NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

Nuvvu Nenu Prema Today Episode May 20 2024 Episode 628 highlights

Nuvvu Nenu Prema May 20 Episode 628:  విక్కీ పద్మావతి ఇద్దరు అరవింద ఇంటికి వెళ్లి అరవిందతో మాట్లాడుతూ ఉంటారు. అరవింద కి విక్కీ నిజం చెప్తాడు కృష్ణ మంచివాడు కాదని, నీ దగ్గర నటిస్తున్నాడని తాను తేనె పూసిన కత్తిలాంటివాడని నిజం చెప్తాడు కానీ ఆ మాటలు అరవింద నమ్మదు అప్పుడే కృష్ణ అక్కడికి వచ్చి విక్కీతో ప్రేమగా మాట్లాడుతాడు అరవింద గురించి కూడా ప్రేమగా మాట్లాడుతాడు ఇంతలో విక్కీ కృష్ణని నువ్వు ఇలా నాటకాలు ఎన్ని రోజులు ఆడతావు అని కృష్ణ మీద కోప్పడతాడు కానీ కృష్ణ మాత్రం చాలా కూల్ గా చిన్నపిల్లలు అరవిందా వికీ ఇలానే అంటుంటాడు నువ్వేం పట్టించుకోవద్దు చూడు వీక్ నువ్వేమన్నా పడతాను గాని అరవింద సమేత లేదంటే మాత్రం నేను సహించను అని అంటాడు దానికి విక్కీ కోపంగా కృష్ణ కాలర్ పట్టుకుంటాడు. వెంటనే అరవింద విక్కీ పద్దు లను బయటికి పంపించేస్తుంది. ఇకనుంచి పద్మావతి వికీ ని తీసుకొని వెళ్ళిపో లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు నా భర్త ఎంత మంచివాడు నాకు తెలుసు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో కూడా నాకు తెలుసు అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode May 20 2024 Episode 628 highlights
Nuvvu Nenu Prema Today Episode May 20 2024 Episode 628 highlights

ఇక విక్కీ పద్మావతి ఇద్దరూ బయటికి వచ్చి బాధపడుతుంటే కృష్ణ వచ్చి వాళ్ళ దగ్గర మీకు చాలా థాంక్స్ చెప్పాలి రా ఎందుకంటే మీరు చెప్తే కచ్చితంగా పర్వింద నమ్ముతుందని ఇన్ని రోజులు భయపడ్డాను కానీ నువ్వు నా గురించి నిజం చెప్పినా కూడా అరవింద్ నమ్మట్లేదంటే ఇక ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినా నమ్మదు ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా కూడా అరవింద నా గురించి నమ్మదు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటాడు. పద్మావతి మాత్రం ఏదో ఒక రోజు ఇంతకి ఇంత అనుభవిస్తావు ఇవాళ కాకపోతే రేపైనా అరవింద్ కి నిజం తెలుస్తుంది అప్పుడు మా ఆయన నియంత చూస్తాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పద్మావతి కృష్ణ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. విక్కీ పద్మావతి ఇద్దరు పోలీస్స్టేషన్కు వెళ్లి తమ ఆస్తిని కృష్ణకాజేసాడు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు అరవింద ఇంటికి వెళ్లి కృష్ణతో, మీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మీరు ఊరి దాటి వెళ్లడానికి వీల్లేదు మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోలీస్ స్టేషన్ కి రావాలి అని చెప్తారు అదంతా కృష్ణ అరవింద తో చెప్తాడు విక్కీ పద్మావతి ఇద్దరు నామీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అరవిందా వాళ్ళేదో చిన్న వాళ్ళు అలానే చేస్తారు నువ్వేం బాధపడకు ఈ కేస్ గురించి నువ్వు ఆలోచించొద్దు నేను చూసుకుంటాను కదా అని అరవింద్ కు ధైర్యం చెప్తాడు.

Nuvvu Nenu Prema Today Episode May 20 2024 Episode 628 highlights
Nuvvu Nenu Prema Today Episode May 20 2024 Episode 628 highlights

ఇక మరోవైపు అరవింద్ మాత్రం బాధపడుతుంది విక్కీ ఎందుకు నా భర్త గురించి అలా మాట్లాడుతున్నాడు నేను విక్కీని కొట్టి తిట్టాల్సి వచ్చింది. అలా చేయడం నాకు ఇష్టం లేకపోయినా తను అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అని బాధపడుతుంది ఇక మరోవైపు కృష్ణ అరవింద దగ్గర నటించి ఎలాగైనా సరే విక్కీ పద్మావతి ఇద్దరి మీద అరవింద మనసులో ఇప్పుడు చాలా కోపంగా ఉంది కాబట్టి ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పినా కూడా చివరికి నా గురించి నమ్మదు అని మనసులో అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోవైపు ఇంట్లో అందరికీ విక్కీ పద్మావతి ఇద్దరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన విషయం చెప్తారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల మీకే నష్టం జరుగుతుందని దివ్య అంటుంది వాడు అక్కని ఏమైనా చేస్తే మీరు అప్పుడు ఏం చేస్తారు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు అని అడుగుతుంది దివ్య. పద్మావతి మాత్రం కంప్లైంట్ ఇవ్వడంతోనే మనకి ఒక దారికి దొరుకుతుంది లేదంటే వాడు మనమేం చేయలేము అని మనని చేతకాని వాళ్లు అని అనుకుంటున్నాడు. మనం కంప్లైంట్ ఇస్తేనే కదా మనం కూడా ఏదైనా చేస్తాము అని వాడికి తెలియాలి అని అంటుంది పద్మావతి. మేమిద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాము అని అంటాడు విక్కీ.పోలీసులు వెళ్లి కృష్ణుని అరెస్ట్ చేస్తారు అప్పుడు అరవింద వదిన ఏంటి అని అడుగుతుంది ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నిలదీస్తుంది దానికి పోలీసులు నిజం చెప్తారు దానితో అరవింద్ నమ్ముతుంది అని ఇంట్లో అందరికీ చెప్తుంది పద్మావతి. ఇక ఇంట్లో అందరూ కూడా ఏం జరుగుతుందో చూద్దామని అనుకుంటారు.

Nuvvu Nenu Prema Today Episode May 20 2024 Episode 628 highlights
Nuvvu Nenu Prema Today Episode May 20 2024 Episode 628 highlights

ఇక మరోవైపు పద్మావతి అను ఇద్దరూ గుడిలో అన్నదానానికి వంట చేస్తూ ఉంటారు. అప్పుడే గుడికి అరబిందో వస్తుంది కృష్ణ అరవింద అని గుడిలో వదిలిపెట్టి నువ్వు ఈ విక్కీ చెప్తేనే నమ్మలేదు ఇక ఈ గుడిలో ఎవరైనా నీకు నిజం చెప్పినా నువ్వు నమ్మవు నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది రానమ్మ నీవు దొరకడం నాకు చాలా అదృష్టం అని అరవింద్ అని అక్కడ వదిలిపెట్టి కృష్ణ వెళ్లిపోతాడు అరవింద గుడిలోకి వచ్చి పద్మావతి వాళ్ళని చూస్తుంది అక్కడే ఉన్న ఒక పెద్దావిడ్ ని వీళ్లిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది వాళ్ళిద్దరూ ఇక్కడ వంట మనుషులు.వాళ్లు ఆస్తం తప్ప పోగొట్టుకున్నారు ఎవరో దుర్మార్గుడు వాళ్ళ ఆస్తి ఒక దుర్మార్గుడు కాజేశాడు దాంతో వాళ్ళు రోడ్డున పడ్డారు. పాపం వాళ్ళని చూస్తే ఎలా అనిపించట్లేదు కదా చాలా మంచి వాళ్ళ అమ్మ అని చెప్పి వెళ్ళిపోతుంది. అరవింద వాళ్లిద్దరిని చూసి బాధపడుతుంది అను పద్మావతి ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కూరలు కట్ చేస్తూ ఉంటారు. అప్పుడే పద్మావతి పని చేసుకుంటూ అరవింద్ అని చూస్తుంది ఒకసారిగా ఇద్దరు షాక్ అవుతారు ఇక అరవింద పద్మావతి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. పద్మావతి తో మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగితే నేను చెప్పినా నువ్వు నమ్మవులే వదినా అని అంటుంది. చూడు పద్మావతి నేను విన్నా ది ఒకటి నేను ఇక్కడ చూస్తున్నది ఒకటి, నాకు సేమి అర్థం కావట్లేదు నిజం చెప్తావా లేదా అని అడుగుతుంది నిజం చెప్పిన మీరు నమ్మరు అని అంటుంది పద్దు. కానీ అరవింద్ మాత్రం వదలకుండా పద్మావతి ఇప్పుడు నేను నిజం చెప్తావా లేదంటే నా మీద ఒట్టే అని పద్మావతి చేతిని తన తల మీద పెట్టుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode May 20 2024 Episode 628 highlights
Nuvvu Nenu Prema Today Episode May 20 2024 Episode 628 highlights

ఇక పద్మావతి అరవింద తో నిజం చెప్తుంది. మీ మనసుకు బాధ కలిగిన నేను చెప్పేది నిజం మీ ఆయన మంచివాడు కాదు అతని ప్రేమ అభిమానం అంతా నటనే, ఇప్పటివరకు మీరు ఇప్పుడు చెప్పని నిజం ఏంటంటే, మీ ఆయన మీద పెళ్లయిన తర్వాత పెళ్లి కాలేదని మా ఇంటికి వచ్చి చెప్పి నాతో నిశ్చితార్థం చేసుకున్నాడు అని అంటుంది. ఆ మాటలకు అరవిందా షాక్ అవుతుంది. ఆ తర్వాత మీతో పెళ్లయింది అన్న విషయం తెలిసి మేము నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నాము అని అను చెబుతుంది. ఇదంతా కూడా విక్రమాదిత్య గారికి తెలుసు అని అంటుంది పద్మావతి. మీరు ఆ మురళి ని చాలా ప్రేమిస్తున్నారు. వాడి గురించి నిజం చెప్తే మీరు ఏమైపోతారు అని విక్కి మీతో నిజం చెప్పలేదు. ఒకసారి మీతో ఈ విషయాలన్నీ చెబుదామని వస్తే మీరు నిద్రపోయారుట, ఏదో ఒక రోజు నిజం చెబుదామని అనుకున్నాడు. వాడు మిమ్మల్ని అడ్డుపెట్టుకొని విక్కిని నన్ను ఎంత చిత్రహింసలు పెట్టాడో మాకు తెలుసు అని అంటుంది. ఈరోజు మేము ఇలా ఈ గుడిలో పని చేయడానికి కారణం కూడా అ రాక్షసుడే నీ భర్త అని చెప్తుంది. విక్రమాదిత్య గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి మా ఆస్తి మొత్తం లాక్కున్నాడు అని చెప్తుంది. అరవింద మాత్రం అలానే షాక్ లో ఉండిపోతుంది. ఈ విషయం మీతో చెప్తే వాడు మిమ్మల్ని ఏం చేస్తాడు అని భయపడి నీతో ఈ విషయం చెప్పకుండా మేము జాగ్రత్త పడుతున్నాము అని అంటుంది. ఒకవేళ మీకు మా మాట నమ్మడం ఇష్టం లేకపోయినా మా మాటలు అబద్ధమని మీకు అనిపించినా ఆస్తి డాక్యుమెంట్స్ మీ ఇంట్లోనే ఉన్నాయి, కావాలంటే ఇంటికి వెళ్లి మీరు డాక్యుమెంట్స్ ని చెక్ చేసుకోవచ్చు అని చెప్తుంది. మీరంటే మీ తమ్ముళ్ళకి ప్రాణం వాళ్ళు మీతో అబద్ధం చెప్పరు ఒకసారి ఆలోచించండి అని అంటుంది పద్మావతి. మీరు కొట్టిన తిట్టినా విక్కీ భరిస్తున్నాడానికి కారణం మీరంటే విక్కి కి ఇష్టం. కోపంతో మీరు బయటికి గెంటేసిన మీకేమవుతుందో మీరు ఎలా ఉన్నారు అని బాధపడుతున్నాడు. ఇది మిమ్మల్ని నమ్మమని నేను చెప్పట్లేదు, ఆ రాక్షసుడు నిజ స్వరూపం మీరే తెలుసుకోండి అని అంటుంది పద్దు. అన్నిటికంటే ముందుగా మీరు అతనితో జాగ్రత్తగా ఉండండి. అని చెప్పి పద్మావతి అను అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అరవింద్ మాత్రం ఆలోచిస్తూ, పద్మావతి చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది. విక్కీ తోని ప్రవర్తించిన తీరు గురించి బాధపడుతూ ఉంటుంది అరవింద.

Nuvvu Nenu Prema Today Episode May 20 2024 Episode 628 highlights
Nuvvu Nenu Prema Today Episode May 20 2024 Episode 628 highlights

ఇక పోలీసులు విక్కీ, తో మేము కృష్ణ మీద ఎంక్వయిరీ స్టార్ట్ చేసాము మీరు ధైర్యంగా ఉండండి అతని ఫాజిలీ చేసి మీ ఆస్తి కాచేసాడని మాకు అర్థమవుతుంది అని అంటారు వెంటనే లాయరు ఆ విక్రమాదిత్య గారి అక్క కి కూడా ఆస్తిలో భాగం ఉంది అని అంటాడు.ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ అసలు అదే అని అంటాడు పోలీసు. విక్రమాదిత్య గాని భయపెట్టిన, మనకు అది ప్లస్ అవుతుంది. మీకు ఇంకో విషయం చెప్పలేదు అతని మీ ఆస్తిలో ఒక రూపాయి తీసుకోవాలన్న అరవింద గారు సంతకం ఉండాలి అని అంటాడు పోలీసు. నాకు ఆస్తి ఇంపార్టెంట్ కాదు మా అక్క ఇంపార్టెంట్ ఆమెకేమీ కాకూడదు మీరు ఇదంతా ఆవిడ తెలియకుండా ఎంక్వయిరీ చేయండి అని అంటాడు. తను అసలే చాలా సెన్సిటివ్ పైగా ప్రెగ్నెంట్, తను డిస్టర్బ్ అవ్వకుండా ఈ కేసును డీల్ చేయండి అని పోలీసు తో చెప్తాడు విక్కీ మీరేం కంగారు పడొద్దు మేమంతా చూసుకుంటామని పోలీస్ విక్కీ ధైర్యం చెప్తాడు. ఇక మరోవైపు అరవింద ఇంటికి వచ్చి కోపంగా ఇల్లంతా తిరుగుతూ ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయని వెతుకుతూ ఉంటుంది. మరోవైపు కృష్ణ వేరే వాళ్ళని కలవడానికి వెళ్తుంటే మీరు డాక్యుమెంట్స్ తీసుకొని రండి అని వాళ్ళు చెప్తారు కృష్ణ కూడా మళ్లీ ఇంటికి బయలుదేరుతాడు. అరవింద డాక్యుమెంట్స్ వెతుకుతూ నేను విక్కీ నీ అపార్థం చేసుకొని విక్కీ నీ కొట్టాను అసలు నిజం తెలుసుకోకుండా ఇంత పని ఎలా చేశాను వికీ నన్ను క్షమించు అని బాధపడుతూ ఉంటుంది ఇక అరవింద్ దొరుకుతాయి అందులో కృష్ణ విక్కి ఆస్తి మొత్తం కాజెసినట్టు తెలిసిపోతుంది అరవిందాకు, అరవింద ఆ పేపర్స్ చూసి షాక్ అవుతుంది.

ఇక అరవింద బాధపడుతూ ఉంటుంది అప్పుడే కృష్ణ లోపలికి వస్తాడు. ఇల్లంతా ఏంటి వెతికావు ,దేని గురించి ఏంటి అలా ఉన్నావు అని అంటాడు. అరవింద చాలా సైలెంట్ గా ఉంటుంది కృష్ణ అరవింద మీద చెయ్యి వేసి ఏంటి రానమ్మ అని అంటాడు ఇంకొకసారి అలా పిలిచావంటే అని ఒకసారి గా లేచి కృష్ణ చెంప మీద కొడుతుంది అరవింద. ఒకసారిగా కృష్ణ షాక్ అవుతాడు అరవింద్ కి నిజం తెలిసి పోయినట్లు ఉంది అని మనసులో అనుకుంటాడు. నాతో ఎందుకు నటించావు ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు నీకోసం నా తమ్ముని కూడా దూరం చేసుకున్నాను అని అరవింద బాధపడుతుంది ఈ చేతులతో నన్ను తమ్ముని కొట్టేలా చేసావు ఈ చేతులతో నా తమ్ముని బయటికి గెంటించావు ఎందుకు ఇలా చేశావు నన్ను నా తమ్ముని ఎందుకు విడదీయాలి అనుకున్నావు అని అరవింద కృష్ణ నిలదీస్తుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella

Krishna Mukunda Murari June 06 Episode 489: శ్రీనివాస్ ని కలిసిన కృష్ణ.. మురారిని దాచింది ముకుంద అన్న నిజం కృష్ణకి తెలియనుందా? రేపటి ట్విస్ట్ ..

bharani jella

Nuvvu Nenu Prema June 06 Episode 643:అను పద్దు ల మధ్య గొడవ పెట్టాలనుకున్న దివ్య.. అను రిక్వెస్ట్.. విక్కీ పద్మావతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మూర్తి..

bharani jella