NewsOrbit
Entertainment News సినిమా

OG: పవన్ కళ్యాణ్ అభిమానికి ఊహించని షాక్ ఇచ్చిన “OG” మూవీ మేకర్స్..!!

Share

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఒకపక్క రాజకీయాలు మరోపక్క సినిమా రంగంలో విజయవంతంగా రాణిస్తూ ఉన్నారు. మొన్నటిదాకా హరిష్ శంకర్ దర్శకత్వంలో “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. వారం రోజుల క్రితం నుండి సుజిత్ దర్శకత్వంలో “OG” షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా… సినిమా స్టోరీ ఉండనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. పవన్ సరసన ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్ గా చేస్తోంది.

OG movie makers gave an unexpected shock to Pawan Kalyan fan

ఖరీదైన కార్లు మరియు చేజింగ్ సీన్స్..తో పవన్ కళ్యాణ్ నీ ఇప్పటివరకు ఏ దర్శకుడు చూపించని రీతిలో.. సుజిత్ చాలా స్టైలిష్ గా చూపించబోతున్నట్లు సమాచారం. పైగా సుజిత్.. పవన్ వీరాభిమాని కావటంతో… సినిమా సెట్స్ లో పవన్ వర్కింగ్ స్టిల్స్ విడుదల చేస్తూ… సినిమాపై వెరైటీగా హైప్ క్రియేట్ చేస్తూ… నిత్యం వార్తల్లో నిలిచేలా ట్రాక్ ఆఫ్ ది టౌన్ గా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానికి ఊహించని విధంగా… “OG” సినిమా యూనిట్ షాక్ ఇవ్వటం జరిగింది.

OG movie makers gave an unexpected shock to Pawan Kalyan fan

మేటర్ లోకి వెళ్తే ఈ సినిమా నిర్మాణ సంస్ధ డీవీడీ ఎంటర్టైన్మెంట్స్.. పవన్ కళ్యాణ్ వీరాభిమానికి… ఓ బిర్యాని ప్యాకెట్ పార్సిల్ చేయడం జరిగింది. సదరు అభిమాని ఈ విషయాని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. నిజంగానే బిర్యాని ప్యాకెట్ పంపారా అని … మిగతా… అభిమానులు ప్రశ్నించగా… బిర్యానీ ప్యాకెట్ అందుకున్న అభిమాని నిజంగానే.. అని జవాబు ఇవ్వటంతో పాటు ఫోటో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో నీ లక్కు బాగుందని కొందరు కామెంట్లు చేయడం జరిగింది. ఈ రకంగా పవన్ కళ్యాణ్ అభిమానికి “OG” నిర్మాణ సంస్థ బిర్యానీ పంపటం ఇండస్ట్రీలో వైరల్ అవుతూ ఉంది. కాగా ఈ సినిమాలో ఫైట్స్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్నట్లు… ప్రొఫెషనల్ ఫైటర్స్ తో… ఆత్యాధునికమైన కెమెరాలతో షూట్ చేయబోతున్నట్లు సమాచారం.


Share

Related posts

బిగ్ బాస్ 4 : వామ్మో మోనాల్…. నీ వల్ల నేషనల్ టెలివిజన్ ను మార్చేస్తున్నారు జనాలు..! అంత తప్పేం చేశావు?

arun kanna

నలుగురు అమ్మాయిల కథ!

Siva Prasad

నాని మ‌ళ్లీ నిర్మిస్తున్నారు

Siva Prasad