Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి, విక్కీకి బాగా లేనందుకు సేవలు చేస్తుంది. కావాలని విక్కీ తనకి బాగా లేనట్టు నటించాడని చెప్తాడు. ఆ మాటలకి పద్మావతి షాక్ అవుతుంది. ఈ మాటలన్నీ విన్న అరవింద కూడా విక్కీ అబద్ధం చెప్తున్నాడని అర్థం చేసుకుంటుంది. విక్కీ తో అరవింద నువ్వు పద్మావతికి అబద్ధం చెప్పావని నాకు అర్థమైంది నీకు నిజంగానే బాగాలేదు కానీ పద్మావతి తో ఎందుకు అబద్దం చెప్పావు, నువ్వు పద్మావతిని చాలా ప్రేమిస్తున్నావు ఆ విషయం నాకు అర్థం అవుతుంది. కానీ నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు విక్కీ అని చెప్తుంది. నువ్వు చెప్పిన మాటలకు పద్మావతి చాలా బాధపడి ఉంటుంది ఇక మీదట తనని బాధ పెట్టకు అని చెప్తుంది అరవింద.

ఈరోజు470 ఎపిసోడ్ లో, పద్మావతి, అను లను పుట్టింటికి పంపించమని అరవిందా కుచల నారాయణ లను అడగడానికి భక్తా వస్తాడు. నారాయణ సరే పంపిస్తాము అని అంటాడు ఇక పద్మావతి పుట్టింటికి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది. బ్యాగ్ సర్దుకుంటూ ఉండగా విక్కీ రూమ్ లోకి వస్తాడు. ఏంటి తెగ కష్టపడుతున్నావ్ అని అడుగుతాడు బ్యాగ్ లో చాలా బట్టలు పెట్టేసి జిప్ వేయడం కుదరక పద్మావతి అవస్థలు పడుతూ ఉంటుంది. సమయానికి వచ్చారు సార్ నాకు కొంచెం హెల్ప్ చేయండి అని అంటుంది పద్మావతి వికీ నీకు నేను ఎందుకు హెల్ప్ చేయాలి అని అంటాడు ఈ జిప్పు పట్టట్లేదు కొంచెం హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ గా అడుగుతుంది. విక్కీ సరే అని పద్మావతికి హెల్ప్ చేసి ఆ బ్యాగ్ కి జిప్పు వేస్తాడు పద్మావతి అప్పటిదాకా బ్యాగు మీదే కూర్చొని ఉంటుంది ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు. పద్మావతి జిప్పు పట్టినందుకు బ్యాగ్ మీద నుండి లేస్తుంది. వెంటనే విక్కీ హే ఇది నా బ్యాగ్ నువ్వేంటి బట్టలు సర్దుకున్నావ్ అని అంటాడు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను నా పర్మిషన్ లేకుండా నా బ్యాగ్ ఎందుకు తీసావు? ఏంటి ఇదంతా అని అడుగుతాడు విక్కీ.

పద్మావతి రిక్వెస్ట్..
విక్కీ చాలాసార్లు పద్మావతిని ఎందుకు బట్టల సద్దావో చెప్పలేదు అని అంటాడు. పద్మావతి సరే మా నాయన వచ్చి మనల్ని ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళాడు అని అంటుంది పద్మావతి. వాట్ అని అంటాడు విక్కీ. అవును సార్ ఒడి బియ్యం పోయడానికి మా నాయన మనల్ని పుట్టింటికి రమ్మన్నాడు ఒడిబియ్యం పోస్తే చాలా మంచిదంట అని అంటుంది పద్మావతి. నేను ఎక్కడికి రాను మీ ఇంటికి అసలే రాను అని అంటాడు విక్కీ. అలా అనమాకండి సారు మనం వెళ్లకపోతే మా నాయన చాలా బాధపడతాడు. ఈసారికి నాతో మా ఇంటికి రండి మనం వడి బియ్యం పోసుకున్న తర్వాత మళ్లీ తిరిగి వచ్చేద్దాము మా నాయన చాలా సార్లు చెప్పాడు మనిద్దరికీ బట్టలు పెట్టి పంపించేస్తారు మళ్ళీ వచ్చేదాము అని అంటుంది. అందుకోసమే మీ బట్టలు నా బట్టలు కలిపి ఒకే బ్యాగ్ లో పెట్టాను అని అంటుంది పద్మావతి. నేను రానని చెప్పాను కదా పద్మావతి ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా అయినా ఎన్నిసార్లు చెప్పినా నన్ను విసిగించడమే పనిగా పెట్టుకున్నావు అని అంటాడు విక్కీ. అలా కాదు సారు నా మాట వినండి అని అంటుంది పద్మావతి. విక్కీ ఒకసారి గట్టిగా సెటప్ అని అరుస్తాడు.

విక్కీ కోపం.. కుచల అసహనం..
ఇక పద్మావతి ఎంత రిక్వెస్ట్ చేసినా విక్కీ మాత్రం పుట్టింటికి రావడానికి ఒప్పుకోడు. నువ్వు నన్ను ఎంతలా ఇబ్బంది పెట్టినా నేను మాత్రం నీ మాట వినను అని అంటాడు విక్కీ. ఇక కింద పద్మావతి వికీలకు మళ్లీ పెళ్లి చేసే అంత కార్యక్రమం చేయడానికి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ రెడీ చేస్తూ ఉంటారు. అంతా ఏర్పాట్లు పూర్తయిన తర్వాత అను ఆర్య మాత్రమే కిందకి వస్తారు. అరవింద వాళ్ళిద్దరూ ఏరి మీరే వచ్చారు అని అడుగుతుంది. వాళ్లు రెడీ అయి వస్తా అన్నారు అని చెప్తుంది అను. చాలాసేపు వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ పద్మావతి వికీ ఇద్దరు కిందకి రారు. పైన వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఇక కుచల ఈ కార్యక్రమం ఏదో అను, ఆర్యా చేత చేయిస్తే సరిపోతుంది ముందు మొదలు పెడదాము అని అంటుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి రావాలి ఎప్పుడూ ఏదో ఒక గొడవలు పద్మావతి విక్కీని విసిగించడానికి ఉంది కదా అని అంటుంది. కుచల ఇక ఎంతసేపు ఎదురు చూస్తామో, వీళ్ళు మాత్రం వచ్చేలా లేరు అని అంటుంది. మిగిలిన ఏర్పాట్లు మీరు చేస్తూ ఉండండి నేను వెళ్లి వాళ్ళని పిలుచుకొస్తాను అని అరవిందే విక్కీ రూమ్ కి బయలుదేరుతుంది.

గుండె బద్దలయ్యే నిజం తెలుసుకున్న అరవింద..
ఇక అరవింద విక్కీ రూమ్ దగ్గరికి వెళ్లి బయటే నుంచొని ఉంటుంది. అరవింద వచ్చిన విషయం పద్మావతి విక్కి ఇద్దరూ చూసుకోరు. పద్మావతి తో విక్కీ గొడవ పడుతూ ఉంటాడు. మీరు ఎలా అనకండి సారు కింద మన కోసం వేరే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు దాని గురించి మీకు అసలు చెప్పడమే మర్చిపోయాను అని అంటుంది పద్మావతి. ఏంటది అని అడుగుతాడు విక్కీ. మన్నా తులాభారం రోజు మీరు నాకు పసుపు తాడు వేశారు కదా ఈ పసుపుతో పుట్టింటికి వెళ్ళకూడదని మీ చేత మళ్ళీ తాళి కట్టించడానికి కింద ఏర్పాట్లు చేశారు అని అంటుంది పద్మావతి. అసలు మీరు ఏమనుకుంటున్నారు పద్మావతి నా గురించి ఏమీ ఆలోచించరా మీకు మీరు నిర్ణయం తీసుకొని కింద ఏర్పాటు చేసేసి రమ్మంటే నేనెలా వస్తాను అని అంటాడు విక్కీ. అరవింద అమ్మమ్మ గారు కలిసి ఏర్పాట్లు చేశారు ఇలా వెళ్ళకూడదు అని, మీరు కోప్పడకండి సారు మనం కిందకి వెళ్లి ఆ కార్యక్రమం చూసుకొని మా పుట్టింటికి వెళ్లి వద్దాము అని అంటుంది పద్మావతి. వెంటనే విక్కీ చాలా కోపంతో షట్ అప్ అని గట్టిగా అరుస్తాడు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పద్మావతి మనిద్దరం కలవడం అన్నది జరగదు. అసలు నేను నిన్ను భార్యగానే ఒప్పుకోలేదు మన మధ్య జరిగింది పెళ్లి కాదు ఒప్పందం ప్రకారం చేసుకున్న దానికి ఇదంతా ఏంటి అని గట్టిగా అరుస్తాడు. ఆ మాట విని పద్మావతి షాక్ అవుతుంది వెంటనే అక్కడే ఉన్న అరవింద కూడా విక్కీ చెప్పిన మాటలు విని షాక్ అవుతుంది. అరవింద కు ఏమీ అర్థం కాదు. విక్కీ అరవింద్ ని చూసుకోకుండా పద్మావతి తో కంటిన్యూగా గొడవ పడుతూనే ఉంటాడు. మనిద్దరిది ఒప్పందం ప్రకారం చేసుకున్న పెళ్లి ఒప్పందం అయిపోగానే నువ్వు మీ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది ఆ మాత్రం దానికి మళ్లీ నా జాతతాళి కట్టించుకోవడం ఏంటి మీ పుట్టింటికి వెళ్లడం ఏంటి అని అంటాడు విక్కీ తర్వాత నువ్వు ఎవరో నేనెవరో అని అంటాడు విక్కీ. పద్మావతి ఏడుస్తూ అక్కడే నిలబడి ఉంటుంది. వెంటనే అరవింద విక్కీ అని పెద్దగా అరుస్తుంది. నిజం అరవింద కి తెలిసిపోయిందని ఇద్దరికీ అర్థమవుతుంది.
Nuvvu Nenu Prema:పద్మావతి ప్రేమని విక్కీ అర్థం చేసుకొనున్నాడా? అరవింద కు తెలిసిన మరో నిజం..?

చావడమే మేలు అన్న అరవింద..
విక్కీ మాటలు విని అరవింద చాలా కోపంతో ఆవేశంగా, విక్కీ దగ్గరికి వచ్చి, ఏం మాట్లాడుతున్నావ్ విక్కీ? మీ మధ్య జరిగింది పెళ్లి కాదా ఒప్పందమా అని అడుగుతుంది. ఒప్పందం ప్రకారం మీరు పెళ్లి చేసుకున్నారా అని అంటుంది. వెంటనే కళ్ళు తిరిగి కింద పడబోతుంది. విక్కీ పద్మావతిని పట్టుకోడానికి ప్రయత్నిస్తే వద్దు ముట్టుకోవద్దు నన్ను అని అంటుంది. ఈ మాట విని నేను ఎందుకు బ్రతికున్నాను దీనికన్నా చావడమే మేలు అని అంటుంది. అలా మాట్లాడకు అక్క అని అంటాడు విక్కి. అసలేం జరిగిందో చెప్పండి అని అంటుంది అరవింద. నువ్వే ఎమోషనల్ అవ్వకు అక్క అని అంటాడు విక్కీ. గుండె పగిలే నిజం తెలుసుకున్నాక ప్రశాంతంగా ఎలా ఉంటాను. ఇక నాకు చావే వస్తుంది మీ మాట విన్న తర్వాత అని అంటుంది అరవింద. మీ ఇద్దరి గురించి నేను ఎన్నో కలలు కన్నాను మీరిద్దరూ కలిసి ఉంటే చూద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీరిద్దరూ కలిసి నాటకం ఆడారని తెలిస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు నువ్వు నన్ను కాదు మన అమ్మని కూడా మోసం చేశావు అని అంటుంది అరవింద. ఒకసారి నేను చెప్పేది వినక అని అంటాడు విక్కీ. మీ మాటలు విన్నాను కాబట్టే కదా, మీరు నన్ను మోసం చేశారని అర్థమైంది అని అంటుంది అరవింద. పద్మావతి కూడా ఏదో మాట్లాడబోతుంటే మిమ్మల్ని కూడా ఎంతో నమ్మాను కదా పద్మావతి మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేశారా అని అంటుంది. ఇప్పటికైనా నిజం చెప్పండి అని అడుగుతుంది. ఒప్పందం ప్రకారం చేసుకున్న పెళ్లయితే ఎవరి కోసం ఈ పెళ్లి చేసుకున్నారో నిజం తెలియాల్సిందే అని అంటుంది అరవింద. ఇంట్లో అందరినీ నమ్మించి మోసం చేశారు ఎందుకు అని అడుగుతుంది. నిజం చెప్తే నువ్వు బతకలేవు అక్క అని మనసులో అనుకుంటాడు విక్కి. నీ భర్త దీని అందరికి కారణమని తెలిస్తే మీరు తట్టుకోలేరు మేడం ఇది నిజం మీకు ఎప్పటికీ తెలియకపోవడమే మంచిది. అని పద్మావతి కూడా మనసులో అనుకుంటుంది. ఇందాక నుంచి అడుగుతుంటే ఇద్దరు సైలెంట్ గా ఉంటారు ఏంటి అని అరవింద మళ్లీ ఇద్దరిని గట్టిగా అడుగుతుంది.

అరవింద ఆవేదన..
ఇక విక్కీ పద్మావతి, విక్కీ ఇద్దరినీ గట్టిగా నిలదీస్తూ ఉంటుంది అరవింద. మీరిద్దరూ ఒప్పందం ప్రకారం పెళ్లి చేసుకుంటే, ఆ నిజాన్ని దాచి పెట్టాల్సిన పని ఏముంది. నిజం చెప్పొచ్చు కదా అని అంటుంది అరవింద. అయినా మీరు చేసిన పని మీకు కరెక్ట్ అయ్యుండొచ్చు కానీ మీరు ఒప్పందం ప్రకారం పెళ్లి చేసుకున్నారనే విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఏమైపోతారు. నానమ్మకి ఈ విషయం తెలిస్తే అల్లాడిపోతుంది ఇక మీ నాన్నకు తెలిస్తే బతకగలరా అని అంటుంది అరవింద. ఇద్దరు సైలెంట్ గా ఉంటారు. మీరు చేసిన పనికి రెండు కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతాయి. మీరు ఎంత తప్పు చేశారో మీకు అర్థం అవుతుందా అని అంటుంది. రెండు కుటుంబాలు సర్వనాశనం అయ్యే పని చేశారు మీరు అని అంటుంది. అప్పుడు మీకు సంతోషంగా ఉంటుందా అని అంటుంది. మీ ఇద్దరూ చేసిన తప్పుకి, మన రెండు కుటుంబాలు బలవడానికి నేను అస్సలు ఒప్పుకోను అని అంటుంది. అసలు మీరిద్దరూ ఇలా ఎందుకు చేశారు నాకిప్పుడే తెలిసి తీరాలి. అరవింద ఎంత అడిగినా పద్మావతి వికీ సైలెంట్ గానే ఉంటారు. ఇప్పుడు గనక మీరు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని తన తల మీద చెయ్యి పెట్టుకుంటుంది అరవింద. శ్రీనివాస్ ఎందుకు అబ్బాయిలా చేస్తున్నావు మేము ఎవరికోసమైతే ఇంత బాధ భరిస్తున్నామో ఇప్పుడు ఆవిడకే ఈ బాధ తెలిస్తే ఎలా తట్టుకుంటుంది. అని పద్మావతి మనసులో అనుకుంటుంది. విక్కీ కూడా నిన్ను దూరం చేసుకుని నేను బతకలేను అక్క నిజం నీకు ఎప్పటికీ చెప్పలేను అని అనుకుంటాడు.
రేపటి ఎపిసోడ్ లో, అరవింద విక్కీ పద్మావతులతో,చూడండి మీ పెళ్లి అనుకోని పరిస్థితుల్లో జరిగిన దైవసాక్షిగా జరిగింది ఒకసారి మెడలో తాళి పడిన తర్వాత దానికి విలువ ఇవ్వాల్సిందే లేదంటే ఆ తాళి బంధానికి విలువ ఉండదు. మీ భార్యాభర్తల బంధం ఎప్పటికీ ఇలానే ఉండాలి. అలాగని నాకు మాట ఇవ్వండి అని అంటుంది అరవింద చేసేదేం లేక విక్కీ అరవింద చేతిలో చేయి వేసి మాట ఇస్తాడు.పద్మావతి సంతోషిస్తుంది.