NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema June 04 Episode 641: పాప అన్నప్రాసనకి కుచల ఒప్పుకోనుందా? విక్కీ ముందే పద్మావతిని ఇష్టపడుతున్న యశోదర్..ఆఫీసులో ప్రాబ్లం..?

Nuvvu Nenu Prema Today Episode June 04 2024 Episode  641 highlights

Nuvvu Nenu Prema June 04 Episode 641:  విక్కీ పద్మావతి ఇద్దరు ఆఫీస్ కి రెడీ అవుతారు. పద్మావతి అద్దం ముందు నుంచి ఎంతసేపటికి లేవకపోవడంతో విక్కి, నేను ఆఫీస్ కి వెళ్ళాలి నువ్వు ఒక్కదానివే కాదు తప్పుకో అని అంటాడు. అయినా నీకు పెళ్లి కాలేదు అంటే బాస్ ఎలా నమ్మాడో నాకు అర్థం కావట్లేదు. మెడలో తాళి కాలికి మెట్టెలు అని చూసి ఆశ్చర్యపోతాడు తీరా చూస్తే అవి రెండు పద్మావతి మెడలో ఉండవు అదేంటి మెడలో తాళి లేదు అని అడుగుతాడు పద్మావతి గోడకు వేలాడదీసి ఉంది అని చూపిస్తుంది దాంతో విక్కి నువ్వు ఇలా మోసం చేస్తున్నావా అని అడుగుతాడు. ఎలా చేయాలో నాకు తెలుసు అని అంటుంది అయినా నీతో నాకు మాటలు ఏంటి అని అనుకుంటాడు మీరు ఎప్పుడూ నన్ను నా మనిషివి కాదు నీకు నాకు సంబంధం లేదు అని అంటూ ఉంటే నాకు ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు అర్థమైంది కదా అని అంటుంది నువ్వు ఎలా ఉన్నా నాకేం పర్వాలేదు అయినా నిన్ను చూస్తే ఎవరైనా ఆంటీ అనుకోవాల్సిందే అమ్మాయిని ఎవరు అనుకోరులే అని అంటాడు మిమ్మల్ని చూస్తే తాతయ్య అనుకుంటారు అని అంటుంది పద్మావతి ఇద్దరు అలా గిల్లికజ్జాలు ఆడుకుంటూ ఉంటారు. ఇక ఇద్దరు కలిసి ఆఫీసుకి బయలుదేరి బయటికి వస్తారు.

Nuvvu Nenu Prema Today Episode June 04 2024 Episode  641 highlights
Nuvvu Nenu Prema Today Episode June 04 2024 Episode  641 highlights

పదవికి ఇద్దరు ఒకే బస్టాప్ లో నుంచొని ఉంటారు పద్మావతి వికీ ని చూసినవ్వుతుంది కానీ విక్కీ మాత్రం నవ్వడు తెలిసిన మనిషి ఎవరైనా కనిపిస్తే నవ్వాలని కూడా తెలియదు నా భర్త అయ్యుండి కనీసం నేను నవ్వినా కూడా నవ్వడు అని అనుకుంటుంది పద్మావతి కొంతసేపటికి అక్కడికి నలుగురు పిల్లలు వచ్చి విక్కీని అంకుల్ అని పిలుస్తారు. ఆ మాటకు పద్మావతి నవ్వుతుంది టైం ఎంత అయింది అని అడుగుతారు పిల్లలు విక్కి నా దగ్గర వాచ్ లేదు అని చెప్తాడు దాంతో పిల్లలు బస్టాప్ లోకి వెళ్లి కూర్చుంటారు. వికిని అంకుల్ అని పిలిచేసరికి పద్మావతి నవ్వుతూనే ఉంటుంది ఎందుకో అంత ఇరగబడిన అవుతున్నావు అని అడుగుతాడు. మిమ్మల్ని ఎవరైనా చూస్తే ఇంకా పెళ్లి కాలేదా అని అనుకుంటారు అని అన్నారు కదా ఇప్పుడు వాళ్ళు వచ్చి అంకుల్ అని పిలిచారు కదా అందుకనే అని అంటుంది పద్మావతి. నాక్కూడా నవ్వే టైం వస్తుంది అప్పుడు చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుంటాడు విక్కి. ఇక అప్పుడే యశోద ర్ కారులో ఆఫీస్ కి వెళ్తూ, పద్మావతిని చూసి పద్దు నువ్వు ఇక్కడ ఉన్నావా? రండి నేను ఆఫీస్కే కదా వెళ్లేది అని అంటాడు. పర్వాలేదు సార్ నేను బస్సులో వస్తాను అని అంటుంది ఏం పర్లేదు ఆఫీసులో వాళ్ళు ఎవరు కనిపించినా నేను ఎక్కించుకుంటాను కారు మీరే కాదు కదా రండి పర్వాలేదు అని అంటాడు. విక్కీ కోపంగా చూస్తూ ఉంటాడు పద్మావతి వికీ వైపు చూసి కోపం వచ్చినట్టుంది అని అనుకుంటుంది. కానీ యశోదర్ మాట కాదని లేక పద్మావతి కారు ఎక్కడానికి వెళ్తుంది. పద్మావతి కారులో కూర్చొని విక్కీ గారు మీరు కూడా రండి కూర్చోండి అని అంటుంది అప్పటిదాకా యశోదర్ విక్కి ని చూడడు, ఓహో విక్రమాదిత్యగాడు కూడా ఇక్కడే ఉన్నారా రండి రండి అని అంటాడు. కావాలనే విక్కీ రాకుండా ఉంటాడు బాస్ చాలాసార్లు పిలుస్తాడు. రండి పర్వాలేదు వచ్చి కార్ ఎక్కు అని అంటాడు దాంతో విక్కీ కూడా వచ్చి కార్ ఎక్కుతాడు. యశోదర్ వెనక సీట్ల ఎందుకు ముందు సీట్ల కూర్చోండి అని అంటాడు. అదంతా చూసి విక్కీ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మీరు వెనకాల కూర్చుంటే నేను డ్రైవర్ అవుతాను అదే మీరు ముందు కూర్చుంటే మీరు నాతో పాటు కలిసి ప్రయాణం చేయొచ్చు అని అంటాడు. విక్కీ వెనకాల కూర్చుంటాడు. పద్మావతి యశోద ర్ పక్కన కూర్చోగానే యశోదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.

Nuvvu Nenu Prema Today Episode June 04 2024 Episode  641 highlights
Nuvvu Nenu Prema Today Episode June 04 2024 Episode  641 highlights

ఇక ముగ్గురు కలిసి కారులో ఆఫీసుకు బయలుదేరుతారు. మీరిద్దరూ ఒకే బస్టాప్ లో ఉన్నారు మీ ఇల్లు ఇక్కడేనా అని అడుగుతాడు ఇద్దరినీ పద్మావతి మా ఇల్లు అయితే ఇక్కడే వాళ్ళ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు అని అంటుంది. విక్కీ కోపం వస్తుంది. విక్కీ కావాలనే తన బాస్ తో మీకు పెళ్లయిందా అని అడుగుతాడు దానికి వెంటనే లేదు అని అంటాడు యశోద ర్, పద్మావతి వైపు చూస్తూ యశోదర్ మీకు ఎలాంటి అబ్బాయి కావాలి అని అడుగుతాడు వెంటనే విక్కీ నేను నిన్ను ప్రశ్నిస్తే నువ్వు తనని అడుగుతావేంట్రా అని మనసులో అనుకుంటాడు. పద్మావతి విక్కి వైపు చూసి ఇదే కరెక్ట్ టైం ఇప్పుడు చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుంటుంది. నాకు ఎలాంటి అబ్బాయి కావాలంటే, హ్యాండ్సమ్ గా ఉండాలి మంచి గా చదువుకొని ఉండాలి. కోపం అస్సలు ఉండకూడదు నన్ను ప్రేమగా చూసుకోవాలి రోజు మల్లెపూలు తీసుకురావాలి. నేనే చేసిన తనకి నచ్చేలా ఉండాలి నన్ను నన్నుగా ప్రేమించే వాళ్ళు కావాలి అని అంటుంది. తప్పకుండా మీకు అలాంటి వాళ్లే దొరుకుతారు ఒకసారి మనం మనసులో సంకల్పం చేసుకుంటే పంచభూతాలు ఏకమయ్యి మనం అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కలుపుతారు అని అంటాడు యశోదర్, ఆ మాటలకి విక్కీకి కోపం వస్తుంది సార్ మీకు ఎక్కడో కాలుతున్న వాసన వస్తుందా అని అడుగుతుంది పద్మావతి నాకేం రావట్లేదు అని అంటాడు. పద్మావతి కావాలని వికీవైపు చూస్తుంది విక్కీకి కోపం వచ్చిందని పద్మావతికే అర్థం అవుతుంది కావాలనే విక్కి కోపం తెప్పించడానికి అలా మాట్లాడుతుంది. నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను అని విక్కీ మనసులో అనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode June 04 2024 Episode  641 highlights
Nuvvu Nenu Prema Today Episode June 04 2024 Episode  641 highlights

ఇక మరోవైపు అను ఆర్యతో నేను మిమ్మల్ని ఒక విషయం గురించి అడగాలనుకుంటున్నాను అది మీకు ఇష్టం ఉంటేనే చేద్దాము లేదంటే లేదు అని అంటుంది. నువ్వు ఏం మొహమాట పడకుండా నన్ను అడగొచ్చు అని అంటాడు ఆర్య. ఏం లేదండి మన చిట్టి పాపకి పేరు పెట్టి బారసాల చేద్దాము అని అంటుంది. మనకు ఉన్నంతలోనే చేద్దాము ఎక్కువ ఆర్భాటాలు ఏమీ వద్దు మనకి డబ్బులు ఎలా దొరికితే అలా చేద్దాము బాగా డబ్బులు దొరికితే గ్రాండ్గా చేద్దాము కొంచమే డబ్బులు ఉంటే మామూలుగా చేద్దాము అని అడుగుతుంది వెంటనే ఆర్య అలాగే అను దాంట్లో ఏముంది మనం పాపకి బారసాల చేద్దాము నీ ఇష్టప్రకారమే కానిద్దాం అని అంటాడు వెంటనే అక్కడికి కుచల వచ్చి ఆ అవును కానిద్దాం ఎందుకు అనాధ పిల్లలకి ఇంత ఆర్భాటాలు, అయినా డబ్బులు లేవు కానీ మీసాలకు సంతంగ నూనె కావాలని మన చేతిలో రూపాయి లేదు కానీ ఇప్పుడు బారసాల గ్రాండ్గా చేస్తాడంట ఆమె అడగడం నువ్వు చేయడం బాగుంది అని వెటకారంగా మాట్లాడుతుంది కుచల. అప్పుడే అక్కడికి నారాయణ కూడా వస్తాడు నేను అనుకున్నాను నువ్వు ఇలా మాట్లాడక ఎలా మాట్లాడుతావు నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవు కదా ఏదో వాళ్ళ చిన్నపిల్లలకి బారసాలు చేద్దాం అనుకుంటున్నారు దాంట్లో తప్పేముంది అయినా అతను నువ్వు కావున కాదన్నా ఆర్య కి కూతురు ఆ పాపకి తల్లి అలాంటప్పుడు వాళ్ళ బాధ్యతని వాళ్ళు నెరవేరుద్దాం అనుకుంటే నువ్వు మధ్యలో అడ్డు పెడతావ్ ఏంటి అని అంటాడు వెంటనే మీరు ఇక్కడే ఉన్నారా అయినా నేనేం అనలేదు. ఆర్భాటంగా చేయాల్సిన అవసరం లేదు అని అన్నాను అని అంటుంది నా మనవరాలికి నేను ఆర్భాటంగానే చేస్తాను ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అని అంటాడు నారాయణ ఆ మాటలకు కుచల ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని వెళ్ళిపోతుంది. నారాయణ అను ఆర్యాలతో మనం పాప బారసాల గ్రాండ్గా చేద్దాం మీరు ఏర్పాట్లు చేసుకోండి అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode June 04 2024 Episode  641 highlights
Nuvvu Nenu Prema Today Episode June 04 2024 Episode  641 highlights

ఇక ఆఫీసులోకి వెళ్లిన తర్వాత పద్మావతిని చూసి గాయత్రి విక్కీ ఎక్కడ అని అడుగుతుంది. ఏమో నాకు తెలీదు అంటుంది పద్మావతి. చేతిలో బాక్స్ చూస్తుంది పద్మావతి ఆ బాక్స్ ఏంటి అని అడుగుతుంది గాయత్రిని ఇది వ్యక్తి కోసం నేను హల్వా చేసి తీసుకొచ్చాను అని అంటుంది. విక్కీ కోసమా అని అంటుంది పద్దు అవును విక్కీ కోసమే ఇప్పుడు హల్వా పెడతాను ఆ తర్వాత భోజనం పెడతాను ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను ఆ తర్వాత అని అంటుంది ఇక అక్కడితో ఆపేసేయ్ అని అంటుంది పద్దు నీకేమైంది అని అంటే ఇంక నాకు పని ఉంది అని అంటుంది. అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు. విక్కీ గారు అని పిలుస్తుంది గాయత్రి కావాలని విక్కీ కూడా పద్దు ముందుగా ఉంటూ ఉంటాడు. ఇప్పుడు చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుంటాడు విక్కీ గాయత్రి దగ్గరికి వెళ్లి ఏంటి పిలిచావు అని అడిగితే మీకోసం హల్వా చేసి తీసుకొచ్చాను అని అంటే నాకోసం హల్వా చేసావా నాకు ఎంత ఇష్టమో తెలుసా హల్వా అని కావాలని బాక్స్ తీసుకుని టేస్ట్ చేసి హల్వా చాలా బాగుంది ఎంత స్వీట్గా ఉందో అని అంటాడు ఆ మాటలకు పద్మావతి హల్వా తీయగా ఉండగా హాట్ గా ఉంటుందా ఏంటి అని అనుకుంటుంది మనసులో, గాయత్రి మాత్రం నిజంగా విక్కీ తనని ఇష్టపడుతున్నాడని మనసులో అనుకుంటుంది నేను ఇచ్చిన హల్వా మీరు బావుంది అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటే నిజంగా నువ్వు హల్వా చాలా బాగా చేశావు గాయత్రి అని అంటాడు ఇక అప్పుడే మూర్తి వచ్చి ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అవతల బాస్ పిలుస్తున్నాడు కొంచెం సేపట్లో ప్రాజెక్ట్ కి మనం ఇవ్వాల్సిన ప్రజెంటేషన్ ఇవ్వాలి కదా అని అంటాడు. వస్తున్నాను అని చెప్పి విక్కీ కాసేపు ఆగి వచ్చి మళ్లీ హల్వా తింటాను నీకు ఇక్కడ ఏమైనా కాలిన వాసన వస్తుందా అని గాయత్రి అడుగుతాడు నాకేం రావట్లేదు సార్ అని అంటే పద్మావతి వైపు చూసి నాకు వస్తుంది అని వెళ్ళిపోతాడు. మరోవైపు ఆఫీసులో మోడల్ రాలేదని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు విక్కి అక్కడికి వెళ్లి ఏంటి మోడల్ ఇంకా రాలేదా అని అంటే రాలేదు సార్ అని అంటే ఇప్పటిదాకా చెప్పకుండా ఏం చేస్తున్నారు అని విక్కీ కోపడతాడు. ఇప్పుడు కాసేపట్లో ప్రజెంటేషన్ మొదలు అయిపోతుంది. ఇంత వాడికి మోడల్ దొరకలేదంటే ఎలాగో అంటే నేను వేరే వాళ్ల కోసం ట్రై చేస్తున్నాను అని అంటాడు ఆఫీసులో ఎంప్లాయ్ ఇక అప్పుడే అక్కడికి యశోద గాయత్రి ఇద్దరు వస్తారు. యశోదర్ ఏమైంది అని అడిగితే, మోడల్ కాలు జారి కింద పడిందట సార్. ఇప్పుడు తను ఇక్కడికి రావట్లేదు అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode June 04 2024 Episode  641 highlights
Nuvvu Nenu Prema Today Episode June 04 2024 Episode  641 highlights

విక్కి అవునా ఇప్పుడు ఇలా అంటే ఎలాగో ఇప్పటికి ఇప్పుడు మనకు వేరే వాళ్ళు ఎలా దొరుకుతారు అని అంటాడు యశోదర్, అప్పుడే పద్మావతి యశోదర్ దగ్గరికి ఫైల్ తీసుకొని సంతకానికి వస్తూ ఉంటుంది యశోదర్ పద్మావతిని చూసి అలా నే ఉండిపోతాడు. యశోదర్ ని పద్దు సంతకం చేయమని అడిగితే నేను మిమ్మల్ని ఒక ఫీవర్ అడగొచ్చు అని అంటాడు యశోదర్, ఏంటో చెప్పండి అని అంటుంది మీరు నాకు సహాయం చేసి తీరాలి అని అంటాడు. ఏంటో చెప్పండి నాకు వీలైతే చేస్తాను అంటుంది అప్పుడే ఈరోజు మోడల్స్ రాలేదు మీరు మన ఫ్యాబ్రిక్ సారీ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన ప్రజెంటేషన్లో మీరే మోడల్ గా ఉండాలి అని అడుగుతాడు. ఆ మాటలకు విక్కీ షాక్ అవుతాడు పద్మావతి వైపు చూసి చేయను అని చెప్పు అని అంటాడు. పద్మావతి నేనా నేను చేయలేను అని అంటుంది. వెంటనే విక్కీ కూడా అవును సర్తం చేయలేను అంటుంది కదా ఆమె కన్నా గాయత్రి చాలా బాగుంటుంది గాయత్రితో చేయుము అని అంటాడు. నీకు తెలుసా నాకు తెలుసా విక్కీ నా కళ్ళతో ఒకసారి పద్మావతిని చూడు ఎంత బాగుంటుందో అని అంటాడు విక్కి ఆ మాటలకు విక్కీ కోపం వస్తుంది గాయత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది విక్కీ నన్ను అందరి ముందు పొగిడాడు అని చాలా సంతోషపడుతుంది ఇక పద్మావతి చూసి, తను వద్దు అని చెప్తుంటే యశోధర్ వైపు చూస్తూ ఓకే చెప్పడం చాలా కష్టంగా అనిపిస్తుంది. విక్కీని బాస్ గమనిస్తాడు ఏంటి నువ్వు తనకింద పనిచేస్తున్నావా తను నీ కింద పని చేస్తుందా తనని కమాండ్ చేయాలని చూస్తున్నావు నేను ఇక్కడే ఉన్నాను నా కళ్ళ ముందే తనని ప్రాజెక్ట్ చేయడానికి వద్దని చెప్తున్నావు అని అంటాడు యశోదర్, అంటే గాయత్రి ఉంది కదా అని అంటాడు విక్కీ నా కళ్ళతో చూడమని చెప్పాను కదా అని అంటాడు యశోదర్ అయినా మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉన్నట్టుంది అని అంటాడు మూర్తి. అలాంటిదేం లేదు అని అంటాడు ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి విక్కీ ని కాదని పద్మావతి అందరి ముందు మోడల్గా నటిస్తుందా లేదంటే విక్కీ మాటకి కట్టుబడి చేయకుండా వెళ్ళిపోతుందా తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella