Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి తులాభారం ఆగకుండా జరగాలని చాలా తాపత్రయ పడుతూ ఉంటుంది. కృష్ణ పద్మావతిని రూమ్ లో బంధిస్తాడు. అను ఆర్యాల ద్వారా పద్మావతి బయటికి వస్తుంది. ఎంత బెల్లం వేసినా త్రాసు తుగదు. పంతులుగారు తులాభారం ఇక్కడతో ఆపేయడం మంచిది అని అంటాడు. కానీ పద్మావతి మాత్రం ఇప్పుడే వస్తాను అని చెప్పి, అమ్మవారి ముందుకు వెళ్లి తన బాధంతా అమ్మవారికి చెప్పి కర్పూరం చేతిలో వెలిగించుకొని, ఎలాగైనా విక్కీ ప్రేమని పొందాలి ఈ తులాభారం ఆగకూడదు మా మధ్య ఉన్న ప్రేమ నిజమని అందరికీ తెలియాలి అని గట్టిగా నమ్మి అమ్మవారి దగ్గర ఉన్న పసుపు తాడును తీసుకొని మళ్ళీ తులాభారం దగ్గరికి వస్తుంది.

ఇక ఈరోజు462 వ ఎపిసోడ్ లో పసుపు తాడు తీసుకొని పద్మావతి విక్కీ దగ్గరికి వెళ్తుంది. మీరు ఈ బతుకుతాడని నా మెడలో వేస్తే నా మెడలో ఉన్న బంగారుపుతాడు నీ త్రాసులో పెడతాను అని అంటుంది. విక్కీ చాలాసేపు ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అరవింద పద్మావతి చెప్పినట్టు చెయ్ అని అంటుంది. సరే అంటాడు.పద్మావతి మెడలో పసుపు తాడుని విక్కీ వేస్తాడు పంతులుగారు మంత్రాలు చదువుతారు అక్కడున్న వాళ్లంతా ఆశీర్వదిస్తారు. ఇక పద్మావతి వెంటనే తన మెడలో ఉన్న బంగారుపుతాడును తీసుకొని త్రాసులో పెడుతుంది. కృష్ణ మనసులో, అన్ని పెడితే తోకంది ఈ చిన్న బంగారపు తాడుకుతూ ఉందని నేను అనుకోవట్లేదు కచ్చితంగా ఇది ఆగిపోతుంది అని అనుకుంటాడు. పంతులుగారు ఇంకా ఇదే చివరి అవకాశం వచ్చేస్తుంది అని అంటాడు. పద్మావతి బంగారు బుతాడుని పెట్టగానే త్రాసులో త్రాసు పక్కకి వంగుతుంది ఇక అందరూ సంతోషిస్తారు విక్కీ తులాభారంలో సక్సెస్ఫుల్గా బయటపడినట్టే అని అనుకుంటారు అందరూ సంతోషిస్తారు విక్కీ కూడా ఆశ్చర్యపోతాడు.ఇది నిజంగా అద్భుతం అమ్మ రుక్మిదేవి తులసి ఆకుతో తుచినట్టు నీ భర్తమీద నీకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అందరికీ నిరూపించావు నువ్వు, ఇక మీ దాంపత్యం కలకాలం సంతోషంగా ఉంటుంది అని పంతులుగారు అంటారు. ఇక ఇద్దరూ కలిసి దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని అంటారు పంతులుగారు. విక్కీ పద్మావతిల మెడలోతులసి మాల వేస్తారు.పద్మావతి చాలా హ్యాపీగా ఉంటుంది.

కృష్ణతో పద్మావతి గొడవ..
ఇక కృష్ణ బయటికి వచ్చి ఎంతో ప్లాన్ చేస్తే పద్మావతి మొత్తం చెడగొట్టింది. అయినా సరే నేను మాత్రం వదిలిపెట్టను ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరి మధ్య దూరం సృష్టించాల్సిందే నేను అనుకున్నది సాధించాల్సిందే అని అనుకుంటాడు అప్పుడే ఎదురుగా పద్మావతి వచ్చి నిలబడుతుంది. నువ్వు చేసిన పనికి నిన్ను చంపిన పాపం లేదు, కానీ అరవింద గారి ముఖం చూసి పాపమని వదిలేయాల్సి వస్తుంది అయినా నీ ప్రాబ్లం ఏంటి అని అంటుంది పద్మావతి. నీ మానానికి నువ్వు బతుకు అని చెప్పినా కూడా నువ్వు మా జోలి వస్తున్నావు తెగేవరకు లాగా మాకు, నీకు నా సంగతి తెలియట్లేదు అని అంటుంది పద్మావతి. ఏంటి తెగ సంతోషపడుతున్నట్టున్నావు తులాభారం సక్సెస్ అయినందుకు ముందు ముందు నీకు జరగబోయే పనులకు నువ్వు చాలా బాధపడతావ్ అని అంటాడు. ఇవన్నీ చాలా చిన్నవి పద్మావతి ఈ చిన్న సంతోషానికే ఇంత పొంగిపోయి ఎలాఅని అంటాడు కృష్ణ. నేను బాధపడడం కాదు నువ్వు బాధ పడతావు. నువ్వు ఎన్ని అడ్డమైన ప్లాన్లు వేసిన నేను అన్ని తిప్పి కొట్టి నీ తాట తీసి అయినా సరే నీకు బుద్ధి వచ్చేలా చేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది పద్మావతి. నీ ఎత్తులకు పై ఎత్తివేసైనా సరే నిన్ను చిత్తు చేయకపోతే అప్పుడు అడుగు అని అంటాడు కృష్ణ. చేతికి గాజులు వేసుకున్నారని తక్కువ అంచనా వేయకు, పద్మావతి పద్మావతి ఇక్కడ, ఆడ శివంగిలా మారి నీ అంత చూడకపోతే అప్పుడు అడుగు అని అంటుంది పద్మావతి. అంతదాకా వస్తే నేను ఊరుకోను నా విశ్వరూపం చూపించైనా సరే మీ కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తాను అని అంటాడు. ఛీ నీకెంత చెప్పినా నువ్వు మారవా ఒకవైపు అరవిందా గారికి నెలల నుండి ఉన్నాయి ఈ టైంలో తనని సంతోషంగా ఉంచాల్సింది పోగొట్టి తనని బాధపడేలా చేస్తావా అని అంటుంది పద్మావతి. ఇంక చాలు ఆపుతావా పద్మావతి, వింటున్నాను అనేది తగలెచ్చర్లిస్తున్నావు నేను కోరుకున్న ఆనందం వేరు నేను అనుభవిస్తున్న జీవితం వేరు, అందుకే మళ్ళీ నాఅనందాన్ని నేను దక్కేలాగా, చేసుకునే పనిలోనే ఉన్నాను దాని కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటాడు కృష్ణ. అవునా అయితే ఎట్లా చేస్తావో ఎట్లా ఆనందపడతావో నేను చూస్తాను, మీ కుటుంబానికి నువ్వు హాని తలిపెట్టడం కాదు కదా ఆలోచన రావడానికి కూడా నువ్వు భయపడేలా నేను చేస్తాను చూడు బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా ఉంటే సరే సరే, లేదంటే నువ్వు తీసే గోతి లో నిన్నే పడేసి నీకు సమాధి కట్టేస్తా జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది పద్మావతి. నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతే ఎలా పద్మావతి త్వరలోనే నిన్ను భయపడేలా చేస్తాను అని అనుకుంటాడు కృష్ణ.
Nuvvu Nenu Prema:పద్మావతి ని బంధించిన కృష్ణ.. తులాభారం జరగకుండా కృష్ణ ప్లాన్.. పద్మావతి ఏం చేయనుంది?

పద్మావతి కి వార్నింగ్ ఇచ్చిన విక్కి..
ఇక పద్మావతి విక్కీ దగ్గరికి వస్తుంది విక్కీ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు పద్మావతి రాగానే ఫోన్ పెట్టేస్తాడు.చూశారా సారు ఈరోజు జరిగిన విచిత్రాన్ని నేను ఎంత సేపు ప్రయత్నించినా జరగనిది నా మెడలో తాళి తీసి అక్కడ పెట్టగానే జరిగింది. అంటే మన మధ్య ఉన్న బంధం నిజమనే కదా అర్థం ఈ తులాభారం సక్సెస్ అయిందంటేమనమధ్య చెప్పలేనంత ప్రేమ ఉన్నదని కూడా నాకు అర్థమైంది ఆ ప్రేమ నిజమైందని ఆ దేవుడి కూడా ఆశీర్వదించాడు. ఇంతకంటే ఆనందం ఏముంటది సారు, ఏంటి సారు మాట్లాడట్లేదు, ఆనందంతో మీకు కూడా మాటలు రావట్లేదు కదా అని అంటుంది పద్మావతి. నా మనసులో మాట మీతో చెప్పుకోకుండా ఉండలేకపోతున్నాను. ఈ ఆనందంలోనే మీకు చెప్పాల్సిన మాటలు మీరు చెప్పేస్తాను అని అంటుంది. ఐ లవ్ యు సారు అని అంటుంది పద్మావతి. మీరంటే నాకు చచ్చేంత ప్రేమ, ఇక ఆ ప్రేమ నేను అస్సలు విడిచిపెట్టుకోను అని పద్మావతి వికీ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది విక్కీ చేత్తో ఆపుతాడు.
Madhuranagarilo November 07 episode 203: శ్యామ్ ని చూసి భయపడుతున్న పండు..

నిజం తెలుసుకున్న కృష్ణ..
ఇక పద్మావతి వికీతో అన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఎందుకు అంత సంతోష పడుతున్నావ్ అని అడుగుతాడు. తులాభారం సక్సెస్ఫుల్గా జరిగే మీ కోరిక నెరవేరిందని నువ్వు సంతోష పడుతున్నావా అని అంటాడు. చూడు పద్మావతి నువ్వెంత ఆనందపడిన అది కేవలం ఇంకో మూడు నెలలు మాత్రమే, ఆ తర్వాత నువ్వు ఆనందమే పడతావు బాదే పడతావో నీ ఇష్టం, నీకు ఇచ్చిన గడువు మూడు నెలలు,అంటే ఏంటి సారు పంతులు గారు చెప్తున్నారు కదా మన ఇద్దరి దాంపత్యం కలకాలం సంతోషంగా ఉంటుందని, వాళ్ళ అలానే చెప్తారు పద్మావతి నువ్వు చేసిన మోసం వాళ్ళకి తెలియదు కదా అని అంటాడు. కానీ నీ గురించి నాకు అంతా తెలుసు నేను ఎలా నీతో కలకాలం కలిసి ఉంటాను చెప్పు, ఎన్ని జన్మలకైనా అది జరగని పని, ఎందుకు సారు ఎందుకు జరగని పని,ఎందుకంటే నువ్వు నేను ఆరు నెలలు వాడికి భార్యాభర్తల గా నటించాలని ఒప్పందం చేసుకున్నాం కాబట్టి, ఆ ఒప్పందం ప్రకారం నీ మెడలో తాళి కట్టాను కాబట్టి, ఇంకో మూడు నెలలు ఆ ఒప్పందం ముగుస్తుంది కాబట్టి, ఆ తర్వాత నీ దారి నిధి నా దారి నాది, కానీ నువ్వు ఒప్పందాన్ని మర్చిపోయి నాకు భార్యగా శాశ్వతంగా ఉండాలని పిచ్చి పిచ్చి కలలు అన్నీ ఇలాంటివన్నీ చేస్తున్నావు అని అంటాడు విక్కి. ఇదంతా దూరం నుంచి కృష్ణ వింటాడు కృష్ణకి అర్థం అవుతుంది వీళ్ళ మధ్యలో ఆరు నెలలు మాత్రమే గడువుతో పెళ్లి చేసుకున్నారు ఇంకో మూడు నెలల్లో ఇద్దరు విడిపోతున్నారని కృష్ణ చాలా సంతోషిస్తాడు ఇదే ఆయుధంగా మార్చుకొని వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలి అని అనుకుంటాడు. ఇంకో మూడు నెలల్లో నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు అందుకే ఎక్కువ ఆశలు పెట్టుకోకు, నేను చెప్పేది నీకు అర్థం అయిందని అనుకుంటున్నాను అని అంటాడు విక్కీ.మన వివాహ బంధం దైవ నిర్ణయం తెలిసిన తర్వాత ఈ ఒప్పందం ఏంటి సారు అన్ని మర్చిపోదాం అని అంటుంది. గాయం చేసి మందు రాస్తే సరిపోతుందా ఆ గాయం తాలూకు నొప్పిని అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. అందుకే ఈ మూడు నెలలు ఎప్పుడు అయిపోతాయో ఎప్పుడు నువ్వు వెళ్ళిపోతావా అని నేను చాలా ఎదురు చూస్తున్నాను. మీరేనా ఈ మాట అనేది ఒకప్పుడు మీరు నా మీద ఎంత ప్రేమ చూపించారు. అప్పుడు నేను మీకు ఏది చెప్పలేకపోయి ఉన్నాను కానీ ఇప్పుడు చెప్పిన మీరు వినే పరిస్థితుల్లో లేరు, ఎందుకు సారు జరిగిందే మనసులో పెట్టుకొని బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నారు అది నిజం కాదు అబద్ధం. ఇప్పుడు ఈరోజు ఈ క్షణం జరిగిందే నిజం. ఎప్పటికీ నా మనసులో మీరే ఉంటారు మీరు తప్ప ఇంక నాకు ఏది అవసరం లేదు. చూడు పద్మావతి నేను నా భార్యగా నేను అస్సలు అంగీకరించను. మిగిలిన ఈ మూడు నెలలు కూడా మనం భార్యాభర్తల్లాగా నటించాలి అంతే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా దూరం నుంచి కృష్ణ చూసి చాలా సంతోషిస్తాడు. నాకు తెలుసు పద్మావతి నేను చేసిన గాయానికి విక్కీ ఎప్పటికి నిన్ను క్షమించడు. నన్నే భయపెట్టాలని చూసావు కదా ఇప్పుడు నాకు తెలిసినా నిజాన్ని చూపించి నిన్నెలా భయపడతానో చూస్తూ ఉండు అని అనుకుంటాడు మనసులో, పద్మావతి ఇంకా ఈయనకి అలా అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకుంటుంది.
Brahmamudi నవంబర్ 7 ఎపిసోడ్ 247: రాజ్ కావ్యని ఒక్కటి చేసిన సీతారామయ్య.. కావ్యాని దూరం పెడుతున్న రాజ్

విక్కీ కోసం ఆర్య గిఫ్ట్..
అను అద్దం ముందు నిలబడిరెడీ అవుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆర్య వస్తాడు.ఏంటో ఈరోజు ఆనందంగా ఉన్నావు అని అడుగుతాడు. పద్మావతి విక్కీ కోసం ఇంత కష్టపడి తులాభారం తోచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఎవరికి రాని ఆలోచన మా పద్మావతికి ఎలా వచ్చిందో అని అంటుంది. ప్రేమంటే అంతే డియర్ ఎవరికి రాలి ఆలోచనలు వాళ్ళకి వస్తాయి తన ప్రేమ కోసం తాపత్రయపడుతూ ఉంటారు పద్మావతికి విక్కీ అంటే చాలా ప్రేమ అందుకే ఇలాంటి ఆలోచన చేసింది అని అంటారు ఆర్య. అంతే కాదండి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఎంత పవిత్రమైందో వాళ్ల మధ్య ఉన్న బంధం ఎంత బలమైందో తెలిసేలా మా పద్మావతి తన మెడలో పసుపు తాడు కట్టుకొని ఇట్లా తులాభారం చేయించింది నాకైతే ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి అని అంటుంది.ఇద్దరు ఏ గొడవ లేకుండా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అని అంటుంది అను.తప్పకుండా ఉంటారు వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికే కదా వాళ్ల కోసం నేను గిఫ్ట్ తీసుకొచ్చాను అని అంటాడు. ఆర్య తెచ్చిన గిఫ్ట్ను తీసి చూపిస్తాడు అందులో రెండు చైన్స్ ఉంటాయి. విడివిడిగా చూస్తే ఈ ఆకారానికి అర్థం లేదు అదే ఈ రెండు చైన్లు కలిపితే, ఒక హాట్ సింబల్ వస్తుంది అని చూపిస్తాడు ఆర్య. చాలా బాగుందండి అని అంటుంది అను. పద్మావతి వికీల మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్న అవన్నీ పోయి వాళ్ళు కూడా ఇలానే కలిసి ఉండాలని నేను ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను వాళ్ల కోసం అని అంటాడు. పర్లేదే మీకు కూడా బుర్రువుంది అని అంటుంది అను. ఇంత మంచి పని చేసినందుకు నాకేం గిఫ్ట్ ఇవ్వవా అని అంటాడు అని ఆర్య కి ముద్దు పెడుతుంది. కింద పుట్టినరోజు అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి ఈ గిఫ్ట్ వాళ్ళకి ఇద్దాం పదండి అని అంటుంది.
Nuvvu nenu Prema:పద్మావతిని కాపాడిన అను,ఆర్య.. తులాభారం ఆపడానికి కృష్ణ ప్లాన్ ఫలించినట్టేనా?

పద్మావతి బాధ..
పద్మావతి ఒక్కతే గరుడ బండి ముందు కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది.గుడిలో జరిగినవన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. గరుడ ఏందమ్మి టెంపరరీ పుట్టినరోజు అంటే ఇల్లు పీకి పందిరి వేస్తావు అనుకున్నాను ఇంత బాధగా కూర్చున్నావు. అని అంటాడు గరుడ పద్మావతి నాకు ఏమీ అర్థం కావట్లేదు గరుడ నేను ఎంత చెప్పినా, నా ప్రేమ విక్కీకి అర్థం కావట్లేదు. ఆయనకి నా మీద నమ్మకం కుదరట్లేదు ఇంక నేను ఎలా ఆయన్ని నమ్మించాలో తెలియక చాలా బాధగా ఉంది గరుడ అని అంటుంది. కానీ ఆయన మనసులో నీ మీద ఒకసారి ప్రేమ కలిగితే ఇక అంతా మంచే కదా మీ అని అంటాడు గరుడ. నేనేం చేసినా ఆయనకి నా ప్రేమ అర్థం కావట్లేదు అని అంటుంది పద్మావతి. అలాగని డల్లుగా ఉంటావా అమ్మి, నీ ప్రేమ ఎంత పవిత్రమైందో టెంపర వాడికి తెలియడానికే ఆ శ్రీరామచంద్రుడే ఈ పరీక్ష పెట్టాడు అనుకో, నువ్వు పద్మావతి ఇలా డల్లుగా ఉంటే ఎలాగు, నీ ప్రేమ నిరూపించుకోవడానికి నీ ప్రయత్నాలు ఏవి ఆపకూడదు అని అంటాడు గరుడ.
రేపటి ఎపిసోడ్లో విక్కీ పుట్టినరోజు కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. పద్మావతి వికీ డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చి మీరు ఇంకా రెడీ అవ్వలేదా కింద మీకోసం ఎదురు చూస్తున్నారు ఈ త్వరగా ఈ డ్రెస్ వేసుకొని రండి అని అంటుంది. విక్కీ కొత్త డ్రెస్ వేసుకొని రాగానే ఇక వెళ్దాం పద అని అంటాడు.ఒక నిమిషం ఉండండి అని క్రాప్ సరిగ్గా లేదు దువ్వుతాను,అనీ పద్మావతి విక్కి తలదువుతూ ఐ లవ్ యు సారు అని చెప్పి ముద్దు పెట్టేస్తుంది. విక్కీ ఏం చేస్తున్నావ్ అని అంటాడు. నీకు అసలు బుద్ధుందా అని తిడతాడు. బుద్ధి ఉంది కాబట్టే ముద్దొచ్చినప్పుడు ముద్దు పెట్టుకున్నాను అని అంటుంది పద్మావతి.