Farah Khan: సర్వజనిక్ గణేశోత్సవ్ మండల్ లోని గణేష్ విగ్రహమైన లాల్ బాగ్చా రాజాకు ప్రతి సంవత్సరం కనీసం 1.5 కోట్ల మంది భక్తులు వస్తుంటారు. 10 రోజుల గణేష్ చతుర్థి (సెప్టెంబర్ 19 నుండి 28 వరకు) పండుగ ప్రారంభ రోజున 12 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తో కలిసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఫరాఖాన్ ముంబైలోని ప్రఖ్యాత లాల్ బాగ్చా రాజా గణేష్ ను దర్శించడానికి రావడం తో మండపంలో భక్తుల సందడి నెలకొంది. ఊహించని విధంగా అభిమానుల తాకిడి వారి ఆలయ సందర్శన యాత్రను ఒక సాహసంగా మార్చింది.

2023 సెప్టెంబర్ 26న ఫరాఖాన్ ముంబైలోని ప్రసిద్ధ గణపతి మండపం లాల్బాగ్చా రాజాను సందర్శించి ఆశీస్సులు తీసుకున్నారు. క్రీమ్ కలర్ సైడ్ బ్యాగ్ తో జతచేయబడిన సౌకర్యవంతమైన నలుపు రంగు దుస్తులు ధరించింది. ఒక వీడియోలో ఫరా బప్పాకు ప్రార్థనలు చేయడానికి మండపంలోకి ప్రవేశించడం మరియు ఆమె స్నేహితులు ఆమె చేతులు పట్టుకుని దారి చూపించడం కనిపించింది. జనం మధ్య ఇతరుల సాయంతో నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె అలసిపోయినట్లు కనిపించింది.

ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో ప్రత్యక్షమైన వెంటనే నెటిజన్లు ఫరాఖాన్ను ట్రోల్ చేస్తున్నారు. కొందరు యూజర్లు ఆమె అనారోగ్యంతో ఉన్నారని పేర్కొనగా, మరికొందరు ఆమె నడకను ట్రోల్ చేస్తూ ఆమె మద్యం సేవించారని పేర్కొన్నారు. ఈ వీడియోపై స్పందించిన ఓ యూజర్ ‘ నాకు ఈమె దారి లో స్పృహ తప్పీ ఉందనిపిస్తోంది ప్రజలు సహాయం చేస్తున్నారు’ అని రాశారు. ఇంతలో మరో యూజర్ ‘దర్శనమ్ కోసం వెళ్తోందా లేక హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ కి వెళ్తోందా అని అని కామెంట్ చేశాడు.

అయితే ఫరాఖాన్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా లాల్బాగ్లోని గణపతి విగ్రహానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోతో పాటు ఓ సుదీర్ఘ లేఖను రాసి, మండపం వద్ద జనం కారణంగా తాను కొంత ఇబ్బంది కలిగిందని, ఇంత జనం లో వెళ్లడం తనకు కష్టం అని స్పష్టం చేసింది. జనాన్ని ఇంత సమర్ధవతం గా బాగా హ్యాండిల్ చేసినందుకు సెక్యూరిటీ, వాలంటీర్లు, పోలీసులకు 58 ఏళ్ల ఫిల్మ్ మేకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఆమె ఈవిధంగా చెప్పారు. అత్యంత అద్భుతమైన దర్శనం కలిగిందని .. స్వామి పాదాల దగ్గరే.ఉన్నానని . జనం కారణంగా నేను అసౌకర్యంగా కనిపిస్తున్న వీడియోలలో ఏమి చూసినా, అదంతా విలువైనదని నేను చెప్పాలనుకుంటున్నాను.

ఇంత జాగ్రత్తగా, అవగాహనతో రోజూ ఇలాంటి జనాన్ని హ్యాండిల్ చేస్తున్న సెక్యూరిటీకి, వాలంటీర్లకు, పోలీసులకు ధన్యవాదాలు.. నన్ను తనతో తీసుకువెళ్ళినందుకు నా ప్రియమైన @sonu_sood ధన్యవాదాలు. నాకు వ్యక్తిగతంగా తోడుగా నిలిచినందుకు ఎన్ @rakesh_kothari24. ప్రతి ముంబైకర్ కు ఇదొక దివ్యానుభూతి’ అని పేర్కొన్నారు.