NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

Nuvvu Nenu Prema Today Episode May 31 2024 Episode 638 highlights

Nuvvu Nenu prema:అను ఆర్య ఇద్దరు అనాధాశ్రమానికి వెళ్లి బిడ్డని దత్తకు తీసుకొని వస్తారు. బిడ్డ ఏడుపుతో కుచల వాళ్ళిద్దరూ ఇంట్లోకి రావడం చూస్తుంది. ఈ బిడ్డ ఎవరు అని కుచల అనుని అడుగుతుంది. ఆర్య నువ్వు ఎప్పుడూ పిల్లలు కావాలని అంటావు కదమ్మా అనుకి పిల్లలు పుట్టారని నీకు తెలుసు కదా అందుకే మేము ఒక పాపని దత్తత తీసుకున్నాము అని చెప్తాడు ఆర్య. పద్మావతి భలే మంచి పని చేశారు బావగారు ఏదో బంధం ఉంటేనే భగవంతుడు ఈ పాపని మన ఇంటికి రప్పించాడు. ఈ పాపకి మనకి ఏదో సంబంధం ఉంది అందుకే మన ఇంట్లో అడుగు పెట్టింది మీరు చేస్తున్న ఈ పని నాకు చాలా బాగా నచ్చింది అని అంటుంది దాంతో ఇంట్లో అందరూ కూడా సంతోషిస్తారు ఇక వెంటనే కుచల కోపంగా, చూడు పద్మావతి మీ అక్కకు పిల్లలు పుట్టారని జీవితంలో తన పిల్లలు కనలేదని నీకు తెలిసి ఇప్పుడు భగవంతుడు సంబంధం అని మాట్లాడుతున్నావు అసలు ఎవరికో పుట్టిన బిడ్డ నా మనవరాలు ఎలా అవుతుంది? నేను మనవడు మనవరాలు కోసం ఆలోచిస్తే అనాధ పిల్లని తీసుకొచ్చి నా మనవరాలు అంటే నేను ఎలా ఒప్పుకుంటాను. మీరు చేసిన పని నాకు నచ్చలేదు అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode May 31 2024 Episode 638 highlights
Nuvvu Nenu Prema Today Episode May 31 2024 Episode 638 highlights

ఇక ఆర్య అమ్మ నీకు నచ్చిన నచ్చకపోయినా ఈ పాప మాత్రం మా పాప నేను కన్నా బిడ్డ అని అంటాడు. ఎవరికో పుట్టిన బిడ్డని తీసుకొచ్చి నీకన్నా బిడ్డ అంటావేంటి అని అంటుంది మేము ఏ రోజు అయితే దత్తత తీసుకున్నామో ఆ రోజు నుంచి ఈ పాప అనాధ పాపన్న విషయం మర్చిపోయి మా బిడ్డగానే పెంచుతాము అని అంటాడు ఆర్య. ఎవరికో పుట్టిన బిడ్డ ఏ తప్పు చేయదని నువ్వెలా అనుకుంటున్నావు రేపు ఈ బిడ్డ ఏదైనా తప్పు చేస్తే అప్పుడు ఎవరి బాధ్యులు అయినా అత్తయ్య నేనే మాట్లాడుతున్నాను మీరే మాట్లాడరు ఏంటి అని శాంతాదేవిని అడుగుతుంది కుచల. నాకు వీళ్ళు చేసిన పని తప్పని అనిపించట్లేదు వాళ్ళు ఇంత పెద్ద కుటుంబాన్ని ఆ పాపకి బహుమతిగా ఇస్తున్నారు అలాంటప్పుడు ఎందుకు తప్పు పట్టాలి అని అంటుంది శాంతాదేవి. పద్మావతి కూడా వీలు చేసింది తప్పు కాదు ఈ పాప మన ఇంట్లో అడుగు పెట్టాలని ఆ భగవంతుడే రాసిపెట్టాడు అని అంటుంది. ఇక వెంటనే కుచల ఏ రోజు నాకు ఈ ఇంట్లో మీరు మాట్లాడే గౌరవం ఇచ్చారు ఈరోజు మాట్లాడ్డానికి నా మాట చల్లదని నాకు అర్థమైంది అని అక్కడి నుంచి కోపంగా మీకు నచ్చింది చేసుకోండి అని వెళ్ళిపోతుంది. పద్మావతి ఈ పాపని తీసుకొచ్చి మంచి పని చేశారు అని అంటుంది. వీలమ్మ మనకు మన అందరి కోసం ఈ పాపని పన్నట్టుంది అని అంటుంది ఆ పాప అరవింద బిడ్డ అని ఎవరికీ తెలీదు.

Nuvvu Nenu Prema Today Episode May 31 2024 Episode 638 highlights
Nuvvu Nenu Prema Today Episode May 31 2024 Episode 638 highlights

ఇక మరోవైపు సుగుణ హడావిడి చేస్తూ ఉంటుంది ఇంట్లో అబ్బాయి రూమ్ రెడీ చేశారా, రత్తాలు రేపు ఉదయం పని వాళ్ళందరినీ రమ్మని చెప్పు అందరిని కొత్త బట్టలు డబ్బులు పంచుదాము అని అంటుంది రత్తాలు పంటకేం లేదు కదా అమ్మ అని అంటుంది సుగుణ నా కొడుకు కీ ఫస్ట్ టైం ఒక అమ్మాయి నచ్చింది ఇక తనతోనే మా అబ్బాయి పెళ్లి, అందుకనే అందరికీ బట్టలు పంచుదాం అని అంటుంది అప్పుడే యశోదర్ ఇంటికి వస్తాడు. సుగుణ ని పట్టుకొని గిరగిరా తిప్పేస్తాడు. అమ్మాయి కనిపించినందుకైనా ఇంత ఆనందం అని అంటే అవునమ్మా నాకు అమ్మాయి బాగా నచ్చింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఎంత కష్టమైనా నేను అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి చేస్తాను అని సుగుణ అంటుంది. ఒకసారి అమ్మాయి ఫోటో చూపించు అని అడుగుతుంది సుగుణ. ఫోటోలు ఏం లేవు అని అంటాడు మరి అమ్మ ఎలా ఉంటుందో చెప్పండి అని పని వాళ్ళు అడుగుతారు దానికి పద్మావతి గురించి పాట పాడుతూ వివరిస్తాడు యశోదర్. నీ కళ్ళలో ఆనందిని చూస్తుంటే ఆ అమ్మాయిని ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది అని అంటుంది. దేనికైనా టైం కావాలి అని అంటుండు యశోదర్, అంతసేపు నేను ఆగలేని వాళ్ళ అమ్మ వాళ్ళ అడ్రస్ చెప్పు నేను వెళ్తాను అని అంటుంది. నేను ఇంకా నా మనసులో మాట అమ్మాయికి చెప్పలేదు, నాకు అంత టైం కావాలి అని అంటాడు. ఆ మాటలకు అది కాదురా అని అంటుంది సుగుణ నేను ఫ్రెష్ అయి వస్తానని వెళ్ళిపోతాడు.

Nuvvu Nenu Prema Today Episode May 31 2024 Episode 638 highlights
Nuvvu Nenu Prema Today Episode May 31 2024 Episode 638 highlights

ఇక మరోవైపు నారాయణ అను ఆర్యాలని బిడ్డకు దత్తత తీసుకొని మీరు మంచిపని చేశారు మీరు మీ అత్తయ్య అనే మాటలు పట్టించుకోవద్దు అని అంటాడు. అప్పుడే అక్కడికి విక్కీ వచ్చి బాధపడుతూ ఉంటాడు. నారాయణ ఏమైందని అడుగుతాడు. తప్పు చేశాను బాబాయ్ క్షమించడానికి తప్పు చేశాను అని అంటాడు. ఏం చేసావని అడుగుతుంది శాంతాదేవి. అక్క బిడ్డని అనాధాశ్రమంలో వదిలేసి వచ్చాను ఆనమ్మ అని చెప్తాడు. ఇంట్లో అందరూ షాక్ అవుతారు. విక్కీ అరవింద బిడ్డ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అంటుంది శాంతాదేవి. అ రాక్షసుడు ఏదైనా చేస్తాడేమోనని భయపడి అక్క తన బిడ్డని నా కారులో వదిలిపెట్టిందిట నాకు ఆ పాప ఎవరో తెలియక నేను అదారాశ్రమంలో వదిలిపెట్టి వచ్చాను అని చెప్తాడు. ఇప్పుడు అక్క ఫోన్ చేసి తన బిడ్డ గురించి అడుగుతుంది అని అంటాడు. సరే నువ్వు చేసింది తప్పని అర్థం అయింది కదా వెళ్లి అనాధాశ్రమంలో బిడ్డని వెనక్కి తెచ్చుకుందాం అని అంటాడు నారాయణ. విక్కీ ఏడుస్తూ పాప అక్కడ లేదు అని అంటాడు. ఎవరో పెంచుకోవడానికి తీసుకువెళ్లిపోయారు అని అంటాడు. ఆ మాటకి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. వాళ్ళు తీసుకెళ్లారు అనగానే నువ్వు వదిలేసి వచ్చేస్తావా అడ్రస్ తీసుకోవాలి కదా అని అంటాడు నారాయణ. అది జరగని పని బాబాయ్ అని ఏడుస్తాడు విక్కి. ఎంత బ్రతిమలాడినా అడ్రస్ మాత్రం చెప్పమని చెప్పారు అని అంటాడు. సారు మనందరం వెళ్లి రిక్వెస్ట్ చేద్దాం అని అంటుంది పద్మావతి. వెంటనే విక్కీ కోపంగా నోరు ముయ్ అని అరుస్తాడు. నాకు నిన్ను చూస్తేనే చంపేయాలని అంత కోపం వస్తుంది. నీవల్లే మా అమ్మ నాకు దూరం అయింది అని అంటాడు. నా చేతులతో, పెరగాల్సిన మా అమ్మని నేనే అనాధాశ్రమలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా నీ వల్లే అని అరుస్తాడు. ఇలాంటి ఘోరాలు ఇంకా ఎక్కడైనా చూసావా, అమ్మ ఎక్కడున్నావని ఏడుస్తూ ఉంటాడు. పాపని వదిలి వచ్చినందుకు బాధపడుతూ ఉంటాడు. అప్పుడే పాప ఏడుస్తుంది. ఉయ్యాలో ఉన్న పాప ఏడుపు చూసి విక్కీ ఎవరు అని అడుగుతాడు దానికి ఆర్య మా గురించి నీకు తెలుసు కదా మాకు పిల్లలు పుట్టారని ఒక పాపని దత్తకు తీసుకున్నాము అని అంటాడు వెంటనే పద్మావతి పాపని విక్కీ చేతిలో పెడుతుంది. ఆ పాపని చూసి విక్కీ ఆశ్చర్యపోతాడు.

Nuvvu Nenu Prema Today Episode May 31 2024 Episode 638 highlights
Nuvvu Nenu Prema Today Episode May 31 2024 Episode 638 highlights

ఇక విక్కీ ఆ పాపని ఎత్తుకొని అచ్చం అరవింద బిడ్డని ఎత్తుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో అలానే ఉంది అని చెప్తాడు దానికి కుచల అడ్డుపడి ఎవరైనా చిన్న పిల్లలు ఒకేలా ఉంటారు ఈ పాప అరవింద పాప అయితే కాదు కదా అని అంటుంది. విక్కీ అయితే మీరు ఏ అనాధాశ్రమం నుంచి పాపం తీసుకొచ్చారు సీతమ్మధార అనాధాశ్రమం అని అడుగుతాడు. కాదు విక్కీ మా ఫ్రెండ్ కి తెలిసిన వారు వేరే ఆశ్రమం నుంచి ఇప్పించారు అని అంటాడు. దానికి విక్కీ అయితే ఈ పాప అరవింద పాప కాదేమో అని అనుకుంటాడు. కానీ పాప నే ఎత్తుకుంటే చాలా హ్యాపీగా ఉంది అనిఅనుకుంటాడు.కుచల అనాధ పాప ఏం చేసినా ఇంట్లో అందరూ తెగ సంబరపడిపోకండి ఎప్పటికీ ఆ బిడ్డ అనాదే అని అంటుంది. ఆ మాటలకు శాంతాదేవి కోప్పడి ఎందుకు అలా మాట్లాడతావు ఇంతమంది ఉంటే తను అనాధ ఎందుకు అవుతుంది అని అంటుంది. విక్కీ అరవింద బిడ్డ ఎక్కడ ఉందో మనకు తెలియదు రేపు అరవింద ఇంటికి వచ్చి నా బిడ్డ ఏది అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని అంటుంది శాంతాదేవి. అక్క వచ్చి అడిగే లోపు బిడ్డ ఎక్కడ ఉన్నది కనిపెట్టాలి అని అంటాడు విక్కీ. ఇదంతా దివ్య చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు కృష్ణ విక్కీ వాళ్ళందరూ బాధపడాలంటే పాప నాకు దొరకాలి అరవింద్ ఏదో ఒకటి చేసి నాకు సంతకం పెట్టించాలి అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే దివ్య కృష్ణ కి ఫోన్ చేస్తుంది. చెప్పు దివ్య అని అంటాడు నువ్వే చెప్పాలి బావా నెక్స్ట్ నువ్వేం చేయబోతున్నావు అని అంటుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఇక్కడ రోజు గొడవలే అని అంటుంది దివ్య. పద్మావతి వల్ల అరవింద బిడ్డ ఇద్దరు కనిపించకుండా పోయారని పద్మావతి మీద చాలా కోపంతో ఉన్నారు అసలు పద్మావతి మీద కోపం పోవాలంటే అరవింద్ కానీ ఆమె బిడ్డ కాని వీళ్ళకి కనిపించాలి అలా కనిపించకపోతే ఎప్పటికీ పద్మావతిని క్షమించేలా లేరు అని అంటుంది దివ్య. ముఖ్యంగా విక్కీ అయితే పద్మావతిని ఎప్పటికి క్షమించడు వాళ్ళిద్దరూ ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారు అని చెప్తుంది. ఇక కృష్ణ నాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు సంతోషంగా ఉండరు అని అంటాడు. బావ నాకు ఇక్కడ అసలు ఉండాలనే లేదు జాబ్ వచ్చింది అని చెప్పి నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అని అంటుంది దివ్య. నువ్వు అక్కడ ఉంటేనే కదా విక్కీ అలాంటి స్టెప్ వేయబోతున్నాడు నాకు తెలిసేది, ఇక్కడికి వచ్చేస్తే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు అని అంటాడు కృష్ణ. చూడు దివ్య ఆస్తి మన చేతిలోకి పూర్తిగా వచ్చేదాకా నువ్వు ఇవన్నీ భరించాలి అని అంటాడు. ఈసారి నేను సూపర్ స్కెచ్ వేస్తాను మనం అనుకున్నది అనుకునేలా చేస్తాను. విక్కీ పద్మావతి ఇద్దరినీ నా కాళ్ల దగ్గర పడేలా చేస్తాను అని అంటాడు ఓకే బావ నేను దాని కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది దివ్య.

Nuvvu Nenu Prema Today Episode May 31 2024 Episode 638 highlights
Nuvvu Nenu Prema Today Episode May 31 2024 Episode 638 highlights

ఇక మరోవైపు పద్మావతి నాకు ఉద్యోగం వచ్చిన విషయం విక్కీకి చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఉంటుంది. అసలే ఈ మధ్య నా మీద చాలా కోపంతో ఉన్నాడు ఇప్పుడు నేను వెళ్లి ఈ విషయం చెప్తే ఏమంటాడో ఏంటో, ఏదైతే అది అయింది విషయం అయితే చెప్పేస్తాను నేను ఎక్కడ తగ్గేది లేదు అని అంటుంది. విష్ణుమూర్తిలా బాగా పడుకున్నారు అని అంటుంది పద్మావతి. తమరు ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టడం మానేస్తే మీతో మాట్లాడాలి అని అంటుంది పద్మావతి. నువ్వు నాతో మాట్లాడతావా, వస్తువుల్ని మీ అక్కని అడ్డం పెట్టుకొని మాట్లాడుతావు కదా నువ్వు అని అంటాడు విక్కి.దానికి కారణం ఎవరు మీరే కదా అని అంటుంది పద్మావతి. అయినా మీలాంటి వాళ్ళతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ అని అంటుంది. నీకు బుద్ధి లేదన్న విషయం నాకు తెలుసులే అని అంటాడు విక్కి. విషయం ఏందో చెప్పు అని అంటాడు నాకు జాబ్ వచ్చింది అని చెప్తుంది. విక్కీ నవ్వి నిజమా నీకు జాబ్ వచ్చిందా నీకు ఉద్యోగం ఇచ్చాడంటే వాడు కచ్చితంగా తలకు మాసినోడు అని అంటాడు మీలాగే అని అంటుంది పద్మావతి. ఏంటి అని అంటాడు విక్కీ ఒకప్పుడు మీరు కూడా నాకు ఉద్యోగం ఇచ్చారు కదా అని అంటుంది పద్మావతి. నాకు తెలుసు నువ్వు ఆ ఉద్యోగం ఇచ్చే వాడి దగ్గరికి వెళ్లి అమాయకంగా పేస్ పెట్టి ఉంటావు వాడు ఉద్యోగం ఇచ్చాడు ఇవాళ కాకపోతే రేపైనా నీ గురించి వాడికి అర్థం అవుతుందిలే అని అంటాడు. మీలాగా ఆయన టెంపరోడ్ ఏం కాదు మంచి ఆయన అని అంటుంది. అప్పుడే మంచి వాళ్ళని సర్టిఫికెట్ చేస్తున్నావు నన్నయితే టెంపర్ గాడు అని అంటున్నవ్ చాలా బాగుంది అని అంటాడు విక్కీ. మీరు ఇంటర్వ్యూ కి వెళ్లారు కదా ఏమైంది అని అడుగుతుంది పద్మావతి. ఓహో నేను ఎక్కడికి వెళ్లాను ఏం చేస్తున్నావ్ కూడా తెలుసా నీకు అని అంటాడు. నీకే జాబ్ వస్తే నాకు రాదా అని అంటాడు. నాక్కూడా జాబ్ వచ్చింది అని అంటాడు. కంగ్రాట్యులేషన్స్ సారు అని అంటుంది. విక్కీ కోపంగా చెయ్యి పక్కకి నెట్టేస్తాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella