`బంగార్రాజు` వంటి డీసెంట్ హిట్ అనంతరం టాలీవుడ్ కింగ్ నాగార్జున `ది ఘోస్ట్` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నారు. అవుట్ అండ్ అవుట్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం దసరా పండగ కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటి గుల్ పనాగ్, అనిఖా సురేంద్ర తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
అలాగే భరత్ సౌరభ్ సంగీతాన్ని అందించగా.. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కంపోజ్ చేశారు. ఇందులో ఇంటర్పోల్ ఆఫీసర్గా నాగార్జున కనిపించబోతున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, గ్లింప్స్, థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాదు.. సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.
అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ రాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ కన్ఫామ్ చేశారు. సెప్టెంబర్ 30న సాయంత్రం 4 గం. 5 ని. లకు ది ఘోస్ట్ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితమే యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే రేపు సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.