NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 2 2024 Episode 587: విక్కీ చెప్పినా అబద్దాన్ని నమ్మిన కుటుంబ సభ్యులు.. కృష్ణ ప్లాన్ సక్సెస్ అయినట్లేనా? పద్మావతి కి హెల్ప్ చేస్తానన్న కుచల..

Nuvvu Nenu Prema Today Episode April 2 2024 Episode 587 highlights

Nuvvu Nenu Prema April 2 2024 Episode 587:  విక్కీ అమెరికా టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడని తెలిసి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. కానీ విక్కీ మసటి రోజు వరకు ఫోన్ చేయకపోవడంతో కంగారు పడుతూ ఉంటారు. ప్రమాదం అయితే జరగలేదని తెలిసింది కానీ విక్కీ ఎందుకు ఇంకా ఫోన్ చేయలేదు కనీసం అరవింద కోసమైనా ఫోన్ చేస్తాడు కదా అలాంటిది ఎందుకు చేయలేదు అని కుచల అనుమానంగా అడుగుతుంది. తరువాత అరవింద కూడా విక్కీ ఫోన్ కలవకపోవడంతో, కంగారు పడుతూ ఉంటుంది. అక్కడే ఉన్న కృష్ణ దివ్య ఇద్దరు, సేఫ్ గా ఉన్నాడని తెలిసింది కదా ఇంక కంగారు ఎందుకు అని కవర్ చేస్తారు. కానీ అరవింద వాళ్లందరూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. విక్కీ ఫోన్ కూడా కలవట్లేదు కనీసం ఎక్కడ ఉంది ఆచూకీ తెలియదు కాబట్టి మనం వెళ్లి కంప్లైంట్ ఇద్దాం అని అనుకుంటారు. అప్పుడే కృష్ణ ప్లాన్ ప్రకారం విక్కి ఫోన్ చేస్తాడు..

Nuvvu Nenu Prema Today Episode April 2 2024 Episode 587 highlights
Nuvvu Nenu Prema Today Episode April 2 2024 Episode 587 highlights

విక్కీ ఫోన్ చేయడంతో ఇంట్లో అందరూ సంతోషిస్తారు. విక్కీ ఫోన్లో ఇంట్లో అందరితో మాట్లాడుతూ ఉంటాడు ఇక అరవిందతో మాట్లాడుతూ నువ్వేం కంగారు పడకు అక్క నేను సేఫ్ గానే ఉన్నాను అని చెప్తాడు.కానీ నీ కోసం నేను ఎంతో బాధపడుతున్నాను నువ్వు ఫోన్ చేయకపోయేసరికి నా కంగారు ఎక్కువైంది అని అరవింద్ అంటుంది. నేను అమెరికా వెళ్దాం అనుకునే టయానికి నాకు అక్కడ పని క్యాన్సిల్ అయ్యి లండన్ లో పని రావడంతో నేను అక్కడికి వెళ్లాను లండన్ ప్రాజెక్టు ఒప్పుకున్నాను అక్క అందుకే మీకు చెప్పకుండా వెళ్లాల్సి వచ్చింది అని విక్కీ చెప్తాడు విక్కీ నిజం చెప్తున్నాడని అరవింద్ చాలా సంతోషిస్తుంది. అయితే ఇప్పుడు నువ్వు లండన్ లో ఉన్నావా అని అడుగుతుంది అవును చెప్తాడు. ఇంట్లో అందరితో మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో ఇక అందరూ విక్కీ గురించి విక్కి ఎలా ఉన్నావని అడుగుతూ కంగారుగా ఉంటారు అందరికీ నేను బాగున్నాను అని చెప్తాడు ఇక కుచల వచ్చేటప్పుడు నాకు మేకప్ కిట్ తీసుకురా అని అంటుంది నారాయణ ఫోన్ లాక్కొని ఈ టైంలో అవేనా అడగాల్సింది అని అరుస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode April 2 2024 Episode 587 highlights
Nuvvu Nenu Prema Today Episode April 2 2024 Episode 587 highlights

ఇక విక్కి అందరితో మాట్లాడి పద్మావతి అక్క జాగ్రత్త అని ఆర్యాతో చెప్తాడు ఆ మాటలకు పద్మావతి అక్కడే ఉంటుంది ఇదిగో పద్మావతి తోనే మాట్లాడు అని ఆర్య ఫోన్ నీ పద్మావతికి ఇస్తాడు. ఫోన్ తీసుకున్న పద్మావతి అక్కడి నుంచి పక్కకు వచ్చి మాట్లాడుతుంది మీరు ఎలా ఉన్నారు సార్ మీకు రారేమో అని నేను ఎంత భయపడ్డాను మీ నుంచి ఫోను మెసేజ్ లేకపోయేసరికి నా ప్రాణం పోయినట్టుంది ఇప్పుడే మీరు ఫోన్ చేయడంతో నా ప్రాణం నాకు తిరిగి వచ్చింది అనిపిస్తుంది అని అంటుంది ఇక ఆ మాటలకు పద్మావతి నేను నిన్ను బాధ పెట్టాను నేను ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను నువ్వు ఏం కంగారు పడొద్దు అక్కని జాగ్రత్తగా చూసుకో నేను కొన్ని రోజులు తర్వాత వచ్చేస్తాను అని చెప్తాడు కానీ పద్మావతి మాత్రం లేదు సార్ నాదే తప్పంతా మీరు ఇక్కడున్నప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాను నా పనులతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అదే నేను చక్కగా చూసుకొని ఉన్నట్టయితే మీరు అసలు వెళ్లి ఉండేవాళ్లే కాదు ఈసారి నుంచి ఏది జరిగిన మీకు చెప్తాను ఇకమీదట మీ దగ్గర ఏది నిజం గాయెను. అని పద్మావతి అంటుంది విక్కీ మాట్లాడుతున్న పద్మావతి తప్పంతా తనదే అన్నట్టు సారీ చెప్తుంది ఇక విక్కి పద్మావతి అని గట్టిగా అరిచి ఐ లవ్ యు పద్మావతి అని చెప్తాడు ఆ మాటలకు పద్మావతి షాక్ అవుతుంది. అవును పద్మావతి నేను చెప్తున్నది నిజం ఐ లవ్ యు పద్మావతి నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నీకు నేను క్షమాపణ చెప్తున్నాను అని అంటాడు ఆ మాటలకు పద్మావతి ఈ మాట కోసమే సారు నేను ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తుంది నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఐ లవ్ యు టూ సారు అని చెప్తుంది ఇక ఇద్దరూ మాట్లాడుతూ ఇది కొంతసేపటికి నా ఫోన్లో చార్జింగ్ లేదు పద్మావతి ఇది ఎప్పుడైనా కట్ అయిపోతుంది అని చెప్తాడు అట్లనే పద్మావతి మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగే లోపే ఫోన్ కట్ అయిపోతుంది అప్పుడే రౌడీ వచ్చి విక్కి దగ్గర ఫోన్ ని లాగేసుకుంటారు. పద్మావతి ఫోన్ కట్ అయిందని బాధపడుతుంది కానీ విక్కీ తనకి ఐ లవ్ యు చెప్పినందుకు తన మనసు మార్చినందుకు దేవుడికి థాంక్స్ చెప్తుంది.

Nuvvu Nenu Prema Today Episode April 2 2024 Episode 587 highlights
Nuvvu Nenu Prema Today Episode April 2 2024 Episode 587 highlights

ఇక అందరూ విక్కీ సేఫ్ గా ఉన్నాడు ఇప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన పనిలేదు అయినా విక్కీ చాలా మంచివాడు అని విక్కీ గురించి పొగుడుతూ ఉంటారు. కుచులని డిటెక్టివ్ వేషం వేసినందుకు నారాయణ తిడతాడు ఇప్పుడు చూసావుగా విక్కీ సేఫ్ గా ఉన్నాడని అర్థమైంది. ఇంక అలాంటప్పుడు నువ్వు గెటప్ చేసి ఎందుకు అని అంటాడు కానీ కుచల మాత్రం నేను ఈ గెటప్ వేసి డౌట్ రైస్ చేయడం వల్లే కదా మీరందరూ విక్కీ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని అనుకుంది అని అంటుంది కుచల ను ఆటపట్టిస్తాడు నారాయణ అక్కడే ఉన్న దివ్య వీళ్ళ పొగడ్తలు వినాలంటేనే విసుగ్గా ఉంది బావ అని అంటుంది కొన్ని రోజులు తప్పదు దివ్య అని అంటాడు కృష్ణ ఇక అందరం మాట్లాడుతున్న మీరేం మాట్లాడరేంటి అని కృష్ణతో అరవిందా అంటుంది కృష్ణ నేనేం మాట్లాడతాను రానమ్మ విక్కీ సేఫ్ గా ఉండడం తెలిసింది కదా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు ఇక పద్మావతి ఎక్కడ అంటే తన మాట్లాడిన తర్వాత గాల్లో తేలిపోతున్నట్టు ఉంది అని అరవింద అంటుంది. ఇక పద్మావతి రూమ్ లోకి వెళ్లి విక్కీ గురించి ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా విక్కీ వచ్చి నిలబడినట్టు తనకి గులాబీతో ప్రపోజ్ చేసినట్టు కలగంటుంది ఇక పద్మావతి వికీతో ఐ లవ్ యు సారు అని చెప్పడం విక్కీ కూడా పద్మావతిని అర్థం చేసుకున్నట్టు తన బాధని నేను ఇంకా పోగొడతాననివికి చెప్పడం. పద్మావతి అంతా కలగంటుంది ఇక విక్కీ వచ్చి పద్మావతి కన్నీళ్లు తుడిచి గులాబీ ఇచ్చి ఐ లవ్ యు చెప్పడం అంతా కలగానే ఉంటుంది ఇక పద్మావతి కలలో నుంచి బయటికి వచ్చి విక్కీ తనకు ఐ లవ్ యు చెప్పినందుకు సంతోషిస్తూ ఉంటుంది అయినా ఇన్ని రోజుల తర్వాత విక్కీ లో మార్పు వచ్చినందుకు చాలా సంతోషిస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode April 2 2024 Episode 587 highlights
Nuvvu Nenu Prema Today Episode April 2 2024 Episode 587 highlights

మరోవైపు రౌడీలు విక్కీ దగ్గర నుంచి ఫోన్ లాగేసుకుంటారు నువ్వు ఇప్పటిదాకా మనసు విప్పి మాట్లాడింది చాలు అని అంటారు ఇక అందులో ఒక రౌడీ ఎవరు విక్కీని కొట్టింది అని అడుగుతాడు అక్కడే ఉన్న ఇంకో రౌడీ బాధని పారిపోతుంటే కొట్టాల్సి వచ్చింది అన్న అని చెప్తాడు ఇతను పది రోజులు మన దగ్గర ఉండాలి అప్పటివరకు ఇతనికి ఒక గాయం కూడా కాకూడదని మన బాస్ చెప్పారు కదా ఈసారి ఎవరు అతని మీద చేయించుకోవద్దు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఒక వికీ దగ్గరికి వచ్చి నువ్వు పది రోజులు సహకరిస్తే అంతా బాగుంటుంది లేదని ఎదురు తిరిగితే ఇలానే దెబ్బలు తినాల్సి వస్తుంది అని అడుగు అంటాడు అప్పుడు మీ సార్ ఎవరో చెప్పు అని విక్కీ అడుగుతాడు అందుకు ఆ రౌడీ వచ్చి కనిపిస్తాడు అప్పటి వరకు వెయిట్ చెయ్ అని అంటాడు. విక్కీ మాత్రం బాధగా పద్మావతి గురించి ఆలోచిస్తూ, ఇన్ని రోజులు నీ దగ్గర ఉన్నప్పుడు నేను నీకు మనసు విప్పి మాట్లాడలేకపోయాను ఇప్పుడు దూరంగా ఉండి మనసులో మాట చెప్పాల్సి వచ్చింది ఇదే మాట నేను నీ దగ్గరికి వచ్చి చెప్తే నువ్వు ఇంకా సంతోషించే దానివి అని అనుకుంటూ ఉంటాడు.

Nuvvu Nenu Prema Today Episode April 2 2024 Episode 587 highlights
Nuvvu Nenu Prema Today Episode April 2 2024 Episode 587 highlights

ఇక మరోవైపు పద్మావతి ఉదయాన్నే నిద్ర లేచి విక్కీకి ఫోన్ చేస్తుంది. విక్కీ ఫోన్ కలవదు. తర్వాత పద్మావతి ఏంటి విక్కీ సారి ఫోన్ కలవట్లేదు అంటే ఆయనకి చాలా మీటింగ్స్ ఫోన్లు వస్తుంటాయి కదా అలాంటప్పుడు ఇంతసేపు ఫోన్ కలవకుండా ఉంటే ఎలా కుదురుతుంది అని అనుకుంటుంది ఇక వెంటనే పద్మావతి వాళ్ల లాయర్ కి ఫోన్ చేసి మిక్కీ లండన్ ప్రయాణం గురించి అడుగుతుంది ఆయన లండన్ ప్రయాణం నాకు తెలియదమ్మా అని చెప్తాడు అదేంటి అన్ని విషయాలు ఈయనతో చెప్పా కదా వెళ్తాడు అలాంటిది ఈయన కూడా తెలియదన్నారు ఏంటి అని అనుమాన పడుతుంది. తర్వాత పద్మావతి ఏజెన్సీ వాళ్లకి ఫోన్ చేసి విక్కీ లండన్ లో ఏ హోటల్ లో ఉన్నది ఏంటి కనుక్కోవాలి అనుకుంటుంది కానీ వాళ్లు కూడా విక్కీ లండన్ గురించి తెలియదని చెప్తారు. అదేంటి ఆరోజు యూఎస్ ఫ్లైట్ వద్దనుకొని తను మళ్ళీ తిరిగి లండన్ వెళ్లారట కదా అని అంటే లేదు మేడం రెండు రోజుల నుంచి అక్కడ వాతావరణం బాగోలేక లండన్లో ఏ ఫ్లైట్ వెళ్లట్లేదు అని చెప్తారు అవునా మీరు చెప్పేది నిజమేనా అంటే నిజమే మేడం నీ ఫోన్ పెట్టేస్తారు ఇక పద్మావతికి డౌటు మొదలవుతుంది విక్కీ లండన్ లో ఉన్నాడని ఎందుకు చెప్పాడు అంటే తను చెప్పింది అబద్దమా మరి అప్పుడు విక్కీ ఎక్కడ ఉన్నట్టు అని ఆలోచనలో పడుతుంది. ఇక పద్మావతి తో విక్కీ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది ఆ మాటల ప్రకారం విక్కి ఏదో ప్రమాదంలో ఉండి తనకు ఐ లవ్ యు చెప్పాడా అని అనుకుంటుంది అదేదో ఇంటికే వచ్చి చెప్పేవాడు కదా అక్కడ ఉండి చెప్పాడు ఎందుకు? అంటే ఏదో ప్రమాదం జరుగుతుంది పద్మావతి అదేంటో కనిపెట్టాలి అనుకుంటుంది.

రేపటి ఎపిసోడ్లో పద్మావతి ఒక్కతే ఒకచోట కూర్చుని ఉంటే అక్కడికి కుచల వస్తుంది. నువ్వు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చావంటే ఏదో బాధలోనే ఉన్నావని అర్థమవుతుంది ఏంటి అని అడుగుతుంది. అది పద్మావతి వికీ గురించి చెప్తుంది అదేంటివి కి ఫోన్ చేసి సేఫ్ గా ఉన్నట్టు చెప్పాడు కదా అని అంటే లేదు ఆయన ఏదో ప్రమాదంలో ఉన్నాడు ఆయన మాటలను బట్టి నాకు అర్థం అవుతుంది అని అంటుంది పద్మావతి అయితే నీకు నేను హెల్ప్ చేస్తాను విక్కీ ఎక్కడ ఉన్నాడో మనం కనిపెడదాం అని అంటుంది కుచల. ఇక చివరకు పద్మావతి విక్కి ఎదురుగా రావడం మనకి చూపిస్తారు నిజంగానే పద్మావతి రౌడీల దగ్గర నుండి విక్కీని కాపాడిందో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

author avatar
bharani jella

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella