టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం `ఒకే ఒక జీవితం`. శ్రీ కార్తిక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తే అమల అక్కినేని, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలను పోషించారు.
మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదలై.. తొలి ఆట నుంచే పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండటంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది.
మూడు రోజుల్లోనే సగం వసూళ్లను రాబట్టేసిన శర్వా.. ఐదో రోజు కలెక్షన్స్‌తో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు అతి చేరువలో నిలిచాడు. ఐదో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 48 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. వరల్డ్ వైడ్ గా రూ. 87 లక్షల షేర్‌ను దక్కించుకుంది. ఇక `ఒకే ఒక జీవితం` 5 డేస్ టోటల్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..
నైజాం: 2.20 కోట్లు
సీడెడ్: 34 లక్షలు
ఉత్తరాంధ్ర: 46 లక్షలు
తూర్పు: 32 లక్షలు
పశ్చిమ: 23 లక్షలు
గుంటూరు: 31 లక్షలు
కృష్ణ: 28 లక్షలు
నెల్లూరు: 18 లక్షలు
————————————–
ఏపీ+తెలంగాణ మొత్తం= 4.36 కోట్లు(7.20 కోట్లు~ గ్రాస్)
————————————–
కర్ణాటక+తమిళ్+రెస్టాఫ్ ఇండియా: 35లక్షలు
తమిళ్: 0.80 కోట్లు
ఓవర్సీస్: 1.36 కోట్లు
——————————————–
టోటల్ వరల్డ్ వైడ్= 6.83 కోట్లు(15.40 కోట్లు~ గ్రాస్)
——————————————–
కాగా, రూ. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద క్లీన్ మిట్ అవ్వాలంటే మొదటి ఐదు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ.1.17 కోట్ల షేర్ ని రాబడితే సరిపోతుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!