Entertainment News సినిమా

2వ రోజు అద‌ర‌గొట్టేసిన శ‌ర్వా.. `ఒకే ఒక జీవితం` టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

Share

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ నుంచి వ‌చ్చిన తాజా చిత్రం `ఒకే ఒక జీవితం`. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో మ‌ద‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఎమోష‌న‌ల్ డ్రామా ఇది. ఇందులో రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తే.. అమ‌ల అక్కినేని, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 9న విడుద‌లై మంచి స్పంద‌న ద‌క్కించుకుంది. అయితే టాక్ బాగున్నా.. పోటీగా బ్ర‌హ్మాస్త్ర ఉండ‌టం, వ‌రుస ఫ్లాపుల‌తో శ‌ర్వా ఫామ్ లో లేక‌పోవ‌డం వ‌ల్ల తొలి రోజు ఈ చిత్రం అనుకున్న స్థాయిలో వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయింది. అయితే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వ‌డంతో.. 2వ రోజు శ‌ర్వా అద‌ర‌గొట్టేశాడు.

oke oka jeevitham movie
oke oka jeevitham movie

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 75 ల‌క్ష‌ల షేర్‌ను వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 1.10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 1.55 కోట్ల రేంజ్ లో షేర్ ను ద‌క్కించుకుంది. ఇక‌ ఏరియాల వారీగా `ఒకే ఒక జీవితం` 2 డేస్‌ టోట‌ల్‌ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 97 ల‌క్ష‌లు
సీడెడ్: 14 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 18 ల‌క్ష‌లు
తూర్పు: 13 ల‌క్ష‌లు
పశ్చిమ: 10 ల‌క్ష‌లు
గుంటూరు: 14 ల‌క్ష‌లు
కృష్ణ: 11 ల‌క్ష‌లు
నెల్లూరు: 8 ల‌క్ష‌లు
————————————–
ఏపీ+తెలంగాణ‌ మొత్తం= 1.85 కోట్లు(3.15కోట్లు~ గ్రాస్)
————————————–

క‌ర్ణాట‌క‌+తమిళ్‌+రెస్టాఫ్ ఇండియా: 25 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్‌: 75 ల‌క్ష‌లు
——————————————–
టోటల్ వరల్డ్ వైడ్= 2.85 కోట్లు(5.45కోట్లు~ గ్రాస్)
——————————————–

కాగా, రూ. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే మొద‌టి రెండు రోజులు వ‌చ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ.5.15 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. వ‌సూళ్ల జోరు చూస్తుంటే శ‌ర్వా సుల‌భంగా ఈ టార్గెట్‌ను అందుకుంటాడ‌ని సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


Share

Related posts

Digangana Suryavanshi Pink Saree Pics

Gallery Desk

ఆ నటితో డైరెక్టర్‌కు ఉన్న లింకేంటి.. అప్పుడేమో అలా, ఇప్పుడు లగ్జరీ కారు కొనిచ్చి!!

Ram

అయ్యయ్యో .. ఎంతపని చేశావ్ పూజా .. రాధే శ్యామ్ పై లీక్ చేసెసింది ??

GRK