Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి విక్కీ తన ప్రేమని అర్థం చేసుకోవట్లేదు అని తన ప్రేమ తెలపడానికి ఒక లెటర్ ని రాస్తుంది. ఆ లెటర్ అరవింద చూస్తుంది. పద్మావతి వికీకి రాసిన లెటర్ ని అరవింద పూర్తిగా చదువుతుంది. ఆ లెటర్ ని బట్టి పద్మావతి, వికీ తనతో టైం స్పెండ్ చేయట్లేదు అని ఫీల్ అవుతుంది అని అనుకుంటుంది. అరవింద విక్కీకి పద్మావతి తో ప్రేమగా ఉండమని చెప్తుంది. విక్కీ అరవింద కు నేను ఇలానే ఉంటాను అని చెప్తాడు.
Nuvvu Nenu Prema:విక్కీ కోసం పద్మావతి చేసిన ప్రయత్నం.. ఇప్పటివరకు తెలియని నిజం అరవిందకు తెలియనుందా?

ఇక ఈరోజు 466 వ ఎపిసోడ్ లో, విక్కీ అరవింద చెప్పిన మాటని లెక్కచేయకుండా ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. అరవింద పద్మావతి దగ్గరికి వస్తుంది మీరు కూడా బిజీ అయిపోవడానికి పనిలో పడ్డారా అని అడుగుతుంది. మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు కదా వదినా అని అంటుంది పద్మావతి. మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు కానీ పని కల్పించుకొని మరి చేయాలి కదా మీరు అని అంటుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు అని అంటుంది పద్మావతి. మా విక్కి మీతో టైం స్పెండ్ చేయట్లేదని మీరు అనుకుంటున్నారు కదా అని అంటుంది. పద్మావతికి ఎలా తెలిసింది అని అరవింద్ కు ఆలోచిస్తూ ఉంటుంది. అవును పద్మావతి మీరు మా విక్కీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ మావికి మీతో ఎక్కువసేపు గడపట్లేదని మీరు ఫీల్ అవుతున్నారు కదా అని అంటుంది అరవింద.

పద్మావతి కి సలహా ఇచ్చినా అరవింద..
పద్మావతి మీరు విక్కీని చాలా ప్రేమిస్తారు ఆ విషయం నాకు తెలుసు అని అంటుంది అరవింద. చిన్నతనం నుండి వాడు ఇలానే ఉండేవాడు కాదు మా అమ్మ ఉన్నప్పుడు, మా అమ్మ అంటే చాలా ప్రేమగా ఉండేవాడు నాతో కూడా గొడవ పడేవాడు, మా అమ్మ చనిపోయిన తర్వాత వాడు పూర్తిగా మారిపోయాడు అప్పటినుండి నేనే వాడికి అమ్మాయి పెంచుతూ వచ్చాను. చిన్నతనంలో కూడా వాడు ఎక్కువ నాతో గొడవ పడేవాడు. అలాగని వాడికి నేనంటే ప్రేమ లేదని కాదు ఎక్కడ కోపం ఉంటుందో అక్కడ ప్రేమ కచ్చితంగా ఉంటుంది. మా విక్కీకి మీరంటే కూడా చాలా ప్రేమ, కాకపోతే దాన్ని బయటికి చూపించట్లేదు ఎక్కువగా అని అంటుంది అరవింద. అరవింద్ చెప్పే మాటలు పద్మావతి ఆలకిస్తూ ఉంటుంది. చూడు పద్మావతి నువ్వు ఇలానే విక్కీ తో ఉంటే మీరిద్దరూ ప్రేమగా ఉండడానికి, కుదరదు మా వికీ ఎప్పుడు ఆఫీసు అని తిరుగుతూ ఉంటాడు అందుకే మీరు వేరే రూట్ లో వెళ్లి మీరు ప్రేమ పొందాలి. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా అని అంటుంది అరవింద, అర్థమైంది అన్నట్లుగా పద్మావతి తల ఊపుతుంది. మీరు స్ట్రైట్ రూట్ లో కాకుండా వాడి రూట్ లోనే వెళ్లి వాడిని మార్చాలి అని అంటుంది అరవింద సరే అంటుంది పద్మావతి.
BrahmaMudi November 11 Episode 251: కావ్య ప్లాన్లో బోల్తా పడ్డ అపర్ణ.. రాజ్ కి ఫ్లయింగ్ కిస్..

పద్మావతి కొత్తవేషం..
ఇక అరవింద చెప్పి వెళ్లిపోయిన తర్వాత పద్మావతి ఆలోచిస్తూ అంటే నేను ఎప్పటిలాగా నా ప్రేమని దక్కించుకోవడానికి ఆయనతో గొడవ పడితే కుదరదు. మనం కూడా ఆయనలానే రివర్స్ అయితే ఆయనే మందారలోకి వస్తాడన్నమాట అయితే ఇవాల్టి నుంచి పద్మావతి కొత్తవేషం వేస్తుంది. ఇక రెచ్చిపో పద్మావతి అని తనకి దాని అనుకొని, విక్కీ వచ్చేసరికి రూమ్ దగ్గర నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇలా కాదులే కానీ ఇంకొంచెం డోస్ పెంచాలి టెంపరడి మనసులో ఉన్న ప్రేమ బయటకు రావాలి అని అంటుంది పద్మావతి. అప్పుడే విక్కీ ఆఫీస్ నుంచి వస్తూ ఉంటాడు. బాగా అలసిపోయినట్టు కనిపిస్తూ ఉంటాడు ఇక వెంటనే పద్మావతి వస్తున్నాడు అనుకోని మంచం వెనకాల దాచుకుంటుంది. షూ కూడా తీయకుండా అంతే పడుకుంటాడు. పద్మావతి వెంటనే వికీ పడుకున్నాడు అనుకోని షూ తీయకుండా పడుకున్నాడు ఏంటి అని షూ తీస్తూ ఉంటుంది. విక్కీకి మెలకువ వచ్చి ఎవరు అని చూస్తాడు. ఎవరు నువ్వు బయటికి వెళ్ళు నా పర్మిషన్ తీసుకోకుండా లోపలికి ఎవరు రమ్మన్నారు నిన్ను అని అంటే,నేనే సారూ అని అంటుంది పద్మావతి. ఎవరు అని అంటాడు విక్కీ నేనే సారూ మీ భార్యామణిని అని అంటుంది. పద్మావతి ముసుగు వేసుకొని చీర విక్కి తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి అవతారం అని అంటాడు అసలు సిసలైన భార్యామణి అవతారం అని అంటుంది పద్మావతి. పతివ్రత శిరోమనులందరూ ఇలానే ఉంటారు అని అంటుంది. మీరంటే నాకు ప్రేమ భక్తి అన్ని ఉన్నాయి కదా అందుకని, వాళ్ళ అడుగుజాడల్లో నడుద్దాం అని, ఇలాంటి గెటప్ వేశాను అని అంటుంది పద్మావతి నిన్ను నీలా ఉంటేనే భరించడం కష్టం ఇక వేరే వాళ్ళు ఇలా ఉంటే అరిటేషన్ నా వల్ల కాదు ముందు గెటప్ తీసేసేయ్ అని అంటాడు. అలా అనకండి సారు ఇకమీదట నేను ఇలానే ఉండి మీ సేవ చేసుకుందామనుకుంటున్నాను అని అంటుంది. ముందు మీరు కూర్చోండి అని అంటుంది. విక్కీని కూర్చోమని చెప్పి షూస్ తీస్తూ ఉంటుంది విక్కీ షో నువ్వు తీసేది ఏంటి నేను తీసుకోలేనా అని షూస్ తీసి కింద పడేస్తాడు.ముందు ఈ డ్రామాలన్నీ ఆపేసే పద్మావతి అని అంటాడు.నేను ప్రశాంతంగా ఉందామని వచ్చాను.నువ్వసలు మనశాంతి లేకుండా చేస్తున్నావ్ అని అంటాడు విక్కీ. నేనేం చేశాను అని అంటుంది. ఇలాంటి ఓవరాక్షన్లు చేసి ఇప్పటిదాకా నువ్వు వాడి నాటకాలు చాలవా ఏంటి మళ్లీ కొత్త నాటకం ఆడుతున్నావ్ అని అంటాడు. మీ టవలు నైట్ డ్రెస్సు పెట్టాను.భోజనం కూడా ఇక్కడికే తీసుకు రమ్మంటారా స్వామి అని అంటుంది. గో టు హెల్ అని పెద్దగా అరుస్తాడు. ఈ కోపంతోనే నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఆ ప్రేమని బయటికి తీస్తాను స్వామి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
Krishna Mukunda Murari: క్రిష్ణ కోసం మురారి పోరాటం.. భవాని మాస్టర్ ప్లాన్..

అరవింద కు థాంక్స్ చెప్పిన పద్మావతి..
ఇక అరవింద పూలు మాల కడుతూ ఉంటే అనువచ్చి మీకెందుకు వదిన ఆశ్రమ మేమున్నాం కదా అని అంటుంది. కడుపుతో ఉన్నాను కదా అని నా చేత ఏ పని చేయించకుండా నువ్వు పద్మావతి ఇలా చేస్తే ఎలాగో నేను పూలే కదా మాల కడుతుంది అని అంటుంది అరవింద్ అప్పుడే అక్కడికి పద్మావతి వచ్చి థాంక్స్ వదినా అని గట్టిగా హగ్ చేసుకుంటుంది. పొద్దున్నే ఏమైంది పద్మావతి ఇంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది అరవింద మీరు చాలా మంచి వారు వదిన నన్ను వికీ ని కలపడానికి మీరిచ్చిన సలహా చాలా బాగా ఉపయోగపడింది అయినా మీ తమ్ముడు ఎప్పుడు ఎలా ఉంటారు అని నాకు చెప్పడం, ఎదుటివారిని వాళ్ళు ఏ బాధలో ఉన్నారు తెలుసుకొని వాళ్లకు సలహా ఇచ్చి వాళ్ళు ఆనందంగా ఉండడానికి సహకరించే మీ మనసు నాకు బాగా నచ్చింది వదిన అందుకే మేము ఎప్పుడూ ఇంటిని అత్తిల్లు అని అనుకోలేదు ఇది మా పుట్టిల్లు అనే భావించాము అని అంటుంది అప్పుడే అక్కడికి కుర్చీలో వస్తుంది పొద్దున పొద్దున్నే ఈ డామేజ్ సారీ గర్ల్స్ ఏంటి అరవింద తో ఏదో మాట్లాడుతున్నట్టు ఉన్నారు అని అనుకుంటుంది. వికీ విషయంలో నేను చెప్పిన సలహాని పద్మావతి పాటించినట్టు ఉంది అందుకే తన ఇంత ఆనందంగా ఉంది అని అనుకుంటుంది అరవింద. ఆనందంలో మరీ నన్ను ఎక్కువ పొగిడేస్తున్న నేను చేసింది ఏం లేదు ఏదో నాకు అనిపించింది చెప్పాను అంతే అని అంటుంది అరవింద. కుచల ఏం చెప్పింది అబ్బా అని అనుకుంటుంది. నా సమస్యకి పరిష్కారమే లేదని బాధపడుతున్న టైంలో మీరు దేవతలా వచ్చి నా సమస్యకు పరిష్కారాన్ని చూపించారు చాలా చాలా థాంక్స్ వదినా మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని అంటుంది. అసలీ పద్మాదేం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు ఈ పద్మావతికి పిచ్చి కూడా ఉందా ఏంటి పిక్చర్స్ అది తీసుకెళ్తే గాని దీని సంగతి తెలియదు అని మనసులో అనుకుంటుంది కుచల. అనుకొని కాఫీ తాగగానే కాఫీ కాలుతుంది పద్మావతిని చూస్తేనే కాలుతుంది అన్నమాట అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నా తమ్ముళ్లు ఇద్దరినీ చూసుకోవడానికి మీరు ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది అరవింద.
విక్కీకి బొట్టు పెట్టిన పద్మావతి..
ఇక మళ్లీ పద్మావతి స్వామి అనుకుంటూ రూమ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. విక్కీ కూడా కావాలని పద్మావతిని ఏమిటి దేవి అని అంటాడు. ఏంటి మీరు నన్ను దేవి అన్నారా? దీంతో నా జన్మ ధన్యం అయిపోయింది సామి, ఇప్పటినుండి మీరు నన్ను అట్లా అని పిలవండి అని అంటుంది. ఎందుకు నన్ను ఇరిటేట్ చేస్తున్నావ్ పద్మావతి అని అంటాడు విక్కీ. నేనేం చేసినా మీకోసం మీ ప్రేమ కోసమే కదా అని అంటుంది పద్మావతి. ముందు హారతి తీసుకోండి అని అంటుంది. కొత్తగా ఇదేంటి అంటాడు విక్కీ. ఈరోజు మంచి రోజు సారు భర్త కోసం ఉపవాసం ఉంటే మంచిదట అందుకే మీ సంతోషం కన్నా నాకు ఏది ముఖ్యం కాదు అందుకే మీకోసం ఈ పూజ చేసి ఉపవాసం ఉందామనుకుంటున్నాను హారతి తీసుకోండి అని అంటుంది. ఉండండి దేవుడి బొట్టు కూడా పెడతాను అని అంటుంది. అవసరం లేదు నీ చేత్తో బొట్టు పెట్టించుకోవడం నాకు ఇష్టం లేదు అంటాడు. ఇప్పుడు ఏంది సారు నా చేత బొట్టు పెట్టించుకోవడం మీకు ఇష్టం లేదు అంతే కదా అని అంటుంది. అవును అని చెప్పేసి షూ వేసుకుంటూ ఆఫీస్ కి రెడీ అవుతూ ఉంటాడు. పద్మావతి విక్కీ దగ్గరికి వచ్చి, సారు అని పిలుస్తుంది. ఏంటి అని అంటాడు వికీ పద్మావతి వికీ నుదుటి మీద తన నుదురిని ఆనించి బొట్టు పెడుతుంది. విఖీ షాక్ అవుతాడు.అంతే పద్మావతిని చూస్తూ ఉండిపోతాడు. పద్మావతి నామీద ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు సారు బయటకు చెప్పకుండా అలానే మనసులో పెట్టుకున్నారు అని విక్కీ కళ్ళల్లోకి చూస్తూ అనుకుంటుంది. చెప్పాను కదా నీకు ఇష్టం లేదని ఎందుకు పెట్టావ్ అని అంటాడు. మీరు చేత్తో పెట్టద్దు అని చెప్పారు కానీ, ఇలా పెట్టొద్దు అని చెప్పలేదు కదా అని అంటుంది. నువ్వేం చేసినా సైలెంట్ గా ఉంటున్నానని నీ మీద ఇష్టంతో కాదు మా అక్క కోసం మా అక్క కోసమే నిన్ను భరిస్తున్నాను. అని అంటాడు విక్కీ భరించే వాడే భర్త సారు, అయినా నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడుతున్నాను ప్రేమతో అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అని అంటుంది. అయ్యో మర్చిపోయాను నన్ను ఆశీర్వదించండి అని కాల మీద పడుతుంది. పద్మావతి ముందు నువ్వులే నాకు ఆఫీస్ కి టైం అయింది అని అంటాడు మీరు ఆశీర్వదిస్తేనే నేను లేస్తాను అని అంటుంది. సరే ఆశీర్వదించాను లే లే అని అంటాడు మీరు ఆశీర్వదించలేదు సారు అని అంటుంది పద్మావతి. నాకు దగ్గర అవ్వాలని ట్రై చేయకు అని అంటాడు. సారు సాయంత్రం పెద్దలాడి రండి నేను మీ ఆశీర్వాదం తీసుకొని ఉపవాసం విరిమిస్తాను లేదంటే నేను ఫస్టే ఉండాల్సి వస్తుంది అని అంటుంది. ఏంటి ఇది కొత్త నాటకమా అయినా ఆఫీసులో నాకు చాలా పనులు ఉంటాయి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మీరు వస్తారు సార్ నాకు తెలుసు కదా వచ్చేలా నేను చేస్తాను కదా అని పద్మావతి అనుకుంటుంది.

విక్కీ కోసం పద్మావతి ఎదురుచూపులు..
ఇక నైట్ అందరూ డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. విక్కీ ఆఫీస్ నుంచి ఇంకా రాలేదని పద్మావతి ఎదురు చూస్తూ ఉంటుంది. ఉదయం పద్మావతివిక్కీ తో ఆఫీస్ కి వెళ్లేటప్పుడు తొందరగా రండి అని చెప్తుంది దాని కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. కుశల ఈరోజు కూడా ఇవే ఐటమ్స్ ఆ అని అంటుంది. ఒకరికి ఇద్దరు ఉన్నారు కదా ఏమైనా వెరైటీ డిష్ లు తయారు చేయొచ్చు కదా అని అంటుంది. ఎప్పుడు మీ మొహాలు లాగానే ముద్దుపప్పు చెడ్డన్నవేనా అని అంటుంది. పిన్ని ఈరోజు అను పద్మావతి ఇద్దరూ ఉపవాసం ఉన్నారు. వాళ్ళిద్దరూ, మా తమ్ముళ్ళ కోసం పూజ చేశారు. వాళ్లు మాని ఇంటి కోడలు అవ్వడం మన అదృష్టం అని అంటుంది అరవింద. ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటుంది పద్మావతి. ఆర్యతో ఈ ఉపవాసం విరమించాలంటే అను ముందుగా నువ్వు తనకి ఒక ముద్ద పెట్టి ఉపాసన నుండి విరమించాలి అని అంటుంది.
రేపటి ఎపిసోడ్ లో, వికీ నిద్రపోతూ మధ్యలో లేస్తాడు, పద్మావతి విక్కీ నే చూస్తూ అక్కడే ఉంటుంది. ఏంటి పద్మావతి ఇక్కడే ఉన్నావ్ అని అంటాడు. ఏమైంది సారు అలా లేచారు ఏమన్నా పీడకల వచ్చిందా ఏంటి? ఉండండి దిష్టి తీస్తాను అని అంటుంది. నేను అసలు నిన్ను భార్యగానే ఒప్పుకోకపోతే నువ్వు ఎందుకు నా గురించి ఇంత ఆలోచిస్తావు అని అంటాడు విక్కీ. మంచం మీద నుండి కిందకి లేవబోతూ కింద ఆయిల్ ఉండేసరికి కింద పడతాడు. ఇక్కడెవరు ఆయిల్ వేసింది అని అరుస్తాడు విక్కీ.