NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema March 30 2024 Episode 585: విక్కీ వెళ్తున్న ఫ్లైట్ కి యాక్సిడెంట్.. కుప్పకూలిన అరవింద.. దివ్య, కృష్ణల కుట్రకు విక్కీ బలికానున్నాడా ?

Nuvvu Nenu Prema Today Episode March 30 2024 Episode 585 highlights

Nuvvu Nenu Prema March 30 2024 Episode 585: విక్కీ అమెరికా వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని, పద్మావతి దగ్గర ఉండలేక అమెరికా వెళ్లాలని డిసైడ్ అవుతాడు పద్మావతి ఎంత వాదించినా ఎంత నచ్చ చెప్పాలని చూసినా విక్కీ వినకుండా అమెరికా వెళ్ళడానికి, సిద్ధపడతాడు ఇక పద్మావతి చేసేదేం లేక విక్కీ కోసం తను కృష్ణతో పడుతున్న బాధలన్నీ, దివ్యకి జరిగిన మోసాన్ని పద్మావతి వికీకి ఒక లెటర్ లో రాసి ఆ లెటర్ ని విక్కీ డ్రెస్ లో పెడుతుంది. విక్కీ అమెరికా వెళ్లేలోగా కృష్ణుని వచ్చి నిజం చెప్పమని అడుగుతుంది అందుకు కృష్ణ పద్మావతిని నమ్మించి నేను కచ్చితంగా వచ్చి నిజం చెప్తాను అని అంటాడు. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కృష్ణ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పద్మావతి విక్కీని బతిమిలాడుకుంటుంది. అయినా విక్కీ వినకుండా కారులో బయలుదేరుతాడు. ఏర్పాటుకు వెళ్లిన విక్కీ పద్మావతి రాసిన లెటర్ ని చూసి షాక్ అవుతాడు. అనవసరంగా పద్మావతిని అపార్థం చేసుకున్నానని బాధపడతాడు. తన బావ మురళీకృష్ణ నిజస్వరూపం తెలిసి ఎలాగైనా బుద్ధి చెప్పాలని వెనక్కి వెళ్లాలనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 30 2024 Episode 585 highlights
Nuvvu Nenu Prema Today Episode March 30 2024 Episode 585 highlights

ఈరోజు ఎపిసోడ్ లో పద్మావతి విక్కి తనని కాదని తన ఎంత చెప్పినా వినకుండా అమెరికా వెళ్లాడని, పద్మావతి బాధ పడుతూ ఉంటుంది అరవింద దగ్గరికి వచ్చి అరవిందతో తన బాధనుచెప్పుకుంటుంది.అరవింద పద్మావతికి నచ్చ చెప్పాలని చూస్తుంది పద్మావతి నువ్వు విక్కీ ఎంత ప్రేమించుకున్నారో నాకు తెలుసు,తను తప్పనిసరి పరిస్థితిల్లో తను ఇక్కడి నుండి అమెరికా వెళ్లాల్సి వచ్చింది కానీ మిమ్మల్ని దూరం చేసుకోవాలని కాదు అని చెప్తూ ఉంటుంది. మావికీ గురించి నాకు బాగా తెలుసు తన మనసులో ప్రేమని సరిగా బయటికి చెప్పలేకపోవచ్చు కానీ తన ప్రేమించిన వాళ్ల కోసం, ఎంత కష్టమైనా నష్టానైనా తనే భరిస్తాడు అని అరవింద పద్మావతితో చెప్తుంది. తన చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటనని పద్మావతికి చెప్పి విక్కీ ఎంత గొప్పవాడో పద్మావతికి తెలిసేలా చేస్తుంది. నాకోసం మా అమ్మ దగ్గర నిజం చెప్పకుండా దాచి పెట్టాడు తనకి నచ్చిన వాళ్ళ కోసం తనే శిక్ష అనుభవిస్తాడు కానీ తన ప్రేమించిన వాళ్ళకి ఎప్పటికీ శిక్ష వేయరు అంత గొప్ప మనసు నా తమ్ముడు ది, అలాంటివాడు నిన్ను బాధపెట్టడు తన దూరంగా వెళ్లిన తన మనసు ఎప్పుడూ నీతోనే ఉంటుంది. విక్కీ నేను అర్థం చేసుకుంటే చాలు అని అంటుంది అరవింద పద్మావతి తో, మీ ఆయన ఎప్పుడూ నీతోనే ఉంటాడు. ఎక్కువ ఆలోచించకు తొందరలోనే వీరికి వచ్చేస్తాడు మీరు ఫ్రెష్ చేస్తే కలిసి భోజనం చేద్దాం వెళ్ళండి అని పద్మావతి తో అరవింద్ చెప్తుంది. మీకు అరవింద వెళ్ళిన తర్వాత పద్మావతి నా మీద ఉన్న ప్రేమతోనే నన్ను బాధ పెట్టకూడదని, విక్రమాదిత్య గారి ఇక్కడి నుంచి వెళ్లిపోయారా బాధైనా సంతోషమైనా అంతా మీతోనే అని బతుకుతున్నాను, మరి నన్ను ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు ఇది నేను భరించలేకపోతున్నాను మిమ్మల్ని వదిలిపెట్టి ఉండడం నావల్ల కావట్లేదు నావల్ల కావడం లేదు అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode March 30 2024 Episode 585 highlights
Nuvvu Nenu Prema Today Episode March 30 2024 Episode 585 highlights

ఇక మరోవైపు నారాయణ బాధపడుతూ, కొబ్బరి బొండం తాగుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్య ఏంటి నాన్న, భోజనానికి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఏం చెప్తాను అని అంటాడు నారాయణ కింద ఉన్న కూరగాయ ముక్కల్ని చూసి ఇదేంటి నాన్న పచ్చి కూరలు అన్నీ ఇక్కడ పెట్టుకున్నావు డైట్ చేస్తున్నావా ఏంటి అన్నం తినకుండా అని అంటాడు. ఆ మాటలకు ఉన్న ఇది నా ఫుడ్ కాదు ఇదంతా మీ అమ్మ ఏర్పాటు చేసింది నేను ఇప్పుడు సిక్స్ ప్యాక్ చేయడానికి ఇవన్నీ తిని నన్నుఇబ్బంది పెడుతుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన కుచల, నారాయణతో ఏంటి నీ కొడుకుతో మాట్లాడుతున్నావు ఇంకా ఈ కూరగాయలు తినలేదా తొందరగా తినేసేయి అని అంటుంది తన చేతిలో ఉన్న కొబ్బరి బొండం లాక్కొని కుచల తాగేసి నీకు ఇప్పుడు ఇవి తినడం తప్ప వేరే ఆప్షన్ లేదు తొందరగా తినేసి ఎక్ససైజ్ చెయ్యి అని అంటుంది ఈ వయసులో ఎందుకమ్మా నాన్నకి అవసరమా అని అంటే నాకు అవసరం అని అంటుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన అను ఈరోజు మెనూలో మీరు చెప్పినట్టుగా నాటుకోడి పులుసు రొయ్యల వేపుడు అని లిస్ట్ అంతా చదువుతుంది అది విని నారాయణకి నోరూరుతుంది. వెంటనే నారాయణ నాకోసమే అవన్నీ చేయించావు కదా అని అంటాడు. అవి మీ కోసం కాదు చేయించింది నాకు అని అంటుంది. అయినా ఒకరోజు ఉంటే పర్లేదు రేపు మాత్రం ఇలాంటి కండిషన్స్ పెట్టావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటాడు నారాయణ. రేపటి సంగతి రేపు చూద్దాం ఈ రోజు మీరు ఈ కూరగాయలు తిని ఎక్సర్సైజ్ చేయండి నేను వెళ్లి ఆమెను మొత్తం తినేసి వస్తాను అని పదా అని కోడలితో అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode March 30 2024 Episode 585 highlights
Nuvvu Nenu Prema Today Episode March 30 2024 Episode 585 highlights

ఇంకా మరుసటి రోజు ఉదయం అందరూ హాల్లో కూర్చుంటారు. అప్పుడే విక్కీ వెళ్తున్న ఫ్లైట్ కి యాక్సిడెంట్ అయిందని చెప్తారు. ఇక అది చూసి నారాయణ కుశల కంగారు పడుతూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన అరవింద, ఏమైంది బాబాయ్ అని అడిగితే ఫ్లైట్ ఆక్సిడెంట్ అయిందని తెలుస్తుంది వెంటనే అరవింద కళ్ళు తిరిగి పడిపోతుంది. అరవింద కుప్పకూలిపోవడంతో పద్మావతి అరవింద్ ను లేపుతుంది. ఇంకొక అరగంటలోయుఎస్ లో ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్ సాంకేతిక కారణాలతో కుప్పకూలిపోయింది. అని న్యూస్ లో చెప్తారు. ఇందులో వైజాగ్ కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు అని న్యూస్ లో చెప్పడంతో వికీ కూడా ఏదో అయిపోయిందని ఇంట్లో అందరూ కంగారుపడుతూ ఉంటారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది అని చెప్తారు. అరవింద ఏడుస్తూ ఉంటే పద్మావతి నచ్చ చెప్పాలని చూస్తుంది. పద్మావతి మనవికి ఏదైనా జరిగిందేమో అని అంటుంది. ఆయనకేమీ అయి ఉండదు అని పద్మావతి గట్టిగా చెబుతుంది. నా గుండె చప్పుడు ఇంకా కొట్టుకుంటుంది అంటే కచ్చితంగా వికీ ఎక్కడో బతికే ఉన్నాడు అని అంటుంది పద్మావతి. ఆయనకు ఏమైనా అయితే ఇక్కడ నా గుండె ఆగిపోతుంది అని పద్మావతి అంటుంది. ఆయనకేం కాదు వదిన కచ్చితంగా బతికే ఉన్నాడు అని గట్టిగా చెప్తుంది పద్మావతి. వెంటనే ఆర్య ని ఒకసారి ట్రావెల్ వాళ్లకి ఫోన్ చేసి కనుక్కోమని అను చెప్తుంది. భార్య ఫోన్ చేస్తే విక్కీ లాస్ట్ మూమెంట్లో ఫ్లైట్ ఎక్కలేదు అని ఏజెన్సీ వాళ్ళు చెప్తారు. ఆయన ఎందుకు ఫ్లైట్ ఎక్కలేదు మాకు తెలియదు కానీ తను మాత్రం ఫ్లైట్ ఎక్కలేదు అనిచెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఆ మాటకు ఇంట్లో అందరూ సంతోషపడతారు ఇక అరవింద హ్యాపీగా ఫీల్ అవుతుంది విక్కీ ఫ్లైట్ ఎక్కలేదు అని పద్మావతి కూడా ఊపిరి పీల్చుకుంటుంది. విన్నారు కదా అందరూ పద్మావతి చెప్పింది నిజమైంది మన వ్యక్తి సేఫ్ గానే ఉన్నాడు అని అనడంతో, మీరు మా వికీ భారీగా రావడం నిజంగా వాడు అదృష్టం అని అరవింద పద్మావతి వైపు చూసి అంటుంది. మరి విక్కీ ఫోన్ చేస్తే ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అనిఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ టెన్షన్ పడడం, ఎక్కడున్నాడు అని ఆలోచిస్తూ ఉంటారు.

Nuvvu Nenu Prema Today Episode March 30 2024 Episode 585 highlights
Nuvvu Nenu Prema Today Episode March 30 2024 Episode 585 highlights

ఇక మరోవైపు విక్కీని ఏర్పాటులో నుంచి కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి, ఊరి చివర ఉన్న ఒక 10 కి తీసుకువచ్చి అక్కడ విక్కిని కట్టేస్తారు. ఎవరు మీరంతా అని విక్కి అరుస్తూ ఉంటాడు కానీ ఎవరు సమాధానం చెప్పరు. అసలు మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని అడుగుతాడు. ఎక్స్ట్రాలు చేస్తే దీనిలో ఉన్న బుల్లెట్టు నీ బాడీలోకి దిగుతుంది అని రెడీలు గన్ చూపించి విక్కీ అని బెదిరిస్తారు. మెడిటేషన్ చేయకు అని రౌడీలందరూ విక్కీని బలవంతంగా కుర్చీలో కట్టేస్తారు. విక్కీ అసలు ఎవరు నన్ను కట్టేయమని చెప్పింది అని అంటే నా బాస్ నీకు అంతా చెప్తారు టైం చూసి, తన ఇక్కడికి వచ్చి నీకు కనపడతాడు అప్పటిదాకా నువ్వు సైలెంట్ గా ఉండు. మా బాస్ వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి లేదంటే ఒక పది రోజులు మాకు నువ్వు కోపరేట్ చేయాలి లేదంటే ఇక్కడే చస్తావు అని బెదిరిస్తారు. ఇక రౌడీల్ని కాపలా పెట్టి ఒక రౌడీ పక్కకు వెళ్లి కృష్ణ కి కాల్ చేస్తాడు. అంతా మీరు చెప్పినట్టే చేశాను సార్ అని అంటాడు. శభాష్ దాస్ ఫారం కని బయలుదేరిన విక్కీని మూడో కంటికి తెలియకుండా కిడ్నాప్ చేశావు. నా నమ్మకాన్ని నిలబెట్టావు అని కృష్ణఅంటాడు.వికీ ఆస్తి మొత్తం నా చేతికి రావడానికి ఒక పది రోజులు పడుతుంది.అప్పటిదాకా తను డెల్ లోనే సేఫ్గా హెల్తీగా ఉండాలి తనని కూడా కిడ్నాప్ చేసింది నేనే అన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. పని అవ్వగానే తనని ఏం చేయాలో నేను అప్పుడే చెప్తాను అప్పటివరకు జాగ్రత్తగా చూసుకోండి అని కృష్ణ చెప్తాడు. విక్కీ నా చేతికి భలే చిక్కావు అనిఅనుకొని పక్కకు తిరిగేసరికి అక్కడే దివ్య ఉంటుంది దివ్యని చూసి కృష్ణ షాక్ అవుతాడు.మొదట దివ్య మా అన్నయ్యని కిడ్నాప్ చేసింది నువ్వా అని అడుగుతుంది. తరువాత కృష్ణ దివ్య ఇద్దరూ కలిసి నవ్వుకుంటారు.సూపర్ గా ప్లాన్ చేసావ్ బావ,తను ఏమయ్యాడో తెలియక పిచ్చోళ్ళు ఇంట్లో టెన్షన్ పడుతున్నారు అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode March 30 2024 Episode 585 highlights
Nuvvu Nenu Prema Today Episode March 30 2024 Episode 585 highlights

ఇక దివ్య కృష్ణ ఇద్దరు కలిసే కుట్ర చేశారన్న విషయం ఇక్కడే తెలుస్తుంది. దివ్య నువ్వు భలే ప్లాన్ వేసావు బావ అని కృష్ణని మెచ్చుకుంటుంది. ఇంట్లో వాళ్ళు విక్కీ కనిపించట్లేదని కంగారు పడుతున్నారు అని అంటుంది. అలా కంగారు పడాలనే కదా మనం ఇద్దరం కలిసి ఇంత ప్లాన్ చేసింది అని అంటాడు కృష్ణ. అవును బావా మా నాన్న ఉన్నంతకాలం ఆయన్ని ఎంతో హింసించారు ఆయన పడిన బాధకి ఇవాళ రివెంజ్ తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది. మా నాన్నని బాధ పెట్టిన వాళ్ళు ఎవరు మనశ్శాంతిగా ఉండకూడదు అని అంటుంది దివ్య, ఎలా ఉంటారు మార్నింగ్ చేసిన నీ వీడియోని, పద్మావతికి చూపిస్తే తను నిజం అనుకున్నా నీకోసం తన ఆస్తి పేపర్ల మీద విక్కీ చేత సంతకంచేయించింది మనిద్దరం కలిస్తే ఇక రోజు వాళ్ళకి నరకమే అని కృష్ణ అంటాడు. అయినా పైకి పోవాల్సిన విక్కీ ఫ్లైట్ ఎక్కకుండా ఎందుకు ఆగిపోయాడు తను ఆగిపోతాడని నీకు ఎలా తెలుసు కిడ్నాప్ చేశావు అని అడుగుతుంది దివ్య. విక్కిని తక్కువ అంచనా వేయకూడదు ఎందుకైనా మంచిది అని నేను సేఫ్ సైజ్ లో నా మనుషుల్ని బయటపెట్టాను, పద్మావతి ప్రేమని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఆ ప్రేమ కోసం వికీ వెనక్కి వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను అందుకనే రౌడీలను ఏర్పాటు పెట్టాను ఇప్పుడు కిడ్నాప్ చేయించాను అని కృష్ణ అంటాడు. ఏదైనా నీకు తెలివే తెలివి బావ అని దివ్య మెచ్చుకుంటుంది. నీ పగ ఆస్తి కావాలన్నా నా కోరిక రెండుఇంకొన్ని రోజుల్లో తీరబోతున్నాయి అని ఇద్దరు షేకెండ్ ఇచ్చుకుంటారు.ఇక మరోవైపు పద్మావతి కలగంటూ ఉంటుంది కలలో విక్కీ పరిగెడుతూ ఉంటే పద్మావతి వెనకాల పరిగెడుతుంది.కొంత దూరం వెళ్లిన తర్వాత విక్కీ ఒక లోయలో పడిపోతుంటే పద్మావతి చేయించి పైకి రమ్మని అడుగుతుంది.ఎంతసేపటికి విక్కీని పైకి లాగాలని చూసిన పద్మావతి వల్ల కాదు పద్మావతి ప్రయత్నించే కొద్ది విక్కీ కింద పడిపోబోతు ఉంటాడు. పద్మావతి నా చేయి గట్టిగా పట్టుకోండి ఎలాగైనా పైకి రండి అని అంటే పద్మావతి ఇక నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని, నీతోనే ఉంటాను పద్మావతి అని అంటూ ఉంటాడు గట్టిగా పట్టుకోండి సార్ అని అంటుంది పద్మావతి. నీ ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు పద్మావతి అని, మనం ఎప్పటికీ కలిసే ఉంటాము అని విక్కీ అంటూ ఉండగా, పద్మావతి చెయ్యి లో నుంచి విక్కీ చెయ్యి వదిలేస్తాడు ఇక అవి కిలోయలో పడిపోతాడు పద్మావతి ఒకసారి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే తన నిద్రలో నుంచి బయటికి వస్తుంది కలలో తనకి పీడకల వచ్చిందని అనుకుంటుంది. అప్పుడే అరవింద వచ్చి ఏమైంది పద్మావతి అలా అరిచారు అని అడిగితే ఏమీ వదిన అనేది ప్రమాదంలో ఉన్నాడని నాకు అర్థం అవుతుంది అని అంటుంది పద్మావతి.

ఇక రేపటి ఎపిసోడ్ లో విక్కీ ఫోన్ కలవట్లేదు అని ఇంట్లో అందరూ బాధ పడుతూ ఉంటే, దివ్య కృష్ణ ఇద్దరు వచ్చి తను సేఫ్ గా ఉన్నాడని మనకు అర్థమైంది కదా ఇక ఎందుకు బాధపడడం, అని అంటారు ఇక వెంటనే కుచల నో నో నాకెందుకో విక్కీ ఇంకో ప్రమాదంలో ఉన్నాడని అనిపిస్తుంది అని అంటుంది. ఆ మాటలకు పద్మావతి టెన్షన్ పడుతూ ఆలోచిస్తుంది విక్కీకి ఏమైందా అని బాధపడుతూ ఉంటుంది.

author avatar
bharani jella

Related posts

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N