Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో,అరవింద్ అను హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. ఆమె తిన్న ఫుడ్ లో పాయిజన్ కలిసింది అని డాక్టర్ చెప్తారు. ఆమె పద్మావతి చేసిన చలివిడి తినడం వల్లే ఇదంతా జరిగిందని కుటుంబ సభ్యులు భావిస్తారు. పద్మావతిని కుచల, విక్కీ హాస్పటల్లో అవమానించి బయటికి వెళ్లిపోమంటారు.

ఈరోజు445 వ ఎపిసోడ్ లో,పద్మావతిదేవుని గుడి దగ్గరికి వచ్చి అరవింద కోసం మొక్కుకుంటుంది. తల్లి నాకేదైనా పర్వాలేదు కానీ మా వదిన తన కడుపులో బిడ్డ క్షేమంగా బయటపడాలి. నేనేదో చేయడం వల్లే ఇలా జరిగిందని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు.కానీ అరవింద్ గారికి నేను ఏ రోజు ఏ కీడు చేయ్యాలి అనుకోలేదు. పద్మావతి ఒకవైపు దండం పెట్టుకుంటూ ఉంటే అరవింద హాస్పిటల్ లో డాక్టర్స్ చెక్ చేస్తూ ఉంటారు తన పల్స్ రేట్ పడిపోతూ ఉంటుంది.
Nuvvu Nenu Prema:కనకాంబరం రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న ‘పద్మావతి’ ఇలా చుస్తే ఫాన్స్ కు పండగే..

పద్మావతి మొక్కు..
పద్మావతి దేవుడి దగ్గర ఉన్న కర్పూరం చూసి తన చేతిలో వెలిగించుకొని మెట్ల మీద మోకాళ్ళతో అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది. అలానే చేతిలో కర్పూరం వెలిగించుకొని మోకాళ్ళ మీద నడుస్తూ రవీంద్ర కోసం అరవింద కడుపులో బిడ్డ కోసం అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది.అమ్మలగన్నా అమ్మవి అని అందరూ అంటారు కదమ్మా నిన్ను మరి అమ్మ కావాలని ఆశ పడుతున్న మా వదినని మాత్రమే ఎందుకు ఆదిలోనే అంతం చేయాలని చూస్తున్నావు. నువ్వు కూడా అమ్మ వే కదా అమ్మ మా వదిన తన కడుపులో ఉన్న వాళ్ళ అమ్మ కోసం ఎంత ఆరాటపడుతుంది, నీకెందుకు అదంతా కనిపించట్లేదు తల్లి. ఎవరికి ఏ కష్టం వచ్చినా అది తనకే వచ్చినట్టు భావిస్తుంది. చీమకి కూడా హాని తలిపెట్టని మంచి మనసు తనది,అలాంటి మంచి మనిషికి ఇలా బాధ పెట్టాలని ఎలా చూస్తున్నావు తల్లి తన కడుపులో ఉన్న బిడ్డకు ఏమన్నా అయితే, తను తట్టుకోలేదు నా కోసమైనా తన కడుపులో బిడ్డని కాపాడు తల్లీ. తనకు ఏమన్నా అయితే మా కుటుంబం మొత్తం అల్లాడిపోతుంది.జగన్మాత వై ఆ తల్లి బిడ్డల్ని కాపాడు తల్లి. ఆ తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండేలా చూడు అని మొక్కుకొని, కుంకుమ తీసుకొని అక్కడనుండి హాస్పిటల్ కి బయలుదేరుతుంది.

అరవింద అపాయం..
డాక్టర్లు అరవింద్ అని చెక్ చేసి, బయటికి వచ్చి విక్కీ మరియు కుటుంబ సభ్యులందరి ముందు సైలెంట్ గాని ఇంట్లోనే ఉంటారు. విక్కీ డాక్టర్ గారు ఏమైంది అని అడుగుతాడు. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అండి మీ అక్క మేము ఇచ్చే వైద్యానికి స్పందించాలంటే తన స్పృహలోకి రావాలి తను అసలు ఎంత ట్రై చేసినా సృహలోకి రావట్లేదు ఇదే కనక ఇంకో గంట కంటిన్యూ అయితే తల్లి బిడ్డ ఇద్దరికీ మేము నమ్మకం చెప్పలేము అని వికీతో డాక్టర్ గారు అంటారు. ఆ మాటలకి విక్కి ఒక్కసారిగా కుంగిపోతాడు. ఇంట్లో అందరూ ఏడుస్తూ ఉంటారు. ఇక మరోవైపు పద్మావతి అరవింద కోసం గుళ్లో పూజ చేయించుకొని ఆ కుంకుమ ని అరవిందకు పెట్టాలని చాలా తొందరగా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. ఇక డాక్టర్ గారు చెప్పిందానికి విక్కీ అంగీకరించడు మా అక్కకు అలా జరగడానికి వీల్లేదు అని అంటాడు. ప్లీజ్ డాక్టర్ అలా అనకండి మా రాణమ్మను కాపాడండి అని కృష్ణ కూడా నటించడం మొదలుపెడతాడు చావు కబురు కూడా ఇంత ఆనందంగా ఉంటుందని ఫస్ట్ టైం తెలుసుకున్నాను అని కృష్ణ మనసులో అనుకుంటాడు. ఎన్నాళ్ళకి నిన్ను అనుకున్నది జరుగుతుంది అనీ కృష్ణ మనసులో అనుకుంటాడు.

అరవింద ను చూసి కుటుంబ సభ్యుల బాధ..
డాక్టర్ గారు మేము దేవుళ్ళని కాము కదా మానవ ప్రయత్నం మేము చేస్తాము ఏదైనా మిరాకిల్ జరిగితేనే తన బతికేది, ఆ దేవుడి మీద భారం వేసి ధైర్యంగా ఉండండి అని అంటుంది. ఒకసారి మా అక్కని చూడ్డానికి ఒప్పుకోండి డాక్టర్ ఒకసారి చూసి వస్తాము అని విక్కీ డాక్టర్ ని బతిమిలాడతాడు విక్కీ అందరూ ని తీసుకొని డాక్టర్ చెప్పేది కూడా వినకుండా లోపలికి వెళ్తాడు. వాళ్ళ అక్కని చూసి చాలా బాధపడతాడు. అక్క ఒకసారి కళ్ళు తెరువు అక్క నేను వచ్చాను ఒకసారి చూడు అని విక్కీ అరవింద బెడ్డి దగ్గర నుంచి అని అరవింద్ అని లేపుతూ ఉంటాడు. అందరూ అరవింద్ అని పిలుస్తూ ఉంటారు నీకు నీ కడుపులో ఉన్న అమ్మకి నేనున్నానక్క మీకు ఏమీ కాదు అని అరవిందతో అంటూ ఉంటాడు విక్కి. నా ప్రాణం పోసిన మిమ్మల్ని కాపాడుకుంటాను ఒక్కసారి నా కోసం కళ్ళు తెరిచి చూడు అక్క అని బతిమిలాడుతూ ఉంటాడు. అమ్మ లేకపోతే అమ్మ లేని లోటు తీర్చావు ఇవాళ అలాంటిది నువ్వు నాకు దూరమైతే నేను ఎవరి కోసం బతకాలి అక్క అని ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు ఆ సీను అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళొద్దాకా నువ్వున్నావని నేను బతుకుతున్నాను. నువ్వు లేకపోతే నాకంటూ ఎవరున్నారు అక్క నేను ఎవరి కోసం బతకాలి అని ఏడుస్తూ ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడు అక్క అని అంటూ ఉంటాడు. నానమ్మ ఆర్య మీరైనా చెప్పండి రా అక్కని ఒకసారి లేవమని అని ఏడుస్తూ ఉంటే అందరూ ఏమీ కాదు అని విక్కీకి చెప్తూ ఉంటారు ఇంతలో డాక్టర్ గారు మీరందరూ బయటకు వెళ్ళండి దయచేసి ఇక్కడ ఎంతమంది ఉండకూడదు మీరు హోప్స్ ని కోల్పోవద్దు.డాక్టర్ ఆమె నా ప్రాణం తనని ఎంత ఖర్చైనా పర్వాలేదు కాపాడండి అని అంటాడు మేము కాపాడడానికి ప్రయత్నిస్తున్నాము ఒక గంట గడిస్తే గాని మేము ఏ విషయం చెప్పలేము మీరు బయటకు వెళ్ళండి అని అంటే నారాయణ పదవికి ఇక్కడ నుంచి వెళ్దాము అని అందరిని తీసుకొని వెళ్తాడు. బయటికి వచ్చి విక్కీ ఆర్యతో అక్క లేకపోతే నేను ఉండలేను అని అంటాడు.

పద్మావతి అవమానం..
ఇక అందరూ బాధపడుతూ ఉంటే పద్మావతి గుడి నుండి హాస్పిటల్ కి వస్తుంది. హాస్పిటల్లో పద్మావతిని చూసి కుచల మళ్లీ ఎందుకు వచ్చావు నీ కళ్ళు చల్లబడ్డాయా నువ్వు అనుకున్నది జరిగింది కదా అని మాట్లాడుతుంది. ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మా అందరి ముందుకు వచ్చావు. లేదండి అలా మాట్లాడొద్దు నేను అరవింద్ గారి కోసం గుడికి వెళ్లి ఈ కుంకుమ తీసుకొని వచ్చాను. ఇది కనక వదిన నుదుటిని పెడితే తప్పకుండా వాళ్ళు ఇద్దరు క్షేమంగా బయటపడతారు అది నా నమ్మకం అండి నన్ను నమ్మండి అని అరవింద దగ్గరికి వెళ్లాలనుకుంటుంది వెంటనే వికీ నువ్వు వెళ్లడానికి వీల్లేదు అని గట్టిగా అరుస్తాడు. సారు ఒకసారి నా మాట వినండి నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అంటుంది పద్మావతి నీ వల్లే మా అక్కకి పరిస్థితి వచ్చింది అలాంటిది నిన్న క్షమించాలి బయటికి వెళ్ళు అని అరుస్తాడు. కృష్ణ మనసులో ఒకే దెబ్బకు రెండు పెట్టాలంటే ఇదేనేమో అటు అరవింద చావు ఇటు వీళ్ళిద్దరి దూరం నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అని సంతోషిస్తాడు. సారీ అమ్మవారికి కుంకుమ నేను తన కోసమే తీసుకొచ్చాను ఇది ఒకే ఒక్కసారి తనకి పెట్టేసి వచ్చేస్తాను నన్ను నమ్మండి అని అంటుంది. విక్కీ అందుకు ఒప్పుకోడు అసలు నీ వల్లే నాకు మా అమ్మ పుట్టబోతుంది అన్న సంతోషం లేకుండా పోయింది నువ్వే దాని దూరం చేశావు ఇక్కడి నుంచి వెళ్లిపో నీమొహం చూడడం కూడా పాపమే అని అంటాడు.మీకు దండం పెడతాను సార్ మీ కాళ్లు పట్టుకుంటాను ఈ కుంకుమ అరవింద్ గారికి పెట్టండి అని ప్రాధేయపడుతుంది అయినా విక్కీ ఒప్పుకోడు ఇక ఇంట్లో వాళ్ళందరూ విక్కీని ఒకసారి అరవింద దగ్గరికి పద్మావతిని పంపించమని చెప్తారు. విక్కీ ఒప్పుకోడు, ఇక నారాయణ విక్కీ కోపంలో ఆవేశంలో బాధలు నువ్విలా మాట్లాడుతున్నావ్ కానీ ఒకసారి ప్రశాంతంగా ఆలోచించి చూడు పద్మావతికి అరవింద్ అంటే ఎంత ప్రేమ, నువ్వు ఎంత ప్రేమిస్తావో తను అంతే ప్రేమిస్తుంది ఒకసారి జరిగినవి గుర్తు చేసుకో,ఎక్కడో ఏదో జరిగింది నిజమేంటన్నది మనకు ఎవరికీ తెలియదు,నిలకడ మీద నిజం ఎప్పటికైనా తెలుస్తుంది అప్పటివరకు నువ్వు కొంచెం ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిది. విక్కీ ఒప్పుకున్న నేను మాత్రం ఒప్పుకోను అంటుంది కుచల. నారాయణ నువ్వు నోరు ముయ్, తనేదో దేవుడి కుంకుమ అరవించని కాపాడడానికి తీసుకొస్తే వద్దంటారు ఏంటి అని అంటాడు నారాయణ నువ్వు వెళ్ళమ్మా నువ్వు వెళ్లి అరవింద కుంకుమ పెట్టు అని అంటాడు.

పద్మావతి ప్రయత్నం..
ఇక నారాయణ చెప్పినా కూడా విక్కీ వద్దని అంటాడు వెంటనే ఆర్య అరే నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా అమ్మ మళ్లీ భూమి మీదకు రావడం నీకు ఇష్టం లేదా అక్క అంటే నీకు ప్రేమ లేదా అలాంటప్పుడు ఎందుకు పద్మావతిని వద్దని వాదిస్తున్నావు.పద్మావతి మన అక్క కోసమే కదా గుడికి వెళ్లి పూజ చేసి కుంకుమ తీసుకొచ్చింది ఏమో డాక్టర్స్ దేవుడి మీద భారం వేయమన్నప్పుడు మనం మాత్రం పద్మావతిని దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన కుంకం ని వద్దని చెప్పడం ఎంత వారకు కరెక్టు అని ఆర్య అంటాడు. ఇక నారాయణ నువ్వు ఒకసారి శాంతంగా ఉండు అని అంటాడు విక్కీ అక్క బతకాల నాకు ఉంది కానీ ఈ పద్మావతి అక్కని చూడడం నాకు ఇష్టం లేదు అని అంటాడు అలా అనొద్దు ఒకే ఒక్కసారి తనని పంపించు ఏమో ఇంత మంది ఉండి ఏమి చేయలేకపోయాం పద్మావతి కుంకుమ ఏదైనా మిరాకిల్ చేస్తుందేమో, తనకు దేవుడి దయ వల్ల తను మొక్కిన మొక్కులు అమ్మవారు కరుణిస్తుందేమో అని నారాయణ అంటాడు.ఒప్పుకుంటాడు విక్కీ పద్మావతి లోపలికి వెళ్లి అరవింద్ దగ్గరకు వెళ్లి వదిన మీకు ఏమీ కాదు నేను వచ్చేసాను మీ కడుపులో ఉన్న బిడ్డ కూడా ఏమీ కాదు నేను అమ్మవారి దగ్గరికి వెళ్లి కుంకుమ తీసుకొచ్చాను మీకోసమే అని కుంకుమ అరవింద్ అని పెట్టిన పెడుతుంది ఇక మనసులో కృష్ణ ఎవరు ఎంత ప్రయత్నం చేసినా అరవింద చావడం ఖాయం అని అనుకుంటాడు.
రేపటి ఎపిసోడ్ లో నేను ఇప్పుడు ఏ తప్పు చేశాను అని అంటుంది పద్మావతి. చేయాల్సిన తప్పు ఎప్పుడో చేశావు అని అంటాడు. మీ దృష్టిలో నేను చేయకూడని తప్పు అదేనా, నన్ను మోసం చేయాలని చూసినా మీ బావదే తప్పు, మీరు చూసిందే నిజమైన తిరిగి తీసుకున్న మీరు ఇంకో తప్పు, ఒకవేళ నేనే తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తే నా ప్రాణాలనైనా వదిలేస్తాను అని అంటుంది పద్మావతి.