Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతికి అరవింద సలహా ఇస్తుంది. విక్కీని మార్చుకోవడానికి, నువ్వు తనతో రివర్స్లో వెళితేనే పని అవుతుంది అని చెప్పింది. పద్మావతి కూడా సరే అని అంటుంది. విక్కీ కోసం పద్మావతి గెటప్ మార్చి, విక్కీని తన దారిలోకి తెచ్చుకోవాలి అనుకుంటుంది. పద్మావతి వేసిన వేషం చూసి విక్కీ కోప్పడతాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర వెయ్యమాకు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను మీరు తిరిగి ఇంటికి సాయంత్రం వచ్చే వరకు నేను ఉపవాసం విరమించను అని అంటుంది. అలాంటివన్నీ పెట్టుకోమాకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆఫీస్కి విక్కి.

ఈరోజు467 వ ఎపిసోడ్ లో, డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని విక్కీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అను కూడా ఉపవాసం ఉంటుంది అరవింద ఆర్యాతో అనుకి భోజనం పెట్టి ఉపవాసం విరమింప చేయి అని అంటుంది. ఆర్య అలాగే అని అనుకి భోజనం పెడతాడు అను ఉపవాసం నుండి విరమిస్తుంది. ఇక అరవింద అనుతో నువ్వు కూడా మీ వారికి భోజనం పెట్టొచ్చు అని అంటుంది. ఆర్య కూడా అనుకి భోజనం పెడతాడు. వాళ్ళిద్దరిని చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అరవింద పద్మావతిని మీరు కూడా భోజనం చేయండి అని అంటుంది. లేదు వదిన ఆయన వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటాను అని అంటుంది. విక్కీ వచ్చేసరికి లేట్ అవుతుందేమో పద్మావతి అని ఇంట్లో వాళ్ళందరూ కన్విన్స్ చేసి తినమంటారు. అయినా పద్మావతి మాత్రం లేదు ఆయన వచ్చిన తర్వాతే తింటాను అని చెప్తుంది.
Nuvvu Nenu Prema: పద్మావతికి అరవింద సలహా.. విక్కీ కోసం పద్మావతి ఇలాంటి వేషం వేసిందా?

విక్కీ కి ఫోన్ చేసినా అరవింద..
పద్మావతిని చూసి అరవింద చాలా ఫీల్ అవుతుంది. నేనే తనకి ఈ పూజ చేయమని చెప్పాను. ఇప్పుడు విక్కీ వచ్చేవరకు తను ఎదురు చూస్తూ ఉంటుంది ఉదయం నుంచి ఏమీ తినలేదు, ఇప్పుడు ఎలాగా అని ఆలోచించి అరవింద అసలు విక్కీ ఎంత టైం పడుతుందో రావడానికి కనుక్కుందామని ఫోన్ చేస్తుంది. విక్కీ ఫోన్ లిఫ్ట్ చేసి నేను మీటింగ్ కి వెళ్తున్నాను అక్క ఇప్పుడు ఇంటికి రాలేను అని చెప్తాడు. మీటింగ్ తర్వాత అయినా పెట్టుకోవచ్చు నువ్వు ఇంటికి ముందు వచ్చేసేయ్ అని అంటుంది అరవింద. నువ్వు నా గురించి కంగారు పడకక్క నేను ఇంటికి వస్తాను ఇప్పుడు మీటింగ్ కు వెళ్తున్నాను అని అంటాడు నేను ఎదురు చూడటం లేదు నీకోసం మీ అర్ధాంగి ఎదురు చూస్తుంది అని అంటుంది అరవింద. తను ఈరోజు ఉపవాసం ఉంది నీకోసం నువ్వు వచ్చి తనకి భోజనం పెడితే తను ఆ ఉపవాసం నుండి విరమిస్తుంది అందుకే నీకోసం ఎదురు చూస్తుంది నువ్వు త్వరగా వచ్చేసే విక్కీ అని అంటుంది అరవింద. అరవింద చెప్పిన తర్వాత విక్కీకి ఉదయం జరిగినవన్నీ గుర్తొస్తాయి. పద్మావతి మీరు త్వరగా వచ్చేసేయండి నేను ఉపవాసం చేస్తున్నాను మీకోసం అని చెప్తుంది. అది విక్కీకి గుర్తొచ్చి నేను ఇప్పుడు రావడం కుదరదు తనని భోజనం చేయమని చెప్పు అని అంటాడు. అలా కాదు విక్కీ మీటింగ్ తర్వాత అయినా పెట్టుకోవచ్చు అని అరవిందా అనే లోపే సరే అక్క ఉంటాను అని పెట్టేస్తాడు. అరవింద ఫోన్ పెట్టేసిన తర్వాత పద్మావతి తో తను రావడానికి లేట్ అవుతుంది మీరు భోజనం చేసేయండి అని అంటుంది. లేదు నేను తనకోసం ఎదురు చూస్తాను అని అంటుంది పద్మావతి కుచల వెంటనే అయితే తను లేట్ నైట్ వచ్చాడు అనుకో అప్పటిదాకా ఉంటావా అని అంటుంది. ఉంటాను అని అంటుంది పద్మావతి. అబ్బో అని అంటుంది కుచల. ఇక అరవింద సరే పద్మావతి మీరు విక్కీ రాగానే భోజనం చేసేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది అందరూ డైనింగ్ టేబుల్ నుంచి వెళ్ళిపోతారు పద్మావతి ఒక్కతే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని విక్కీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

ఉపవాసం విరమణ..
పద్మావతి చాలాసేపు విక్కీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురుగా ఉన్న భోజనాలు చూస్తూ ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది. శ్రీనివాస ఐ అబ్బి ఇంకా రాడేంటి నాకేమో ఒకవైపు ఆకలేస్తుంది ఈ ఐటమ్స్ అన్ని చూస్తుంటే నేను ఆగలేక పోతున్నాను అని అంటుంది. ప్రతిసారి చేయి భోజనం దాకా వెళ్లి వెనక్కి తీసుకుంటూ ఉంటుంది. చాలాసేపటి తర్వాత పద్మావతికి బాగా ఆకలి వేస్తుంది. కొంచెం ప్రసాదం తిన్నట్టుగా భోజనం చేద్దాము అని దేవుడికి దండం పెట్టుకొని కొంచెం తిందాము అనుకొని స్టార్ట్ చేస్తుంది. ఇక అంతే మొత్తం భోజనం కంప్లీట్ గా తినేస్తుంది. నేను మా వారు వచ్చేదాకా ఆగి తన ఆశీర్వాదం తీసుకొని తిందాము అని అనుకున్నాను కానీ కొంచెం ప్రసాదంగా తిందాం అనుకుంటే మొత్తం తినేసానా అని ఫీల్ అవుతుంది. సరే ఇంక ఇప్పుడు ఏం చేస్తాం తినేసాను కదా శ్రీనివాస ఈ సారి నన్ను మన్నించు అని అనుకుంటుంది అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు. వామ్మో ఇప్పుడే వచ్చాడు ఏంటి అని అనుకుంటుంది పద్మావతి. విక్కీ కారు ట్రబుల్ రావడంతో, చాలాసేపు రోడ్డు మీదే కారు కోసం ఎదురుచూసి ఎవరు రాకపోవడంతో వికీ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని, ఇంటికి తిరిగి వచ్చేస్తాడు.

కళ్ళు తిరిగి పడిపోయిన విక్కీ..
ఇక పద్మావతి డైనింగ్ టేబుల్ దగ్గర నించొని ఉండడాన్ని చూసి విక్కీ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు. పద్మావతి నీకు ఎన్నిసార్లు చెప్పాను. నాకోసం ఎదురు చూడొద్దని అయినా ఈ కొత్త డ్రామాలు ఏంటి నేను తినేసామని చెప్పాను కదా అక్క నీతో చెప్పలేదా అని అరుస్తాడు. పద్మావతి శ్రీనివాస నామీద నీకు ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా పగ తీర్చుకుంటావా తండ్రి. నేను ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. సరేగాని ఇంక నాకు బాగా ఆకలిగా ఉంది భోజనం పెట్టు అని అంటాడు విక్కీ. పద్మావతి ఒక్కసారిగా ఆ మాటకు షాక్ అవుతుంది. విక్కీ భోజనం పెట్టమంటున్నాడు చూస్తే ఒక్క ఐటెం కూడా ఉండదు అంతా తనే తినేసి ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలి అని డైనింగ్ టేబుల్ దగ్గర అడ్డంగా నిల్చుని ఉంటుంది. ఏంటి భోజనం పెట్టమంటుంటే నీకు కాదా ఇదేంటి ఇక్కడే నిలబడి ఉన్నావు నేనే పెట్టుకుంటానులే తప్పుకో అని విక్కీ ఏ భోజనం పెట్టుకుంటామని కూర్చుంటాడు. చూస్తే ఒక్కదానిలో కూడా ఒక్క ఐటెం కూడా ఉండదు అన్ని గిన్నెలు ఖాళీగా ఉంటాయి. వాట్ ఇస్ దిస్ అని అడుగుతాడు పద్మావతిని. పద్మావతి సారు మీరు రావడం లేట్ నైట్ అవుతుంది అని చెప్పేసరికి నేను బాగా ఆకలి వేసి తినేసాను ఇప్పుడే మీకు వేడివేడిగా భోజనం చేసి పెడదామని అనుకుంటున్నాను అని అంటుంది. ఏం అవసరం లేదు నేను ఆర్డర్ పెట్టుకుంటాను అని అంటాడు విక్కీ. లేదు సారీ అది వచ్చేలోపు నేను వేడివేడిగా మీకోసం భోజనం చేసి తీసుకు వస్తాను అని లోపలికి వెళ్తుంది. పద్మావతి అప్పటికప్పుడు అన్నం వండి, విక్కీ కోసం కర్రీ చేస్తూ ఉంటుంది. విక్కీకి అప్పటికే బాగా ఆకలి వేసి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. పద్మావతి భోజనం చేసి తీసుకువచ్చేసరికి విక్కీ కాలు తిరిగి పడిపోయి ఉంటాడు.

విక్కీని కాపాడిన పద్మావతి.
ఇక విక్కీ అలా కళ్ళు తిరిగి పడిపోవడం చూసి పద్మావతి కంగారు పడుతుంది. విక్కీని లేపడానికి చాలా ట్రై చేస్తుంది కానీ విక్కీ కళ్ళు తెరవడు పద్మావతికి భయం వేసి ఇంట్లో ఉన్న అందరిని పిలుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అరవింద ఏమైంది పద్మావతి అని అడుగుతుంది నేను భోజనం తీసుకువచ్చేసరికి ఇలా పడిపోయి ఉన్నారు అని చెప్తుంది ఇక అందరూ విక్కీని లేపడానికి ట్రై చేస్తారు కానీ విక్కీ మాత్రం అస్సలు లేవడు. పద్మావతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అరవింద కంగారుగా ముందు మొహం మీద నీళ్లు చల్లండి అని అంటుంది. అయినా గాని వికీ లేవడు. ఇక వెంటనే అరవిందా కంగారుగా డాక్టర్ దగ్గర తీసుకువెళ్దాం ముందు డాక్టర్ కి ఫోన్ చెయ్ ఆర్య అని అంటుంది. కుశల ఈ పద్మావతిని అనాలి అసలు తనే మా విక్కి ఇలా అవడానికి కారణం. తను ఫోన్ చేసి రమ్మని ఉంటుంది తను ఆఫీస్ టెన్షన్ లో కంగారుగా వచ్చేసాడు అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి మా విక్కిని ఇలా కంగారు పెట్టొద్దని అని అంటుంది. వెంటనే, నారాయణ నువ్వు కాసేపు ఆపుతావా అని అంటాడు. అందరూ నన్ను అనేవాళ్లే ఆ పద్మావతి వల్లే మా విక్కి ఇలా అయిపోయాడు అంటే ఎవరు నమ్మరు అని అంటుంది. ఆర్య అమ్మాను కాసే పరవకుండా ఉండు అసలే విక్కీకి బాలేదని అందరూ టెన్షన్ గా ఉంటే నువ్వు మధ్యలో పద్మావతి గురించి తెస్తావ్ ఏంటి అని అంటాడు. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి పద్మావతి ఒక నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్లి బెల్లం తీసుకొని వస్తుంది. బెల్లం కొంచెం కొంచెం గా విక్కీ నోట్లో పెట్టమని అరవిందాకు చెప్తుంది అరవింద అలానే చేస్తుంది. విక్కీ కొంతసేపటికి కళ్ళు తెరుస్తాడు. తనకి షుగర్ ఉంది కదా వదినా షుగర్ లెవెల్స్ డౌన్ అయి ఉంటాయి అందుకనే ఇలా చేశాను అని అంటుంది పద్మావతి. ఇక భోజనం పెడతారు విక్కీకి విక్కీ నాకొద్దు అని అంటాడు లేదు కొంచెం తినాల్సిందే అని బలవంతంగా పద్మావతి నోట్లో పెడుతుంది విక్కీ రెండు ముద్దలు తినేసిన తర్వాత ఇక నేను వెళ్లి పడుకుంటాను అని అంటాడు నారాయణ టాబ్లెట్స్ ఎక్కడున్నాయి అని అడుగుతాడు నేను వెళ్లి వేసుకుంటాలే బాబాయ్ అని చెప్తాడు విక్కీ. ఇక అరవింద పద్మావతి కలిసి విక్కీని రూమ్ కి తీసుకొని వెళ్తారు రూమ్లో విక్కీని వదిలిపెట్టి అరవింద్ చాలా బాధపడుతుంది. అరవింద్ ను చూసి విక్కీ నా గురించి ఎక్కువ ఆలోచించొద్దు అక్క నాకేం కాలేదు నేను చాలా బాగున్నాను చూడు అని అంటాడు. కంగారు పడొద్దు అని ఎలా చెప్తావ్ విక్కీ నీ ఆరోగ్యం చూస్తుంటే నాకు భయమేస్తుంది అని అంటుంది అరవింద. ఏం పర్లేదు అక్క నేను బానే ఉన్నాను నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అని అంటాడు. అరవింద వెళ్తూ వెళ్తూ పద్మావతి తో విక్కిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి ఏదైనా అవసరమైతే నన్ను పిలవండి అని చెప్తుంది. పద్మావతి సరే అంటుంది.

రేపటి ఎపిసోడ్లో పద్మావతి విక్కీకి నిద్ర పోవడానికి పాట పాడుతూ ఉంటుంది. విక్కీ ఇష్టం లేనట్టుగా ఫేస్ పెట్టి అయినా తను పాట పాడడంతో నిద్రలోకి జారుకుంటాడు. పద్మావతి వికీ పక్కనే మంచం దగ్గర కూర్చొని విక్కీని చూస్తూ తను కూడా అంతే నిద్రపోతుంది.