OG Pawan Kalyan Movie: ప్రక్రుతి వైద్యం శిబిరంలో ఉప్పులేని తిళ్ళు తిని పచ్చి కూరలు తిన్న వాడికి ఒక్కసారి పెద్ద హోటల్ లో బఫె భోజనానికి తీసికెళ్ళినట్లు ఫీల్ అవుతున్నారు పవన్ ఫాన్స్. ఇన్నాళ్లు రీమేక్‌లతో వెజ్ మీల్స్ తిని తిని నాలుక చచ్చుబడి పోయిన ఫ్యాన్స్‌కు ‘ఓజీ’ అంటూ జంబో సైజ్ ప్యాక్ ధమ్ బిర్యాని పెట్టాడు సుజీత్. ఆకలితో వేటాడే పులిని చూస్తారా అంటూ.. నిజంగానే పవన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేశాడు. ఈ మధ్య కాలంలో ఒక టీజర్ గురించి ఇంత చర్చ జరగడం ఎప్పుడూ చూడలేదు. నాలుగు రోజులు కిందట రిలీజైన ఓజీ టీజర్ పెను సంచలనమే సృష్టించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఓజీ’ (OG Movie) ని ఆయన అభిమాని సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. అభిమానులకు ఆ టీజర్ విపరీతంగా నచ్చింది. సగటు సినీ ప్రేక్షకులను సైతం ఆకట్టుంది. ముఖ్యంగా పవన్ స్టయిలిష్ లుక్, ఆ స్లీక్ యాక్షన్ సీక్వెన్సులు నచ్చాయి. అయితే… యాక్షన్ మాత్రమే కాదు, అంతకు మించి అనేట్లు దర్శకుడు సుజీత్ టీజర్ కట్ చేశారు.

‘ఓజీ’ కథ ఏ కాలంలో జరుగుతుంది? ప్రస్తుతానికి అయితే టైమ్ పీరియడ్ ఏదీ చెప్పలేదు. కానీ, టీజర్ చూస్తే ఒక్కటి అర్థం అవుతోంది… కత్తులతో ముంబై నగరాన్ని శాసించే రోజుల నుంచి తుపాకులతో యుద్ధం చేసే రోజుల వరకు జరుగుతుందని! ”పదేళ్ళ క్రితం వచ్చిన తుఫాను” అంటూ మొదలు పెట్టి ”వాడు నరికిన మనుషుల రక్తాన్ని ఏ తుఫానూ కడగలేకపోయింది” అంటూ అర్జున్ దాస్ చెప్పే మాటలు వింటే అది నిజమని అనిపిస్తోంది. బెల్ బాటమ్ పాంట్స్ పవన్ వేయడం చూస్తుంటే… 70, 80ల నేపథ్యం తీసుకున్నారేమో!
పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఓ ప్రత్యేకత ఏమిటంటే… ఆయన సినిమాల్లో సమాజానికి సందేశం ఇచ్చే పాటలు ఉంటాయి. పోరాట స్ఫూర్తి రగిలించే సన్నివేశాలు సైతం ఉంటాయి. ఇప్పుడీ ‘ఓజీ’లో కొంత మంది రోడ్ల మీద ఆందోళన చేసే దృశ్యాలు, వాళ్ళను పోలీసులు కొట్టడం వంటివి ఉన్నాయి. వాళ్ళు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఎందుకు ఆందోళన చేస్తున్నారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అలాగే, బాంబే పోర్ట్ ట్రస్ట్ & ఈ కథకు సంబంధం ఏమిటి? అనేది కూడా!

OG Pawan Kalyan: పవన్ ఎంట్రీ… 15వ సెకనులో!
ముంబై వీధుల్లో ఓ కార్నర్! పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను కార్నర్ చేయాలని ఓముఠా ప్రయత్నిస్తుంది. కౌంటర్ ఎటాక్ ఇస్తూ… పవన్ కళ్యాణ్ చిన్న తుపాకీతో ఎదురు కాల్పులు జరిపారు. అయితే… ఆ ఫ్రేమ్ అంతగా రిజిస్టర్ కాలేదు. ఈసారి నిశితంగా గమనిస్తే…. పాజ్ చేసి చూస్తే… పవన్ కనపడతారు.
OG Movie Leak: పోలీస్ స్టేషన్‌లో చెయ్యి నరికేంత పవర్!
మాఫియా, రౌడీలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో వేసేంత పవర్ పోలీసుకు ఉంది. ఖాకీ చొక్కాలో అంత హీరోయిజం ఉంటుంది. అటువంటి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ ఒకరి చెయ్యి నరకాలంటే… ఆ వ్యక్తికి ఎంత పవర్ ఉండాలి? అంత పవర్ ఫుల్ మాఫియా నాయకుడిగా పవన్ కళ్యాణ్ పాత్రను సుజీత్ చూపించారు. ఆ పవరుకు తమన్ నేపథ్య సంగీతం తోడు కావడంతో పవర్ స్టార్ హీరోయిజం మరింత ఎలివేట్ అయ్యింది. పోలీస్ స్టేషన్ నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళేటప్పుడు కొన్ని ఫైల్స్ తీసుకు వెళుతున్నట్టు సీన్ ఉంది.
‘ఓజీ’ ప్రచార చిత్రంలో పవన్ కళ్యాణ్ మరాఠీలో డైలాగులు చెప్పారు. ఇంతకీ, ఆ మాటలకు అర్థం తెలుసా? ‘Lavkar’ అంటే… ‘త్వరగా’ అని అర్థం. ‘Khade Khade Kaayi Bagthos Jaakar Dhund’ అంటే… నిలబడి ఏం చూస్తున్నావ్ రా! వెళ్లి త్వరగా వెతుకు’ అని అర్థం. ముంబై నేపథ్యంలో సినిమా కదా! అందుకని, మరాఠీ డైలాగులు ఉపయోగించినట్లు ఉన్నారు.

‘ఓజీ’ కంటే ముందు సుజీత్ దర్శకత్వం వహించిన సినిమా ‘సాహో’. వాజీ సిటీలో ఆ కథ జరిగినట్లు చూపించారు. ఆ వాజీ సిటీకి, ముంబైలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌కు సంబంధం ఉంటుందని ఫిల్మ్ నగర్ ఖబర్. అంటే ఇది సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ అన్నమాట! ఇప్పుడీ ‘ఓజీ’ వీడియోలో ‘వాజీ ఇంపోర్ట్స్ & ఎక్స్పోర్ట్స్’ అని బోర్డు చూపించారు. దాని ముందు ఫైట్ జరిగినట్లు హింట్ ఇచ్చారు. అది ఏమిటి? అనేది సినిమా వస్తే గానీ తెలియదు.
‘ఓజీ’ టీజర్ (OG Teaser)లో ముందుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశం పవన్ కళ్యాణ్ ప్రజెన్స్! పవర్ స్టార్ లుక్స్, స్టైల్ నుంచి ఆయన యాక్షన్ వరకు… అన్నీ అభిమానులకు నచ్చేశాయి. అయితే…
పవన్ కళ్యాణ్ నుంచి స్ట్రయిట్ సినిమా వస్తే ఏ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుందో ఓజీ టీజర్‌తో క్లారిటీ వచ్చేసింది.ఓజీ మూవీ 1950ల బ్యాక్‍డ్రాప్‍లో రూపొందుతోందని టాక్ బయటికి వచ్చింది. ఆ కాలంలో బడా గ్యాంగ్‍స్టర్ పాత్రలో పవన్ నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ బ్యాక్‍డ్రాప్ గురించి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం లీకైంది. 1950 బ్యాక్‍డ్రాప్‍లో వస్తుందనే లీక్‍తో వింటేజ్ గ్యాంగ్‍స్టర్ లుక్‍లో ఓజీ మూవీలో పవన్ కల్యాణ్ కనిపిస్తారనే విషయం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ బ్యాక్‍డ్రాప్ అంశంపై త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కాగా, ఖైదీ సినిమా ద్వారా బాగా ఫేమస్ అయిన తమిళ నటుడు అర్జున్ దాస్.. ఓజీ సినిమాలో నటిస్తున్నాడు. అర్జున్ దాస్‍ను ఆహ్వానిస్తూ ఓజీ చిత్రబృందం అధికారికంగా కూడా ట్వీట్ చేసింది.
ఓజీ మూవీలో పవన్ కల్యాణ్‍కు జోడీగా అరుల్ మోహన్ నటిస్తోంది. మరోవైపు ప్రభాత్‍తో సాహో సినిమా చేసిన సుజీత్‍కు యాక్షన్ డైరెక్టర్‌గా మంచి పేరు వచ్చింది. తెలుగుతో పాటు హిందీలోనూ సాహో మంచి విజయం సాధించింది. ఇక ఓజీ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
ఎప్పుడు రిలీజవుతందనేది పక్కన పెడితే.. ఎప్పుడు రిలీజైన బాక్సాఫీస్ దగ్గర తుఫాన్ రావడం పక్కా అని కన్ఫర్మ్ అయిపోయింది. అసలైన ఫ్యాన్ బాయ్ సంభవం అంటే ఏంటో సుజీత్ చూపించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్‌ను ‘ఐఎమ్‌డీబి’ అఫీషియల్ వెబ్ సైట్‌లో రాసుకొచ్చింది. ‘ఓజాస్ గంభీర అనే ఓ టూరిస్ట్ బాయ్ అనుకోకుండా బాంబేకు వచ్చి అక్కడ గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు. క్రైమ్, మాఫియాలలో రారాజుగా ఎదుగుతాడు. ఆ ప్రయాణంలో తన ఫ్యామిలీని పోగొట్టుకుంటాడు. దాంతో తన ఫ్యామిలీని అంతమొందించిన వారిని చంపడానికి నడుం బిగిస్తాడు. కేవలం చంపడమే కాకుండా ఆ విలన్‌ల సమ్రాజ్యాన్ని కుప్పకూలుస్తాడు. వాళ్లు చేసే ఇల్లీగల్ దందాలన్నిటిని కూకటి వేల్లతో పెకలించేస్తాడు’ అంటూ ప్రముఖ పాపులర్ సినిమా వెబ్ సైట్ ‘IMDB’ రాసుకొచ్చింది.
ఈ టీజర్ వచ్చిన దగ్గిర నుండి పవన్ ఫాన్స్ కి పూనకాలే. ఏవేవో ఊహించుకుంటున్నారు. సుజీత్ దర్శకత్వం బావుంటుందని భావిస్తున్నారు. కథ ఎలా ఉన్నా కధనం అదరగొట్టడం సుజీత్ స్పెషలిటీ. అందుకే పవన్ ఫాన్స్ అంతా ఆ స్పెషల్ డిష్ కోసం విపరీతం గా ఎదురు చూస్తున్నారు