Nuvvu nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, విక్కీఅను ఆర్యాల చేత సంతకాలు తీసుకుంటాడు. అది చూసి పద్మావతి విడాకులు పేపర్స్ మీద వాళ్ళ అక్క బావ సంతకం చేశారు అనుకొని, విక్కీ తో ఇంట్లో అందరి ముందు గొడవ పడుతూ ఉంటుంది.

Nuvvu Nenu Prema today Episode 19 september 2023 episode 419 highlights
ఈరోజు 419 ఎపిసోడ్ లో,పద్మావతి అనుతో నువ్వు సంతకం పెట్టొద్దు అక్క అని అంటుంది. ఏమైంది పద్మావతి నీకు విక్కీ నిర్ణయాన్ని ఎందుకు కాదంటున్నావు అని అంటుంది అరవింద. మీ అందరికీ నా బాధ ఎందుకు అర్థం కావట్లేదు అని అంటుంది పద్మావతి. నువ్వు చేస్తుందే మాకు అసలు అర్థం కావట్లేదు అంటుంది శాంతాదేవి. బావగారు మీరు చేస్తున్న పనికి మీరు జీవితాంతం బాధపడాలి మీకు ఆ విషయం తెలుసా అని అంటుం
Nuvvu Nenu Prema: అను, ఆర్యాలకు విడాకులు? పద్మావతి ఏం చేయనుంది?

పద్మావతిని ద్వేషించడం..
ఏమైంది పద్మావతి నీకసలు అని ఇంట్లో అందరూ అడుగుతూ ఉంటారు అప్పుడే కుచల మీకు అసలు అర్థం కావట్లేదు నేను చెప్పమంటారా అని అంటుంది. ఇప్పుడు దాకా ఆస్తి లేదు కాబట్టి, అక్క మీద ఎక్కలేని ప్రేమ వలక పోసింది ఇప్పుడు వాళ్ళ అక్కకి ఆస్తి వస్తుందని తెలిసి వాళ్ళ అక్కనే ద్వేషిస్తుంది. ఇప్పటికైనా అర్థమైందా ఈ పద్మావతి ఎలాంటిదో మీకు అని అంటుంది. పద్మావతి కి ఏమీ అర్థం కానట్టు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది.ఈర్షత అసూయతో పద్మావతి వాళ్ళ అక్కని వద్దనుకునేటట్టుంది చూశారా మీరు ఈ పద్మావతి ఎట్లాంటిదో అని అంటుంది కుచల. ఎంతైనా డబ్బు విషయం వచ్చేసరికి నిజమైన రక్త సంబంధాలు కూడా గుర్తుండవు అని అంటుంది. పద్మావతి వికీ నీకు ఈ విషయం గురించి చెప్పలేదా అని అంటుంది అరవింద పద్మావతికి ఏం మాట్లాడాలో తెలీక చెప్పారు అన్నట్టుగా తలు ఊపుతుంది మరి తెలిసి కూడా ఎందుకు పద్మావతి మీరు ఇలా చేస్తున్నారు అని అంటుంది అరవింద.మీరు కోరుకున్నట్టుగానే మేము కూడా మీ అక్క సంతోషం కోసం తన భద్రత కోసం ఎంతో కొంత పేరు మీద ఆస్తి ఉంటే బావుంటుందని విక్కీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు దానికి మీరు అడ్డు చెప్పడం నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది అరవింద. శాంతాదేవి కూడా అవునమ్మా నువ్వు చేసిన పని నాకు అసలు నచ్చడం లేదు అని అంటుంది. అందరి మంచి కోరే దానివి ఇంట్లో అందరూ బాగుంటే చూడాలనుకునే దానివి నువ్వే ఇలా మారిపోయావా అని అంటుంది శాంతాదేవి.ఇప్పటికైనా మీకు అర్థమైంది గా ఆర్తి కోసం ఏదైనా చేసే క్యారెక్టర్ తనది అని అంటుంది కుచల. విక్కీ వెంటనే మర్చిపోయి ఉంటుందిలే పిన్ని అని అంటాడు.అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు అని అంటుంది పద్మావతి నేను చెప్తాను.పద్మావతికి అని విక్కీ నా పేరు మీద ఉన్న షేర్లలో కొంత భాగం ఆర్య పేరు మీద రాశాను అలానే ఆర్య కి అను భార్య కాబట్టి తన పేరు మీద కూడా కొన్ని షేర్లు ఉంటే రేపు ఫ్యూచర్లో తనకే ఇబ్బంది రాకుండా ఉంటుందని, నేనే మీ అక్క పేరుమీద కొన్ని షేర్లు అని రాసిస్తున్నాను దానికోసమే ఈ సంతకాలు తీసుకుంటున్నాం అని అంటాడు విక్కీ ఒక్కసారిగా పద్మావతి షాక్ అవుతుంది ఇంకా విడాకుల కోసం అనుకొని, నేను ఇలా మాట్లాడాను ఇప్పుడు వీళ్లంతా నన్ను అపార్థం చేసుకున్నారు అని మనసులో అనుకొని సైలెంట్ గా ఉంటుంది పద్మావతి. వెంటనే కుచ్చుల చూసావుగా మీ అక్క పేరుమీద మా విక్కి ఆస్తి రాస్తుంటే నువ్వు కుళ్ళు తో అడ్డుపడుతున్నావు అని అంటుంది దానికి అందరూ నిజం అని అనుకుంటారు. అంటే విక్కీ నాతో అని చెప్పబోతుండగా కుచుల అబద్ధం చెప్పాడు అని అంటావు అంతే కదా ఇప్పుడు బండారం బయటపడిన తర్వాత నువ్వు ఏదైనా చెప్తావు నీ గురించి ఇప్పుడు ఇంట్లో అందరికీ తెలిసిపోయింది అని అంటుంది కుచల. అను కూడా పద్మావతిని అపార్థం చేసుకుంటుంది. ఇక విక్కీ జరగాల్సింది చూద్దాం ముందు అని లాయర్ చేత సంతకాలు చేయించుకొని లాయర్ ని పంపించేస్తాడు. మనసులో పద్మావతి విడాకులను నాతో చెప్పి అందరి ముందు నన్ను దోషించేసి అందరి చేత నన్ను తిట్టిస్తావు కదా అని మనసులో అనుకుంటుంది విక్కీ వైపు చూసి విక్కీ ఇప్పటికైనా అర్థమైందిగా నేనంటే ఏంటో ఇంకొకసారి నాతో పెట్టుకోకు అని మనసులో అంటాడు.
Krishna Mukunda Murari: కృష్ణ కి నిజం చెప్పిన మధు.. బోల్తా పడ్డ ముకుంద..

విక్కీ పద్మావతి లో గొడవ..
విక్కీ పద్మావతి తో ఇప్పటికైనా అర్థమైంది గా నేనంటే ఏంటో ఇకమీదట ఎప్పుడూ నాతో పెట్టుకోవాలని చూడమాకు, ఇలానే బాధపడాల్సి వస్తుంది అని అంటాడు. విడాకులని అబద్ధం చెప్పి ఇలా మోసం చేయడం, మీరు ఏది చేసినా ఇంట్లో అందరూ నమ్ముతున్నారని ఇష్టమొచ్చినట్టు నాపై నిందలు వేసి, ఇంట్లో అందరి ముందు చెయ్యి అని తప్పుకి నన్ను దోషిగా నిలబెట్టారు కదా, నన్ను ఎదిరించడం మీకు చేతకాకపోతే, తప్పుకోవాలి కానీ ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేసి మోసం చేసి అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టడం గొప్పకాదు అని అంటుంది పద్మావతి. నేనేం చీప్ ట్రిక్స్ ప్లే చేయలేదు నేనేం అబద్దం చెప్పలేదు నిజంగానే మీ అక్క చేత విడాకులు ఇప్పించడానికి సంతకాలు తీసుకుందాం అనుకున్నాను ఇప్పటికీ నా దగ్గర ఈ పేపర్స్ ఉన్నాయి కావాలంటే చూడు అని విడాకులు పేపర్లు చూపిస్తాడు. అయినా నువ్వు నా మాటకు ఎదురు చెపితే ఏమవుతుందో నీకు తెలియాలి కదా అందుకే ఇలా చేశాను. ఇవే మన ఆస్తి పేపర్లు అనుకున్నావా నీ దగ్గర పెట్టుకోవడానికి ఇప్పుడే వీటిని చింపి పడేస్తాను అని పద్మావతి పేపర్ ని తీసుకుంటుంది. పద్మావతి గొడవ చేయకుండా పేపర్స్ ఇలా ఇవ్వు అని అంటాడు నేను ఇవ్వను అంటుంది పద్మావతి వాడితో ఇంకా చాలా అవసరం ఉంది పద్మావతి. నువ్వు మళ్ళీ నా ముందు ఏమన్నా, చెప్పింది చెయ్యకపోతే అప్పుడు ఇవి అవసరం అవుతాయి వీటి అవసరం రేపైనా రావచ్చు ఇటు ఇవ్వు అని అంటాడు నేను ఇవ్వను అని పద్మావతి లాక్కుంటుంది.పేపర్స్ తీసుకునే క్రమంలో పద్మావతి కింద పడిపోతుంది విక్కి పట్టుకుంటాడు. విక్కీ పద్మావతిని పక్కకి నెట్టి పేపర్స్ కోసం కిందపడినవి తీసుకుంటూ ఉంటే పేపర్స్ అప్పటికే తడిచిపోయి ఉంటాయి. వాటిని చూసి పద్మావతి నవ్వుకుంటూ ఇదిగోండి సారూ మీ పేపర్లు అని తడిసిపోయిన పేపర్లు ఇస్తుంది. ఇక మీరు మా అక్కని బావని ఎప్పటికీ విడదీయలేరు అర్థమైందా అని అంటుంది, పిచ్చి పద్మావతి నీకే ఒక విషయం అర్థం కావట్లేదు,నేను తలుచుకుంటే కోర్టు నుంచి డైరెక్ట్ గా డైవర్స్ నోటీసు ఇంటికి వస్తుంది అలాంటిది ఈ పేపర్ తడిసిపోతే ఏమయ్యాయి నువ్వు నేను చెప్పినట్టు బుద్దిగా ఇంట్లో పడివుండు లేదంటే నేనంటే ఏంటో చూస్తావు అని చెప్పేసి వెళ్ళిపోతాడు.
BrahmaMudi: బ్రహ్మముడి మానస్ పుష్ప 2 గెటప్ లో మీరెప్పుడైనా చూశారా?

అనుతో కుచల గొడవ..
కుచిలా ఈ క్లైమేట్ చాలా బాగుంది ఇప్పుడు వేడివేడి పకోడీ తింటే బాగుంటుంది అని అనుకుంటుంది.వెంటనే అను పిలిచి, నీకు ఇంకా అర్థం కాలేదా నేను ఎప్పుడు ఏం తింటానో తెలుసుకోకపోతే ఎలాగో అని అంటుంది. చెప్పండి అత్తయ్య మీకు ఏం కావాలో అంటుంది అను నేను ఏడుపుగొట్టి ఫేస్ చూస్తే ఇది నాకు లేదు కానీ నువ్వు వెళ్లి వేడివేడి పకోడీ చేసుకొని తీసుకురా,అను సరే అని అక్కడ నుంచి వెళ్లి, ఉల్లిపాయ కట్ చేస్తూ ఉంటే ఏంటే నీ ఒక్కదానికే కట్ చేసుకుంటున్నావు అని అంటుంది లేదా అత్తయ్య మీకోసం చేస్తున్నాను అంటుంది ఇవేం సరిపోతాయి అని కింద నుంచి చాలా ఉల్లిపాయలు తీసి అను కిచ్చి ఇవన్నీ కట్ చెయ్ అని అంటుంది అను ఒక్కసారిగా ఎన్ని కట్ చేయాలా అన్నట్టు చూస్తుంది ఏంటి నా వైపు చూస్తున్నావు సన్నగా పొడుగు పొడుగుగా కట్ చెయ్ అని అంటుంది. ఉల్లిపాయలు కట్ చేస్తుంటే నీళ్లు కంట్లో నుంచి వస్తూ ఉంటాయి అది చూసి, వెంటనే అను నీళ్లలో ఉల్లిపాయలు వేస్తుంది.ఏంటే ఏం చేస్తున్నావు విజేత ఒళ్ళోంచి పని చేయించడానికి నేను ఇక్కడున్నాను అవి నీళ్లలో వేయకు మామూలుగానే కట్ చెయ్ అని అంటుంది. అను కళ్ళు తుడుచుకుంటూ ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పద్మావతి వస్తుంది. అక్క నువ్వు తప్పుకో అక్క నేను కట్ చేస్తాను అని అంటుంది పద్మావతి కూసే గాడిద వచ్చి మేసే గాడిది చెడగొట్టినట్టు మీ అక్క పని చేస్తుంటే నువ్వు మధ్యలో వచ్చి చెడగొట్ట మాకు వదిలిపో అని అంటుంది. పద్మావతి అను నీ నువ్వెలా అక్క నేను చేస్తాను అంటుంది అను వినకపోవడంతో నాకు అర్థమైంది అక్క నేను నీ జాత సంతకం పెట్టించడానికి ఒప్పుకోలేదని నువ్వు నా మీద అలిగి ఉన్నావు కదా అసలు మా ఆయన నాతో నిజం చెప్పలేదు అక్క లేదంటే నేను ఎందుకు వద్దంటానా నీ సంతోషమే నా సంతోషం అని అంటుంది.అవునా అమ్మి మీ ఇద్దరూ మళ్లీ గిల్లికల గిల్లికజ్జాలు ఆడుకోవడం మొదలు పెట్టారా నేను ఎంత భయపడ్డానో తెలుసా నువ్వు ఎందుకు వద్దంటున్నావు అని పోనీలే నీ గురించి నాకు అర్థమైంది అని అంటుంది. మీరిద్దరూ సోదాపి పని చేయండి అని అంటుంది. నేను కట్ చేస్తాను ఉండు అని పద్మావతి హెల్మెట్ తీసుకొని,తలకు పెట్టుకొని ఉల్లిపాయలు కట్ చేస్తుంది అది చూసి కుచల షాక్ అవుతుంది. ఇది వీళ్ళ అక్కంత అమాయకురాలు అయితే కాదు. పద్మావతికట్ చేయడం అయిపోయింద అత్త ఇక మీరు వెళ్ళండి మేము పకోడీ చేసి తీసుకొస్తాము అని అంటుంది.

పకోడీ అమ్మిన పద్మావతి..
పద్మావతి పకోడీలు తీసుకొచ్చి అందరికీ రమ్మంటుంది. అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు విక్కీ ఫోన్ మాట్లాడుతూ అటువైపుకు వస్తే పద్మావతి పకోడీ చేసింది రా అని అరవింద పిలుస్తుంది విక్కీని విక్కీ నాకు ఇంట్రెస్ట్ లేదు అక్క అని చెప్తాడు. ఇంట్రెస్ట్ లేకుండా ఎట్లా ఉంటుంది ఒకసారి వచ్చి టేస్ట్ చెయ్ అంటుంది శాంతాదేవి. సరే అని విక్కీ కూడా వస్తాడు పద్మావతి ముందు అందరూ ఒకసారి టేస్ట్ చూడండి తర్వాత అందరికీ ప్లేట్లు ఇస్తాను అని ముందు ఒకసారి టెస్ట్ చేయిస్తుంది పకోడీ అందరూ తిని అద్భుతంగా ఉంది అంటారు అప్పుడే పద్మావతి అయితే ఒక్కొక్కళ్ళు 2000 రూపాయలు ఇచ్చి ప్లేట్ తీసుకోవచ్చు అని అంటుంది.2000 రూపాయలా ఒక ప్లేట్ కి బయటి 20 రూపాయలకు వస్తాయి అంటుంది కుచ్చుల బయట చాలా పకోడీలు వస్తాయి పద్మావతి చేసిన పకోడీ ఉండదు కదా అందుకనే 2000 మీకు కావాలంటే నే తీసుకోండి అని అంటుంది. అరవింద ఏంటి పద్మావతి టేస్ట్ చూపించి ఊరించి ఇప్పుడు 2000 అంటున్నావు అని అంటుంది అంతే అరవింద్ గారు కావాలంటేనే తీసుకోండి అని అంటుంది విక్కీ నువ్వు ఉండక్క నేను ఇస్తాను డబ్బులు అని అంటాడు అంతలో కుచలా ఏంటి నువ్వే మా ఇంటికి ఫ్రీ గా వచ్చావు ఇప్పుడు ఇలా వసూలు చేస్తున్నావా అని అంటుంది.

రేపటి ఎపిసోడ్లో కృష్ణాష్టమికి పద్మావతి రెడీ చేస్తూ ఉంటే ఇద్దరూ చిన్న పిల్లలు కృష్ణుడి వేషం రాదవేషం వేసుకొని పద్మావతి విక్కిలని కలుపుతారు మీ ప్రేమ చాలా బలమైనది రాధాకృష్ణుల ప్రేమ లాగా అని చిన్న పిల్లలు అంటారు. పద్మావతి ఆ మాటలకి వికీవైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఈ లోపు అనుకోకుండా పద్మావతి కింద పడబోతుంటే విక్కి పట్టుకుంటాడు.