NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema May 30 Episode 637: విక్కీకి అరవింద ఫోన్.. తన పాప గురించి అరా.. మేనకోడలు కోసం విక్కీ వెతుకులాట.. అను ఆర్యా ల నిర్ణయం..

Nuvvu Nenu Prema Today Episode May 30 2024 Episode 637 highlights

Nuvvu Nenu Prema May 30 Episode 637: యశోదర్ ఆఫీసులో విక్కీ కూడా ఇంటర్వ్యూ కి వెళ్తాడు అక్కడ విక్కి కావాలని తిక్క సమాధానాలు చెప్తాడు యశోదరికి పొగరున్న విషయం విక్కీ కి అర్థం అవుతుంది. కావాలని విక్కీ అలా ప్రవర్తిస్తాడు. అది చూసి యశోదర్ విక్కీకి ఉద్యోగం ఇవ్వడు అని విక్కి అర్థం చేసుకొని నేను వేరే ఆఫీస్ కి వెళ్ళాలి అని అంటాడు. అవసరం లేదు మీకు ఉద్యోగం ఇచ్చేస్తున్నాను అని యశోదర్ అనడంతో విక్కి ఒకసారి ఆశ్చర్యపోతాడు. నిజంగా మీరు అన్నది నిజమేనా నేనేమైనా తప్పుగా అర్థం అయిందా అని అంటే లేదు నేను చెప్పింది నిజమే మీరు విన్నది నిజమే అని అంటాడు. విద్య ఉద్యోగం ఇచ్చినందుకు యశోదర్ కి థాంక్స్ చెప్పి మూర్తితో అసలు నేను ఇలా సమాధానం చెప్పినా మీ ఎండి నాకెందుకు ఉద్యోగం ఇచ్చాడు అర్థం కావట్లేదు అని అంటాడు.నాకు అదే అర్థం కావట్లేదు అని అంటాడు మూర్తి.మీరు ఆల్ ది బెస్ట్ చెప్పలేదు నాకు అని అంటే ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు మూర్తి ఇక పద్మావతి అప్పుడే విక్కీకి కాల్ చేస్తుంది. కావాలనే కాల్ కట్ చేస్తాడు ఎవరి సార్ అని అడుగుతాడు మూర్తి ఎవరో లే రాంగ్ నెంబర్ అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode May 30 2024 Episode 637 highlights
Nuvvu Nenu Prema Today Episode May 30 2024 Episode 637 highlights

ఇక పద్మావతి ఫోన్ కట్ చేయడంతో విక్కిని తిట్టుకుంటూ ఉంటుంది అది చూసి గాయత్రి ఎవరిని తిడుతున్నావు అని అడుగుతుంది ఎవరు లేరు అని అంటుంది పద్మావతి నీ బాయ్ ఫ్రెండ్ అని అడుగుతుంది. నా ముఖానికి అదొక్కటే తక్కువ అని అంటుంది పద్మావతి. నిజం చెప్పు అని అంటుంది నిజంగా అంత సీన్ లేదు అని అంటుంది. సరే మనం క్యాంటీన్ కి వెళ్లి కాఫీ తాగుదాం కదా అని అంటుంది గాయత్రి, పద్మావతి ఫోన్ మళ్ళీ ట్రై చేస్తుంది విక్కీకి ఫోన్ మళ్ళీ కట్ చేస్తాడు. విక్కిని తిట్టుకుంటూ ఇందులో హస్బెండ్ అన్న పేరు తీసేసి వేరే పేరు పెట్టుకోవాలి విక్కీకి అని ఫోన్లో విక్కి పేరు చేంజ్ చేస్తుంది. గాయత్రి ఇంక వెళ్దామా మనం క్యాంటీన్ కి అని అంటుంది ఇక ఇద్దరు కలిసి క్యాంటీన్ కి వెళ్తారు. మరోవైపు మూర్తితో కూడా విక్కీ మనం క్యాంటీన్ కి వెళ్దామా సార్ ఒక కాఫీ తాగుదాం అని అంటాడు. నేను రాను అని అంటాడు మూర్తి రండి సార్ నాకు క్యాంటీన్ ఎక్కడో తెలియదు కదా అని అంటాడు. సరే పదండి తీసుకువెళ్తాను అని మూర్తి విక్కీని క్యాంటీన్ కి తీసుకువెళ్తాడు అప్పటికే అక్కడికి పద్మావతి వాళ్ళు వచ్చి ఉంటారు విక్కీ పద్మావతిని చూస్తాడేమో అనుకునేసమయానికి గాయత్రిపద్మావతిని పిలుస్తుంది దాంతో పద్మావతి వికీకి కనిపించదు ఇక క్యాంటీన్లోకి వెళ్లిన విక్కీ నీ మూర్తి వేరే వాళ్ళకి పరిచయం చేసి నాకు పని ఉంది మీరిద్దరూ మాట్లాడుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే విక్కీకి ఫోన్ వస్తుంది ఎన్నిసార్లు కట్ చేసినా మళ్ళీ వేరే నెంబర్ నుంచి చేస్తున్నట్లు ఉంది అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. వెంటనే అవతల వైపు నుంచి అరవింద విక్కీ అని పిలుస్తుంది దాంతో ఒక్కసారిగా విక్కీ షాక్ అవుతాడు. అక్క అని అంటాడు విక్కీ నేనే ఎలా ఉన్నావు? నీకు ఎప్పటినుంచో ఫోన్ చేద్దామనుకుంటే కుదరట్లేదు ఈ నీచుడి గురించి నువ్వు ఎంత చెప్పినా నేను వినలేదు వీడి గురించి నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అని అంటుంది ఆ మాటలకు విక్కీ బాధపడతాడు. నువ్వు చెప్పినప్పుడే నేను అర్థం చేసుకొని ఉండాల్సింది ఇప్పుడు వీడి గురించి తెలిసిన తర్వాత నేనేం చేయలేకపోతున్నాను అని అంటుంది నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు అక్క అని అంటాడు విక్కీ. నేను ఎక్కడ ఉన్నది నాకు తెలియదు ఎక్కడికో తీసుకొచ్చి నన్ను బంధించాడు. ఇది ఏ ఏరియాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది అరవింద్ అలా అంటుంటే విక్కి చాలా బాధపడుతూ ఉంటాడు.

Nuvvu Nenu Prema Today Episode May 30 2024 Episode 637 highlights
Nuvvu Nenu Prema Today Episode May 30 2024 Episode 637 highlights

ఇక అరవింద నాకేం పర్వాలేదు విక్కీ అని వీడు నన్ను ఏం చేయడు,నన్ను ఏమి చేయలేడు ఎందుకంటే వీడికి ఆస్తి కావాలంటే నేను బతికి ఉండాలి కాబట్టి నువ్వు నా గురించి ఆలోచించొద్దు అమ్మని బాగా చూసుకొని అంటుంది ఆ మాట విక్కీకి అర్థం కాదు.అవును విక్కీ నేను ఆరోజు పాపని నీకు డైరెక్ట్ గా చూపిద్దామని అనుకున్నాను కానీ హాస్పిటల్ లో వీడి పాపని చంపమని పడం నేను విన్నాను వెంటనే పాపని ఏదైనా చేస్తాడేమోనని భయపడి అక్కడి నుంచి దూరంగా తీసుకువచ్చేసాను.నీ చేతిలో పెడదాం అనుకున్నాను కానీ అంతలో నాకు ఈ దుర్మార్గుడు ఎదురుపడ్డాడు ఏం చేయాలో తెలియక నీ కారులో వదిలివెళ్లిపోయాను నేను నీ డైరెక్ట్ గా నీకు చేతిలోనే పెట్టాల్సింది అమ్మని నువ్వు ఎంత సంతోషించే వాడివో కదా కానీ నీ కారులో పెట్టాను కదా ఇక నీ దగ్గరికి చేరుతుంది లే అనుకున్నాను అమ్మని బాగా చూసుకుంటున్నావా నాకోసం ఏమైనా ఏడుస్తుందా అని అడుగుతుంది అప్పుడు వికీ అర్థమవుతుంది ఆరోజు కారులో ఉన్న పాప తన అక్క కూతురు అని, ఆ పాపని అనాధాశ్రమంలో వదిలి వచ్చేస్తాడు విక్కి అది గుర్తొచ్చి చాలా బాధపడతాడు ఇక అరవింద్ మాట్లాడుతూ అమ్మ ఎలా ఉంది? నాకోసం బాధపడుతుందా లేదంటే పద్మావతి తో బాగా ఆడుకుంటుందా అయినా అంతమంది ఉంటే నాకోసం ఎందుకు బాధపడుతుంది ఇప్పుడే చెప్తున్నాను విక్కీ నేను వచ్చేంత వరకే నువ్వు పాపని బాగా చూసుకోవాలి నేను వచ్చిన తర్వాత నా పాప నేను చూసుకుంటాను మీకు ఎవరికి ఇవ్వను అని అంటుంది అరవింద్ ఆ మాటలకు విక్కి బాధపడుతూ ఉంటాడు. ఏదో ఒక రోజు నేను నా పాప దగ్గరికి వచ్చేస్తాను ఆరోజు దాకా నువ్వు పాపని జాగ్రత్తగా చూసుకో అని అంటుంది అరవింద. విక్కీ నేను ఇంత మాట్లాడుతున్నా గానీ నువ్వేం చెప్పట్లేదు అమ్మ ఎలా ఉంది అని అడుగుతుంది ఇక విక్కీకి ఎప్పటికి అర్థం అయిపోయి ఉంటుంది అరవింద పాప నా కారులో ఉంది అని అందుకే ఇప్పుడు ఆ పాప అనాధ ఆశ్రమంలో ఉంది అని చెప్తే అరవింద్ ఎక్కడ బాధపడుతుందో అని బాగానే ఉంది అక్క అని అబద్ధం చెప్తాడు. సరే విక్కీ ఆదురు మార్కులు వచ్చినట్టున్నాడు నేను మళ్ళీ చేస్తాను అని అరవింద ఫోన్ పెట్టేస్తుంది. విక్కీ అరవింద ఫోన్ పెట్టే గాని బాగా ఏడుస్తాడు అయ్యో నాకు కూతురు నా కారులో ఉంటే నేను చూసుకోలేక పోయాను తను నా అమ్మ నీ గమనించుకోలేకపోయాను అని బాధపడతాడు అమ్మ నువ్వు ఎక్కడ ఉన్నా గానీ నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అని అనుకుంటాడు. రోజు నువ్వు నా చెయ్యి పట్టుకొని నా చెయ్యి వదలకుండా ఉంటే మనిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అనుకున్నాను కానీ నా అమ్మవే నువ్వు నాకోసం వచ్చావని అనుకోలేక పోయాను.

Nuvvu Nenu Prema Today Episode May 30 2024 Episode 637 highlights
Nuvvu Nenu Prema Today Episode May 30 2024 Episode 637 highlights

నన్ను క్షమించమ్మా నేను నీకోసం వస్తున్నాను నేను నిన్ను తీసుకుంటాను అని బాధపడుతూ అక్కడ నుంచి బయలుదేరి ఆశ్రమానికి వెళ్తాడు. ఆశ్రమంలో పాప ఉందేమోనని వెతుకుతాడు ఎక్కడా పాప కనిపించదు ఆశ్రమం ఓనర్ వచ్చి ఏం కావాలి అని అడుగుతాడు మొన్న మీకు రాత్రి ఫోటో వచ్చి పాపని ఇచ్చాను కదా ఆ పాప నా పాపే మా అమ్మ ఎక్కడ ఉంది అని అడుగుతాడు మీ అమ్మ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు ఆశ్రమం ఓనర్, సరదాగా గుర్తు తెచ్చుకోండి నేను మీకు పాపని ఇచ్చాను కదా ఆ పాప ఎవరో కాదు నా అక్క కూతురే అనుకోకుండా ఆ పాపని నేను తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాల్సి వచ్చింది. ఆ పాపం ఆరోజు నాకు తెలియదు ఇప్పుడే తెలిసింది నా పాపను నాకు ఇచ్చేసేయండి తను నా మేనకోడలు అని అంటాడు. సారీ అండి ఆ పాపి ఇక్కడ లేదు రాత్రి వేరే ఆశ్రమానికి వెళ్ళింది అక్కడి నుంచి ఎవరో దాన్ని దత్తత తీసుకొని వెళ్ళిపోయారు అని అంటాడు. మాటలకు వికీ షాక్ అవుతాడు నా పాప గురించి ఎలాగైనా నాకు తెలియాలి అసలు మీరు ఎలా ఇచ్చేస్తారు అని అంటాడు మీకు ఆ రోజే చెప్పాను ఒకటికి నాలుగు సార్లు అడిగాను ఈ పాపకి మీకు ఏం సంబంధం లేదని ఏం సంబంధం లేదని నాకు రాసి ఇచ్చారు. ఇప్పుడు మీరు వచ్చి నన్ను నిలదీస్తే నేను పాపను ఎక్కడి నుంచి తీసుకురాను అని అంటాడు. ఇక మీరు ఇకనుంచి వెళ్లిపోవచ్చు ఆ పాప గురించి నాకు ఏమీ తెలియదు ఆ పాప ఏ ఆశ్రమానికి వెళ్లిందో కూడా నేను మీకు చెప్పలేను ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు ఆ పాప లేదు కాబట్టి ఎవరి దత్తత తీసుకుంది కూడా మాకు తెలియదు అని అంటాడు ఇక విక్కి బాధపడుతూ అక్కడ నుంచి బయటికి వచ్చి ఏడుస్తూ ఉంటాడు. నా చేతుల్లోకి వచ్చిన మా అమ్మని నేను దూరం చేసుకున్నాను ఈ విషయం అక్కకి ఎలా చెప్పాలి ఏదో ఒక రోజు అక్క ఎదురుపడిన పాప ఏది అని అడిగితే నేనేం చెప్పాలి అని బాధపడుతూ ఉంటాడు.

Nuvvu Nenu Prema Today Episode May 30 2024 Episode 637 highlights
Nuvvu Nenu Prema Today Episode May 30 2024 Episode 637 highlights

ఇక మరోవైపు నారాయణ కుచల, మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి నువ్వు అంత ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు నారాయణ ఏం లేదు ఆరోజు పద్మావతి కేసు ఆపసి తీసుకోకుండా ఉన్నట్లయితే మన ఆస్తి మనకి వచ్చేది కదా దాని గురించి ఆలోచిస్తున్నాను ఎలాంటి కోడలు దొరికారు ఒక కోడలు ఏమో అసలు నా మాటే వినదు ఒక కోడలేమో నేను చెప్పింది చెయ్యదు. అయినా అసలు కోడలైనా అనుకే నా మీద గౌరవం లేకపోతే ఇక పద్మావతి అనుకొని ఏం ప్రయోజనం అని అంటుంది. ఎప్పుడూ వాళ్ళ మీద పడి ఏడవడమేనా నీ పని అయినా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారని నువ్వు వాళ్ళని ఆడిపోసుకుంటావు అని అంటాడు నారాయణ. నిజంగా నాకు మళ్లీ మన జీవితాలు మారాలంటే దేవుడు ఎవరో ఒకరిని ఏదో ఒక రూపంలో మన ఇంటికి పంపించదని అనిపిస్తుంది అని అంటుంది ఆ మాట పూర్తవ్వకుండానే అను ఆర్య ఇద్దరు ఒక నిర్ణయం తీసుకొని ఒక అనాధ పాపని దత్తత తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకు వస్తారు. ఆ పాప ఏడుపు కుచలకి వినపడుతుంది ఒకసారి గా తిరిగి చూసేసరికి అను ఆర్య వాకిలి ముందు పాపని ఎత్తుకొని ఉంటారు. అను భయపడుతుంది ఆర్య ధైర్యం చెప్పి లోపలికి తీసుకు వెళ్తాడు. పాపని చూసి కుచులా ఎవరు అని అడుగుతుంది నువ్వు ఎప్పటినుంచో మనవరాలు మనవడు కావాలని గొడవ చేస్తున్నావ్ కదమ్మా అందుకే మేము అనాధాశ్రమానికి వెళ్లి ఒక పాపని దత్తత తీసుకొని వచ్చాము అని ఆర్య చెప్తాడు ఆ మాటలకు పద్మావతి ఇంట్లో అందరూ సంతోషిస్తారు ఇక కుచల మాత్రం చేసిన పనిని అందరూ మెచ్చుకున్నది చాలు అసలైన ఎవరో పిల్లని మనం పెంచుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటుంది. కానీ పద్మావతి మాత్రం ఏదో బంధం ఉంటేనే ఈ పాప మన ఇంటికి వచ్చింది అని, పాపని దద్దక తీసుకొని మంచి పని చేశారు బాబు గారు అని అంటుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode May 30 2024 Episode 637 highlights
Nuvvu Nenu Prema Today Episode May 30 2024 Episode 637 highlights

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతినీ ఆఫీసులో యశోదర్ పిలుస్తాడు. ఏంటి సార్ పిలిచారు చెప్పండి అని అంటుంది పద్మావతి నీకు ఇప్పుడు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను అతనిని కింద పనివాడిగా పెడుతున్నాను. నువ్వు ఏం పని చెప్తే ఆ పని అతను చేస్తాడు అతను ఏదైనా తేడా చేస్తే, అతని ఏమైనా అనొచ్చు ఆ రైట్స్ నీకు ఉన్నాయి అని అంటాడు. అలాగే సార్ అని అంటుంది ఎవరా అని పద్మావతి ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మూర్తి విక్కీని తీసుకొని వస్తాడు. విక్కీని చూసి పద్మావతి నువ్వా అని అంటుంది పద్మావతిని చూసి విక్కి ఆశ్చర్యపోయి నువ్వా అని అంటాడు ఇద్దరు ఒకరికి ఒకరు చూసుకొని ఆశ్చర్యపోతారు. యశోదర్ పద్మావతి తో ఇతనే నీ కింద పని చేస్తాడు అని విక్కీ వైపు చూసి నువ్వు ఈమె చెప్పినట్లు నడుచుకో అని అంటాడు ఇక విక్కీ పద్మావతి ఇద్దరు ఆఫీసులో యశోదర్ ఎదుట కలుసుకుంటారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella