Jagame Maya OTT Movie Review: ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ రంగంలో ఓటీటీ హవా నడుస్తోంది. చాలామంది సినిమా ప్రేమికులు ధియేటర్ కి బదులు ఓటీటీ లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మరోపక్క ఓటీటీ లకు సెన్సార్ కట్ లు లేకపోవడంతో సరికొత్త కంటెంట్ లు… విడుదలవుతున్నాయి. ఈ తరహాలోనే తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “జగమే మాయ” సినిమా డిసెంబర్ 15 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
నటీనటులు: ధన్య బాలకృష్ణ, చైతన్య రావు, తేజ అయినంపూడి, పృథ్వీరాజ్
దర్శకుడు : సునీల్ పుప్పాల
సంగీత దర్శకుడు: అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ: రాహుల్ మాచినేని
ఎడిటర్: మధు రెడ్డి, కళా సాగర్ ఉడగండ్ల
నిర్మాతలు: ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే

స్టోరీ:
పని పాట లేకుండా అల్లరి చిల్లరిగా ఆనంద్ (తేజ) అనే వ్యక్తి విజయవాడలో తీరుగుతూ ఉంటాడు. కష్టపడకుండానే సులువుగా సంపాదించాలి.. బాగా ఎంజాయ్ చేయాలి అన్నది అతని ఉద్దేశం. అందుకోసం.. ఎదుట వాళ్ళ బలహీనతలను పసిగట్టి బ్లాక్ మెయిల్ చేయడం. ఇంకా బెట్టింగులు ఆడుతూ జీవితం కొనసాగిస్తాడు. అయినా గాని ఖర్చులకి డబ్బులు ఉండకపోవడంతో ఎలాగైనా డబ్బున్న అమ్మాయిని వలలో వేసుకుని బతికేయలన్నది అతని ఉద్దేశం. దీంతో విజయవాడ నుండి హైదరాబాద్ కి మకాం మారుస్తాడు. వచ్చినరోజు నుండి అమ్మాయిలను ట్రాప్ చేసే పని పెట్టుకుంటాడు. ఆ సమయంలోనే ఆనంద్ కి చిత్ర (ధన్య బాలకృష్ణ) తో పరిచయం ఏర్పడుతుంది. చిత్ర భర్త అజయ్ (చైతన్య రావు) పెళ్లయిన ఆరునెలలకే కారు ప్రమాదంలో చనిపోతాడు. చిత్ర సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. దీంతో వీలాసమైన..పాష్ జీవితాన్ని గడుపుతున్న ఆమెను పథకం ప్రకారం… ఆనంద్ పరిచయం పెంచుకుంటాడు. ఈ క్రమంలో చిత్ర దాచుకున్న డబ్బుతోపాటు ఆమె భర్త ఇన్సూరెన్స్ డబ్బు కూడా కాజేసి… సైడ్ అవ్వాలని ఆనంద్ టార్గెట్ గా పెట్టుకుంటాడు. అయితే చిత్రతో పరిచయం ఉన్న సమయంలోనే చిత్ర అత్తమామల దృష్టిలో ఆనంద్ పడటం జరుగుతుంది. ఆనంద్ చేసే అతి వినయం అన్నీ కూడా చూసి నమ్మేసి చిత్ర ఆనంద్ లకి వాళ్ళే దగ్గరుండి వివాహం జరిపిస్తారు. పెళ్లయిన తర్వాత చిత్ర వేరే కాపురం పెడుతుంది. ఇలా సాగుతుండగా ఒకరోజు చిత్ర పర్సనల్ సెల్ఫ్ లో దాచుకున్న పెన్ డ్రైవ్ ఒకటి ఆనంద్ కంటపడుతుంది. అయితే ఆ పెన్ డ్రైవ్ లో.. ఏముంది..? అప్పటినుండి ఆనంద్ ఎందుకు చిత్ర అంటే భయపడతాడు..? మొదటి భర్త అజయ్ నీ ఎవరు చంపారు..? అనే ట్విస్టులతో సినిమా స్టోరీ నడిచింది.

విశ్లేషణ:
సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీలో క్యారెక్టర్ లు చూపించే విధానం చాలా ఎటకారంగా ఉంది. ఆనంద్ చేసే ఫ్రాడ్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. ఇంకా హీరోయిన్ చిత్రా వచ్చాక స్టోరీ.. మారుద్ది అనుకుంటే.. కథ కొనసాగుతూనే ఉంటది. సినిమా స్టార్ట్ అయిన చాల సమయానికి టర్నింగ్ పాయింట్ ఉంటది. అది కూడా పెద్ద ఏమీ అనిపించదు. సినిమా స్టోరీ మొత్తం నాలుగు ప్రధానమైన పాత్రలు చుట్టూ తిరిగే కథ. ఒక విధంగా చెప్పాలంటే షార్ట్ ఫిలిం స్టోరీ విధంగా ఉంది. చాలా పాత్రలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. స్టోరీలో అసలు లాజిక్ లు కనిపించవు. రెండు గంటల సినిమా అయినా గాని చాలా సన్నివేశాలు సాగదీస్తూ ఉన్నట్టు.. అనిపిస్తాయి. చిన్న కథని సాగదీస్తూ ఏదో చూపిద్దామని లాజిక్ మిస్ చేశారు.
ప్లస్ పాయింట్స్:
ధన్య బాలకృష్ణ.
డైలాగ్స్.
ఫోటోగ్రఫీ.
మైనస్ పాయింట్స్:
స్టోరీ.
నిర్మాణ విలువలు.
మ్యూజిక్.