Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి విక్కి లకు అరవిందా, కుటుంబ సభ్యుల సమక్షంలో మళ్లీ పెళ్లి చేస్తుంది. అరవింద కోసం విక్కీ మొదట పెళ్లి వద్దన్నా తర్వాత పద్మావతి మెడలో తాళి వేస్తాడు. అరవింద ఇప్పటికైనా పద్మావతి విక్కీ ఒకటి అవుతారని ఆశిస్తుంది. పెళ్లయిన తర్వాత పద్మావతి విక్కి లను అత్తారింటికి వెళ్ళమని చెప్తుంది. అందుకు విక్కీ ఒప్పుకోడు, చివరకు అరవింద కోసం దానికి కూడా ఒప్పుకుంటాడు. ఇక కృష్ణ విక్కీ ఆస్తి పత్రాలు లాకర్ లో పెట్టడం చూసి అసలు అవి ఆస్తి పత్రాల లేక ఏమైనా ఇంపార్టెంట్ పైన ఆ లాకర్లో పెట్టిన పత్రాలు ఏంటి అనే తెలుసుకోవాలి అనుకుంటాడు. ఏదో ఒక విధంగా ఆ పత్రాలని ఏముందో తెలుసుకోవాలి విక్కీ మళ్లీ తిరిగి ఇంటికి వచ్చే లోపు అని అనుకుంటాడు.

ఈరోజు 473 వ ఎపిసోడ్ లో, పద్మావతి విక్కీ ఇద్దరు, బక్త ఇంటికి బయలుదేరుతారు. ఇక పార్వతి అప్పటికే ఎదురు చూస్తూ ఉంటుంది. మీరెల్లి వాళ్ళని ఈరోజే రమ్మనమని చెప్పారా లేదంటే రెండు రోజులు ఆగి రమ్మని చెప్పారా అని భర్త మీద కోప్పడుతూ ఉంటుంది. నేనెందుకు చెప్తాను అలాగా ఈరోజే రమ్మనమని చెప్పాను వస్తారు అని అంటాడు భక్త. మరింత వాడికి పిల్లలు ఇంకా రాలేదు ఏంటండీ అని అంటుంది పార్వతి ఇంతలో ఆండాలు వస్తారులే ఎందుకు అంతలా అరుస్తున్నావు అని అంటుంది. నీకు మాత్రమే ప్రేమున్నట్టు చెప్పకు మాకు కూడా ప్రేమ ఉంది కదా వస్తారు పిలిచాను కదా అని అంటుంది ఉండాలి ఇంతలో చిలకమ్మొస్తుంది. ఏంటమ్మా అందరూ ఎక్కడున్నారు అల్లుడు కోసం ఎదురు చూస్తున్నట్టున్నారుగా అని అంటుంది. చూడు చిలకమ్మా నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా అల్లుడిని ఏం లోటు లేకుండా చూసుకోవాలి వాళ్ళు ఏది అడిగితే అది తీసుకొచ్చి ఇవ్వాలి. అన్ని గుర్తుపెట్టుకో అని అంటుంది ఇంతలోనే పద్మావతి వాళ్ళు వచ్చిన హారన్ సౌండ్ అవుతుంది. చిలకమ్మా అదిగో వచ్చారమ్మా అల్లుళ్ళు అని అంటుంది.

ఆనందంలో పద్మావతి..
ఇక పద్మావతి విక్కీలు, అత్తారింట్లో అడుగుపెడతారు. పద్మావతి ఇప్పటికైనా మీరు అన్ని మర్చిపోయి నాతో నవ్వుతూ ఉండండి అని అడుగుతుంది. మనం వచ్చింది మా ఇంటికి, నేను మనసులో ఎన్ని పెట్టుకోకుండా మా అమ్మ వాళ్ళ ముందు హ్యాపీగా వుందా అని అడుగుతుంది. నేను ఎప్పుడో చెప్పాను కదా పద్మావతి నీతో సరిగా నేను ఉండలేను. పద్మావతి లగేజ్ కారులో నుంచి దించుతుంది నేను కూడా తీసుకొస్తా నీకు ఇవ్వు అని అంటాడు విక్కీ నేనంటే మీకు ప్రేమ ఉంది కదా ఎందుకు దాచిపెడతారు అందుకే లగేజీ నేను మోయలేరనే కదా మీ అభిప్రాయం అని అంటుంది. అంతలేదు అని అంటాడు విక్కీ.నేను నా భార్యగా నేను ఒప్పుకోలేను అని అంటాడు. సరే మీ ఇష్టం నేను లోపలికి వెళ్తున్నాను అని పద్మావతి వాకిలి ముందు చాలా ముగ్గులు వేసి ఉంటాయి వాటిని తప్పకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఆనందంలో పద్మావతి గంతులేస్తూ ఉంటుంది.

రంగుల్లో మునిగిన భార్య భర్తలు..
ఇక విక్కీ, పద్మావతి ఎలా లోపలికి వెళ్లిందో చూడడు. పద్మావతి వాకిలి ముందు నిలబడి సారు రండి అక్కడే ఆగిపోయారే అని అంటుంది. విక్కీ కారు లాక్ చేసిఇంట్లోకి వస్తూ ఉంటే ముగ్గులన్నీ ఎలా ఉన్నాయో చూశారు కదా నేను ఎలా అయితే తప్పకుండా వచ్చాను మీరు కూడా అలానే తప్పకుండా రావాలి అని అంటుంది. వాట్ అని అంటాడు విక్కీ చెప్పాను కదా సారు ముగ్గుకి ముగ్గుకి మధ్య ప్లేస్ ఉంది వాటిలో అడుగులు వేస్తూ రండి అని అంటుంది. అప్పటికే ముగ్గులన్నీ రంగులతో నిండిపోయి ఉంటాయి. మీకు చాలా కష్టపడి, రంగులు తొక్కకుండా వస్తూ ఉంటాడు ఇంతలో పడబోతే పద్మావతి పట్టుకుంటుంది ఇది ఒకరి కలలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో పద్మావతి పక్కనే ఉన్న రంగులు తీసుకొని విక్కీ నిద్ర జరుగుతుంది. విక్కీ కూడా పద్మావతి మీద రంగుల జల్లుతారు ఇద్దరు చాలాసేపు అలా రంగులో మునిగిపోతారు.

కృష్ణ దొంగతనం..
కృష్ణ ఎవరు చూడకుండా ఇంట్లోకి వచ్చి ఎవరు లేనట్టున్నారు ఇప్పుడే మనకి కరెక్ట్ టైం ఎవరికంటే పడక ముందే విక్కీ గదిలోనికి వెళ్లాలి అని ఎవరు చూడకుండా విక్కీ గదిలోకి వెళ్తాడు. ఇక విక్కీ దాచిపెట్టిన పేపర్స్ ఏంటో తెలుసుకోవాలని కృష్ణ అనుకుంటాడు అవి ఆస్తి పత్రాలు అయితే, లేదంటే ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ ఫైలా అని, ఆలోచిస్తూ లోపలికి వెళ్లి లాకర్ని ఓపెన్ చేద్దామనుకుంటాడు ఎంతసేపటికి లాకర్ ఓపెన్ అవ్వదు. నిజాయితీ దీనికి సంబంధించిన కేసు ఇక్కడే పెట్టి ఉంటాడు ఈ కీస్ నేను తీసుకొని, డూప్లికేట్ కీస్ చేసి మళ్లీ వీటిని ఇక్కడే పెట్టేయాలి మీకు వచ్చే ఈ మూడు రోజుల్లోపు అన్ని పనులు పూర్తవ్వాలి అని అనుకుంటూ ఉంటాడు ఆ కీస్ తీసేటప్పుడు అప్పుడే పని చేసే రాము వస్తాడు. ఏంటి సార్ అని అంటాడు కేస్ తీయడం రాము చూసాడేమోనని మొదట కృష్ణ కంగారుపడతాడు కానీ రాముతో నా వాష్ రూమ్ లో వాటర్ రావట్లేదు అందుకనే ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు రాము నిజం అనుకుంటాడు ఇక కృష్ణ బాత్రూం లోకి వెళ్లి సోపు మీద లాకర్ కి అచ్చు వేసి ఇది మన ఆయుధం అంటే ఇప్పుడు దీన్ని ఒరిజినల్ తాళం లాగా తయారు చేయించాక అసలు కథ నడుపుతాను అని అనుకుంటాడు.

అత్తారింట్లో అల్లుళ్ళు..
ఇక అను, ఆర్యా లు కూడా అప్పుడే అక్కడికి వస్తారు. అప్పటికి ఇంకా విక్కీ పద్మావతి ఇద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూనే ఉంటారు. ఇక్కడే మనకు ఒక విషయం అర్థం అవుతుంది. ఆర్య ప్లేస్ లోకి మరో కొత్త ఆర్య ఎంట్రీ అయ్యాడు. ఇక అను పదండి లోపలికి వెళ్దాం అని అంటుంది ఇక ఆ మాటలకు విక్కీ పద్మావతి, వాళ్లు వాళ్లు వచ్చారని అర్థమవుతుంది ఇక అందరినీ చిలకమ్మా లోపలికి వెళ్లే లోపు హారతి తీసుకుని వస్తుంది. చిలకమ్మ హారతిస్తూ, ఏంటి బాబు ఎప్పుడు మీరు ఒక్కరే రావడమేనా లేదంటే పిల్లల్ని తీసుకొని వచ్చేది ఏమైనా ఉందా అని అంటుంది. ఈసారి వచ్చేటప్పటికి ఒక అరడజను మంది పిల్లలతో రావాలి అని అంటుంది. అరడజని సరిపోతాయి చిలకమ్మా ఒక డజన్ మందిని ట్రై చేద్దాంలే అని అంటాడు ఆర్య. అల్లుళ్లు మంచి హుషారు మీదే ఉన్నారే అని అంటుంది చిలకమ్మా. మాటలైన లోపలికి రానిచ్చేది ఉందా అని అంటాడు ఆర్య. ఇక అందరూ లోపలికి వెళ్తారు.
కృష్ణ కంగారు.. అరవింద కు దొరికేనా
ఇక కృష్ణ సోప్ మీద కీస్ అచ్చు వేసుకొని, మళ్లీ ఎవరికీ తెలియకుండా ఆ కీస్ని వాటి స్థానంలో పెట్టేసి డూప్లికేట్ కి కోసం చేయించుకోవడానికి బయటకు వెళ్తూ ఉంటాడు. చాలా కంగారుగా చాలా భయంగా వెళుతూ ఉంటాడు అప్పుడే అరవింద మొక్కలకు నీళ్లు పడుతూ ఉంటుంది. ఒకసారి కృష్ణుని పిలుస్తుంది కృష్ణ వెనక్కి తిరగదు అంతే వెళ్తూ ఉంటాడు ఇంకొక రెండు సార్లు పిలుస్తుంది అయినా కానీ పలకడు. తను చాలా కంగారుగా ఉంటాడు అది గమనించి ఏంటి ఎన్నిసార్లు పిలుస్తున్నా కానీ పలకట్లేదు అని ఆ వాటర్ పైప్ తీసుకొని వాటర్ ని అరవింద కృష్ణ మీద నీళ్లు పోస్తుంది వెంటనే కృష్ణ ఆపు అరవింద అని అంటాడు ఆయన అరవింద ఆపదు. వెంటనే కృష్ణ కోపంతో నీకు ఎన్నిసార్లు చెప్పాల అరవింద ఆపు అని గట్టిగా అరుస్తాడు దానికి అరవిందా భయపడుతుంది. ఏంటండీ అలా అరిచారు అని అడుగుతుంది. పోనీ కంగారులో అరవింద మీ దరి చేశాను ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని వెంటనే అరవింద్ కి అనుమానం రాకూడదు అని మనసులో అనుకొని, నువ్వు నన్ను ఆపడానికి నీళ్లు చెల్లావు కదా నేను నిన్ను ఆపడానికి కోపంగారిచాను అసలు నేను కోపంగారిస్తే నువ్వు ఎలా ఫీలవుతావా అని అంటాడు కృష్ణ. మీరు ఎప్పుడు అలా కోపంగా అరవలేదు కదా ఒకసారి అరిచేసరికి నేను చాలా భయపడిపోయాను అని అంటుంది. అయినా పిలుస్తున్న పాలక్కుండా ఎక్కడికండి అంత హడావిడిగా కంగారుగా వెళ్తున్నారు అని అంటుంది. ఏం లేదు అరవింద ఒక క్లైంట్ అర్జెంటుగా రమ్మన్నారు నేను వెళ్లకపోతే అవతల ప్రాణాలు పోతాయి అని అంటాడు అయ్యో బట్టలన్నీ తడిసిపోయాయి కదా లోపలికి వెళ్లి మార్చుకొని వెళ్ళండి అని అంటుంది. కృష్ణ అప్పటికే సోపు చేత్తో పట్టుకుని ఉండటం వల్ల అరవింద చల్లిన నీటికి ఆ సోబ అంతా కరిగిపోతుంది. చేసేదేం లేక మళ్లీ కృష్ణ లోపలికి వెళ్తాడు.

అక్క కోసం భరిస్తున్నాను..
ఒక పద్మావతి, ఏదైనా పుట్టింటికి వస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఇదేదో స్వర్గం లాగా అనిపిస్తుంది నాకు అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు పద్మావతిని చూసి నేను అక్క కోసం ఏమైనా భరించాలి తప్పదు, లేదంటే అక్క బాధపడుతుంది ఉన్న నాలుగు రోజులు ఈ ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు నేను పద్మావతి తో నటించాలి అని అనుకుంటాడు. పద్మావతి ఏంటండీ అలా చూస్తున్నారు అని అంటుంది. నువ్వు నా మీద అంత కేర్ చూపించాల్సిన అవసరం లేదు అలాగే నన్ను నీ భర్తగా అనుకోవాల్సిన పని కూడా లేదు ఎందుకంటే నేను నిన్ను భార్యగా అనుకోవట్లేదు కాబట్టి నువ్వు నన్ను అలా పిలవద్దు అని అంటాడు. మళ్లీ పద్మావతి మళ్లీ మారిపోయారా అయితే రివర్స్లో రావాలా ఇప్పుడు నేను అని మనసులో అనుకొని అయితే మిమ్మల్ని ఏమండీ అని పిలవకుండా ఏమని పిలవాలి భర్త, శ్రీవారు మావారు అని రకరకాలుగా అన్ని రకాల భాషల్లో, మాట్లాడుతూ ఉంటుంది ఇక విక్కీ ఆపుతావా అని అంటాడు.
రేపటి ఎపిసోడ్ లో పద్మావతి కి అరవింద్ వీడియో కాల్ చేస్తుంది. అప్పటికే విక్కీ పద్మావతి మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిగో వదిన వీడియో కాల్ చేసింది అని అంటుంది. ఎలా ఉన్నారు పద్మావతి అని అడుగుతుంది అరవింద బానే ఉన్నాము అని చెప్తుంది ఇంతలో విక్కీ ఎక్కడున్నాడు అంటే ఇక్కడే ఉన్నాడు అని చూపిస్తుంది ఏంటి అలా ఉన్నాడు అని అడుగుతుంది అరవింద ఏం లేదు మా అమ్మ కొంచెం కూరల్లో కారం ఎక్కువ వేసింది లేండి అని అంటుంది కారం తిన్న కోపం వస్తుంది అని అంటుంది అరవింద. మీ తమ్ముడికి కోపం వస్తే ఎలా పోగొట్టాలి నాకు తెలుసు అని ఉంటుంది పద్మావతి.