Nuvvu nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, రాఖీ పండగ కోసం అరవింద ఏర్పాట్లు చేసుకుంటుంది. గుడికి వెళ్లి వచ్చి తమ్ముళ్ళకి రాఖీ కడదాం అనుకుంటుంది అరవింద. పద్మావతి నీ తోడు తీసుకొని అరవింద గుడికి వెళుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో,పద్మావతి కృష్ణ అరవింద ముగ్గురు కారులో గుడికి బయలుదేరుతారు. కృష్ణ పద్మావతిని చూస్తూ ఉంటే ముందు చూసి డ్రైవ్ చేయండి అని అంటుంది పద్మావతి. అరవింద ఏమైంది అని అడగ్గా కృష్ణ ఏం లేదు ఏదో ఆలోచనలో ఉన్నాను అని అంటాడు. పద్మావతి మనసులో వీడు ఎప్పటికీ మారడు అని అనుకుంటుంది కృష్ణ గురించి.

కృష్ణా షాక్ అవడం..
అరవింద పద్మావతి గారు మీరు ఇప్పటివరకు ఎవరికీ రాఖీ కట్టలేదు కదా అని అంటుంది. అవును అరవింద్ గారు నాకుఅన్నయ్యలు కానీ తమ్ముడు కానీ ఎవరూ లేరు కదా మీలాగా ఎప్పుడూ అదే నా దిగులు అని అంటుంది అప్పుడు వెంటనే అరవిందా మీకు దేవుడిచ్చిన అన్నయ్య ఉన్నారు కదా అని అంటుంది. దేవుడిచ్చిన అన్నయ్య ఎవరు అని అంటుంది పద్మావతి ఇంకెవరు మా ఆయనే అని అంటుంది అరవింద. ఒకసారిగా కృష్ణ షాక్ అయ్యి సడన్ బ్రేక్ వేస్తాడు. ఏమైంది అని అడగ్గా ఏం లేదురా అమ్మ అని మల్లి కారు స్టార్ట్ చేస్తాడు. అరవింద ఎప్పటినుంచో మా ఆయన కూడా చెల్లెలు లేరని బాధపడుతున్నారు పద్మావతి గారు మీరు ఈరోజు మా వారికి రాఖీ కట్టండి అని అంటుంది. కృష్ణతో కూడా ఏంటండీ నేను చెప్పింది బాగుందా పద్మావతి మీ చెల్లిలిగా ఈరోజు మీకు రాఖీ కడుతుంది మీకు కూడా చెల్లెలు లేరన్న బాధ తప్పుతుంది అని అనేసరికి మళ్ళీ కృష్ణ కారు బ్రేక్ వేస్తాడు. ఏమైంది అని అడుగుతుంది అరవిందా చూస్తాను రానమ్మ అని చెప్పి కారు దిగుతాడు. నేను తాళి కడదాం అనుకున్నా అమ్మాయికి, నా చేతి రాఖీ కట్టించాలి అనుకుంటున్నావా అరవింద నేను ఎప్పటికీ పద్మావతి నీ చెల్లెలిగా యాక్సెప్ట్ చేయలేను పద్మావతి నా భార్య గా మాత్రమే నేను అనుకుంటున్నాను. అసలు నీ అడ్డు తొలగించేస్తే, ఇక ఇలాంటి ఆలోచనలు ఎవరికి రావు అని అనుకుంటాడు మనసులో, కృష్ణ.

కృష్ణకు వార్నింగ్ ఇచ్చిన పద్మావతి.
కృష్ణ రాణమ్మ కారు ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టుంది నేను మెకానిక్ ని పిలుచుకు వస్తాను అని వెళ్తాడు. అరవింద పద్మావతి మాట్లాడుకుంటూ ఏంటి ఇంకా రాలేదు అని అంటుంది పద్మావతి తో అరవింద.. గుడికి వెళ్లడానికి టైం అవుతుంది అని అంటుంది పద్మావతి నేను వెళ్లి చూసేస్తాను అని వెళ్తుంది.పద్మావతి కృష్ణ ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ వెళ్తుంది అప్పుడే కృష్ణ పద్మావతిని చూసి పక్కకు తీసుకొస్తాడు. నీకు అసలు బుద్ధుందా అరవింద్ గారు అక్కడ ఎదురు చూస్తుంటే నువ్వు ఇక్కడ ఖాళీగా కూర్చున్నావా అని అంటుంది పద్మావతి. సికెందుకు పద్మావతి మనిద్దరి మధ్య అడ్డుగా ఉందని అరవిందని తొలగించడానికి నేను ఈ పన్నాగం పన్నాను అని అంటాడు. నువ్వు ఈ జన్మకి మారవు అని అంటుంది పద్మావతి. మరి అరవింద చెప్పింది అని చెప్పి నాకు రాఖీ కట్టడానికి సిద్ధమయ్యావు. నువ్వు సిద్ధపడిన నేను సిద్ధంగా లేను నీ చేత రాఖీ కట్టించుకోవడానికి అని అంటాడు కృష్ణ. ఏ ఎందుకు సిద్ధంగా లేవు నువ్వు వరుసకి నాకు అన్నయ్యవి అవుతావు అందుకని రాఖీ కట్టడానికి ఒప్పుకున్నాను. నీ చెల్లెలిగా నేను నీకు రాఖీ కడితే తప్పేంటి అని అంటుంది వెంటనే కృష్ణ పద్మావతిని కొట్టబోయి ఆగుతాడు. ప్లీజ్ పద్మావతి ఇంకెప్పుడు అలా మాట్లాడుకుని నిన్ను నా భార్యగా తప్ప ఇంకోలా ఊహించుకోలేను, ఎన్ని జన్మలైనా నువ్వే నా భార్యగా రావాలి అని కృష్ణ అనగానే చెప్పు తీసుకొని కొడతాను అని అంటుంది పద్మావతి. ఇంకొకసారి ఆ మాట అన్నావ్ అనుకో చెప్పు తీసుకొని కొడతాను అని పద్మావతి కృష్ణకు వార్నింగ్ ఇస్తుంది. అసలు నీకు వావి వరుసలు లేవా నువ్వు మనిషివా మృగాన్ని వా తిడుతుంది. పరిస్థితిలు ఎన్ని మారినా నా మనసు మాత్రం మారదు పద్మావతి అని అంటాడు కృష్ణ. నేనెప్పటికీ నిన్ను మర్చిపోలేను అంతే అని అంటాడు కృష్ణ. నేను ఇప్పుడే చెప్తున్నాను అవి ఏమీ జరగవు, నీ మంచి కోసమే చెప్తున్నాను నువ్వు అరవింద గారి భర్తగా ఉంటేనే బతికి ఉంటావు. లేదని ఆ తల్లికి అన్యాయం చూసావో నేనే నిన్ను చంపుతాను అని కృష్ణకి వార్నిగ్ ఇస్తుంది పద్మావతి.
Krishna Mukunda Murari: కృష్ణ ముందే ముకుంద తో అలా వచ్చిన మురారి.. భవని కి నిజం చెప్పనున్న ముకుంద..

అరవింద అను కాపాడిన పద్మావతి..
కృష్ణకు వార్నింగ్ ఇచ్చి పద్మావతి అరవింద దగ్గరికి వస్తూ ఉండగా అరవింద కారు దిగి బయటికి వచ్చి ఫోన్ సిగ్నల్ కోసం చూస్తూ ఉంటుంది.అప్పుడే ఒక లారీ ఫాస్ట్ గా అరవింద్ మీదకి వస్తూ ఉంటుంది అరవింద కాలునొప్పి రావడంతో రోడ్డు మధ్యలోనే ఆగిపోతుంది పక్కకి జరగడానికి కాలు సహకరించదు. అరవింద చాలా భయపడిపోతూ ఉంటుంది లారీ తనని గుద్దుతుందేమోనని అప్పుడే అక్కడికి వచ్చిన పద్మావతి అరవింద్ సేవ్ చేస్తుంది.వెంటనే అరవింద్ అని పట్టుకొని పక్కకు తోసేస్తుంది అరవింద కింద పడిపోతుంది చేతికి గాయం అవుతుంది కానీ ప్రాణానికి ప్రమాదం జరగదు. మీకేం కాలికే కాలేదు కదా అరవింద్ గారు ఇప్పుడు మీరు బానే ఉన్నారు కదా అని అంటుంది పద్మావతి అరవింద్ తో నేను బానే ఉన్నాను పద్మావతి మీకేం కాలేదు కదా అంటుంది అరవింద్ అప్పుడే అక్కడికి వచ్చిన మంచి ఛాన్స్ మిస్ అయింది అని బాధపడతాడు. అయ్యో చాలా బ్లడ్ పోతుంది ముందు హాస్పిటల్ కి వెళ్దాం పదండి అంటుంది పద్మావతి. కృష్ణ కావాలని అరవింద ముందు అయ్యో ఇదంతా నావల్లే జరిగింది రానమ్మ నేనే గనుక ఇక్కడ ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు నన్ను క్షమించు రానమ్మ అని అంటాడు.మీరు అలా మాట్లాడితే నేను తట్టుకోలేనుండి అంటుంది అరవింద పద్మావతి మాటలు తర్వాత ముందు హాస్పిటల్ కి తీసుకెళ్దాం పద అంటుంది.
Bramhamudi: కావ్య ని పుట్టింటికి వెళ్లకుండా చేసేందుకు రాజ్ ప్రయత్నాలు..చివరికి ఏమైందంటే!

భక్తాకు నిజం చెప్పిన పార్వతి..
పార్వతి పిల్లల దగ్గర నుండి ఇంటికి వస్తుంది. భక్త పార్వతిని చూడగానే పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతాడు. అను బాగుంది కదా తను సంతోషంగానే ఉంది కదా నువ్వు వెళ్లిన పని జరిగింది కదా వ్రతం ఎలా చేసుకున్నారు అని అడుగుతాడు. పార్వతి ఏడుస్తూ ఉంటుంది భక్తా ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడగ్గా పద్మావతి గురించే నా భాదండి అని అంటుంది. ఇప్పుడు ఏమైందని ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా బానే ఉంటుందిలే అని అంటాడు. మీకేం తెలుసండి పద్మావతి గురించి లోపల ఎంతో ప్రేమ ఉన్న పైకి ఇష్టం లేనట్టు మీరు మాట్లాడుతున్నారని నాకు తెలుసు కానీ పద్మావతి మనసు మీకు తెలుసా అని అంటుంది పార్వతి. అటు భర్త ప్రేమ దొరక్క ఇటు అత్తగారి ప్రేమ దొరక్క చివరికి తండ్రిగా మీరు కూడా దాని అర్థం చేసుకోవట్లేదు అని అంటుంది పార్వతి. ఇప్పుడు తన భర్తతో బానే ఉంటుంది కదా పద్మావతి అని అంటాడు. లేదండి పద్మావతికి విక్కీకి మధ్య ఏదో గొడవ జరిగింది అని అంటుంది. నీకెలా తెలుసు అని అడుగుతాడు భర్త పార్వతి చిలకమ్మ చెప్పిన విషయాన్ని భక్తాతో చెప్పి, అక్కడ వ్రతం దగ్గర కూడా పద్మావతి మీద విక్కి అరవడం గురించి చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందండి అని చెప్తుంది మీరు ఇప్పటికైనా దానిని అర్థం చేసుకోండి మనమే ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలి అని ఏడుస్తుంది పార్వతి. అదంతా విని భక్త షాక్ అవుతాడు.

పద్మావతి మీద అరిచిన విక్కీ..
పద్మావతి అరవింద కోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్లు గుడికి వెళ్లి చాలాసేపు అయింది ఇంకా రాలేదు అని అంటుంది కుచల అప్పుడే ఆర్య వచ్చేసారు అక్క వాళ్ళు అని అంటాడు వెంటనే అరవింద్ ను చూసి విక్కీ ఏమైంది అక్క చేతికి అని అడుగుతాడు. అరవింద ఏం సమాధానం చెప్పకుండా ఉండేసరికి పద్మావతిని అడుగుతారు పద్మావతి యాక్సిడెంట్ తప్పించుకున్నారు చేతికి చిన్న గాయం మాత్రమే అయింది అని చెప్తుంది వెంటనే విక్కీకి చాలా కోపం వస్తుంది. ఏంటి చిన్న గాయం అయిందా యాక్సిడెంట్ అవ్వపోయిందా అంత తేలిగ్గా మాట్లాడుతున్నావ్ ఏంటి పద్మావతి అని అంటాడు. మా అక్కకి యాక్సిడెంట్ అయితే నేను ఎంత బాధ పడతానో నీకు తెలుసు కదా అయినా కానీ చాలా తెలివిగా సమాధానం చెబుతున్నావు నీకు అసలు బాధ్యత అనేది ఉంటే కదా, ఈ లోగా అరవింద అది కాదు విక్కీ అని చెప్పబోతుంటే అక్క నువ్వే మాట్లాడకు అని విక్కీ పద్మావతి తో గొడవ పడుతూ ఉంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను పద్మావతి మా అక్కని జాగ్రత్తగా చూసుకోవాలని అయినా మాటల్లో చెప్పినంత మాత్రాన బాధ్యత రాదు చేతల్లో కూడా చూపించాలి.వెంటనే కుచ్చులు కూడా ఎప్పుడూ ఏదో ఒకటి చేయడం మాత్రమే అలవాటు ఈ పద్మావతికి అని అంటుంది. పద్మావతి ఏడుస్తూ ఉంటుంది ఇక అరవింద ఒకసారిగా విక్కీ అని అరుస్తుంది. విక్కీ పద్మావతి తో గొడవపడడం ఆపి అక్కా నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోయినా నన్ను కన్న తల్లి లాగా పెంచావు అలాంటిది ఈ చేతులతో నన్ను నడిపించావు. ఇప్పుడు నీ చేతికి గాయం అయితే అది చూసి నేను ఎలా తట్టుకోవాలి అక్క అని అంటాడు. నేను చేతికి గాయం అయితేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు అలాంటిది నాకు ఏమన్నా జరిగి ఉంటే ఏమయ్యేది అని అంటుంది. అలాంటి మాటలు మాట్లాడకు అక్క అంటాడు వెంటనే అరవిందా ఇవాళ నేను ఈ మాత్రం బాగున్నానంటే కారణం పద్మావతి అమ్మ జన్మనిస్తే పద్మావతి పునర్జన్మని ఇచ్చింది అని జరిగిన విషయం మొత్తం వికీ చెప్తుంది అరవింద. పద్మావతి కాపాడింది అని అరవింద విక్కీతో చెప్పగా విక్కీ షాక్ అవుతాడు. వెంటనే పద్మావతి వైపు చూస్తాడు.

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి ఏడుస్తూ ఉండగా విక్కీ అక్క చేతికి గాయం చూసి అలా మాట్లాడాను అని అనగా పద్మావతి మీ అక్క చేతికి గాయం చూసి నా మనసు బాధ పెట్టారు అంతే కదా అని అంటుంది. అది కాదు పద్మావతి అని విక్కీ చెప్పబోతుండగా మీరేం చెప్పకండి నేనేం వినాలి అనుకోవట్లేదు ఇకమీదట నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు శాశ్వతంగా మీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను రేపు ఉదయాన్నే మా పుట్టింటికి వెళ్తాను మీకు నాకు సంబంధం లేదని ఇంట్లో చెప్పేస్తాను అని అంటుంది.