఏ స్టేషన్లో ఉందో తెలియక విక్కీ చాలా కంగారు పడతాడు. అన్ని పోలీస్ స్టేషన్లో వెతుకుతూ ఉంటాడు.
Nuvvu nenu Prema: కృష్ణ ప్లాన్ సక్సెస్.. పోలీస్ స్టేషన్లో పద్మావతి.. విక్కీ ఏం చేయనున్నాడు..

అరవింద కంగారు..
అరవింద విక్కీ కి ఫోన్ చేస్తుంది. విక్కీ ఫోన్ కలవదు పద్మావతికి ట్రై చేస్తే తన ఫోన్ కూడ కలవదు. ఇక అరవింద టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆర్య వస్తాడు ఏంటి అక్క ఇంత టైం అయినా ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు. నీకు పద్మావతి కానీ విక్కీ కానీ ఫోన్ చేశారా అని అడుగుతుంది అరవింద నాకు ఎవరు చేయలేదు అక్క అని చెప్తాడు. ఇప్పుడేమైంది అక్క అని అంటాడు. ఈపాటికి వాళ్లు బోర్డింగ్ టైం కి వెళ్లి ఉండాలి కానీ ఇంతవరకు ఫోన్ చేయలేదు. వాళ్ల ఫోన్లు రెండు కలవటం లేదు అందుకే కంగారుగా ఉంది అని అంటుంది.ఏం పర్లేదులే అక్క వాళ్ళు దిగిన తర్వాత కాల్ చేస్తారు అని అంటాడు లేదురా నా మనసు ఎందుకు కిడు సంకిస్తోంది నాకు ఏదో భయంగా ఉంది అని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి కృష్ణ వస్తాడు. కృష్ణ కంగారుగా రానమ్మ అని పిలుస్తాడు. అసలే కంగారు పెడుతున్నారు ఇంకా కంగారు అనిపించి ఏంటండీ అని అడుగుతుంది కానీ కృష్ణ ఇంట్లో అందరినీ పిలుస్తాడు. అందరూ వచ్చిన తర్వాత ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నారు అని అడిగితే మీరే చూడండి నేను చెప్పడం ఎందుకు అని టీవీ ఆన్ చేస్తాడు.
Brahmamudi ఎపిసోడ్: రాహుల్ ప్లాన్ ఫెయిల్.. స్వప్నని కిడ్నాపర్స్ నుండి కాపాడిన క్వావ్య- రాజ్

పద్మావతి విషయం ఇంట్లో వాళ్లకు తెలియడం..
అందరూ కంగారుగా ఉంటే కృష్ణ టీవీ ఆన్ చేస్తాడు. అందులో హైదరాబాద్లో ఊరికే అవతల ఉన్న ఒక రిసార్ట్ లో కొంతమంది డ్రెస్ తీసుకుంటున్నారన్న ఇన్ఫర్మేషన్ తో అక్కడికి వెళ్ళగా యువతి యువకులు అని టీవీలో చూపిస్తూ ఉంటారు. బాగా పేరు మోసిన విక్రమాదిత్య భార్య పద్మావతి కూడా ఈ డ్రగ్స్ కేసులో చిక్కుకుంది అని పద్మావతిని చూపిస్తారు. పద్మావతి జైల్లో ఉండడానికి చూసిన అను వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది. అరవింద ఆర్య ఇద్దరు అనుని లేపడానికి ట్రై చేస్తారు కానీ అను లేవదు వెంటనే నీళ్లు తీసుకురమ్మంటుంది అరవింద ఆర్య నీళ్ళు తీసుకొని వస్తాడు. అనుముఖ మీద నీళ్లు చలి లేపుతారు ఇక అను కళ్ళు తెరిచి మా చెల్లి అలాంటి తప్పు చేసి ఉండదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది దానిని కాపాడండి అని ఆర్యతో అంటుంది. నువ్వేం కంగారు పడకు మేమందరం ఉన్నాం కదా పద్మావతికి ఏం కాదు అని ఆర్య ధైర్యం చెబుతాడు అనుకి, కృష్ణ తన అనుకున్నది ఫుల్ ఫీల్ గా జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అరవింద అసలు మాల్దీవులు వెళ్లాల్సిన వాళ్లు హైదరాబాదులో రిసార్ట్లో ఎందుకు ఉన్నారు అని అరవిందా అంటుంది. అదే నాకు అనుమానం గా ఉంది రాణమ్మ, పద్మావతి గురించి ఆలోచిస్తున్నానండి అని అంటే మీరేం కంగారు పడకండి నేను ఏదో ఒక విధంగా పద్మావతిని కాపాడుతాను అని అంటాడు కృష్ణ. అక్కడ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి పద్మావతి ఏ స్టేషన్లో ఉందో కనుక్కుంటాడు కృష్ణ. అందరూ ఇక్కడ ఉండడమే నా పద్మావతిని కాపాడే ఏదైనా ఉందా అంటాడు నారాయణ. అరవింద కృష్ణ ఆర్యా అను కలిసి బయలుదేరి పద్మావతిని కాపాడడానికి వెళ్తారు.
Krishna Mukunda Murari: ప్రభాకర్ ఎంట్రీ తోనే ముకుంద కి ఝలక్.. రేపటికి సూపర్ ట్విస్ట్

పార్వతి బాధ..
పార్వతి భక్తా కి కాఫీ తీసుకొని వస్తుంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి అని అంటుంది. దేనికి పార్వతి అని అంటాడు భక్త. మన అమ్మి వాళ్లు అదే అండి పద్మావతి వికీతో కలిసి విదేశాలకు వెళుతుంది. తను చాలా సంతోషంగా నాకు ఫోన్ చేసి చెప్పింది ఇప్పుడు నా మనసు చాలా గుర్తు పడింది అండి అని అంటూ ఉంటుంది అప్పుడే దారిలో వుండి అను వాళ్ల నాన్నకి ఫోన్ చేస్తుంది. సంతోషంగా ఉన్న వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేసే, ఏంటమ్మి అను బాగున్నావా అని అడుగుతాడు. అప్పటికే అను ఏడుస్తూ ఉంటుంది ఏమైంది అని కంగారుగా అంటాడు. పార్వతి ఏమైందండీ స్పీకర్ ఆన్ చేయండి అని అంటుంది ఇక ఇద్దరు ఇద్దరికి వినపడేలాగా అను పద్మావతికి జరిగినదంతా చెప్తుంది. ఇప్పుడు స్టేషన్లో ఉందిమేము అక్కడికే వెళ్తున్నాము మీరు కూడా రండి అమ్మ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అను. పార్వతి ఇప్పుడే కదండి మనం అనుకుంది చాలా సంతోషంగా ఉంది పిల్ల అని ఐలోపే ఎలా జరిగింది ఏమిటి అని బాధపడుతుంది. ఎక్కడ ఏదో తప్పు జరుగుంటుంది నా కూతురు లాంటిది కాదు పదా ముందు బయలుదేరి అక్కడికి వెళ్దాము అని ఇద్దరు కలిసి స్టేషన్కు బయలుదేరుతారు.
పద్మావతిని కాపాడిన విక్కీ..
విక్కీ పద్మావతి ఫోన్ కి ఫోన్ చేద్దాం అనుకున్నా ఆలోచన వస్తుంది. కానీ విక్కీ ఏ అరవింద్ వాళ్లకి ఎక్కడ నిజం చెబుతుందో రిసార్ట్ లో ఉన్నాము అని ఆ ఫోన్ ని ఏరోప్లేన్ మోడ్ లో పెట్టేస్తాడు ఆ విషయం గుర్తుకు వచ్చి చాలా బాధపడతాడు.ఇక విక్కి హీరో కాబట్టి తన ఏ స్టేషన్లో ఉందో తెలిసినట్టు అక్కడికి వెళ్తాడు.పద్మావతి వికీ వెళ్లేసరికి అక్కడ బాధపడుతూ ఉంటుంది స్టేషన్లో, విక్కీ పద్మావతిని చూసి ఒకసారిగా పద్మావతి అని పిలుస్తాడు. పద్మావతి విక్కి పిలుపు విని కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా విక్కీ ఉంటాడు. విక్కీ వచ్చినందుకు పద్మావతి చాలా సంతోషపడుతుంది సారు నేను ఏ తప్పు చేయలేదు వీలు నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చారు అని పద్మావతి ఏడుస్తూ ఉంటుంది అది చూసి విక్కి ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ వైపు చూస్తాడు. మీకు అసలు బుద్ధుందా ఎవరనుకొని తనని తీసుకువచ్చారు అని అంటాడు. ఎస్సై గారు వెంటనే విక్రమాదిత్య గారు మీరు అని అంటుంది అవును నేనే తను ఎవరనుకున్నారు అని అంటాడు. తను నా భార్య నేను తాళి కట్టిన నా భార్య అని చెప్తాడు ఆ మాటలకి పద్మావతి లాకప్ లో నుండి చూస్తూ సంతోషపడుతుంది. అయినా ఎవరెవరో తెలుసుకోకుండానే మీరు స్టేషన్ దాకా తీసుకువస్తారా అని అంటాడు విక్కీ. తప్పైపోయింది క్షమించండి అని అంటుంది కానీ విక్కీ వినిపించుకోకుండా వాళ్ళ మీద అరుస్తూనే ఉంటాడు. అసలు మీరు తీసుకువచ్చినందుకు తను ఎంత బాధ పడిందో తను కనిపించక నేను ఎంత బాధ పడ్డానో మీకు ఏమైనా తెలుసా అని అరుస్తాడు. ఎస్సై సారీ చెప్పి పద్మావతిని తీసుకు వెళ్ళమని విడిపిస్తుంది. వెంటనే పద్మావతి ఒక్కసారిగా విక్కీని హద్దుకుంటుంది.ఏడుస్తూ సారు నాకు చాలా భయమేసింది మిమ్మల్ని ఈసారి చూస్తాను లేదో అనుకున్నాను అని అంటుంది.నువ్వేం బాధపడకు పద్మావతి నేను వచ్చేసాను కదా అని అంటాడు. లేదు సారు నేను ఏ తప్పు చేయలేదు అని ఉంటుంది వీళ్ళు నన్ను కావాలని తీసుకువచ్చారు అని అంటుంది. సరే నువ్వు భయపడకు నీకేం కాదు నేనున్నాను కదా నీకు అని పద్మావతికి ధైర్యం అక్కడి నుంచి బయటికి వెళ్దాం అని తీసుకొస్తాడు.

అల్లుడు మీద నిందలు వేసిన పార్వతి..
ఇక స్టేషన్లో నుంచి పద్మావతిని తీసుకొని విక్కీ బయటికి వచ్చేసరికి కృష్ణ అందర్నీ తీసుకొని స్టేషన్ ముందు ప్రత్యక్షమవుతాడు. ఒకసారిగా అను ని చూసి పద్మావతి ఏడుస్తుంది. అందరి ముందు విక్కీ తలదించుకుని నిలబడతాడు. పద్మావతివాళ్ల ఇంట్లో వాళ్లు కూడా వస్తారు.ఒకసారిగా పద్మావతి వాళ్ళ నాన్నను చూసి ఏడుస్తూ వాళ్ళ నాన్న వాటేసుకుంటుంది. ఏడుస్తున్న పద్మావతిని ఓదారుస్తాడు తండ్రి. అక్కడే ఉన్న కృష్ణ ఇదంతా చూసి ఏం ప్లాన్ వేసావ్ రా వీళ్ళని ఎలా ఇరికించాలో ఆరా ఇరికించేశారు ఇక వీళ్ళు తప్పించుకోలేరు ఇప్పుడు నిజం మొత్తం బయటపడిపోతుంది నువ్వు బలే చేసావ్ కృష్ణ అని తనకి తానే మెచ్చుకుంటూ ఉంటాడు. పద్మావతిని భక్త ఓదారుస్తూ ఎన్ని కష్టాలు వచ్చినాయి అమ్మ నీకు అని అంటాడు. వెంటనే పార్వతి ఈ కష్టాలన్నీ తనకి ఎంతటి తాను తెచ్చుకోలేదండి ఈ కష్టాలకి కారణమైన వాడు మీ అల్లుడు తన భర్త అయినా ఈ విక్రమాదిత్య అని అంటుంది. ఏ పాపం తెలియని నా బిడ్డని నీ చేతిలో పెడితే తనకి చెడు అన్నది చేయడం తెలియదు ఎప్పుడూ మంచి గురించే ఆలోచిస్తుంది అలాంటి అమ్మాయిని నువ్వు కష్టాల్లో వదిలేసి వెళ్తావా తనకి తోడుగా ఉండాలని తెలియదా అని పార్వతి విక్కీ వైపు చూసి ఏం బాబు నేను చెప్పింది కరెక్టేనా అని అంటుంది.
రేపటి ఎపిసోడ్ లో విక్కీ నిద్రపోతూ ఉండగా పద్మావతి అప్పుడే రూమ్ లోకి వచ్చి, నా మీద మీకు ఎంత ప్రేమ ఉన్నదో నాకు తెలిసింది సారు, మీ కళ్ళల్లో ఉన్న ప్రేమని మనసులోనే ఆపేస్తున్నారు దాని నాతో పంచుకోవాలని నా కోరిక అంతా, ఎంత ముద్దొస్తున్నారు సారు అని ముద్దు పెట్టబోతు ఉంటుంది.