Nuvvu nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి ఇంట్లో అందరికీ తన బిజినెస్ గురించి చెప్పడం జరుగుతుంది. శాంతాదేవి పద్మావతి కి సపోర్ట్ గా ఉంటుంది. పద్మావతి ఇక విక్కీ దగ్గర తీసుకున్న అప్పు తీర్చేయవచ్చు అని అనుకుంటుంది. పద్మావతిని చూసి అను సంతోషపడుతుంది.
ఈరోజు 437 ఎపిసోడ్ లో పద్మావతి తను కొత్తగా ప్రారంభించబోయే బిజినెస్ కోసం ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు. ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. బిజినెస్ కాల్స్ మాట్లాడుతున్నాను అని అంటుంది. వాట్ అంటాడు విక్కీ.

మన పెళ్లి కార్డుల కోసం..
ఫోన్లో మాట్లాడుతూనే విక్కీ తో మాట్లాడుతూ ఉంటుంది పద్మావతి. అవును సారూ నేను కొత్తగా మన ఆఫీసులో పనిచేసే అందరికీ, భోజనం తీసుకోవచ్చే కాంట్రాక్ట్ ని ఒప్పుకున్నాను. అందుకని ఈ హడావిడ అంతా అని అంటుంది. అది అంత సులువు కాదు పద్మావతి అంటాడు విక్కీ. ఈ పద్మావతి అనుకుంటే ఏదైనా సాధిస్తుంది సారూ అని అంటుంది. అయినా మీరు చెవిలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా అది ఏంటి అని అడుగుతుంది.దాన్ని ఏమని అడగాలి ఎంత అవుతుంది అని అంటుంది. విక్కీ నీకుఇయర్ ఫోన్స్ ఎక్కువ, ఇక వాటి గురించి ఎందుకులే అని అంటాడు. మీరు చెప్పకపోతే తెలుసుకోలేను అనుకుంటున్నారా కొనుక్కోలేను అనుకుంటున్నారా ఇప్పుడు నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేశాను అడ్వాన్స్ ఇచ్చారు అని అంటుంది. కార్డులు ఎలా కొట్టించాలి అని అడుగుతుంది. విక్కీ ఏ కార్డులు అని అడుగుతాడు. మన పెళ్లి కార్డులు మీరు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు కదా కార్లు పెట్టించి అందరికీ తెలియజేద్దామని అని అంటుంది. వాట్ అంటాడు విక్కీ. మరి లేకపోతే ఏంటి సారు బిజినెస్ కోసం విజిటింగ్ కార్డ్స్ ఎట్లా కొట్టించాలి? ఎక్కడ కొట్టించాలి అని అడుగుతున్నా, విక్కీ కోపంగా నన్ను విసిగించకు అవతలికి వెళ్ళు అని అంటాడు. పద్మావతి ఫోన్లో మాట్లాడుతూ,ఇక్కడ కొంతమంది ఉంటారు నా ఎదుగుదల చూసి కుళ్ళు కుంటున్నారు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. అని పెట్టేస్తుంది. విక్కీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
Nuvvu nenu Prema: పద్మావతి బిజినెస్ ప్రపోజల్.. అభినందించిన కుటుంబ సభ్యులు..విక్కీ ఏం చేయనున్నాడు?

కృష్ణ ఐడియా..
ఇక కృష్ణ తన అకౌంట్లో డబ్బులు ఇంకా పడలేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆఫీసులో పని చేసే ఆడిటర్ కి ఫోన్ చేసి నా అకౌంట్ లో ఇంకా మీరు డబ్బులు వెయ్యలేదు అని అంటాడు. విక్కీ సారు మీ అకౌంట్లో డబ్బులు వేయద్దు అని చెప్పారండి అని అంటాడు ఎంప్లాయ్, నేనెవరో నీకు తెలియదా అని అంటాడు కృష్ణ తెలిసినా మీకు ఏమి ఇవ్వద్దని విక్కి సార్ చెప్తే నేను అలానే చేయాలి ఆయన మా బాస్ నేను ఆయన కింద ఎంప్లాయ్ ని, సారీ సార్ నేనేం చేయలేను అని ఫోన్ పెట్టేస్తాడు ఆడిటర్. కృష్ణ విక్కీ నా అకౌంట్లో డబ్బులు వేయకుండా చేస్తావా? ఇప్పుడు చూడు నేనేం చేస్తానో, అని లోపలికి వెళ్తాడు. ఎలాగైనా విక్కీని ఇరికించాలని కృష్ణ కొత్త ప్లాన్ వేస్తాడు.. బంగారపు నగలు అమ్మే సేటు ఇంటికి వస్తాడు.

ఇంకెప్పుడూ అలా మాట్లాడొద్దు అక్క అన్న విక్కి..
ఇక పద్మావతి ఇయర్ బర్డ్స్ పెట్టుకొని, ఫోన్లో మాట్లాడుతూ పేపర్ మీద కావాల్సిన ఐటమ్స్ ని రాసుకుంటూ ఉంటుంది. చాలా బిజీగా బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు. రూమ్ అంతా పేపర్లతో నిండిపోయి ఉంటుంది.ఒకసారి గా పద్మావతి అని అరుస్తాడు పద్మావతి చెవిలో ఇయర్ బర్డ్స్ ఉండడం వల్ల వినిపించదు. మళ్లీ గట్టిగా కేకేస్తాడు అయినా పద్మావతి చూడకపోవడంతో చేతిలో ఉన్న పేపర్ ని లాక్కుంటాడు. ఏం చేస్తున్నావ్ నువ్వు ఇది రూమ్ అనుకున్నావా, ఇలా పాడు చేసావ్ ఏంటి అని అంటాడు. అబ్బాయిల ఇవ్వండి సార్ పేపరు రేపటి కోసం మెనూ రాసుకుంటున్నాను అని అంటుంది పద్మావతి. ముందు నా రూమ్ ని క్లీన్ చెయ్ పద్మావతి అని అంటాడు. ఏంటి సారు నేను ఒక వైపు బిజినెస్ గురించి మాట్లాడుతుంటే నన్ను విసిగిస్తారు అని అంటుంది. అవునా అయితే పేపర్ తీసుకో చూద్దాం అని చేతిలో ఉన్న పేపర్ ని పైకి పట్టుకుంటాడు. పద్మావతి పేపర్ తీసుకునే క్రమంలో విక్కీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంది. అప్పుడే అక్కడికి అరవింద వస్తుంది పద్మావతి రండి వదిన అని అంటుంది. ఏంటి పద్మావతి రమ్మన్నావంట అని అంటుంది అరవింద. ఏం లేదు వదిన నేను సాధించిన ఈ విజయం కారణం మీరే, అసలు నేను పెట్టే బిజినెస్ ఇంత సక్సెస్ అవుతుందని అనుకోలేదు. అందుకే మీకు థాంక్స్ చెబుదామని అనుకున్నాను. అని పద్మావతి అనగానే అరవింద అవునా అంటే నీకు ఆర్డర్స్ వచ్చాయన్నమాట అని అంటుంది. ఆర్డర్స్ రావడం ఏంటి వదిన నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు అని అంటుంది. కంగ్రాట్యులేషన్స్ పద్మావతి నువ్వు ఎప్పుడూ ఇలానే ఉండాలి. నా అయిషు కూడా పోసుకొని నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి అని అంటుంది. విక్కీ కోపంగా ఎనఫ్ అక్క అని అంటాడు. ఒకసారి అరవింద షాక్ అవుతుంది. ఇప్పుడు నేనేమన్నాను రా అలా అరిచావు అని అంటుంది. చిన్నప్పటినుండి అమ్మ లేకపోయినా ఎంతో ప్రేమగా పెంచావు,అలాంటి నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోగలనా అని అంటుంది నేనేదో మాట వరసకి పద్మావతిని నా ఆయుషు కూడా పోసుకోమని అన్నాను కానీ నాకు ఏమన్నా అవుతుందని అన్నానా అని అంటుంది అరవింద. అక్క అలాంటి మాటలు నువ్వు ఎప్పుడూ అనొద్దు ఎవరికోసం కూడా నీకు ఏమీ కాకూడదు. నా తర్వాత నిన్ను ప్రేమగా చూసుకునేది పద్మావతికి అని చెప్తూ ఉండగా, కృష్ణ పిలుస్తున్నాడని అరవింద కి కబురు వస్తుంది. సరే మీరు మాట్లాడుకోండి నేను కిందకి వెళ్లి వస్తాను అని వెళ్తుంది.

కృష్ణ ప్లాన్ రివర్స్..
కృష్ణ బంగారపు అమ్మే వాడిని ఇంటికి తీసుకువస్తాడు. అరవింద్ అను కూడా పిలుచుకు రమ్మంటే అరవింద కూడా వస్తుంది. రాణమ్మ నీకు ఒక విషయం చెప్పాలి ఈనాసేటు,ఏదో కొత్త డిజైన్ వచ్చిందంటే చూద్దామని రమ్మన్నాను కానీ ఇప్పుడు వెళ్ళిపోమంటున్నాను అని అంటాడు. అదేంటండీ ఎందుకు రమ్మన్నారు ఎందుకు వెళ్లిపోమంటున్నారు అని అంటుంది.అదేం లేదులే రానమ్మ మీరు వెళ్ళండి సార్ అని అంటాడు కావాలని రానమ్మ ముందు నటిస్తూ ఉంటాడు, కృష్ణ. అంతలో సేటు నేను చెప్తానమ్మా అసలు విషయం ఏంటో అని, సారు ఒక నగ కోసం ఆర్డర్ పెట్టాడు అది వచ్చింది కానీ దాని రేటు ఎక్కువగా ఉందని వద్దని అంటున్నారు ఇప్పుడు అని అంటాడు. దేనికి అండి వద్దన్నారు అంటుంది అరవింద. మన తాహతకు మించి ఎందుకులే రానమ్మ నా దగ్గర బ్యాలెన్స్ లేదు అకౌంట్లో విక్కి డబ్బులు వేయలేదు అందుకనే వద్దని చెప్పాను అని అంటాడు. అవునా మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని వెళ్తుంది అరవింద. కృష్ణ ఆహా ఇప్పుడే వెళ్లి విక్కీని నాలుగు చివాట్లు పెడుతుంది. విక్కీని డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చేటట్టు చేస్తుంది అని అనుకుంటాడు కానీ అరవింద అలా చేయకుండా డబ్బులు తీసుకువచ్చి ఇస్తుంది. నగ తీసుకొని వాళ్లని పంపించేస్తుంది. కృష్ణ అరే నేను అనుకున్నది జరగలేదు అని అనుకుంటాడు. అయినా ఏం పర్లేదు ఎలాగైనా నేను అనుకున్నది చేస్తానుగా అని మనసులో అనుకుంటాడు.

పద్మావతి మీద కోప్పడిన విక్కీ..
పద్మావతి అరవింద్ అన్న మాటలే తలుచుకుంటూ ఉంటుంది. విక్కీ అక్కడే ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. అరవింద్ గారు ఎంత మంచివారు తన ఆయుష్షు కూడా పోసుకొని నన్ను బతకమంటున్నారు అంటే తనకి నేనంటే ఎంత ఇష్టమో, అని అంటూ ఉండగా అది విని విక్కీ కోపం వస్తుంది. అంతకుముందు కృష్ణ పద్మావతి ఒకరికొకరు మాట్లాడుకోవడం గుర్తుకు వస్తుంది. నీకు అంత ఇష్టమైతే అరవింద్ అని వదిలేసేయ్ నన్ను పెళ్లి చేసుకో అని పద్మావతి కృష్ణతో అన్నమాట అన్న మాటలు విక్కీకి గుర్తుకు వస్తాయి వెంటనే పద్మావతి మీద కోపంగా ఇంక చాలు ఆపుతావా అని అంటాడు. ఇప్పుడు నేనేమన్నాను సారూ అరవింద గారు తన అయుష కూడా పోసుకొని నన్ను బతకమన్నారు అంటే నేనంటే తనకి చాలా ఇష్టం కదా అని అంటుంది పద్మావతి. మా అక్కకి నీ గురించి తెలియదు కదా అందుకని అలా మాట్లాడింది నువ్వు చేసిన మోసం గురించి మా అక్కకు తెలిస్తే తట్టుకోలేదు, కానీ నువ్వు మాత్రం తన ముందు భలేగా నటిస్తున్నావు అని అంటాడు నేను నటించట్లేదు మీరు చూసింది మాత్రమే నిజం అనుకుంటున్నారు అసలు ఆరోజు ఏం జరిగిందో అనే పద్మావతి చెప్తుంటే చాలు పద్మావతి నీ మాటలు నేను వినాలి అనుకోవట్లేదు అంటాడు విక్కీ. పద్మావతి వినకపోతే నిజం ఎలా తెలుస్తుంది సారు అని అంటే విక్కీ కోపంగా పూలకుండి విసిరేస్తాడు ఇదంతా కృష్ణ చూసి అరవింద్ కు చెప్పాలని కిందకి వెళ్తాడు. అరవింద దగ్గరికి వెళ్లి పద్మావతి వికీలు మళ్లీ గొడవ పడుతున్నారు నువ్వు రా అరవింద అని తీసుకొని వస్తాడు కృష్ణ. విక్కీ అప్పటికే పద్మావతి తో గొడవపడి తనకి గాయం అయిందని చూస్తూ ఉంటాడు. పద్మావతి నువ్వు ఎంత నటించినా నీకు ఎంత బాధ కలిగినా నా మనసు మాత్రం మారదు అని అంటాడు. మీ మనసు మారుతుంది సారు ఇప్పుడు నాకు దెబ్బ తగిలితే మీ కళ్ళల్లో నేను ప్రేమ చూశాను. మీరు ఎప్పటికైనా మారి నన్నుఅర్థం చేసుకుంటారు ఆ నమ్మకం నాకుంది దానికోసమే నేను మీరు ఏదన్నా భరిస్తాను అని అంటుంది అప్పుడే అక్కడికి అరవింద వస్తుంది.ఏంటి అక్క టెన్షన్ పడుతున్నావ్ అని అంటాడు విక్కీ అరవింద్ అని చూసి ఏం లేదు మీరు మళ్ళీ గొడవ పడుతున్నారా అని అంటుంది లేదక్కా అని అంటాడు విక్కీ లేదు విక్కీ నటించమాకు నువ్వు గొడవ పడడం పద్మావతితో నేను చూశాను అంటాడు కృష్ణ. అక్క బావ ఎక్కువ శ్రద్ధ మా మీద పెడుతున్నాడు నిన్ను బాగా చూసుకోమని చెప్పు. ఎందుకంటే మేము గొడవ పడట్లేదు తను చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉంది నేను పెద్దగా పద్మావతి అని అరిచాను. దాన్ని చూసి బావ అపార్థం చేసుకున్నట్టు ఉన్నాడు మేం బాగానే ఉన్నాము అని అంటాడు పద్మావతి కూడా అవును మేము బానే ఉన్నాము అని అంటుంది సరే రేపు నా శ్రీమంతం మీరు గ్రాండ్గా చేయాలి అని అంటుంది చూస్తావుగా అక్క మేము ఎలా చేస్తాము అంటాడు.

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి కృష్ణ ని అన్నయ్య అని పిలుస్తుంది. దానికి పద్మావతిని కృష్ణ నువ్వు అన్నయ్య అని పిలిచినంత మాత్రాన మన మధ్య బంధం మారిపోదు. నేను డబ్బులు కోసమే అరవింద్ అని పెళ్లి చేసుకున్నాను కానీ నా మనసులో మాత్రం నువ్వే ఉన్నావు అని చెప్తాడు అది ఇంట్లో అందరితో పాటు అరవింద్ కూడా వింటుంది. కృష్ణుని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది చూడాలి ఇది నిజంగా జరిగిందా లేదంటే కల అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..