టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం `ఒకే ఒక జీవితం`. శ్రీ కార్తిక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అమల అక్కినేని, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలను పోషించారు.
మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి ఆట నుంచే పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్న ఈ సినిమా.. బాక్సీఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది.
తొలి రెండు రోజులతో పోలిస్తే మూడో రోజు మరింత ఎక్స్‌లెంట్‌గా పర్ఫామ్ చేసి దుమ్ము దులిపేశాడు శర్వా. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 75 లక్షలు, రెండో రోజు రూ. 1.10 కోట్ల షేర్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. మూడొవ రోజు రూ.1.37 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూల్ చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 1.87 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇక ఏరియాల వారీగా `ఒకే ఒక జీవితం` ఫస్ట్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..
నైజాం: 1.65 కోట్లు
సీడెడ్: 24 లక్షలు
ఉత్తరాంధ్ర: 33 లక్షలు
తూర్పు: 23 లక్షలు
పశ్చిమ: 18 లక్షలు
గుంటూరు: 24 లక్షలు
కృష్ణ: 21 లక్షలు
నెల్లూరు: 14 లక్షలు
————————————–
ఏపీ+తెలంగాణ మొత్తం= 3.22 కోట్లు(5.30కోట్లు~ గ్రాస్)
————————————–
కర్ణాటక+తమిళ్+రెస్టాఫ్ ఇండియా: 40 లక్షలు
ఓవర్సీస్: 1.10 కోట్లు
——————————————–
టోటల్ వరల్డ్ వైడ్= 4.72 కోట్లు(9.10 కోట్లు~ గ్రాస్)
——————————————–
కాగా, రూ. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ మిట్ అవ్వాలంటే ఫస్ట్ వీకెండ్ వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ.3.28 కోట్ల షేర్ ని రాబడితే సరిపోతుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!