NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 6 2024 Episode 591: కృష్ణ నిజస్వరూపం కుచల కనిపెట్టనుందా? విక్కీ పద్మావతి ల బాధ.. దివ్య, కృష్ణ కంగారు..

Nuvvu Nenu Prema Today Episode April 6 2024 Episode 591 highlights

Nuvvu Nenu Prema April 6 2024 Episode 591: పద్మావతి కృష్ణ మీద అనుమానంతో కృష్ణ కారులోనే తనతో పాటు ఫాలో అయ్యి, అనుకోకుండా కృష్ణకు ఎదురు పడుతుంది దాంతో పద్మావతి ఎక్కడ విక్కీ లోపల ఉన్నాడు అని కనిపెడుతుందో అని కృష్ణ టెన్షన్ పడుతూ పద్మావతి నాకు పంపించేయాలి అని అనుకుంటాడు. ఇక పద్మావతి నువ్వు ఇక్కడే ఉండకూడదు ఇకనుంచి వెళ్ళిపోవాలి అని విక్కీ కూడా అనుకుంటూ ఉంటాడు పద్మావతి మాటలన్నీ విక్కీకి వినపడుతూ ఉంటాయి కృష్ణతో పద్మావతి మాట్లాడుతుంది. ఈ నీచుడు పద్మావతిని ఏం చేస్తాడు అని విక్కీ కంగారుపడుతూ ఉంటాడు. మరోవైపు పద్మావతికి విక్కీ ఇక్కడే ఉన్నాడేమోనని మనసు చెబుతూ ఉంటుంది పద్మావతి అటు ఇటు చూస్తూ ఉంటే కృష్ణ ఇక పద్మావతి అనుమానం వచ్చినట్లు ఉంది విక్కీ ఇక్కడే ఉన్నట్టు కనిపెడుతుందో ఏమో ఇకనుంచి పంపించేయాలి అని అనుకొని పద్మావతి ఇది చాలా డేంజర్ ప్లేస్ కదా మనం ఇంటికి వెళ్దామని చేయి పట్టుకుంటాడు అని అంటుంది. పద్మావతి చేయి వదులు అని అంటుంది అది కాదు పద్మావతి నేను చెప్పేది ఒకసారి విను అని అంటే చేయి వదిలి అని అక్కడి నుంచి పద్మావతి చేయి బెదిరించుకొని పక్కకు వెళ్ళిపోతుంది. ఇది అక్కడ ఉన్న రౌడీలతో కృష్ణ మీకు అసలు బుద్ధుందా తన గురించి మీకు తెలియదు తను శివంగి లాంటిది తన యొక్క మనం దొరికిపోయే వాళ్ళం కొంచెం ఉంటే ఇక నుంచి అర్జెంటుగా విక్కీ ప్లేస్ మార్చేయండి అని చెప్తాడు.

Nuvvu Nenu Prema Today Episode April 6 2024 Episode 591 highlights
Nuvvu Nenu Prema Today Episode April 6 2024 Episode 591 highlights

ఇక మరోవైపు కుచల ఆలోచనలో పడుతుంది అసలు పద్మావతి టైంలో ఎక్కడికి వెళ్లింది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ నన్ను హెడ్ అని చెప్తుంది నేను చేసే మిషన్ లో తను ఎక్కువ పేరు కొట్టేయాలని చూస్తుంది అని అనుకుంటుంది ఇక రాని వీటిని తన పని చెప్తాను ఎక్కడికి వెళ్లిందో తేల్చేస్తాను అని మీకు పద్మావతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అరవింద్ అక్కడికి వస్తుంది ఏంటి పిన్ని ఇక్కడ ఉన్నారు అని అడిగితే ఈ ఇంట్లో పేరు కోసం పవర్ కోసం నన్ను మోసం చేస్తున్నారు అని అంటుంది మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటే పద్మావతి అని ఈ మధ్య అసలు పట్టించుకోవట్లేదు అని అంటుంది. అదేంటి పిన్ని నిన్ననే కదా మీ ఇద్దరూ కలిసిపోయాం అని చెప్పారు అని అంటుంది అరవింద్ అది కాదు అని పద్మావతి నాకు పేరు రాకుండా చేయాలని తనే పేరు మొత్తం కొట్టేయాలని చూస్తుంది అని అంటూ ఉండగా అక్కడికి పద్మావతి వస్తుంది. పద్మావతిని చూసి ఈ టైంలో మీరు ఎక్కడికి వెళ్లారు అని అరవింద నిలదీస్తుంది పద్మావతి ఎక్కడికి వెళ్ళింది అని చాలాసార్లు గుచ్చి గుచ్చి అడుగుతుంది అరవింద్ కానీ ఏం చెప్పాలో తెలియక పద్మావతి అబద్ధం చెప్తుంది. కుచల అత్తయ్య నన్ను టాబ్లెట్స్ తీసుకురమ్మని పంపించింది దానికోసమే వెళ్లాను కానీ అక్కడ టాబ్లెట్స్ లేవు అత్తయ్య అని అంటుంది. అక్కడే ఉన్న కుచల నేను నిన్ను టాబ్లెట్స్ ఏమన్నానా అని అంటుంది. అవును మీరే కదా టాబ్లెట్స్ తెమ్మంది అని కవర్ చేస్తుంది పద్మావతిఅరవింద కుచల ను అరుస్తుంది ఏంటి పిన్ని మీరు పద్మావతి ఉంటదిగా చేసి ఇలా పంపించారా, ఇంత రాత్రిపూట తను ఒంటరిగా వెళ్తే తనకు ఏమైనా అయితే ఎలాగూ మీరు కావాలని చేశారు కదా ఇదంతా అని అంటుంది. ఇక పద్మావతి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కుచలా నిజం చెప్పు నేను నిన్ను టాబ్లెట్స్ తో ఏమైనా పంపించాను ఎందుకు నా మీద అలా చెప్పావు అరవింద్ నన్ను ఎలా మాట్లాడిందో చూసావు కదా అని అంటే కాదు మనం ఎక్కడ రెడ్ హ్యాండెడ్ గా దానికి దొరికిపోతాము అని భయం వేసింది అందుకే ఏదో ఒకటి చెప్పాలి కదా అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode April 6 2024 Episode 591 highlights
Nuvvu Nenu Prema Today Episode April 6 2024 Episode 591 highlights

ఇక కుచలా సరే జరిగింది ఏదో జరిగింది అసలు నువ్వు ఎక్కడికి వెళ్లావు చెప్పు అని అంటుంది. ఇప్పుడు ఏం చెప్పాలా అని పద్మావతి ఆలోచిస్తుంది కానీ కుచల మాత్రం వదిలి పెట్టకుండా అలానే అడుగుతూ ఉంటుంది నాకు ఒకరి మీద అనుమానం ఉంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని అనుకున్నాను. అందుకే నేను మీకు చెప్పకుండా బయటికి వెళ్లాను అని అంటుంది అవునా ఎవరిని గురించి నీ అనుమానం అని అడుగుతుంది. వాళ్ల గురించి నేను తర్వాత చెప్తాను. నాకు ఒక ల మీద బాగా అనుమానం ఉంది అని అంటుంది అప్పుడే అక్కడికి కృష్ణ వచ్చి నా గురించి ఎక్కడ చెప్తుందో అని కంగారుపడుతూ ఉంటాడు. కుచల మాత్రం వాళ్ళు ఎవరో నాతో చెప్పు నేను వాళ్ళని నా మేకప్ తోనే చంపేస్తాను అని అంటుంది. ఇక అక్కడే ఇదంతా వింటూ కృష్ణ కంగారు పడుతూ ఉంటే కృష్ణుని చూసి కుచల ఇట్రా అని పిలుస్తుంది. కంగారుపడుతూ కృష్ణ దగ్గరికి వస్తాడు అదేంటి నువ్వు ఈ టైంలోనే బయటికి వెళ్ళావా? అయితే పద్మావతి నువ్వు అనుమానిస్తున్న వ్యక్తి కృష్ణవేణి అంటుంది దాంతో ఇక కృష్ణ షాక్ అయిపోతాడు వామ్మో ఈ కుచల కి నిజం తెలిసిపోయింది అని అనుకుంటాడు. పద్మావతి కూడా షాక్ అవుతుంది కానీ తర్వాత నవ్వి కుచల జోక్ చేశాను అని అంటుంది దాంతో కృష్ణ టెన్షన్ పోతుంది నేను ఊరికే అన్నాను మీరు బంగారు పడ్డారు కదా అల్లుడుగారు అయినా అరవింద్ ను వదిలిపెట్టి ఈ టైంలో వెళ్తే ఎలాగూ తనకి మీరు తోడుగా ఉండాలి కదా ఇకమీదట ఇలా చేయొద్దు వెళ్లిపోండి అని అంటుంది. ఇక కృష్ణ వెళ్లిపోయిన తర్వాత పద్మావతి అత్తయ్య ఇంట్లోనే ఒకళ్ళు మీద నాకు అనుమానం గా ఉంది. మీకు కూడా ఈ ఇంట్లో వాళ్ళందరిని అబ్జర్వ్ చేయండి ఎవరి మీద అనుమానం ఉన్న నాకు చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతుంది.

Nuvvu Nenu Prema Today Episode April 6 2024 Episode 591 highlights
Nuvvu Nenu Prema Today Episode April 6 2024 Episode 591 highlights

ఇక మరోవైపు విక్కీ బాధపడుతూ ఉంటాడు పద్మావతి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అసలు నిన్ను ఈ దుర్మార్గులు ఏమీ చేయలేదు కదా అని అనుకుంటూ అక్కడే ఉన్న రౌడీతో ఇందాక ఒక లేడీ ఇక్కడికి వచ్చారు కదా ఆవిడ ఏమైంది అని అడుగుతాడు అప్పుడు మా బాస్ పంపించేశాడుగా ఆ అమ్మాయికి చెప్పేసి ఏదో ఒకటి అని అంటాడు. అయితే తను క్షేమంగా వెళ్లిపోయిందా అని అంటాడు అవును మా బాస్ పంపించేసాడు ఇంటికి వెళ్లి పోయిందా అమ్మాయి అని అంటే ఇంతకీ ఆమె ఎవరో కాదు నా భార్య నన్ను చూడడానికి వచ్చింది. నిన్ను తలపెట్టుకొని బాధపడాలని ఉంది పద్మావతి నిన్ను నన్ను ఈ కాలం దూరం చేస్తుంది ఈ పరిస్థితులన్నీ మనిద్దరిని విడిగా ఉండేలా చేస్తున్నాయి కానీ నేను ఎప్పటికైనా నేను కలుస్తాను నీ ప్రేమ నాకు కావాలి పద్మావతి అని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు పద్మావతి కూడా ఒక్కతే గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది అప్పుడే అటుగా వచ్చిన అరవింద పద్మావతి బాధ చూసి ఎందుకు పద్మావతి ఎంత బాధ పడుతున్నావు అని అంటే ఒకసారి విక్కీకి ఫోన్ చేయండి వదిన తనతో మాట్లాడితే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు అని అంటుంది నా ఫోన్లో నుంచి చేస్తే దాన్ని లిఫ్ట్ చేయరు మీరు చేయండి అని అంటే అరవింద ఫోన్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయడు. విక్కీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పద్మావతి తన చేయగానే కచ్చితంగా నీతో మాట్లాడి ఇస్తాను అని అంటే నాకు దానితో మాట్లాడడం చూడాలనిపించడం నా బాధ చెప్పలేకపోతున్నాను వదిన అని అంటే మీ ఇద్దరు ఒకరికి ఒకరు ప్రేమించుకున్నారు మీ ప్రేమే మిమ్మల్ని కలుపుతుంది అని అరవింద్ చెప్తుంది. పద్మావతి బాధపడుతుంటే అరవింద ఓదారుస్తుంది ఇక మరుసటి రోజు ఎలాగైనా సరే అక్కడ వాళ్లతో మాట్లాడి నేను విక్కీ తో ఫోన్ చేయిస్తాను కచ్చితంగా మాట్లాడిస్తాను అని మాట ఇచ్చి మీరు ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది.

Nuvvu Nenu Prema Today Episode April 6 2024 Episode 591 highlights
Nuvvu Nenu Prema Today Episode April 6 2024 Episode 591 highlights

ఇక మరోవైపు కృష్ణ ఉదయం తెల్లవారి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఎవరూ లేకుండా చూసి రౌడీ దాస్ కు ఫోన్ చేసి విక్కీ ప్లేస్ మార్చారా అని అడిగితే మార్చాను అని చెప్తారు దాస్. ఈసారి కనుక నిన్న జరిగిన సీ ఇంటి పీట అయితే మీకు నేను ఏం చేస్తానో కూడా తెలియదు అని కృష్ణ దాస్ ని బెదిరిస్తాడు దాంతో బాస్ మీరు చెప్పినట్లే చేస్తాము అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక అక్కడికి వచ్చిన దివ్య ఏమైంది బావ అంత టెన్షన్ గా ఉన్నావు అని అడిగితే ఏం లేదు నిన్న కొంచెం ఉంటే పద్మావతికి దొరికి పోయే వారిని పద్మావతి నా మీద అనుమానంతో నా వెనకాలే వచ్చింది. కొంచెం తప్పించుకున్నాను చావు దొబ్బి కను పోయినట్టు అయింది నా పరిస్థితి అని అంటే వామ్మో ఎలా బావ ఎలా తప్పించుకున్నావు అని అంటే అక్కడ జరిగింది చెప్తాడు కృష్ణ పద్మావతి తో జాగ్రత్తగా ఉండాలి పద్మావతి గురించి నీకు పూర్తిగా తెలియదు కానీ ఆడ శివంగి లాంటిది ఏమన్నా తేడా వచ్చిందా అని అంటే ఇక అంతె అప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుంటుంది దివ్య. ఇక ఇద్దరు కంగారు పడుతూ ఉంటే అప్పుడే అక్కడికి అరవింద వచ్చి ఏంటి మీ బావతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నావు అని అడుగుతుంది దాంతో ఏం చెప్పాలో తెలియక దివ్య కంగారు పడుతూ ఉంటుంది కానీ కృష్ణ మాత్రం ఎక్కడ దివి నిజం చెప్తుందో అని భయపడతాడు దివ్య కవర్ చేస్తూ ఏం లేదు అక్క బావ నన్ను చదువు మానేసి వంటలు చేసుకోమంటున్నాడు నేను కూడా లాయర్ అయ్యి నీ మీద అనే నేను వాదిస్తాను బావ అని బెదిరిస్తున్నాను అందుకే నాతో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అని అంటుంది. మీ బావ మరదలు ముచ్చట్లు ఆడుకుంటున్నారే అని అరవింద అంటూ ఉండగా అక్కడికి పద్మావతి ఆర్య అందరూ వస్తారు ఇక అందరికీ టిఫిన్ వడ్డించు అని ఆర్య అంటాడు అప్పుడే పద్మావతి బావగారు మీరు ఒకసారి విక్కీకి ఫోన్ చేయండి నేను ఫోన్ చేస్తే కలవట్లేదు తనతో నేను మాట్లాడాలి అని అంటే అక్కడే ఉన్న అరవింద నువ్వు ఎలాగైనా సరే ఈరోజు విక్కీ నీ కాంటాక్ట్ అయ్యే పద్మావతి తో మాట్లాడించాలి నేను తనకి మాట ఇచ్చాను ఈరోజు ఎలాగైనా పద్మావతి తో మాట్లాడాలి అని అంటుంది. దాంతో ఆరు ఆ కచ్చితంగా నేను మాట్లాడేలా చేస్తాను పద్మావతి నువ్వు హ్యాపీగా ఉండు ఒక గంటలో విక్కీ చేత నీకు ఫోన్ చేయిస్తాను అని అంటాడు. ఇక కృష్ణ ఎలాగైనా సరే ఇది చెడగొట్టాలి అనుకొని అవును మీరు ఎందుకు తనని డిస్టర్బ్ చేస్తున్నారు పాపం తను ఆఫీస్ పని మీద వెళ్ళాడు తన ఫోన్ కలవట్లేదు అంటే తను చాలా బిజీగా ఉన్నట్లు కదా మీరు డిస్టర్బ్ చేయమాకండి మళ్ళీ తన కోపం వస్తుంది అని అంటాడు కృష్ణ. దాంతో ఆర్య కోపంగా బావ మీరంటే క్రిమినల్ కాబట్టి మీకు ప్రేమలో అభిమానాలు తెలియదు కానీ మా విక్కీ అలా కాదు ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడుతాడు పద్మావతి అంటే తనకి చాలా ఇష్టం కచ్చితంగా మాట్లాడుతాడు అని చెప్తాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode April 6 2024 Episode 591 highlights
Nuvvu Nenu Prema Today Episode April 6 2024 Episode 591 highlights

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి వాళ్లు ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తారు. ఆ మెడికల్ షాప్ దగ్గరికి ఒక రౌడీ వచ్చి విక్కీకి కావాల్సిన మందుల్ని తీసుకొని వెళ్తాడు. ఆ మందుని చూసి పద్మావతి గుర్తు పడుతుంది. ఇవన్నీ విక్కీ వాడే మందులు కదా అంటే ఈ రౌడీని ఫాలో అయితే మనకి విక్కీ ఎక్కడుందో తెలిసిపోతుంది అని అంటుంది దాంతో కుచల పద్మావతి ఇద్దరు బండి మీద రౌడీని ఫాలో అవుతారు. ఇద్దరూ రౌడీతోపాటు విక్కీ ఉన్న ప్లేస్ కి వెళ్తారు మరి విక్కిని చూసారో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri