NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema May 15 Episode 624: కుటుంబ సభ్యుల ఆకలి తీర్చిన అక్క చెల్లెలు.. అరవింద, విక్కీ ల బాధ.. ఉద్యోగం కోసం విక్కీ ప్రయత్నం..

Nuvvu Nenu Prema Today Episode May 15 2024 Episode 624 highlights

Nuvvu Nenu Prema: విక్కీ కుటుంబ సభ్యులందరూ, ఒక చిన్న ఇంట్లోకి మారతారు. కృష్ణ మోసం చేసి వాళ్ళ ఇల్లు ఆస్తి మొత్తం తీసేసుకుంటాడు. కృష్ణకి దివ్య హెల్ప్ చేస్తుంది. దివ్య నేను కూడా మీ దగ్గరే ఉంటాను అని కృష్ణుని అడుగుతుంది. నువ్వు విక్కీ వాళ్ళ దగ్గర ఉండి విక్కీ ఇప్పుడు దెబ్బతిన్న పులి, అతను ఏసే ప్రతి అడుగు నువ్వు నాకు చెప్పాలి అని అంటాడు. అందుకు దివ్యఒప్పుకుంటుంది. అరవింద్ అని చంపేసి ఆ తర్వాత నువ్వు నేను ఒకటి అవుదామని కృష్ణ దివ్యతో డీల్ మాట్లాడుకుంటాడు. దివ్య కూడా కృష్ణుని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్తుంది. దివ్య తిరిగే విక్కీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లో అందరూ ఆకలితో ఉంటారు ఇక అను పద్మావతి ఇద్దరూ గుడి దగ్గరికి వెళ్లి అక్కడ వంట మనిషి రాకపోతే అన్నదానానికి, వంట మనిషి కోసం వెతకడం గమనించి, అను పద్దు ఇద్దరూ వంట చేస్తాము అని అక్కడ వాళ్ళతో బేరం మాట్లాడుకుంటారు. ఎలాగా ఒకలాగా వాళ్ళని ఒప్పించి అన్నదానానికి వంట చేయడానికి వెళ్తారు. అక్కడ వాళ్ళు భోజనం తీసుకు వెళ్ళమని ఇస్తారు.

Nuvvu Nenu Prema Today Episode May 15 2024 Episode 624 highlights
Nuvvu Nenu Prema Today Episode May 15 2024 Episode 624 highlights

ఇక పద్మావతి అను ఇద్దరూ భోజనంతో పాటు ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్లందరికీ భోజనం పెడతారు. అప్పటికే కుచల చాలా ఆకలిగా ఉంటుంది. ఎవరైనా అందరితోపాటు నువ్వు సైలెంట్ గా ఉండాలి ఇలా ఆకలి కోసం గొడవ చేస్తే ఎట్లాగో అని అంటాడు. దివ్య ఈ ఆకలి బాధలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు నాకు చేసిన అన్యాయానికి మీరు ఇలా బాధపడడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చినా పద్దు అను ఇద్దరు, వాళ్లకి భోజనం తీసుకొచ్చాము అని చెప్తారు. ఇంట్లో అందరూ సంతోషిస్తారు ఇక అందర్నీ కూర్చోమని చెప్పి పద్దు అనే ఇద్దరు వడ్డిస్తారు ఇంట్లో అందరూ ఎక్కడికి భోజనం అడిగితే ముందు తినండి తర్వాత చెప్తాము అని అంటారు. కుటుంబ సభ్యులందరి ఆకలి అక్కా చెల్లెలు తీర్చేస్తారు ఇక ఇప్పటికైనా చెప్పమ్మా వంట చాలా బాగుంది. ఇది అచ్చం నీ చేతి వంటలని ఉందిఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని నారాయణ అడుగుతాడు దాంతో పద్దు గుడిలో వంట చేయడానికి వెళ్ళాము అక్కడ అన్నదానానికి వంట మంచి రాకపోతే మేము వెళ్లి వంట చేస్తే వాళ్ళు తిరిగి మాకు ఈ ప్రసాదాన్ని ఇంటికి తీసుకు వెళ్ళమని ఇచ్చారు అదే ఇప్పుడు మీకు పెట్టాము అని అంటారు. అక్కడే ఇదంతా విన్నవికి చాలా బాధపడతాడు ఎలా ఉండాల్సిన వాళ్ళు ఎలా అయిపోయాము అని బాధపడతాడు. నారాయణ మా కోసం మీరిద్దరూ ఇంత చేశారు కానీ మీకు మాత్రం తిరిగి మేము ఇవ్వలేకపోతున్నాము అని అంటాడు. మీరిద్దరూ మాకు కోడలుగా రావడం మేమే జన్మలోనే చేసుకున్న పుణ్యం అని అంటాడు నారాయణ ఇక సంతాదేవి కూడా అవును అని అంటుంది కష్టాల్లో కలిసి వచ్చే ఇలా ఉండే కోడల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని అంటుంది శాంతాదేవి.

Nuvvu Nenu Prema Today Episode May 15 2024 Episode 624 highlights
Nuvvu Nenu Prema Today Episode May 15 2024 Episode 624 highlights

ఇక మరోవైపు విక్కి ఆలోచిస్తూ ఉంటాడు. అరవింద కోసం బాధపడుతూ ఉంటాడు. అరువైపు అరవింద కూడా బాధపడుతూ ఉంటే కృష్ణ అరవింద దగ్గరికి వెళ్లి ఏంటి రానమ్మ నువ్వు కడుపుతో ఉన్నావు అన్నం తినకపోతే ఎలాగో అని అన్నం నోట్లో పెడుతూ ఉంటాడు. అరవింద కృష్ణ చూపించే ప్రేమంతా నిజమని నమ్మి నేనంటే ఎందుకండి మీకు ఇంత ఇష్టం అని అడుగుతుంది. నువ్వంటే నాకిష్టమైన ఎప్పుడో చెప్పాను కదా అని మా ముందు నువ్వు భోజనం చేసి రెస్ట్ తీసుకో, మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు అరవింద్ మాత్రం నాకు ఎందుకో విక్కీ వాళ్ళు గుర్తుకు వస్తున్నారు మీకు ఏం చేస్తున్నాడో ఏంటో నా కోసం ఎంత బాధ పడుతున్నాడో ఒకసారి వాడిని చూడాలని ఉంది అని అంటుంది మరోవైపు విక్కీ కూడా పద్మావతి తో తన బాధని పంచుకుంటూ ఉంటాడు అక్క అక్కడ ఏం చేస్తుందో ఏంటో ఎలా ఉండాల్సింది మనం ఎలా అయిపోయామో మీ అందరికీ ఇలాంటి బాధ రావడానికి నేనే కదా కారణం అని అంటాడు. మీకేంటి ఇలా బాధపడడం ఏంటి మీరు బాధపడకండి మనకి మంచి రోజులు వస్తాయి అని పద్మావతి విక్కీకి ధైర్యం చెబుతుంది కానీ విక్కీ మాత్రం పరిస్థితుల గురించి కాదు పద్మావతి అక్కడ అక్క వాడి దగ్గరే అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు అని అంటే, పద్మావతి నన్ను క్షమించండి సార్ మీరు ఈ పరిస్థితికి రావడానికి నేనే కారణం అని అంటుంది. అదేంటి పద్మావతి అని అడుగుతాడు ఇక పద్మావతి విక్కీ ఆస్తి, పేపర్స్ మీద కృష్ణ తన చేత సంతకం చేయించిన విషయం గురించి చెబుతుంది.

Nuvvu Nenu Prema Today Episode May 15 2024 Episode 624 highlights
Nuvvu Nenu Prema Today Episode May 15 2024 Episode 624 highlights

ఇక పద్మావతి దివ్య కోసమే ఇదంతా చేశాను దివ్యని వాడు ఏం చేస్తాడు అన్న భయంతో నేను ఆస్తి పేపర్లను మీ దగ్గరికి తీసుకువచ్చి ఇచ్చాను. అప్పటికి వాడేదైనా మోసం చేస్తాడేమోనని భయపడి మీకు ముందే చెప్పాను ఒకసారి పేపర్స్ ని చెక్ చేసి సంతకం పెట్టండి అని మీరు నా మీదున్న కోపంతో ఆరోజు సంతకం పెట్టేశారు. అవి ఆస్తి పేపర్లో ఉన్న విషయం నాకు తర్వాతే అర్థమైంది అని అంటుంది. అప్పుడు విక్కీకి గతంలోకి పద్మావతి ఇచ్చిన ఫైల్ మీద సంతకం పెట్టడం గుర్తుకు వస్తుంది ఆమె పద్మావతి కానీ వాడు ఇది ఒక్క రోజులో చేసింది కాదు దీని వెనుక చాలా ప్రాసెస్ ఉంది ఇదంతా ఫ్రీ ప్లాన్ గాని చేశాడు. నువ్వు దీని గురించి ఏమీ ఆలోచించొద్దు ఆ రోజు నువ్వు దివ్య కోసమేదంతా చేసావని నాకు అర్థమైంది అని అంటాడు. నేను ఇప్పుడు మనం ఆలోచించాల్సింది పోయిన ఆస్తి గురించి కాదు వాడి దగ్గర ఉన్న అక్క గురించి వాడు ఒక్కని ఏం చేస్తాడు అని భయంగా ఉంది అని అంటే వాడు మీ అక్కని ఏమీ చేయలేడు, వాడికి తెలుసు మీరు మీ అక్కకి ఎంత బాగా ప్రేమిస్తున్నారో వాడు జాగ్రత్తగా అరవింద్ గారిని చూసుకుంటాడు లేదంటే మీరు వాడిని చంపేస్తారని వాడికి తెలుసు అని అంటుంది పద్మావతి. కానీ ఎంతకాలం పద్మావతి ఏదో ఒక రోజు వాడి నిజ స్వరూపం బయటపడుతుంది వాడు ఆ టైంలో అక్కని ఏం చేస్తాడు అని అంటే ఈలోపు మనం వెళ్లి తెచ్చుకుందాం అని అంటుంది. ఆ శ్రీనివాసుడు మనకి ఏదో ఒక దారిలోపు చూపిస్తాడు మీరు మీ అక్క గురించి బాధపడకండి అని అంటుంది. మరోవైపు కృష్ణ దగ్గర అరవింద కూడా విక్కీ గురించి బాధపడుతుంది వాడికి చిన్నప్పుడే తల్లి దూరమైంది నేనే వాడికి తల్లిలా పించాను ఈరోజు నేను దూరమైతే వాడు తట్టుకోలేడు ఎలాగైనా గాని ఒకసారి చూడాలి అని అంటుంది. దానికి కృష్ణ కొన్ని రోజులు ఓపిక పట్టణం పరిస్థితులు చక్కబడిన తర్వాత అందరం కలిసి ఉందాం అని నచ్చే చెప్తాడు. మనసులో మాత్రం కృష్ణ ఇంకొన్ని రోజులు తర్వాత నిన్ను ఈ నిజం తో పాటు పూర్తిగా సమాధి చేసేస్తాను ఆ తర్వాత విక్కీకి నిన్ను పూర్తిగా శాశ్వతంగా దూరం చేస్తాను అని అనుకుంటాడు. అరవింద మాత్రం కృష్ణ చెప్పే మాటలను నిజమైన నమ్ముతుంది మీరు కచ్చితంగా నన్ను వికీ దగ్గరికి తీసుకువెళ్తారు కదా అంటే తీసుకువెళ్తాను అని అంటాడు. అరవింద బాధపడుతూ అలానే ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode May 15 2024 Episode 624 highlights
Nuvvu Nenu Prema Today Episode May 15 2024 Episode 624 highlights

ఇక మరోవైపు కుచల ఉదయమే నిద్రలేచి బయటికి వచ్చి చూసేసరికి పాల ప్యాకెట్లు వాడు పాలు వేస్తూ ఉంటాడు. ఆ పాల ప్యాకెట్లు మా ఇంటికి తప్ప అందరిలోకి వేస్తున్నాడు అని ఎవరికి తెలియకుండా పాల ప్యాకెట్లను తీసుకుంటుంది అప్పుడే పాల ప్యాకెట్లు అమ్మే అతను వచ్చి కుచ్చులని చేయి పట్టుకుని దొంగ అని అరవబోతాడు. ఏం దొంగని కాదు ఇవి నాకు రావాల్సిన పాలు ప్యాకెట్లే అని అంటుంది అలా ఎలా కుదురుతాయి అమ్మ మీరు ఆర్డర్ ఇస్తేనే ఇంటికి వస్తాయి మీరు ఇలా తీసుకోవడం కరెక్ట్ కాదు అని అంటాడు. అప్పుడే అక్కడికి నారాయణ వచ్చే అసలు ఏం జరిగింది అని అడుగుతాడు ఈ వీడియో నా పాల ప్యాకెట్లు దొంగతనం చేసిందండి అని చెప్తాడు. ఇల్లు మారినా కానీ నీ బుద్ధి మారలేదు మనమున్న పరిస్థితుల్లో ఇలాంటివన్నీ అవసరమా అయినా మూడు పాలు ప్యాకెట్లు ఎందుకు తీసుకున్నావు అని అడుగుతాడు నారాయణ ఒకటి కాఫీకి ఒకటి పెరుగుకి ఒకటి నా మొహానికి అని అంటుంది. ఫేషియల్ చేసుకోవడానికి ఒక పాలు ప్యాకెట్ కావాలి నేను పాలరాతి శిల్పాన్ని కదా అని అంటుంది. ఇప్పటిదాకా మాట్లాడింది చాలు వాడి పాల ప్యాకెట్లు వాళ్లకి ఇచ్చేసేయ్ అని అంటాడు నారాయణ. పాల ప్యాకెట్లను ఇచ్చేస్తుంది కుచ్చుల ఇక మీకు పాలు కావాలంటే చెప్పండి అని అంటాడు. మాకు కావాలంటే నీకు నిన్ను అడుగుతాను లే బాబు వెళ్ళు అని అంటాడు నారాయణ. కుచల కోపంగా లోపలికి వెళ్తుంది. మరోవైపు విక్కి హడావిడిగా పద్మావతిని పిలుస్తాడు పద్మావతి ఏంటి సారు అని అడుగుతుంది నాకు అర్జెంటుగా దువ్వెన ఎక్కడ ఉందో ఇవ్వు అని అంటాడు. ఇక్కడే ఉంది కదా అని ఇస్తుంది తర్వాత ఫైల్ ఎక్కడుందో చూడు అని అంటాడు ఫైల్ కూడా ఇక్కడే ఉంది అయినా ఇంత కంగారుగా ఎక్కడికి బయలుదేరారు అని అడుగుతుంది. ఉద్యోగం పురుష లక్షణం కదా అందుకే ఉద్యోగం వెతుక్కోవడానికి వెళుతున్నాను అని అంటాడు. రాజావారి దండయాత్రకి బయలుదేరితే విజయం ఖాయం అని అంటుంది పద్మావతి. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode May 15 2024 Episode 624 highlights
Nuvvu Nenu Prema Today Episode May 15 2024 Episode 624 highlights

రేపటి ఎపిసోడ్లో విక్కీ చాలా చోట్ల ఉద్యోగానికి ప్రయత్నించి మంచినీళ్ల కోసం ఒక బండి దగ్గర ఆగి మంచినీళ్లు తాగి ఎదురుగా చూసేసరికి అక్కడ కృష్ణ ఉంటాడు. కృష్ణుని చూసి పెట్టడానికి కోపంతో విక్కి, దగ్గరికి వెళ్ళిపోతాడు అక్కడికే కృష్ణ విక్కీ దగ్గరికి వచ్చి ఏంటి బామ్మర్ది ఇలా అయిపోయావు అసలు ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు ఇలా రావడానికి కారణం ఎవరో తెలుసా నువ్వే, నీ అంతట నువ్వే నీ పరిస్థితిని ఇలా మార్చుకున్నావు. ఆరోజు నేను పద్మావతిని ఇష్టపడుతున్నాను అని తెలిసినప్పుడు నాకు అడ్డు చెప్పకుండా ఉన్నట్టయితే నీకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా నువ్వు నాకు అడ్డు తిరగడం వల్లే నేను ఇలా చేశాను అని చెప్తాడు దాంతో విక్కీ కోపంగా కృష్ణ వైపు చూస్తాడు.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri