టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం `ఒకే ఒక జీవితం`. శ్రీ కార్తిక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్గా నటించింది. అమల అక్కినేని, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలను పోషించారు.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న గ్రాండ్‌గా విడుదలై.. తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. టాక్ బాగుండటంతో తొలి రోజు ఈ చిత్రం అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబడుతుందని భావించారు.
కానీ, పోటీగా బ్రహ్మాస్త్ర ఉండటం, వరుస ఫ్లాపులతో శర్వా ఫామ్ లో లేకపోవడం వంటి అంశాలు ఈ సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఈ చిత్రం రూ. 75 లక్షల షేర్‌ను దక్కించుకుంది. అలాగే వరల్డ్ వైడ్‌గా రూ. 1.30 కోట్ల షేర్ కొల్లగొట్టింది. అయితే టాక్ అనుకూలంగా ఉండటం వల్ల రెండొవ రోజు నుంచీ ఈ మూవీ వసూళ్లు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇకపోతే ఏరియాల వారీగా `ఒకే ఒక జీవితం` ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..
నైజాం: 40 లక్షలు
సీడెడ్: 6 లక్షలు
ఉత్తరాంధ్ర: 7 లక్షలు
తూర్పు: 5 లక్షలు
పశ్చిమ: 4 లక్షలు
గుంటూరు: 6 లక్షలు
కృష్ణ: 4 లక్షలు
నెల్లూరు: 3 లక్షలు
————————————–
ఏపీ+తెలంగాణ మొత్తం= 0.75కోట్లు(1.30కోట్లు~ గ్రాస్)
————————————–
కర్ణాటక+తమిళ్+రెస్టాఫ్ ఇండియా:10 లక్షలు
ఓవర్సీస్: 45 లక్షలు
——————————————–
టోటల్ వరల్డ్ వైడ్= 1.30కోట్లు(2.45కోట్లు~ గ్రాస్)
——————————————–
కాగా, రూ. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ.6.70 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఎలాగో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి.. శర్వా సులభంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకుంటాడని సినీ ప్రియులు భావిస్తున్నారు.