Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో విక్కీ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని ఇంట్లో వాళ్ళు ఘనంగా జరుపుకుంటారు. పద్మావతి విక్కీ ని ఒప్పించి పుట్టినరోజు జరుపుకోవాలని అందరి ముందుకి తీసుకొస్తుంది. పద్మావతి విక్కీ కోసం కేక్ ప్రిపేర్ చేస్తుంది. కృష్ణ ఆ కేక్ ని పాడు చేసేస్తాడు. విక్కీ అందరి ముందు పద్మావతిని తిట్టాలి అని కృష్ణ అనుకుంటాడు. కానీ కృష్ణ అంచనాలన్నీ తారుమారు చేస్తూ విక్కీ పద్మావతిని సపోర్ట్ చేసి ఆ కేక్ ని తను రీ మోడల్ చేస్తాడు. కేకు పాడు చేసింది కృష్ణయ్య అని తెలుసుకొని పద్మావతి వార్నింగ్ ఇస్తుంది.
BrahmaMudi November 11 Episode 251: కావ్య ప్లాన్లో బోల్తా పడ్డ అపర్ణ.. రాజ్ కి ఫ్లయింగ్ కిస్..

ఈరోజు 465 వ ఎపిసోడ్ లో, పద్మావతి కృష్ణ కి వార్నింగ్ ఇచ్చి, విక్కీ దగ్గరికి వస్తుంది. అప్పటికే విక్కీ, ఆలోచిస్తూ, పద్మావతి తనకు చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. పద్మావతికి తను ఐ లవ్ యు చెప్పడం పద్మావతి, నాకు వేరే వాళ్లతో నిశ్చితార్థం అయ్యిందని చెప్పడం, ఆ తర్వాత విక్కీ పద్మావతిని బలవంతంగా పెళ్లి చేసుకోవడం అన్ని ఆలోచిస్తూ, బాధపడుతూ ఉంటాడు.విక్కీ ఏం ఆలోచిస్తున్నాడో పద్మావతి కి తెలియదు. పద్మావతి అలానే వచ్చి విక్కీని వెనుక నుంచి హగ్ చేసుకుంటుంది. విక్కీ ఒకసారిగా షాక్ అవుతాడు. పద్మావతి విక్కీ తన గురించి ఆలోచిస్తున్నాడు అని అనుకుంటుంది. మీరు నా కోసం చేసిందానికి నేను మీకు థాంక్స్ చెబుదాము అని అనుకుంటున్నాను. నాకోసమే మీరు ఇదంతా చేశారని నాకు తెలుసు మీ మనసులో ఉన్న ప్రేమ బయటకు పెట్టడానికి, ఆలోచిస్తున్నారు. నీ మనసులో ఉన్న ప్రేమని అర్థం చేసుకోగలుగుతున్నాను. నేనంటే మీకు ఇష్టమని నాకు తెలుసు అందుకే కదా అందరి ముందు నేను బాధపడకూడదు అని ఆ కేక్ ని రీ మోడలింగ్ చేశారు అని అంటుంది పద్మావతి.
Krishna Mukunda Murari: క్రిష్ణ కోసం మురారి పోరాటం.. భవాని మాస్టర్ ప్లాన్..

ఐ హేట్ యు అని చెప్పిన విక్కీ..
పద్మావతి చెప్తూనే ఉంటుంది. నేను బాధ పడకూడదని అందరి ముందు నన్ను ఏమి అనకుండా మీరు కేక్ కట్ చేశారు కదా, సారు నేను ఈరోజు కోసమే ఎంతగానో ఎదురు చూశాను నేను ఎంతో దేవుళ్ళకి ఈరోజు కోసమే మొక్కుకున్నాను. నా మొక్కలు ఫలించి మీ మనసు కరిగి ఈరోజు ఇట్లా కలిసొచ్చింది ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు మీ పుట్టిన రోజు నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను. మీతో కలిసి నా జీవితాన్ని పంచుకోవాలని నేను అనుకుంటే, అది ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు. నేను మీ చేతిని ఎప్పటికీ విడిచిపెట్టను ఒన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సారు. పద్మావతి విక్కీ ని హగ్ చేసుకుని ఐ లవ్ యు సారు అని చెప్తుంది. విక్కీ పద్మావతి తో ఐ హేట్ యు అని చెప్తాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సారు అని అంటుంది నేను మాత్రం నిన్ను ఎప్పటికీ ద్వేషిస్తూనే ఉంటాను పద్మావతి అని అంటాడు విక్కీ. ఆ మాటలకి పద్మావతి చాలా బాధపడుతుంది. అవును పద్మావతి నువ్వు విన్నది నిజమే, ఎందుకంటేనాలో ఉన్న ప్రేమని మోసం చేసింది నువ్వు, నేను కోరుకున్న జీవితాన్ని నాశనం చేసింది నువ్వు, నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, నయవంచన చేసింది నువ్వు, నాకు జీవితాన్ని లేకుండా చేసిన నిన్ను ఎలా ప్రేమిస్తాను నిన్ను ఎలా భారీగా ఒప్పుకుంటాను ఇంత మోసం చేసిన దాని భారీగా ఒప్పుకోమంటావా చెప్పు అని అంటాడు విక్కి. అయితే మీరు నా మీద చూపించింది అంతా నటన, అవసరం కోసం నువ్వు ఎలా నటించావో మా వాళ్ళ ఆనందం కోసం నేను అలానే నటించాను. అంతేగాని నీ మీద ప్రేమ లేదు, అనే విక్కి గట్టిగా చెప్పేస్తాడు. మీ ప్రేమ గురించి తెలిసిన తర్వాత కూడా ఆ ప్రేమని పొందడం కోసం నేను ఆశపడుతున్నాను సార్, కానీ మీరేమో నేను నీ ప్రేమకి అర్హురాన్ని కాదు అని అంటున్నారు. మీ ప్రేమ కోసమే బతుకుతున్న దానిని, మీరే అలా అంటే నేను ఇంకెలా బతకాలి సారు, పగిలిన అద్దం విరిగిన మనసు ఎప్పటికీ అతుక్కోవు పద్మావతి, నువ్వు ఎంత ఆశపడినా నిరాశే తప్ప ప్రేమ మాత్రం పుట్టదు. నా ప్రేమ నిజమైనప్పుడు నేను మిమ్మల్ని మనస్పూర్తిగా, ప్రేమిస్తున్నప్పుడు నా ప్రేమ ఎందుకు మీకు అర్థం కావట్లేదు సారు అని అంటుంది పద్మావతి. అది ప్రేమ కాదు కాబట్టి నువ్వు మోసం చేస్తున్నావు కాబట్టి నువ్వు నటిస్తున్నావు, ఎప్పటికీ మనిద్దరం కలవము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్కి. పద్మావతి చాలాసేపు బాధపడుతూ అక్కడే ఉంటుంది. వెనక బ్యాక్ గ్రౌండ్ లో ఒక సాడ్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది విక్కీ కూడా లోపలికి వచ్చి బాధపడతాడు.
Nuvvu Nenu Prema: విక్కీ పుట్టినరోజు సెలబ్రేషన్స్.. పద్మావతిని దెబ్బ కొట్టాలనుకున్న కృష్ణ..

విక్కీ కోసం పద్మావతి లేఖ..
ఇక పద్మావతి మరుసటి రోజు విక్కీ ఎంత చెప్పినా తన ప్రేమని అర్థం చేసుకోవట్లేదు అని, శ్రీనివాస నేను నా మనసులో ఉన్న బ ప్రేమని చెప్తే టెంపర రోడ్డు అపార్థం చేసుకుంటున్నాడు ఎంత ప్రయత్నించినా తనలో ఉన్న అపార్ధాన్ని పోగొట్టలేకపోతున్నాను దానికోసమే తన మీద నాకు ఎంత ప్రేమ ఉన్నాదో ఈ లెటర్లో రాసి తనకి అందిస్తాను ఇది చదివితే తనుకి నేను పడిన బాధ తన ప్రేమ కోసం నేను పడే తపన తనకి అర్థమవుతుంది అని విక్కీ లేని టైంలో పద్మావతి లేఖ రాస్తుంది. ఆలేఖలో సారు విధి చాలా విచిత్రమైనది. అది ఎప్పుడు ఎవరిని ఎట్లా కలుపుతుందో ఎవరికీ తెలియదు పుట్టుకతోనే అమ్మెవరో నాయన ఎవరో తెలియని అనాధని నేను, చేరదీసి అన్ని వాళ్లే ఈ పెంచి నాకు అసలైన అమ్మానాన్న అయ్యారు. అలాంటి వాళ్ళ ప్రేమ తర్వాత నాపై అంత ప్రేమ చూపించింది మీరే సారు. ఎక్కడో తిరుపతిలో ఉన్న నన్ను నా శ్రీనివాసుడు మీతో కలపడానికి మన, ఇద్దరి మధ్య పరిచయాన్ని పెట్టి ఆ తర్వాత ఇద్దరినీ స్నేహంతో కలిపి తరువాత మూడుములతో మనల్ని ఒకటి చేశాడు ఆ శ్రీనివాసుడు. జీవితాంతం సంతోషంగా ఉండే అవకాశం నీతోనే ఇచ్చాడు, ఈ జన్మకి నాకు ఇది చాలు కానీ ఎక్కడో ఏదో చిన్న వెళితే, ఇంత ఆనందంలో కూడా మీరు నా పక్కన ఉండడం లేదు, మీ ప్రియమైన నేను పూర్తిగా పొందలేకపోతున్నాను, ప్రతిక్షణం మీతోనే గడపాలని ఆశపడుతున్నాను, కానీ అది మాత్రం నెరవేరే అవకాశం మీరు నాకు ఇవ్వడం లేదు. అయినా ఇష్టమైన వాళ్ళ మీదే ఎక్కువ కోపం ఉంటుంది అంటారు. మీకు నాపై ఎంత ప్రేమ ఉన్నదో మీరు నాకు చూపించే కోపంలోనే తెలిసిపోతుంది నాకు, కానీ ఆ ప్రేమని మీ చిరునవ్వుతో చెప్తే చూడాలని నాకు చాలా కోరికగా ఉన్నది. నా ఈ కోరికను మీరు తీరుస్తారని ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు ప్రేమతో మీ భార్య పద్మావతి అని లెటర్ రాసి, విక్కీకి కనిపించే విధంగా, కబోర్డ్ మీద పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇంతలో పద్మావతిని అను పిలుస్తుంది.

లెటర్ చూసిన అరవింద..
ఇక పద్మావతి రాసిన లెటర్ ని అను పిలవడంతో పద్మావతి రూమ్లో పెట్టేసి వెళ్ళిపోతుంది. విక్కీ వచ్చి పద్మావతి లెటర్ ని చూస్తాడు అని అనుకుంటుంది కానీ విక్కీ ఫోన్ మాట్లాడుతూ పద్మావతి ఇచ్చిన లెటర్ ని చూసుకోడు, ఫోన్లో ఎవరితోనో ఆఫీసుకు సంబంధించిన విషయాలు అన్నీ మాట్లాడుతూ, లెటర్ చూసుకోకుండానే బయటికి వెళ్లిపోతాడు రూమ్ లో నుంచి, తర్వాత విక్కీ కోసం అరవింద అదే రూమ్ కి వస్తుంది. విక్కీ ఎంత పిలిచినా పలకడేంటి అని అనుకొని తర్వాత మాట్లాడదాం లే అని వెళ్ళిపోతూ ఉండగా లెటర్ కనిపిస్తుంది అరవింద్ కు, ఇదేంటి ఇక్కడ ఏదో లెటర్ రాసి ఉంది అని అనుకుంటుంది. ఎవర్రా సారు అని తీసుకొని చూస్తుంది. ఆ లెటర్ మీద కింద పద్మావతి అని రాసి ఉంటుంది పద్మావతి రాసిందా ఎవరికోసం రాసింది, ఏముంది ఈ లెటర్ లో చూద్దాము అని, పద్మావతి రాసిన లెటర్ ని అరవింద మొత్తం చదువుతుంది. అందులో పద్మావతి మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అని, మీ ప్రేమ నాకు ఇంకా కావాలనిపిస్తుంది నేను అనాధనా అయిన తర్వాత అంత ప్రేమ మళ్ళీ మీతోనే పొందాను అని రాసి ఉండడాన్ని, అరవింద చదువుతుంది. అదంతా చదివి అరవిందా పద్మావతి చాలా బాధపడుతుంది విక్కీ తనతో టైం స్పెండ్ చేయట్లేదని ఆలోచిస్తుంది. మీ ప్రేమ నేను పొందలేకపోతున్నాను అని బాధపడుతుంది. అని అరవిందా అర్థం చేసుకుంటుంది పద్మావతి విషయంలో విక్కీ నెగ్లెట్ చేయకూడదు అని చెప్పాలి ఎలాగైనా విక్కీకి అర్థమయ్యేలా చెప్పాలని లెటర్ మల్లి ఎక్కడ తీసిందో అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంది.

విక్కీకి చెప్పాలనుకున్నది చెప్పిన అరవింద..
విక్కీ ఆఫీస్ కి వెళ్తూ ఉంటాడు అరవింద హారతి పట్టుకొని ఎదురు వస్తుంది. ఏంట్రా ఒకప్పుడు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు నేను హారతిస్తే గాని ఆఫీస్ కి వెళ్లే వాడివి కాదు ఇప్పుడేంటి నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అని అంటుంది. అంత బిజీనా అని అంటుంది నా గురించి తెలిసే అడుగుతున్నావా అక్క అని అంటాడు విక్కీ మనం అంటే ఒకే తల్లి కడుపున పుట్టాం కాబట్టి నీ గురించి నేను అర్థం చేసుకోగలను. మనమంటే ఏంటో ఒకరికొకరికి తెలుసు వేరే ఇంటి నుంచి మన ఇంటి కి వచ్చిన వాళ్లకి మన ప్రేమ కోసం తపించే వాళ్లకి ఈ విషయం తెలియాలంటే తెలియదు కదా అని అంటుంది. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు నీ మనసులో ఏముందో తెలుసుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పు అని అంటుంది. అక్క చెప్పాలనుకున్నది ఏదో స్ట్రెయిట్ గా చెప్పు నాకు అర్థం కానట్టు చెప్పొద్దు అని అంటాడు. సరే అయితే నీకు స్ట్రైట్ గానే చెప్తాను పద్మావతి విషయంలో నువ్వు తనని నెగ్లెట్ చేస్తున్నావా అనిపిస్తుంది విక్కీ అని అంటుంది నేను తన నెగ్లెట్ చేయడం ఏంటి అక్క తను చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నాను పూజలు తులాభారాలు, పుట్టినరోజులు అన్నీ తనకి నచ్చినట్టుగానే చేస్తున్నాను కదా అక్క అని అంటాడు. మనం ఉండడం వేరు మనసుపెట్టి ఉండడం వేరు విక్కి అని అంటుంది. నువ్వు మరీ బిజీ అయిపోతున్నావు అంత బిజీ అయితే ఎలాగూ విక్కీ డబ్బు జీవితంలో ఒక భాగమే అదే జీవితం కాదు కదా అని అంటుంది అరవింద. నువ్వెంత బిజీగా ఉన్నా పద్మావతి తో కూడా కాసేపు టైం స్పెండ్ చెయ్ అని అంటుంది. వీలైతే తను ఎక్కడికైనా తీసుకెళ్ళు తను హ్యాపీగా ఉండేలా చూడు అని అంటుంది ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, ముందు నన్ను మాట్లాడనివ్వు అని అంటుంది. పద్మావతికి నువ్వంటే ఎంత ఇష్టమో మా అందరికీ తెలుసు కానీ నువ్వు తనని అర్థం చేసుకుంటే తను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పద్మావతి మన కోసం చాలా కష్టపడింది అలాంటి తనకి నువ్వు ఏమాత్రం ఆనందాన్ని కూడా ఇవ్వలేవా అని అంటుంది అరవింద. అక్క నాకు పద్మావతి ఒక్కతే ముఖ్యం కాదు ఇంట్లో అందరూ కూడా ముఖ్యమే నేనే చేసినాను ఇంట్లో వాళ్ళ కోసమే చేస్తాను అది అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది మనుషుల కోసం మనసుని మార్చుకుంటూ పోతే, మనకంటూ ఏ వ్యక్తిత్వం ఉండదు. అక్కకి ఇంకా నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించకు నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను ఆఫీస్ కి వెళ్ళొస్తాను. నీకు ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చెయ్ అక్క అని అంటాడు. చెప్పాల్సిన వాళ్ళు చెప్పాల్సిన రీతిలో చెప్తే గాని వాడి పరిస్థితిని అర్థం చేసుకోలేడు, వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటుంది. ఇక అరవింద విక్కి వెళ్లిపోయిన తర్వాత పద్మావతి దగ్గరికి వెళ్లి బొట్టు పెట్టి, మొత్తానికి బిజీ అవ్వడానికి మీరు కూడా ట్రై చేస్తున్నారా అని అంటుంది. మావికి బిజీగా ఉంటున్నాడు కదా అని మీరు కూడా బిజీగా ఉండడానికి ఏదో ఒక పని పెట్టుకున్నారా అని అంటుంది అరవింద పద్మావతి తో, మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు కదా వదినా ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే, మనకి ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది పద్మావతి. అవునా అయితే ఈ విషయం మీ ఆయనకి అర్థం అయ్యేటట్టు చెప్తే బాగుంటుందేమో అని అంటుంది అరవింద.

రేపటి ఎపిసోడ్లో విక్కి ఆఫీస్ నుంచి వచ్చేసరికి పద్మావతి రూమ్లో ఎదురుచూస్తూ ఉంటుంది. విక్కీ రూమ్ లోకి రాగానే పద్మావతి వికీ కనిపించకుండా దాక్కుంటుంది. విక్కీ అప్పటికి అలసిపోయి రావడంతో పడుకుంటాడు. పద్మావతి ముసుగు వేసుకొని తల మీద, విక్కీ బూట్లు తీస్తూ ఉంటుంది విక్కీ ఎవరు నువ్వు అని అంటాడు నేనే స్వామి మీ ధర్మపత్ని అని అంటుంది. ఏంటి అవతారం అని అంటాడు ఇకమీదట ఇలానే ఉండాలనుకుంటున్నాను స్వామి అని అంటుంది. అసలు సిసలైన భార్యమని అవతారం, మీరు ఈ గెటప్ తీసేయమన్నా నన్ను తీసేయ్ ఇలానే ఉండి మీ సేవ చేసుకుంటాను అని అంటుంది.