NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Article 370 OTT Response: ఓటీటీలో సత్తా చాటుతున్న యామి గౌతమ్, ప్రియమణి మూవీ..!

Article 370 OTT Response: బాలీవుడ్ నటి యామి గౌతమ్, సీనియర్ నటి ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ మూవీ ” ఆర్టికల్ 370 “. ఈ మూవీ థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం సుమారు రూ. 110 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. ఆదిత్య జంబాలే ఈ మూవీకి దర్శకత్వం వహించారు. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ తర్వాత కూడా నెట్ ఫిక్స్ నుంచి ప్రశంసలు పొందుతుంది. జమ్ము కాశ్మీర్లో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 ఎత్తివేసే ప్రక్రియ.. ఆ ప్రాంతంలో అప్పటి పరిణామాలను.. ప్రభుత్వ చర్యలను ఈ మూవీలో మేకర్స్ స్పష్టంగా చూపించారు.

Article 370 OTT Response
Article 370 OTT Response

ఇక ఈ చిత్రం ఉత్కంఠ భరితంగా ఆకట్టుకోవడంతో ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ దక్కించుకుని లాంగ్ రన్ లో కొనసాగింది. ఏప్రిల్ 19వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటిటిలో ఆర్టికల్ 370 చిత్రం అడుగుపెట్టింది. నెట్ఫ్లిక్స్ ఓటిటిలో ఆర్టికల్ 370 మూవీ చూసిన చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ఆర్టికల్ 370 చిత్రం అద్భుతంగా ఉందని చాలామంది ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. సస్పెన్స్ గా ఉండడంతో పాటు ఎమోషనల్ గాను ఉందని అభిప్రాయిస్తున్నారు. దేశభక్తి మరో హైలెట్ కాగా.. కాశ్మీర్, ఆర్టికల్ 370 గురించి చాలా సమాచారం కూడా ఈ చిత్రం చూడడం ద్వారా తెలుస్తుందని కొందరు పోస్ట్లు పెడుతున్నారు.

ఆర్టికల్ 370 మూవీ ని అసలు మిస్ కావొద్దు అంటూ మరికొందరు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. థియేటర్లలో చూసినప్పటికీ మరోసారి నెట్ఫ్లిక్స్ ఓటిటిలో చూస్తామని మరి కొందరు తెలియజేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితులు, ఆర్టికల్ 370 ఎత్తివేత విషయాలను చూపిస్తూ ప్రేక్షకులలో ఉత్కంఠ లేపారు. ఈ మూవీ కోసం ఎంత పరిశోధన చేశారో అర్థమవుతుందని కొందరు ప్రేక్షకులు చెబుతున్నారు. ఆర్టికల్ 370 మూవీలో యామి గౌతమ్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రియాంక నటనపై పొగడ్తలు కురిపిస్తున్నారు. ఓవరాల్ గా ఈ మూవీకి నెటిజెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Article 370 OTT Response
Article 370 OTT Response

నెట్ఫ్లిక్స్ ఓటిటిలో ఆర్టికల్ 370 మూవీకి భారీ వ్యూస్ దక్కాయి. దీంతో త్వరలోనే ట్రెండింగ్ లో టాప్ కు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం హిందీలో మాత్రమే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఆర్టికల్ 370 మూవీ లో యామి గౌతమ్, ప్రియమణితో పాటు రాజ్ అరుణ్, శివమ్ ఖజురియా, వైభవ్, తరుణ్ గోవిల్ , రాజ్, దివ్య, కిరణ్, సుమిత్ కౌల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీకి శశ్వంత్ సచిదేవ్ సంగీతమందించారు. బి 62 స్టూడియోస్, జియో స్టూడియోస్ పథకంపై జ్యోతి దేవ్ పాండే, ఆదిత్య ధార్, లోకేష్ ధార్ నిర్మించారు. ఇక ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో దుమ్ము రేపుతుంది. రానున్న రోజుల్లో ఇంకెన్ని సినిమాస్ని తలదని ముందుకు కొనసాగుతుందో చూడాలి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella