NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

Nuvvu Nenu Prema Today Episode May 17 2024 Episode 626 highlights

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: విక్కీ ఉద్యోగ ప్రయత్నంలో చాలా ఆఫీసులకి తిరుగుతాడు. కానీ ఏ ఆఫీసులోనూ విక్కీ ని సెలెక్ట్ చేసుకోరు మీలాంటి గొప్ప వాళ్ళు మాలాంటి ఆఫీసుల్లో పనిచేయడం మాకే చిన్నతనంగా ఉంటుంది అని చెప్పి ఏ ఆఫీసులోనూ విక్కీ నీ ఉద్యోగానికి తీసుకోరు దాంతో వికీ తన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయని నిరాశగా బయటికి వస్తాడు ఇక కొంత దూరం నడిచిన తర్వాత విక్కీ దాహం వేసి ఒక టీ స్టాల్ దగ్గర ఆగి టీ తాగుదాం అని చూసేసరికి ఎదురుగా, కృష్ణ నించని ఉంటాడు కృష్ణను చూసి వికీపట్టడానికి ఒపెన్తో ఉంటాడు. కృష్ణ రివర్స్లో విక్కీని అనడానికి దగ్గరికి వచ్చి నువ్వు ఎలా బతికేవాడివి ఎలా అయిపోయావు ఇలాంటి పరిస్థితి నీకు రావడానికి కారణం ఎవరో తెలుసా నువ్వే అని అంటాడు. ఆ మాటలకు విక్కికి బాగా కోపం వస్తుంది అవును విక్కీ నేను చెబుతున్నది నిజమే అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode May 17 2024 Episode 626 highlights
Nuvvu Nenu Prema Today Episode May 17 2024 Episode 626 highlights

ఇక కృష్ణ మాట్లాడుతూ నువ్వు పద్మావతిని విషయంలో జోక్యం చేసుకోకుండా ఉన్నట్లయితే చూసి చూడనట్లు పోయినట్లయితే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు నేను పద్మావతి కోసమే ఇదంతా చేశాను నువ్వు పద్మావతి నా నుండి దూరం చేయాలనుకున్నావు అని అంటాడు. ఈరోజు ఏమైందో చూసావు కదా రూపాయి కూడా నీ దగ్గర లేదు ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావు అని విక్కీని ఇన్సల్ట్ గా మాట్లాడుతాడు. కృష్ణ మాట్లాడే ప్రతి మాటకి విక్కీకి బాగా కోపం వస్తుంది కానీ అరవింద తన దగ్గర ఉందని మొదటి చాలాసేపు కంట్రోల్ గా ఉంటాడు. విక్కీ పాపం నువ్వు ఎలా ఉంటావో ఏంటో అని నాకు జాలిగా ఉంది నీ దగ్గర ఇప్పుడు రూపాయి కూడా లేదు సరే ఇప్పుడు ఎలా బతుకుతావు మూటలు వస్తావా కూలి పని చేస్తావా లేదంటే నలుగురిలో ముష్టి ఎత్తుకుంటావా పాపం అలా బతకడం నీకు సాధ్యం కాదేమో ఈ రూపాయి ఉంచు ఇది నేను ఇస్తున్న ముష్టి అనుకోవద్దు దానం అనుకో అని అంటాడు. ఆ రూపాయి తీసి ఇచ్చినా అక్కడ నుంచి వెళ్లిపోవాలని చూస్తాడు. అప్పుడే విక్కీ కృష్ణుని వెనక్కి పిలుస్తాడు విక్కి చాలా కోపంగా ఉంటాడు ఇప్పటిదాకా ఈ కృష్ణ ఏం మాట్లాడినా సైలెంట్ గా ఉంటాడు ఎప్పుడైతే విక్కీని బాగా అవమానించాడు అప్పటికి విక్కికి చాలా కోపం వస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode May 17 2024 Episode 626 highlights
Nuvvu Nenu Prema Today Episode May 17 2024 Episode 626 highlights

ఇక కృష్ణుని పిలిచి విక్కీ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న హోదా నువ్వు అనుభవిస్తున్న డబ్బు ఆస్తి అంతా నాది నేను కష్టపడి సంపాదించిన నా కష్టాలు ఎప్పటికైనా అది నా దగ్గరికి వస్తుందని నాకు నమ్మకం ఉంది. నువ్వు ఏమన్నా నేను ఎందుకు పడుతున్నానో తెలుసా నా అక్క నీ దగ్గర ఉందని మా అక్కకు నిజం తెలిసింది రోజు మా అక్క నా దగ్గరికి వచ్చిన రోజు నీ అంత తేలుస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావో నీకైనా అర్థమవుతుందా నువ్వు అనుభవిస్తే నేను ఆస్తిని నాకే తిరిగి దానం చేయాలనుకుంటున్నావా ఈ రూపాయి కూడా నాదే నేను సంపాదించింది నీ అంతకు నువ్వు సంపాదించింది ఒకటి నీ దగ్గర లేదు అది నువ్వు గుర్తు పెట్టుకో అని అంటాడు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఆస్తంతా నాదే అని మా అక్కకు తెలిసిన రోజు నువ్వు ఏమైపోతావో ఆలోచించుకో అసలు మా అక్కకి నాకిలాంటి పరిస్థితి వచ్చింది అని తెలిస్తే నేనేం చేస్తుందో ఒకసారి ఊహించుకో అని అంటాడు. ఏదో ఒక రోజుమా అక్కకి నిజం తెలిసిపోతుంది నా దగ్గరికి వస్తుంది ఆ రోజు నీ అంత తేలుస్తాను నీ దగ్గర నుంచి నాస్తి ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఈరోజు నేను బాధపడి ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు నేను కచ్చితంగా నా ఆస్తిని తీసుకుంటాను అని అంటాడు ఇక ఆ మాటలు కృష్ణ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Nuvvu Nenu Prema Today Episode May 17 2024 Episode 626 highlights
Nuvvu Nenu Prema Today Episode May 17 2024 Episode 626 highlights

ఇక ఆర్యా డెలివరీ బాయ్ గా జాయిన్ అవుతాడు. ఒక పర్సన్ దగ్గరికి వెళ్లి డెలివరీ ఇస్తారు ఇంతవరకు ఎవరు కరెక్ట్ టైం కి డెలివరీ ఇవ్వలేదు నువ్వు చక్కగా డెలివరీ ఇచ్చావు అని అతను ఆర్యా కి డబ్బులు ఇస్తాడు. ఆన్లైన్లో ఆల్రెడీ పే చేశారు కదా ఇప్పుడు నాకెందుకు అని అంటాడు ఇది నువ్వు కరెక్ట్ టైంకి తెచ్చినందుకు అని అంటాడు. ఇక నేను సంపాదించే ప్రతి రూపాయి ఇంట్లో వాళ్ళ కోసమే కానీ నేను ఈ పని చేస్తున్నట్లు ఇంట్లో వాళ్లకు తెలియకూడదు అని అనుకుంటాడు. ముఖ్యంగా నీకు తెలియకూడదు తను చాలా బాధపడుతుంది అని అనుకుంటాడు. మరోవైపు అనుకూడా పని కోసం వెతుకుతూ ఉంటుంది. ఏదో ఒక విధంగా పని దొరికితే బాగుండు లేదంటే ఇంట్లో వాళ్లకి కష్టమైపోతుంది అని అనుకుంటూ అన్ని ఇల్లు తిరుగుతూ ఉంటుంది. నేను ఇలా పని కోసం వెతుకుతున్నట్లు ఆర్యాకి తెలియకూడదు లేదంటే తన బాధపడతాడు. ఆర్యా,అను ఇద్దరూ కూడా ఒకరికి తెలియకుండా ఒకరు పని చేయాలి అని అనుకుంటారు.

Nuvvu Nenu Prema Today Episode May 17 2024 Episode 626 highlights
Nuvvu Nenu Prema Today Episode May 17 2024 Episode 626 highlights

పద్మావతి వెళ్లిన ఆఫీసులో మేనేజర్ పద్మావతిని చూస్తూ నువ్వు చాలా అందం గా ఉన్నావు అని అంటాడు.దానికి పద్మావతి ఏమన్నా అని అడుగుతుంది. అదే నీ రెజ్యూమ్ చాలా అందంగా అని అంటున్నాను అంటాడు దానికి పద్మావతి నాకేదైనా ఉద్యోగం ఇప్పించండి అని అంటుంది. ఇప్పుడే ఉద్యోగాలన్నీ ఫిలప్ అయిపోయాయి అని అంటాడు అలా అనకండి నాకు ఏదో ఒక ఉద్యోగం కావాలి అని అంటుంది ఇలా కష్టపడే వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఇంతలా అడుగుతుంటే నేను కాదు అని చెప్పలేకపోతున్నాను అని అంటాడు మేనేజర్. నిన్ను చూస్తుంటే ఉద్యోగం ఇవ్వాలనే ఉంది కానీ ప్రస్తుతానికి ఖాళీలు లేవు ఏమివ్వాలి అని ఆలోచించి మేనేజర్ ఒక ప్రత్యేకమైన ఉద్యోగం ఉంది చేస్తావా అని అంటాడు. ఆ ఉద్యోగం ఏదైనా చేస్తాను అని అంటుంది పద్మావతి చాలా కంఫర్టబుల్ జాబు అని అంటాడు మేనేజర్. కాకపోతే టైమింగ్స్ కొంచెం చేంజ్ గా ఉంటాయి అని అంటాడు. ఎక్కువగా నైట్ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఆఫీసులో కాదు మా గెస్ట్ హౌస్ లో అని పద్మావతి మీద చెయ్యి వేస్తాడు మేనేజర్. నీ పర్ఫామెన్స్ నాకు నచ్చితే నీకు కావాల్సినంత శాలరీ ఇస్తాను అని అంటాడు. ఈ ఉద్యోగం నీకు ఓకే కదా అని అంటాడు. వెంటనే పద్మావతి లేచి అ మేనేజర్ ని చెంప మీద ఒకటిస్తుంది.పద్మావతి కూడ వెళ్లిన ఆఫీసులో మేనేజర్ ని కొట్టి నీకసలు ఆడవాళ్లు ఎలా కనబడుతున్నారు నోటికి వచ్చినట్లు మాట్లాడతావా, ఆడపిల్లలు ఆట బొమ్మల్లా కనిపిస్తున్నారా నీకు నీలాంటి వాళ్ళ అంతు చూసే, ఆదిపరాశక్తులు వాళ్ళు ఇంకొకసారి అమ్మాయిల జోలికి వెళ్లి వాళ్ళ అవసరాన్ని నీకు అనువుగా మార్చుకోవాలని చూస్తే, మీ అంతు చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఇక విక్కీ పద్మావతి ఇద్దరూ మొదటిసారి వెళ్లిన ఆఫీసుల్లో చేదు అనుభవం ఎదురవుతుంది. ఇద్దరు ఉద్యోగం కోసం ప్రతి చోటికి వెళ్లి ప్రయత్నిస్తూ ఉంటారు.

Nuvvu Nenu Prema Today Episode May 17 2024 Episode 626 highlights
Nuvvu Nenu Prema Today Episode May 17 2024 Episode 626 highlights

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి అను దగ్గరికి పార్వతి వస్తుంది. ఏమైందమ్మా ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చింది అని అడిగితే అయిపోయిన దాని గురించి ఎందుకమ్మా అని అంటుంది పద్మావతి.ఇంక మీరేం మాట్లాడద్దు నాతో వచ్చేయండి అని నేను ఉన్నాను కదా నాకు చెప్పకుండా మీరు ఇక్కడ ఉండడం ఏంటి అని అంటుంది. నేను బతికే ఉన్నాననుకున్నారా చచ్చిపోయాను అనుకున్నారా ఇంత కష్టం వస్తే నాకు చెప్పకుండా ఇక్కడ ఉంటారా అని కోపంగా వాళ్ళ బట్టలు అన్ని సర్దుతూ ఉంటుంది. మీరిద్దరూ నాతోపాటు మన ఇంటికి వస్తున్నారు అంతే అని అంటుంది పార్వతి నేను రాను అని పద్మావతి గట్టిగా అంటుంది. ఇప్పటికే ఆస్తి పోయి మేము చాలా కష్టం లో ఉన్నాము. ఇప్పుడు మేము పుట్టింటికి వచ్చి మా ఆయన విలువని నేనే తగ్గించిందని అవుతాను. అందుకే మేము ఆ ఇంటికి రాము అని అంటుంది. ఇదంతా విక్కీ కూడా వింటూ ఉంటాడు. అసలే కష్టాల్లో ఉంది ఇప్పుడు వాళ్ళ అమ్మ పిలిస్తే వెళ్లొచ్చు కదా అని విక్కీ కూడా అనుకుంటాడు. కానీ పద్దు అను ఇద్దరూ పుట్టింటికి వెళ్లడానికి ఇష్టపడరు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella