Ante Sundaraniki: చాలా కాలం తర్వాత న్యాచురల్ స్టార్ నాని నుంచి వచ్చిన పక్కా ఫన్ ఎంటర్టైనర్ `అంటే.. సుందరానికీ!`. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవిశంకర్ లు నిర్మించారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించగా..నరేష్, రోహిణి, నదియా, హర్ష వర్ధన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. నిన్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది.
కులమతాలకు,చార వ్యవహారాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే రెండు వేరు వేరు కులాలకు చెందిన యువతీ, యువకులు ప్రేమించుకుంటారు. పెళ్లికి పెద్దలను ఒప్పించడం కోసం రెండు అబద్ధాలు ఆడతారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అన్నదే ఈ సినిమా కథ. ఇందులో బ్రాహ్మణ యువకుడు సుందరంగా నాని, క్రిస్టియన్ యువతి లీలా థామస్ గా నజ్రియా నజీమ్ నటించారు.
ఫస్టాఫ్ లో కథ కాస్త స్లో అయినా, సెకండాఫ్ లో మాత్రం దూకుడుగా వెళుతుంది. ట్విస్టులు, మలుపులు కూడా ఆకట్టుకుంటున్నాయి. రోటీన్ కథ అయినప్పటికీ.. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సినిమాను తీయడంతో డైరెక్టర్ బాగానే సక్సెస్ అయ్యాడు. నాని, నిజ్రియాల నటన సినిమాకే హైలైట్. మొత్తానికి తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్‌ను రాబడుతుందో చూడాలి.
ఇకపోతే కరోనా వచ్చిన తర్వాత థియేటర్స్‌లో విడుదలైన ప్రతి సినిమా కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి దిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే.. సుందరానికీ` ఓటీటీ రిలీజ్‌కి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సాలిడ్ ధరకు దక్కించుకుందట. ఇక ఈ మూవీ మూడు వారాల్లోనే అంటే వచ్చే నెల 1వ తేదీన ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రెండు నెలల వరకు సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశాలే లేవని కూడా అంటున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…