లేడీ సూపర్ స్టార్ నయనతార గత నెల ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్‌తో దాదాపు ఏడేళ్ల నుండీ ప్రేమాయణం కొనసాగిస్తున్న నయన్.. ఎట్టకేలకు జూన్ 9న అతడితో ఏడడుగులు నడిచింది. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.కుటుంబసభ్యులు, సన్నిహితులే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు సైతం నయన్-విఘ్నేష్‌ల పెళ్లిలో సందడి చేశారు. ఇకపోతే వీరి పెళ్లి వీడియో ఫుటేజ్‌ను స్ట్రీమింగ్ చేసేందుకు ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ డీల్ కుదుర్చుకుందని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
నయనతార పెళ్లికి ఏర్పాట్లు పూర్తి.. ఫ్యాన్స్‌కు విఘ్నేశ్ గుడ్‌న్యూస్
పెళ్లి తాలూకు వీడియోను అందంగా షూట్ చేసే బాధ్యతను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్‌కు నెట్‌ఫ్లిక్స్ సంస్థ అప్పగించారని కూడా ప్రచారం జరిగింది. దీంతో నయన్-విఘ్నేష్‌ల పెళ్లి వీడిడీ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో.. ఓ షాకింగ్ బయటకు వచ్చింది.
అదేంటంటే.. మ్యారేజ్ వీడియో టెలికాస్ట్ చేసే ఒప్పందాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ రద్దు చేసుకుని నయన్ దంపతులకు భారీ ఝులక్ ఇచ్చిందట. వివాహానికి సంబంధించిన ఫుటేజ్‌ను స్ట్రీమింగ్ చేయడానికి ముందే విగ్నేష్ శివన్ కీలకమైన పెళ్లి ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసేశాడు. ఈ విషయంపై నెట్ ఫ్లిక్ సంస్థ తీవ్ర అసహనం వ్యక్తం చేసిందట. అంతేకాదు, మ్యారేజ్ వీడియో స్ట్రీమింగ్ ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!