Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి విక్కీ నీ ఆట పట్టిస్తూ ఉంటుంది. పద్మావతి కావాలనే విక్కీని ఏడిపిస్తూ ఉంటుంది. అరవింద అందరితో కలిసి పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అంటుంది.ఈరోజు 391 వ ఎపిసోడ్ లో, పద్మావతి మీద విక్కీ కోప్పడుతూ ఉంటాడు. అసలు నేను చేసిన తప్పేంటో చెప్పమంటే చెప్పరు, ఇలా నామీద అంటే అరుస్తారు అని అంటుంది పద్మావతి. చెప్పాను కదా, ఈ ఆరు నెలలు నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే, ఈ ఆరు నెలల తర్వాత నీకు అంత నిజం తెలిసిపోతుంది అని అంటాడు విక్కీ. అప్పటిదాకా నటించాల్సిందే అంటారా ఈ అసలు నేనేం తప్పు చేశాను చెప్పండి అంటుంది. నీకు నటించడం అలవాటే కదా పద్మావతి కొత్తగా ఏం నటించట్లేదు ఎవరి దగ్గర ఎలా నటించాలో నీకు బాగా తెలుసు అదే చెయ్యి ఇప్పుడు కూడా అని అంటాడు. ఎందుకు సార్లు మళ్లీ మళ్లీ అదే మాట మాట్లాడుతారు నేను ఏ తప్పు చేయలేదు అంటే నమ్మరు కనీసం నేను చేసిన తప్పేంటో చెప్పరు ఎలా ఇలా అయితే అని అంటుంది. చెప్పాను కదా ఈ ఆరు నెలలు మాత్రమే నువ్వు నా భార్యది తర్వాత నీకు అన్ని విషయాలు అర్థం అవుతాయి. అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్కి.

Nuvvu Nenu Prema: కుచల కోపానికి బలి కానున్నది ఎవరు? కృష్ణ అనుకున్నది జరిగినట్టేనా?
పదహారు రోజుల పండగ ఏర్పాట్లు..
ఆండాలు లక్ష్మి అందరూ ఏర్పాట్లు చూస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి, కుచల కృష్ణ అరవింద వస్తారు. కృష్ణ 16 రోజులు పండగ చేసుకుంటున్నావా పద్మావతి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని అంటాడు మనసులో, కావాలని కుచీలతో అత్తయ్య గారు మీరు వచ్చి ఇంతసేపైనా మీ కోడలు వచ్చి పలకరించలేదు ఏంటి అంటే మీరంటే గౌరవం లేదా భయం పోయిందా అని అంటాడు. అలాంటిది ఎప్పటికీ జరగనివ్వను అని కుచల, ఆండాలతో ఏంటి ఇంతసేపు అయింది మేము వచ్చి మీ అమ్మాయిలకి అత్తగారిని పలకరించే అలవాటు లేదా అని అంటుంది. ఆండాలు కాలి కడుక్కోవడానికి నీళ్లే కదండి మినరల్ వాటర్ తెప్పించాను ఇవ్వమంటారా, చిలకమ్మా కుచన గారికి మినరల్ వాటర్ నీళ్లు ఇవ్వు కాలు కడుక్కోవడానికి, అని అంటుంది అండల్. కృష్ణ ఇంతసేపు అయింది మేము వచ్చి అసలే మా రాణమ్మ ఒట్టి మనిషి కూడా కాదు ఇలా నుంచోపెట్టి మాట్లాడుతారు ఏంటండీ అని అంటాడు. అయ్యో అదేం లేదండి అని అంటుంది అరవింద. నువ్వుండ అరవిందా అన్నిటికి ఎలా అని అంటావు వీళ్ళకి మర్యాదలు చేయడమే రాదు అని అంటుంది. భర్త రెండమ్మ కూర్చోండి అని అంటాడు. అందరూ వెళ్లి కూర్చుంటారు.

పద్మావతి విక్కి అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే విక్కీకి ఆర్య ఫోన్ చేసి, అరవింద వాళ్ళు వచ్చారు రమ్మనమని చెప్తాడు. అక్క వాళ్ళు వచ్చారంట కదా మనం వెళ్దాము రెడీ అయ్యి అని అంటాడు విక్కీ. నా ఏ గొడవ పడకుండా తొందరగా రా అని అంటాడు. అవును మీరు ఏదైనా అంటే నేను బాధపడకూడదు. మీరు మాత్రం అనాల్సినవన్నీ అంటారు నేను మాత్రం బాధపడకుండా మీ వాళ్ళ ముందు నవ్వుతూ నటించాలి నాకు కూడా ఉంటుంది కదా, మా వాళ్ళందరికీ సంతోషంగా ఉండాలి అని అంటుంది పద్మావతి. అప్పుడే అక్కడికి అందాలు వస్తుంది ఏంటి రానుంటే రాను అని ఏదో గొడవ పడుతున్నట్టున్నారు అని అంటుంది. అదేం లేదు నేను తనకి గిఫ్ట్ ఇస్తామని చెప్పాను ఆ గిఫ్ట్ తీసుకురావడం మర్చిపోయాను దానికే తను గొడవ పడుతుంది. అని విక్కీ ఆండాలతో అంటారు. కాసే పిచ్చి మామ నీకు గిఫ్ట్ కావాలా తనే మీకు ఒక గిఫ్ట్ ఇంకా మళ్ళీ వేరే గిఫ్ట్ ఎందుకు అని అంటుంది ఆండాలు పద్మావతి తో, పద్మావతి అలానే ఉంటుంది మీరు తనని తొందరగా రెడీ చేసి కిందకి తీసుకురండి.. అని ఆడాలి వెళ్ళిపోతుంది. విక్కీ ఇప్పటికైనా రెడీ అవుతావా అని అంటారు పద్మావతి తో, నటించడం నాకు రాదు సారు మీకు బాగా వచ్చు. అందుకే బాగా అబద్ధాలు చెబుతున్నారు అబద్దాన్ని కూడా నిజం చేసి చక్కగా మాట్లాడుతున్నారు ఏంటి ఇప్పుడు నేను రెడీ అవ్వాలి అంతే కదా రెడీ అవుతాను అని అంటుంది.

కుచల ని రెచ్చగొట్టిన కృష్ణ..
ఆండాలతో చిలకమ్మా ఈవిడకి సోకులతో పాటు కొంచెం ఎక్కువ కూడా ఎక్కువే కదమ్మా అని అంటుంది. అందుకే కదా దాంతో నేను అలా మాట్లాడేది అని అంటుంది అండల్. ఏమన్నా తీసుకుంటారమ్మా అంటారా అని అంటాడు భక్త. అడిగినవి ఇవ్వలేరు కదా అలాంటప్పుడు ఎందుకు అడుగుతారు అని అంటుంది కుచల. మనం ఇక్కడికి వచ్చింది గొడవలు పడడానికి కాదు 16 రోజులు పండగ జరిపించడానికి అంటుంది అరవింద. కొంచెం పద్మావతి తొందరగా రమ్మనండి అని అంటుంది. వస్తున్నారా అమ్మ రెడీ అవుతున్నారు అంటుంది చిలకమ్మా. కృష్ణ కావాలని కుచ్చులతో ఏంట అత్తయ్య మీరు చింతసేపైనా వాళ్ళు ఇంకా కనపడలేదు అని అంటారు. వెంటనే కుచ్చులా వస్తున్నారు వస్తున్నారు అంటున్నారు ఇంత వడికి కోడలు బయటికే రాలేదు మేమంటే మర్యాద లేదా అని అంటుంది. మీ పిల్లలకి తల పొదురు బాగా ఎక్కువైనట్టుందిగా అని అంటుంది వెంటనే అరవింద పిన్ని ఏదో చెప్తుంది కదా చెప్పనివ్వు, వీళ్ళకేం తెలుస్తుంది కృష్ణ మనం ఎంత చెప్పినా ఆడపడుచు అల్లుడు అత్తగారు వచ్చారు అన్న మర్యాద లేదు కనీసం పలకరించడానికి బయటకు రాలేదు అని భర్తతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అవునులే ఆమాత్రం మర్యాద తెలిసి ఉంటే మీ పద్మావతి మా పరువు తీసి ఉండేదే కాదు. చూడండి ఇందులో మా అమ్మాయి తప్ప ఎంతుందో మీ అబ్బాయి తప్పు కూడా అంతే ఉంది తను ఒక్కతే వెళ్లి తాళి కట్టించుకోలేదు కదా అది సరి చేయాలని కదా 16 రోజులు పండగ చేస్తుంది. కానీ మా అబ్బాయిని మాయ చేసింది మీ పద్మావతి.

అంతలో కృష్ణ కావాలని ఏదో మాట్లాడు పోతుండగా ఆండాలు మధ్యలో నువ్వు మాట్లాడకు అని వేలు చూపిస్తుంది కృష్ణకి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు అని అంటుంది ఆండాలు కృష్ణతో, వెంటనే కుచ్చుల మా ఇంటి అల్లుని పట్టుకొని ఎంత మాట అంటావు. మా అల్లుడు నీకు అంత చులకన అయిపోయాడా అంత చులకనగా మాట్లాడతావా, వెంటనే భర్త తప్పైపోయింది క్షమించండి అమ్మ అని అంటాడు. వెంటనే కుచ్చులా లేదు నేను క్షమించను ఈవిడ ఎందుకు కృష్ణ అని అలా తెలుసుగా మాట్లాడిందో చెప్పాల్సిందే, మా ఇంటి అల్లుడి మీద మేము ఈగ కూడా వాళ్ళని ఇవ్వము, అలాంటిది ఇన్ని మాటలు అంటే చూస్తూ ఊరుకుంటానా, అరవింద చూస్తావ్ ఏంటి బాగా వెళ్ళిపోదాం. వెంటనే ఆండాలు క్షమించండి అమ్మ ఏదో అనుకోకుండా అలా వచ్చేసింది. అని అంటుంది. కృష్ణ పోనీలేండి అత్తయ్య ఇప్పుడు మనం రండి కుటుంబాలు కలిసి సంతోషంగా ఉండే సమయం ఇలాగే అనుకోకుండా కోపంలో మాట్లాడింది. నావల్ల ఇలా జరిగితే మా రానమ్మ బాధపడుతుంది తను బాధపడితే నేను చూడలేను కానివ్వండి ఈసారి, నాకోసం మీరు కొంచెం కోపం తగ్గించుకోండి అత్తయ్య అని అంటాడు వెంటనే అరవింద కూడా ప్లీజ్ కూర్చోండి అని అంటుంది. మా ఇంటి అల్లుడు క్షమించమంటున్నాడు కాబట్టి క్షమించాను ఇంకొకసారి రిపీట్ అయిందో జాగ్రత్త అని అంటుంది కుచల. నేను వెళ్లి పద్మావతి వాళ్ళని తీసుకొస్తాను. కృష్ణ మనసులు చెప్పాను కదా ఈ 16 రోజుల పండుగ జరగనివ్వను అని మీరు ఎలా చేసుకుంటారు నేను చూస్తాను ప్రతి క్షణం మీకు నరకం చూపిస్తాను. అని మనసులో అనుకుంటాడు.
Krishna Mukunda Murari: భవాని ముకుంద కి లెటర్స్ రాసిన కృష్ణ.! అందులో ఏముందంటే.!?
కోడళ్ల ను అవమానించిన కుచల..
16 రోజుల పండగకి అందరూ ఏర్పాట్లు చేస్తారు.ఆండాలు పద్మావతి అణువులతో అందరికీ పసుపు రాయండి అని అంటుంది.కుజలకి అరవిందాకి పద్మావతి అను పసుపు రాస్తారు.కుచల చూశావుగా ఇదే నీ స్థానం మీ ఇద్దరూ ఎప్పుడూ నాకు కాళ్ళ కింద ఉండాల్సిందే అని అంటుంది. పద్మావతి డల్లుగా ఉండటం చూసి అరవిందా అడుగుతుంది ఏమైంది అలా ఉన్నావు అని, ఏం లేదు అని అంటుంది పద్మావతి. మీ అందరూ బానే ఉన్నారు ఈ టెంపర్ ఒకటి నిజం చెప్పేదాకా నా మనసే మనసులో లేదు ఏమైందో తెలియదు అని,పద్మావతి మనసులో అనుకుంటుంది.
ఎందుకు పద్మావతి ఎలా ఉన్నావు? నీకోసమే కదా మీ ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నాను అని అంటుంది అరవింద. పద్మావతి ఏమి మాట్లాడకుండా అట్లానే ఉంటుంది అని సంతోషంలో మా అమ్మకి మాటలు రావట్లేదు లెండి అని అంటుంది అరవిందతో,ఇవన్నీ కృష్ణ దూరం నుంచి చూస్తూ గతంలో అను ఆ పద్మావతి ఇద్దరు చేసిన అవమానాన్ని గుర్తుచేసుకొని జరిగింది మీరు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేదు ఇంతకీ ఇంత చెల్లిస్తాను అని అనుకుంటాడు.జీవితంలో మీరు అప్పటికి కోల్పోలేని దెబ్బ కొడతాను అని అంటాడు మనసులో, కాళ్ళకి పసుపు వేయడం అయిపోయింది కదా నల్లపూసలు గుచ్చుదామా అని అంటుంది లక్ష్మీ తో ఆందాల్. పద్మావతి విక్కీ అక్కడ కనిపించట్లేదు అని అంటుంది అరవింద. ఒకసారి నాకు చెప్పకుండా తాగితే కనీసం నల్లపూసలు పెట్టేటప్పుడు అయినా నాకు నిజం చెప్తే బాగుండు. అని అనుకుంటుంది పద్మావతి.

రేపటి ఎపిసోడ్ లో విక్కీ పద్మావతి మండలం నల్లపూసలు వేస్తాడు బొట్టు పెడతాడు ఏంటబ్బా శ్రీనివాస నేను చెయ్యను తప్పుకి అందరిలో మాట పడి ఉన్నాను కనీసం ఇప్పుడైనా చెప్తాడు అనుకుంటే ఇప్పుడు కూడా చెప్పకుండా నల్లపూసలు వేసేసాడు నిజం ఎప్పటికి తెలుసుకోవాలి అని అనుకుంటుంది మనసులో, చిలకమ్మా మీ ఇద్దరిని చూస్తుంటే నాదిష్ట తగిలేలా ఉంది అని అంటుంది.