Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి విక్కీకి రాత్రంతా కూర్చొని సేవలు చేస్తుంది. విక్కీకి బాగాలేదని విక్కీ కోసం అరవింద కంగారు పడుతుంటే పద్మావతి నేను చూసుకుంటాను అని మాట ఇస్తుంది. విక్కీ లేవగానే పద్మావతిని నానా మాటలు అంటాడు. నాకోసం నువ్వు నటించాల్సిన అవసరం లేదు అని అంటాడు. పద్మావతి ఆ మాటలకు చాలా ఫీల్ అవుతుంది. ఆ మాటలే ఆలోచిస్తూ కుచల దగ్గర తిట్లు తింటుంది. అరవింద విక్కీకి పద్మావతి తో సఖ్యతగా ఉండమని చెప్తుంది.

Nuvvu Nenu Prema:పద్మావతి ప్రేమని విక్కీ అర్థం చేసుకొనున్నాడా? అరవింద కు తెలిసిన మరో నిజం..?
ఈరోజు 469 వ ఎపిసోడ్ లో, పద్మావతి, విక్కీ కోసంచాలా కష్టపడి రాత్రంతా మెలకువగా ఉండి, విక్కీ కోసమే ఉదయం కూడా కాఫీ పెట్టుకుని తీసుకొస్తుంది. అప్పుడే అరవింద విక్కీకి పద్మావతి తో సఖ్యతగా ఉండమని చెప్పి వెళ్తూ, పద్మావతి కి ఎదురై, మీరు పెట్టిన కాపీ కోసమే అక్కడ మావికి ఎదురు చూస్తున్నాడు తొందరగా తీసుకెళ్లండి అని అంటుంది. పద్మావతి అలాగే వదిన అని విక్కీ దగ్గరకు వెళుతుంది. విక్కీ నాకోసం రాత్రంతా కష్టపడ్డావా అని అడుగుతాడు. అవునండి అని అంటుంది పద్మావతి. మీరు హెల్త్ బాగా లేకపోతే నాకు ఒక మాట చెప్పండి అని అంటుంది. మీకోసం నేను ఏదైనా చేస్తాను అని అంటుంది. నిజంగానా అని అంటాడు విక్కీ నటిస్తూ, అవునండి మీకోసం నేను ఏదైనా చేస్తాను మీకు బాగా లేదని రాత్రంతా మీకోసమే మేల్కొని ఉన్నాను. ఇప్పుడైనా మీకేం కావాలో చెప్పండి అని అంటుంది పద్మావతి ముందు ఈ టాబ్లెట్ వేసుకొని కాఫీ తాగండి అని అంటుంది. ఇదంతా దూరం నుంచి అరవింద గమనిస్తూ ఉంటుంది.

విక్కీ నటన..
పద్మావతి అంతా చెప్పిన తర్వాత విక్కీ నా కోసం నువ్వు అంత చేసావా, అసలు నీకు ఒక విషయం తెలుసా నాకు రాత్రి ఏమీ కాలేదు అని అంటాడు. మీరేం మాట్లాడుతున్నారండి అని అంటుంది పద్మావతి అవును పద్మావతి నువ్వు విన్నది నిజమే రాత్రంతా నాకేం కాలేదు నేను కావాలనే నటించాను అని అంటాడు. నటించడం ఏంటండి అని అంటుంది పద్మావతి. అరవింద కూడా దూరం నుంచి విక్కీ అన్న మాటలు విని షాక్ అవుతుంది. అవును పద్మావతి నటించాను రాత్రి అసలు నాకు ఏమీ కాలేదు నాకు బాగా లేకపోతే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని అలా నటించాను అని అంటాడు. ఆ మాటలకు పద్మావతి షాక్ అవుతుంది నిజంగానా అని అడుగుతుంది నిజంగా చెప్తున్నా పద్మావతి నాకు ఇప్పుడేం కాలేదని టాబ్లెట్ కింద పడేస్తాడు. నువ్వు నిన్న నా ముందు నటించావు కదా ఏమి చదువుకొని నువ్వే అంత బాగా నటిస్తే బిజినెస్ మాన్ ని నేను ఎంత బాగా నటించాలి అందుకే ఇలా నటించాను ఇప్పుడు లెక్క సరిపోయింది గా అని అంటాడు. ఆ మాటలకి అరవింద కూడా షాక్ అవుతుంది. ఇకమీదటైనా నాతో జాగ్రత్తగా ఉండి పద్మావతి నువ్వు నటిస్తే ఇలానే ఉంటుంది నా నుంచి రియాక్షన్ అని అంటాడు విక్కీ. ఈపాటికి నీకు అర్థం అయి ఉండాలి అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. పద్మావతి విక్కీ వెళ్లిన తర్వాత శ్రీనివాస్ అనే నేను ఆయనకి దగ్గర అవుదాం అనుకుంటే ఇలా జరుగుతుంది ఏంటి, నా ప్రేమలో ఏ లోపం ఉంది స్వామి ఇకనైనా నా భర్త మారేటట్టు చూడు అని దండం పెట్టుకుంటుంది అదంతా అరవింద చూస్తుంది.

తమ్ముడికి చిన్నతనం గుర్తు చేసిన అరవింద..
విక్కీని అరవిందా చేయి పట్టుకొని రూమ్ లోకి తీసుకు వెళుతుంది ఏంటి అక్క ఏమైంది ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటాడు అరవింద కు చాలా కోపంగా ఉన్న ఏమీ మాట్లాడకుండా ఒక ఫోటో తీసి విక్కీ చేతిలో పెడుతుంది. ఆ ఫోటో చిన్నతనంలో విక్కీ అరవింద ఫోటో నే, ఆ ఫోటో చూడగానే విక్కీ గతం గుర్తొస్తుంది. నేను ఎలా మర్చిపోతాను అక్క అని అంటాడు. అమ్మ గుర్తుగా మన దగ్గర ఉండాలని మనం ఇల్లు వదిలి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం అని అంటుంది అరవింద.. పొరపాటులో నేను చూసుకోకుండా కింద పడేసాను అప్పుడే పగిలింది అని అంటాడు. అబద్ధం చెప్పిన అతికినట్లు ఉండాలి వీక్కి అర్థం పగిలినట్టు ఉండకూడదు అని అంటుంది. నేను అబద్ధం చెప్పడం ఏంటి అక్క నేనే కదా ఈ ఫోటో పగల కొట్టింది చిన్నతనంలో అని అంటాడు. నువ్వు అబద్దం చెప్తే నాకు తెలిసిపోతుంది విక్కీ. అబద్ధం కూడా అతికినట్టు చెప్పాలన్నది అందుకే అని అంటుంది అరవింద. ఈ అద్దం పగలకొట్టింది ఈ ఫోటోని పొరపాటున నేనే కదా విక్కీ అమ్మ నన్ను ఏమైనా అంటుందని నువ్వు పగలగొట్టినట్టుగా ఇంట్లో వాళ్లకు చెప్పావు, అదేం లేదక్కా నేనే పగలగొట్టాను అని అంటాడు నాకు తెలుసు విక్కీ నాకు ఇంకా గుర్తుంది అని అంటుంది అరవింద. ఇప్పుడు కూడా నేను బాధపడకూడదు అని చెప్తున్నావా అని అంటుంది అరవింద.

విక్కీకి సూక్తులు చెప్పిన అరవింద..
అరవింద విక్కీ ని అద్దం ముందుకు తీసుకువెళ్లి అద్దంలో విక్కిరి చూపిస్తూ ఈ అద్దంలో ఉన్న, నా తమ్ముడు విక్కీ కి ప్రేమ ఎక్కువ, అవతలి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడడానికి ఏదైనా చేస్తాడు. అసలు అబద్ధాలు చెప్పడు. తను తప్పు చేయకపోయినా తానే చేశానని తన మీద నేరం వేసుకుంటాడు ఇంట్లో వాళ్ల కోసం, అందుకే కదా ఇందాక నువ్వు పద్మావతి తో అబద్ధం చెప్పావు. నాటకం ఆడాను అని అబద్ధం చెప్పావు కదా నిజంగానే నీకు బాగాలేదు, కానీ నువ్వు అబద్దం చెప్పావు పద్మావతి దగ్గర అబద్ధం ఎందుకు చెప్పావు విక్కి. నీ కంట్లో నలుసు పడితే పద్మావతి కంట్లో నీళ్లు వస్తాయి నువ్వు చాలా ప్రేమిస్తున్నావు తనని తను కూడా నిన్ను అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తుంది ఇద్దరు వ్యక్తులు కలిసిన తర్వాతే స్నేహం పెరిగి బంధం ఏర్పడుతుంది మీ మధ్య జన్మ జన్మల బంధం ఉంది కాబట్టే కలవగలిగారు ఒకటి కాగలిగారు, ఇది కాదనలేని సత్యం ఇదే దైవ నిర్ణయమ్. పద్మావతి నీ మీద చూపించే ప్రేమతో తను ఎక్కడ బాధ పడుతుందో అని నువ్వు అబద్దం చెప్పావ్, దీనిబట్టే చెప్పొచ్చు కదా పద్మావతి అంటే నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో, ఈ రీజన్ చాలదా అని అంటుంది అరవింద. అది ఎంతలా అంటే నీకు నువ్వే మర్చిపోయి తనని ప్రేమిస్తున్నావు. ఇప్పటికీ తనని ఆరాధిస్తున్న తెలుసా ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నూతనని ఇంతలా ప్రేమిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరవింద వెళ్లిపోయిన తర్వాత విక్కీ అదే అద్దంలో చూసుకుంటూ తనని తాను ఆలోచించుకుంటూ ఉంటాడు.

భక్త పద్మావతి ఇంటికి రాక..
పద్మావతి విక్కీ అన్నమాటలే ఆలోచిస్తూ ఉంటుంది. తను ఇంకా నిజంగానే బాగోలేదని నేను రాత్రంతా చాలా కంగారు పడ్డాను అది నటనని తెలిసి ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని పద్మావతి ఆలోచిస్తూ నేను ఎలా విక్కీతో సఖ్యతగా ఉండాలో అని అనుకుంటూ ఉంటుంది. తనతో కలిసి నేను సంతోషంగా ఉండడానికి ఒక దారి చూపించే శ్రీనివాస అని దండం పెట్టుకుంటుంది అప్పుడే అక్కడికి భక్తా వస్తాడు. వాళ్ల నాన్నని చూడగానే పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. అందరూ బాగున్నారు అని అంటాడు భక్త. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ బత్తాన్ని పలకరిస్తూ ఉంటారు అరవింద కోసం భర్త పిండి వంటలు చేసి తీసుకొచ్చి ఇస్తాడు. నీకోసమే నమ్మ అని అంటాడు ఇప్పుడు నాకోసం ఎందుకు అని అంటుంది ఏమైందమ్మా నువ్వు నా పిల్లల్ని ఇంత బాగా చూసుకుంటున్నావు నీకోసం నేను పిండి వంటలు చేసి తీసుకురాలేమా అని అంటాడు. వాళ్లకి చేతనైంది అదే కదా అని అంటుంది కుచల. ఇలాంటి మాయ మాటలు చెప్పే కదా వాళ్ళిద్దరూ కూతుర్లని మన నెత్తిన పెట్టాడు అని అంటుంది. కుచల. నారాయణ నువ్వు కాసేపు నోరు మూస్తావా అని అంటాడు. పార్వతి రాలేదని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. తను ఊరికి వెళ్ళింది అని చెప్తాడు భక్త. ఓహో అందుకే మీరు వచ్చింది అయితే ఇక మా ఇంట్లోనే ఉంటారా ఆవిడొచ్చేదాకా అని అంటుంది కుచల. నిన్ను కాసే పరవకుండా ఉండమన్నానా అని అంటాడు నారాయణ. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పలేదు అని అంటాడు నారాయణ. పెళ్లయిన తర్వాత ఒడి బియ్యం పోయలేదు ఇంతవరకు వాళ్లకి మీరు వాళ్ళని మా ఇంటికి పంపిస్తే ఒడి బియ్యం పోసి మళ్ళీ రెండు రోజుల్లో దిగబెడతాను. మీ అనుమతి కోసమే వచ్చాను అని అంటాడు నారాయణ. తప్పకుండా పంపిస్తాము అని అంటాడు నారాయణ. అరవింద కూడా చాలా సంతోషంగా ఉంది మా వాళ్ళందరూ వస్తారు కచ్చితంగా అని అంటుంది. కుచల ఏమంటుందో అని భక్త కుచల వైపు చూస్తూ ఉంటాడు.బావగారు నేను చెప్పిన తర్వాత కాదనే హక్కు అధికారం ఎవరికీ లేవు మీరే కంగారు పడకండి అని అంటాడు. అంటే ఇక్కడ మాట్లాడే అధికారం కూడా లేదా నాకు అని అంటుంది కుచల. మాట్లాడే హక్కు నీకు ఇవ్వకూడదే అని అంటాడు నారాయణ. ఇక భక్త నేను వెళ్లొస్తానమ్మ రేపు పిల్లల్ని పంపించండి అని అంటాడు. సరే అని పద్మావతి అను ఇద్దరూ వాళ్ల పుట్టింటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు.

రేపటి ఎపిసోడ్లో పద్మావతి బ్యాగ్ సద్ది ఈ జిప్పు పట్టడం లేదు అని బ్యాగ్ మీద కూర్చొని జిప్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు. ఏం చేస్తున్నావ్ నువ్వు అని అంటాడు ఈ బ్యాగ్ కి జిప్పు పట్టట్లేదు సారు కరెక్ట్ టైం కి వచ్చారు కాస్త సహాయం చేయండి అని అంటుంది. విక్కీ పద్మావతికి హెల్ప్ చేస్తూ ఉంటే పద్మావతి అంతే విక్కీ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది విక్కీ కూడా పద్మావతి కళ్ళల్లోకి చూస్తాడు.