NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema June 05 Episode 642: పద్మావతి కి బంపర్ ఆఫర్ ఇచ్చిన యశోదర్.. విక్కీ కోపం.. పద్మావతి ఫోటో సుగుణ చూడనుందా?

Nuvvu Nenu Prema Today Episode June 5 2024 Episode 642 highlights

Nuvvu Nenu Prema:విక్కీ పద్మావతి ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేయడంతో ఇద్దరు ఎవరికివారు అన్నట్లుగానటిస్తూనటిస్తూ ఉంటారు. ఆఫీసులో మోడల్ రాకపోవడంతో పద్మావతిని, ప్రాజెక్టులో మోడల్ గా చేయమని యశోదర్ రిక్వెస్ట్ చేస్తాడు. మనకి ఈ ప్రాజెక్ట్ చాలా ముఖ్యమని, సారీస్ ఇంపోర్ట్ చేయడంలో ఈ ప్రాజెక్టు డిజైనర్ పాత్ర ఎంతో ఉంటుందని దానికి నువ్వు మాత్రమే సరిగ్గా చేయగలవని నువ్వు చాలా బాగుంటావు కాబట్టి నువ్వు ఈ ప్రాజెక్టు చేస్తే చాలా బాగుంటుంది అని అందరి ముందు యశోదర్ పద్మావతి తో చెప్తాడు. పద్మావతి ఎస్ చెప్పాలా నువ్వు చెప్పాలో తెలీక విక్కీ వైపు చూస్తుంది విక్కీ నో చెప్పమని చెప్తాడు అది యశోదర్ గమనిస్తాడు. ఏంటి పద్మావతిని నువ్వు కమాండ్ చేస్తున్నావు మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా ఎందుకు తను నిన్ను ఆపాలని చూస్తున్నాడు నేను ఇక్కడ బాస్ ని నేను చెప్తే మీరు వినాలి కదా అలాంటిది నిన్నెందుకు తను సైగ చేస్తున్నాడు చేయొద్దని, అడుగుతాడు యశోదర్ వెంటనే విక్కి సార్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎందుకు తనని చేయొద్దన్నానంటే పద్మావతి మోడలింగ్ ఫీల్డ్ అలవాటు లేదు కాబట్టి, తను సరిగా చెయ్యలేదు కాబట్టి మనం సరిగ్గా చేసిన తన వల్ల ఈ ప్రాజెక్టు ఎక్కడ మిస్ అయిపోతుందో అని నా బాధ అని చెప్తాడు. మోడల్ సరిగ్గా లేకపోతే జనాలకి సరిగ్గా మన ప్రాజెక్ట్ రీచ్ అవ్వదు కదా అని అంటాడు. అదే నా భయం సార్ అందుకే పద్మావతి వద్దు అని అంటున్నాను తనకి మోడలింగ్ మీద అంత అవగాహన లేదు కాబట్టి అని అంటాడు. యశోద విక్కి వైపు చూసి అంటే మోడలింగ్ గురించి నాకంటే నీకే బాగా తెలుసు అని అంటాడు. నా ఉద్దేశం అది కాదు సార్ అని అంటాడు విక్కీ ఆ అమ్మాయిని సరిగ్గా చూడు, నా కళ్ళకి పద్మావతి ఎలా కనిపిస్తుందో తెలుసా, దేవకన్యలా ఉంది అని పద్మావతిని విక్కీ ముందు పొగుడుతాడు. సార్ మీరు రిస్క్ చేస్తున్నారు అని అంటాడు వికీ. రిస్క్ చేయకపోతే సక్సెస్ రాదు అని అంటాడు యశోదర్. పద్మావతి నువ్వెళ్ళు విక్కి వైపు చూడాల్సిన పని లేదు వెళ్ళు అని అంటాడు. సారు మీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది కానీ తప్పక వెళ్తున్నాను అని మనసులో అనుకొని పద్మావతి లోపలికి వెళ్తుంది. మూర్తి ఏంటయ్యా విక్కీ నువ్వేం ఎలా అయిపోతున్నావు అని అంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని ఈ కంపెనీ గుడ్విల్లి మనం పాడు చేస్తున్నాము అని నా మనసు చెప్తుంది అని అంటాడు విక్కీ సార్ ఇంత వాడికి ఏ డెసిషన్ తీసుకున్న అది కరెక్ట్ గానే ఉంటుంది నువ్వేం టెన్షన్ పడకల పద్మావతి ఇప్పుడు రెడీ అయి వస్తుంది చూడు అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode June 5 2024 Episode 642 highlights
Nuvvu Nenu Prema Today Episode June 5 2024 Episode 642 highlights

ఇంకా పద్మావతి సారీస్ కి మోడలింగ్ చేయడానికి ఒకసారి నీ కట్టుకొని వస్తుంది. పద్మావతిని చూసి యశోదర్ విక్కి ఇద్దరు ఆశ్చర్యపోతారు. విక్కీ ముందే పద్మావతిని ఎలా నే చూస్తూ ఉండిపోతాడు. చాలా బాగున్నావు పద్మావతి నువ్వు అని విక్కీ ముందే పొగుడుతూ ఉంటాడు. చూడు వికీ చూడు నేను చెప్పాను కదా పద్మావతి మన సారీస్ లో అద్భుతంగా ఉంటుందని. నువ్వు ఎలాంటి మోడల్ తీసుకొచ్చిన ఇంత అందంగా అయితే మాత్రం ఉండదు. అది మాత్రం నిజం అని నాకు తెలుసు అని మనసులో అనుకుంటాడు విక్కి. చెప్పు విక్కీ నేను చెప్పింది నిజమే కదా అని అంటాడు. మీరు చెప్పినంత కాకపోయినా యావరేజ్ గా ఉంది పద్మావతి అని అంటాడు విక్కీ కన్ఫామ్ నీకు టేస్ట్ లేదని నాకు అర్థమైంది. అని అంటాడు యశోదర్ మీరందరూ చెప్పండి అని ఎంప్లాయిస్ ని అడుగుతాడు. సూపర్ గా ఉందని వాళ్ళందరూ చెబుతారు దాంతో పద్మావతి ఇంక నువ్వు వెళ్ళు అని అంటాడు. విక్కి పద ఫొటోస్ తీ అని అంటాడు ఇక పద్మావతిని విక్కీ ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అప్పుడే యశోదర్ పద్మావతి దగ్గరికి వెళ్లి తన హెయిర్ ని సరి చేస్తూ ఉంటాడు. పద్మావతికి దగ్గరుండి మేకప్ చేస్తూ ఉంటాడు అది చూసి విక్కీ చాలా కోపంగా పద్మావతి వైపు చూస్తూ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఏదో మిస్సయింది పద్మావతి అని అనుకుంటూ ఉంటాడు యశోదర్, ఒక స్టికర్ ప్యాకెట్ ఇవ్వు అని తన ముఖాన బొట్టు పెడతాడు. పద్మావతి భయం గానే ఉంటుంది విక్కీ పద్మావతి వైపు కోపంగా చూస్తుంటే తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఇటు వెక్కికి చెప్పలేదు అటు తన బాస్ కి చెప్పలేదు ఇక తన టెన్షన్ పడుతూ ఉంటుంది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వికీ ఇప్పుడు ఫొటోస్ తియ్యి అని యశోదర్ పక్కకు వెళ్తాడు. విక్కీ పద్మావతిని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. కొంచెం రైట్ కి తిరగండి కొంచెం లెఫ్ట్ కి తిరగండి అని పద్మావతిని ఫొటోస్ తీస్తాడు. ఆ ఫొటోస్ చూస్తూ విక్కి చాలా అందంగా ఉంది పద్మావతి అని అనుకుంటాడు. కానీ వాడు నిన్ను పొగుడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను పద్మావతి అని మనసులో అనుకుంటాడు. అన్ని ఫొటోస్ ని బాస్ చూస్తాడు తీసుకురా అని అంటాడు మూర్తి. యశోదర్ అన్ని ఫొటోస్ చూసి వావ్ చాలా బాగుంది అని అంటాడు. నేను ఇప్పటివరకు వర్క్ చేసిన మోడల్స్ అందరూ ఇంత ట్రెడిషనల్ గా ఎవరు కనిపించలేదు అని అంటాడు. మూర్తి మీ జడ్జిమెంట్ ఎప్పటికీ రాంగ్ కాదు అని అంటాడు. ఫోటోషూట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయండి నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోతాడు.

Nuvvu Nenu Prema Today Episode June 5 2024 Episode 642 highlights
Nuvvu Nenu Prema Today Episode June 5 2024 Episode 642 highlights

ఇక మరోవైపు పద్మావతి ఇంటికి వస్తుంది.నేనేం కోపం చేశానని ఎప్పుడూ నా మీద కోప్పడుతూ ఉంటాడు అని అనుకుంటుంది పద్మావతి. నిజంగా నేను ఆ శారీలో బాగా లేకపోతే ఇంటికి వచ్చాక చెప్పాలి కానీ అంత మందికి నచ్చినా కూడా అనే నేను మాత్రం నచ్చలేదు ఆఫీసులో అందరి ముందు బాగోలేదని ఇలా చెప్పాడు అని అనుకుంటూ ఉంటుంది. ఈ విషయమే కాదు ఈమధ్యనేను ఈయనకు అసలు నచ్చట్లేదు అని అనుకుంటుంది అప్పుడే విక్కీ పద్మావతి దగ్గరికి వచ్చి నేను అనవసరంగా ఆఫీసులో ఎక్కువ చేశానా తను బాగున్న బాగలేదని చెప్పి తన మనసుని హట్ చేశానా, ఇప్పుడు నేను వెళ్లి తనకి సారీ చెప్పినా తను నా నెత్తినికి కూర్చుంటుంది అలాగని సారీ చెప్పకుండా ఉండలేను అని ఆలోచిస్తూ రావోయి చందమామ అని పాట పాడుతూ ఉంటాడు. పద్మావతి కూడా పాట పాడుతుంది. నేను కోపం లేదు అన్నానని నువ్వేం ఫీల్ అవ్వకర్ల లేదు అసలు తప్పంతా నీదే కదా అని అంటాడు విక్కీ. నేనేం తప్పు చేశాను అని అంటుంది పద్మావతి నేను సారీ కట్టుకోవద్దు అని సైగ చేశాను కదా అయినా నువ్వు ఎందుకు సారీ కట్టుకున్నావు అని అడుగుతాడు. అక్కడున్న సిచువేషన్ గురించి మీకు తెలియదా అని అంటుంది పద్మావతి. టైంకి రాలేదు మీ మోడల్ అలాంటప్పుడు మనం పని చేస్తున్న కంపెనీ గుడ్విల్ మీద అదంతా పడుతుంది. అక్కడ బాస్ రిక్వెస్ట్ చేస్తే నేను ఒప్పుకోకుండా ఎలా ఉంటాను అని అంటుంది పద్మావతి. బాస్ చెప్పినట్లు వింటావా మొగుడు చెప్పినట్టు వింటావా అని అంటాడు.నా గురించి ఆలోచించవా, పరాయి వాళ్ల గురించి ఆలోచించే దాంట్లో కనీసం నా గురించి కొంచమైనా ఆలోచించావా అని అంటాడు అది కాదు సార్ అని పద్మావతి చెప్తూ ఉంటే అప్పుడే పద్మావతికి ఫోన్ వస్తుంది. ఎవరా అని చూస్తే తన బాస్ యశోదర్ పద్మావతికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చూసి విక్కీ అబ్బా ఫోన్ చేసుకునేదాకా వచ్చారా అని అంటాడు. స్పీకర్ ఆన్ చెయ్ ఏం మాట్లాడుతాడు నేను వింటాను అని అంటాడు. పద్మావతి స్పీకర్ ఆన్ చేస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode June 5 2024 Episode 642 highlights
Nuvvu Nenu Prema Today Episode June 5 2024 Episode 642 highlights

ఇక యశోదర్ పద్మావతి కి ఫోన్ చేసి హాయ్ పద్మావతి అని అంటాడు హాయ్ సార్ అని అంటుంది. ఈ టైంలో కాల్ చేసినందుకు సారీ అని అంటాడు. నీకు కాల్ చేయకుండా ఉందామనుకున్నాను కానీ ఉండలేకపోయాను అని అంటాడు. ఎందుకో తెలుసా అని అంటాడు. దానికి రెండు కారణాలు ఉన్నాయి అని అంటాడు అవేంటి సార్ అని అడుగుతుంది పద్దు. అది ఒకటి నువ్వైతే రెండు ఆవిక్రమాదిత్య అని అంటాడు. వెంటనే విక్కీ కోపంగా అసలు ఏం చెప్తాడో విను అని సైగ చేస్తాడు. ఇక బాస్ మాట్లాడుతూ, విక్రమ్ ఆదిత్య లాంటి వరస్ట్ బిహేవర్ వరస్ట్ టేస్ట్ ఉన్న వారిని నేను ఎక్కడా చూడలేదు అని అంటాడు. కనీసం బాస్ అంటే రెస్పెక్ట్ లేకపోయినా ఆడవాళ్ళు అంటే రెస్పెక్ట్ ఉండాలి కదా అని అంటాడు. నువ్వు మన ఫ్యాబ్రిక్ శారీలో దేవతలా ఉన్నావని నేనంటే తను నమ్మట్లేదు. పైగా నిన్ను చూసి అందరూ పొగుడుతూ ఉంటే, తను మాత్రం నచ్చలేదు అని అన్నాడు. అతనికి నీతో ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు కొంచెం ఇగో ఉన్న పర్సన్ లా ఉన్నాడు అని అంటాడు. సరేలే అతని గురించి గుర్తు చేసుకొని ఇప్పుడు డిస్టర్బ్ అవ్వడం ఎందుకు అని అంటాడు యశోధర్. ఇప్పుడే నీ ఫొటోస్ వచ్చాయి చాలా అంటే చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. నీకు సాఫ్ట్ కి సెండ్ చేస్తాను తర్వాత చూడు పద్మావతి ఒక ముఖ్యమైన విషయం అని అంటాడు. ఇకనుంచి నువ్వే మన కంపెనీ ఫ్యాబ్రిక్లి బ్రాండ్ అంబాసిడర్ అని అంటాడు. ఆ మాటలకి విక్కి ఆశ్చర్యపోతాడు పద్మావతి కూడా ఆశ్చర్య పోతుంది. యు నో వన్ థింగ్ త్వరలోనే నీ ఫొటోస్ ఈ సిటీ అంతా మన కంపెనీ బోర్డింగ్ పెట్టిస్తాను అని అంటాడు. విక్కీ వద్దని చెప్పు అని అంటాడు వద్దు సార్ అని అంటుంది పద్మావతి నోటు వరి నాకు నీకంటే బెస్ట్ మోడల్ దొరకదు అని అంటాడు యశోదర్ సరే రేపు నువ్వు ఆఫీస్ కి వచ్చినప్పుడు అన్ని వివరంగా చెప్తాను అని పెట్టేస్తాడు. వెంటనే వికీ కోపంగా విన్నావుగా సిచువేషన్ ఎలాంటి స్టేజ్ కి వచ్చిందో రేపు నీ హోల్డింగ్స్ చూసి జనాలు ఏమనుకుంటారు. విక్రమాదిత్య కి ఫ్యామిలీ ఇన్ రన్ చేయడం చేతకాక అతని భార్యతో మోడలింగ్ చేయిస్తున్నాడు అని అనుకుంటారు. నన్ను అందరూ చేతగాని వాడు ఇలా చూస్తారు అని అంటాడు విక్కి. ఎందుకు మీరు అలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మోడలింగ్ చేస్తున్న వాళ్ళ భర్తలు అందరూ కూడా ఇలానే అనుకుంటున్నారా వాళ్ళందరూ మోడలింగ్ చేయట్లేదా నేనేం కావాలని చేయట్లేదు సిచువేషన్ అలా వచ్చింది అని అంటుంది పద్మావతి. నా మనసుని బాధ పెడితే మీకు ఆనందంగా ఉంటుంది అనుకుంటా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను చీప్ గా ఆలోచిస్తున్నానా అని అనుకుంటాడు విక్కి.

Nuvvu Nenu Prema Today Episode June 5 2024 Episode 642 highlights
Nuvvu Nenu Prema Today Episode June 5 2024 Episode 642 highlights

ఇక ఇంట్లో యశోదర్ పద్మావతి ఫొటోస్ ని చూస్తూ చాలా అందంగా ఉంది అనుకుంటూ ఉంటాడు. ఫొటోస్ చూస్తూ ఇంతకాలం ఇలాంటి అమ్మాయిని మా అమ్మ కోసం తేవాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నా కోసం కూడా ఇలాంటి అమ్మాయి కావాలి అనిపిస్తుంది. నిన్ను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకు వస్తాను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సుగుణ వస్తుంది. జరిగింది తలుచుకుంటే అంతా మాయలా ఉంది అని, నేనిని రోడ్డు మీద వర్షం లో చూసి నిన్ను ఇష్టపడడం ఏంటో నువ్వు నా ఆఫీస్కే వచ్చి ఉద్యోగం అడగడం ఏంటో నేను నీకు ఉద్యోగం ఇవ్వడం ఇప్పుడు ఇలా దగ్గర అయిపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు, కన్ఫామ్ గా మనల్ని డిస్నీ కలుపుతుంది అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే సుగుణ ఆ మాటలన్నీ వింటుంది ఇక కింద పడి ఉన్న పద్మావతి ఫోటో చూసి ఇది కచ్చితంగా ఆ అమ్మాయి ఫోటో అయి ఉంటుంది అని అనుకుంటుంది. నేను నీ మనసులో ఎవరైనా ఉన్నది తెలుసుకుంటాను నా మనసులో మాట నీకు చెప్తాను అని అనుకుంటూ ఉంటే సుగుణ పద్మావతి ఫోటో చూడబోతూ ఉంటుంది. వెంటనే యశోదర్, అమ్మ అనే పద్మావతి ఫోటో సుగుణ చూడకుండా తీసేసుకుంటాడు. నేను అమ్మాయి ఫోటో చూడడం నీకు ఇష్టం లేదు కదా నువ్వు చూపించే వరకు నేను చూడను అని వెళ్ళిపోతుంది సుగుణ. పద్మావతి నీ ఫోటో ఇప్పుడే అమ్మకు చూపిస్తే తన ఎంక్వయిరీ చేసి ఆఫీస్కొచ్చి కూర్చుంటుంది అందుకే ఇప్పుడే నీ ఫోటో చూపించండి నీ మనసులో ఎవరున్నారో తెలుసుకున్నాకే అమ్మతో చెప్తాను అని అనుకుంటాడు. మరోవైపు పద్మావతి ఆఫీస్ కి రెడీ అవుతుంటే దివ్య వచ్చి పదివేలు కావాలి ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లాలి అని అడుగుతుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode June 5 2024 Episode 642 highlights
Nuvvu Nenu Prema Today Episode June 5 2024 Episode 642 highlights

రేపటి ఎపిసోడ్ లో, విక్కీ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే పద్మావతి అక్కడికి వస్తుంది ఏంటి సారు ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. మీరు చాలా ప్రశాంతంగా ఉన్నట్లు ఉన్నట్లు కనిపిస్తుంది అని అంటుంది పద్దు.ఒకసారి భార్య జీవితంలోకి వచ్చిన తర్వాత, భర్త ఎలా ప్రశాంతంగా ఉంటాడు నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను అంటే ఇందులో కొత్త ఏముంది అని అడుగుతుంది పద్మావతి. ఉంది ఇందులో కూడా కొత్తగా ఒకటి ఉంది అని నువ్వు ఈ ఆఫీస్ మానేయాలి ఈ జాబ్ మానేయాలి అని అంటాడు. పద్మావతి ఆశ్చర్య పోతుంది ఇక పద్మావతి తన కుటుంబం కోసం ఉద్యోగం చేస్తుందా లేక తన భర్త కోసం ఉద్యోగాన్ని వదులుకుంటుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella